improved healing
-
శ్రీజకు ప్రభుత్వం అండ
రేగిడి: రేగిడి ఆమదాలవలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ నెల 6వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్ సరి్టఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
మాకు న్యాయం చేయండి
నేరెళ్ల బాధితుల డిమాండ్ వేములవాడ: మాకు న్యాయం చేయాలంటూ నేరెళ్ల బాధితులు వేడుకుం టున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ తమను అన్నివిధాలా ఆదుకుంటా నని హామీ ఇచ్చారన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం చేయించాలని, పరిహారం ఇవ్వా లని, పునరావాసం కల్పించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. కండిషన్ బెయిల్ ఎత్తివే యాలని కోరారు. 40 రోజుల తర్వాత వచ్చిన వరంగల్ ఎంజీఎం డాక్టర్లకు మానిన గాయాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. తమ ఒంటినిండా దెబ్బలే ఉన్నాయని, కరెంటు షాక్ కూడా పెట్టా రని తెలిపారు. జైలులో ఉన్న సీసీ కెమెరా పుటేజీలు పరిశీలిస్తే నెలరోజుల క్రితం మా పరిస్థితి అర్థమవుతుందన్నారు. నేరెళ్లను శ్మశానం చేసిండ్రు ► దళిత ఆదివాసీల సంఘాల ఐక్యవేదిక నిజనిర్ధారణ కమిటీ వేములవాడ: ఇసుక లారీల స్వైర విహారం... ఇసుక మాఫియా ఆగడాలు నేరెళ్ల గ్రామాన్ని శ్మశానంలా మార్చాయని దళిత ఆదివాసీల సంఘాల ఐక్యవేదిక నిజనిర్ధారణ కమిటీ ఆరోపించారు. కమిటీ నాయకులు జనశక్తి చర్చల ప్రతినిధి చంద్రన్న, తెలంగాణ దళిత అలయన్స్ ప్రతినిధి చార్లెస్ వెస్లీ, దళిత స్టూడెంట్ ఫ్రంట్ ప్రతినిధి పి.శంకర్, తెలంగాణ దళిత సమాఖ్య ప్రతినిధి బి.రామ్మోహన్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రతినిధి సి.రఘుపతిరావు, సీఏఎస్ఏ(కాస) ప్రతి నిధి ఎన్.ప్రేమ్‌కుమార్, డీబీఎస్ ప్రతినిధి ఎగొండ స్వామి, టీఆర్ఎస్ఎస్ఎస్ ప్రతి నిధి ఎర్ర నరసింహలు శుక్రవారం వేముల వాడ ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరా మర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జిల్లా ఎస్పీని ముందుగా సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యు లపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యా ప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. హెచ్చరించారు. -
సర్కారీ వైద్యమే సూపర్ అనాలి
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అని పాటలు పాడుకునే జనం కచ్చితంగా సర్కారు దవాఖానలో వైద్యం చేయించుకుంటాం.. అనే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులకు మంచిపేరు తేవాల్సిన బాధ్యతను వైద్యులే తీసుకోవాలని సూచించారు. చాలినన్ని నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పీహెచ్‌సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుపడాలన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న మాట ప్రజల నుంచి రావాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్, గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీగా ఉన్న డాక్టర్, ఇతర పోస్టులను వంద శాతం భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. చీపురు కొనాలన్నా సెక్రటేరియట్ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితిని తొలగిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో పునఃసమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎంపీ బి.వినోద్ కుమార్, సీఎస్ రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా బడ్జెట్.. ఆసుపత్రుల వారీగా బడ్జెట్ కేటాయించాలని సీఎం నిర్ణయించారు. కేటాయించిన డబ్బులను వినియోగించుకునే హక్కును సూపరింటెండెంట్లకు ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వరకు తన పరిధిలో పనులను తామే చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. ‘‘ఆసుపత్రుల వారీగా నిర్వహణ నిధులు కేటాయించి, నెలవారీగా వాటిని విడుదల చేయాలి. ఆ డబ్బులతో బెడ్స్, ఆసుపత్రి ప్రాంగణం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మంచినీటి సౌకర్యం అందించాలి’’ అని సీఎం ఆదేశించారు. ప్రతినెలా 25లోగా ఈ నిర్వహణ వ్యయం ఆసుపత్రులకు అందేలా చూడాలని పేర్కొన్నారు. హాస్పిటళ్లలో కావాల్సిన పరికరాలన్నీ కొనివ్వాలని సీఎం నిర్ణయించారు. పరికరాల కొనుగోలుకు రాష్ట్రస్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, పబ్లిక్ హెల్త్ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్లతో కూడిన కమిటీ రేట్లు ఖరారు చేసి, నాణ్యతను నిర్ణయించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంత డాక్టర్లకు వెసులుబాటు ‘‘గ్రామీణ, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి అదనపు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలి. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన సడలించి పక్క పట్టణంలో ఉండే అవకాశం కల్పించాలి. పీహెచ్సీలో వైద్యుల సంఖ్యను పెంచి షిప్ట్ సిస్టంలో పని చేయిం చాలి’’ అని కేసీఆర్ వివరించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వైద్య విధాన పరిషత్‌లోకి తెచ్చి, పీహెచ్‌సీలను పబ్లిక్ హెల్త్ పరిధిలోనే ఉంచాలన్నారు. 108, 104 సేవలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. పరీక్షల బాధ్యత సర్కారుదే: ప్రైవేటు డయాగ్నసిస్ సెంటర్లు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే ఆసుపత్రుల స్థాయిని బట్టి రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలన్నారు. ఇందుకు ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా పరికరాలన్నీ ఉంచాలన్నారు. మందులు ఉచితంగా అందజేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విరివిగా జెనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. విద్యుత్తు సంస్థలపై పడే భారం భరిస్తాం రైతులు, ఇతర వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వల్ల విద్యుత్ సంస్థలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రైవేటు కంపెనీలకు విద్యుత్తు ఉత్పత్తి అప్పగించలేదని, జెన్కోకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, అప్పుడు జెన్కో లాభాలు గడిస్తుందని, దాని ఫలితం ప్రజలకు దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కట్టాల్సిన విద్యుత్ బకాయిలు వంద శాతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వాటికి ప్రీపెయిడ్ మీటర్లు పెడతామని చెప్పారు. ప్రజాపంపిణీలో అక్రమాలు అరికట్టాలి ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగం అరికట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. పేదలకు చేరాల్సిన సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని, పౌర సరఫరాల శాఖలో అన్ని విభాగాలు కుమ్మ క్కవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. దుబారా తగ్గాలని, నిత్యావసరాల ధరలు పెరిగితే పౌరసరఫరాలశాఖ జోక్యం చేసుకుని ప్రజలకు సరుకులందించాలన్నారు. -
మరణ మృదంగం!
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిలోఫర్‌లో రోజుకు సగటున 13 మంది శిశువుల మృతి కోర్టులు చీవాట్లు పెట్టినా మారని వైద్యసేవల తీరు పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది... పురిటి నొప్పుల బాధను ఇంకా పూర్తిగా మరిచి పోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది... మౌలిక వసతుల లేమి, మందుల కొరతకు తోడు సకాలంలో వైద్యం అందక ప్రతిష్టాత్మాక నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు సగటున 13 మంది శిశువులు మృతి చెందుతుండటం అందరినీ కలిచివేస్తోంది. నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరుగనుంది. సమావేశంపై ఆస్పత్రికి సంబంధించిన సీనియర్ ప్రొఫెసర్లు కానీ, ఇతర అధికారులకు సమాచారం లేదు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆస్ప త్రిలో కాకుండా సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. సిటీబ్యూరో : అమ్మ కలలు కల్లలవుతున్నాయి. తొమ్మిది నెలలు కడుపులో మోసి పండంటి బిడ్డను కనేందుకు నిలోఫర్ ప్రభుత్వ నవజాతా శిశువుల దవఖానుకు వచ్చే తల్లులకు గుండె కోతే మిగులుతోంది. పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మత్యుముఖంలోంచి బయటకొచ్చిన తల్లిని మృత శిశువు వెక్కిరిస్తోంది. మరోవైపు ప్రసూతి విభాగంలో క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వ ల్ల బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే... నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను వెచ్చదనం కోసం వార్మర్లలో పెట్టాల్సి ఉంది. ఆస్పత్రిలో సుమారు వంద వార్మర్లు ఉన్నా...వీటిలో 40కిపైగా పని చేయడం లేదు. ఇది తెలిసి కూడా శిశువులను వాటిపైనే ఉంచడం వల్ల చలికి గజగజ వణుకుతున్నారు. త్వరగా కోలుకుంటారని భావించిన తల్లిదండ్రులకు చివరకు తీరని ఆవేదనే మిగులుతోంది. చాలా మందికి పుట్టుకతోనే కామెర్లు వస్తాయి. శిశువులను ఫొటో థెరిపీ యూనిట్లుపై ఉంచి చికిత్స అందించాల్సి ఉంది. అయితే చూసేందుకు ఫొటోథెరపీ యూనిట్లు పనిచేస్తున్నట్లే కన్పించినా వ్యాధిని నయం చేయలేక పోతున్నాయి. వాస్తవానికి ప్రతి వంద రోజులకు ఒకసారి లైట్లను మార్చాల్సి ఉన్నా..అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా... మూడు అంతస్తులు ఉన్న ఎమర్జెన్సీ విభాగంలో మూడేళ్లుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. బాలింతలు తమ చంటిపిల్లలను ఎత్తుకుని అతి కష్టం మీద పై అంతస్తులకు చేరుకోవాల్సి వస్తోంది. కుట్లు పడినలేత శరీరంతో మెట్లు ఎక్కలేక బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. చేతుల్లో శిశువును పెట్టుకుని మెట్లపై నడుచుకుంటూ పైకి ఎక్కుతుండటం వల్ల మెడలోని నరాలు తెగి శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో 15-20 శాతం మరణాలకు ఇదే కారణమని నిపుణులంటున్నారు. లిఫ్ట్ మరమ్మతుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అనుమతి ఇచ్చినా ఆర్ ఎంఓ పట్టించుకోవడం లేదు. పిల్లలే కాదు తల్లులది అదే దుస్థితి.. ఆస్పత్రిలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్య తలెత్తుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వీరికి రక్తం ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో బాలింతలు మృత్యువాత పడుతున్నారు. కేవలం రెండు మాసాల్లోనే 8 మంది బాలింతలు మృత్యువాత పడినట్లు విశ్వసనీ సమాచారం. చిన్ని గుండెలు బీటలు... పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది శిశువుల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రోగ నిర్థారణకు ఉపయోగించే ఈసీజీ, 2డిఎకో యంత్రాలు ఆస్పత్రిలో లేవు. ఇక ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఉన్నా... లేనట్లే. ప్రతి రోజూ 20-30 మంది శిశువులను నిలోఫన్ వాహనంలో ఉస్మానియాకు తరలిస్తున్నారు. తీరా ఈసీజీ వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే అక్కడ భారీ క్యూ ఉంటోంది. మెరుగైన వైద్యం అందాలంటే.. దేశంలోనే అతిపెద్ధ నవజాత శిశువుల రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన నిలోఫర్ ఆస్పత్రిలో 550 పడకలు ఉండగా, నిత్యం వెయ్యి మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 450 పడకల సామర్థ్యంతో కొత్తగా నిర్మించిన రాజీవ్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌ను ప్రారంభిస్తే పడకల సమస్య కొంత వరకు తీరుతుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం 75 మంది వైద్యులుండగా, మరో 75 మంది అవసరం. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు అవసరం కాగా... 130 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో రోగుల బంధువులే సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో 51 వెంటిలేటర్లు ఉండగా, వీటిలో 11 పని చేయడం లేదు. రోగుల అవసరాలు తీరాలంటే మరో 25 వెంటిలేటర్లు, వ ంద వార్మర్లు, 5 ఫోర్టబుల్ ఎక్సరే మిషన్లు, 4 ఆల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక టు డి ఎకో మిషన్, రక్తనాళాల్లో లోపాన్ని గుర్తించే ఒక ఈఎంఎన్జీ మిషన్‌తో పాటు 25 ఇంకుబేటర్లు, 60 ఫొటోథెరపీ యూనిట్లు, 50 ఇన్ఫ్లూజన్ పంప్స్ 20 ఎన్ఐబీ మానిటర్స్, 20 పల్స్ ఆక్సో మీటర్స్, 40 గ్లకోమీటర్లు అవసరం. శిశు మరణాల రేటు తగ్గించేందుకు శ్రమిస్తున్నాం ఆపదలో వచ్చిన ప్రతి శిశువును ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నాం. ఇక్కడికి వస్తున్న కేసుల్లో నూటికి 80 శాతం బ్యాక్ కండిషన్ బేబీలే. వారిని కాపాడేందుకు మా వైద్య బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఆస్పత్రిలో వైద్యులకు కొరత లేదు.. కానీ నర్సింగ్ స్టాఫ్, పారమెడికల్ స్టాఫ్, వార్డు బోయ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశాం. మా ఇబ్బందులను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్లో నిలోఫర్‌కు రూ.30 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ దేవరాజ్, సూపరింటెండెంట్ , నిలోఫర్ -
ఎవరు హెచ్చరించినా..డోన్ట్‌కేర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజలు స్వేచ్చగావచ్చి చికిత్స పొందవచ్చని ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే...భద్రాచలం మన్యం ప్రజలు మాత్రం.. ‘వామ్మో.. ఏరియా ఆస్పత్రిలో వైద్యమా..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రిలో సేవలు మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇటీవల మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, నవజాత శిశులకు అందే సేవలు విఫలమై మరణాలు సంభవించడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూడు నెలల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఆక్సిజన్ అందక పసికందు మృతి చెందడం, ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందడం, ప్రసవం జరిగిన తర్వాత బాలింతకు వేసిన కుట్లు విడిపోయి తీవ్ర రక్త స్రావం కావడం, శనివారం వైద్యులు, స్టాప్ నర్సులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయటంతో పురిటిలోనే పసికందు మృతి చెందడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా వరుస మరణాలతో ఏరియా ఆస్పత్రి తరచూ వార్తల్లోకెక్కి వివాదాల్లో నిలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంతో పాటు డాక్టర్లు, వసతుల లేమి, డయాగ్నస్టిక్ సెంటర్, స్కానింగ్ సెంటర్ లేకపోవడం..ఇలా అన్ని సమస్యలే. వాటిని పరిష్కరించడంలో స్థానిక వైద్యాధికారులతో పాటు ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైద్య సేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి... ఏజెన్నీ ప్రజలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల వారికి సైతం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పెద్ద దిక్కుగా ఉంది. కానీ ఈ ఆస్పత్రిలో వైద్యసేవలపై స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఏరియా ఆస్పత్రి తనిఖీకి వచ్చిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పీఓ దివ్యలకు ఆయన ఫిర్యాదు చేశారు. సేవలు అందించడంలో వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆయన బాహాటంగానే వివరించారు. దీనికి తోడు ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాలపై సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే మరింత ఆగ్రహంగా ఉన్నారు. శనివారం జరిగిన పసికందు మృతి సంఘటనలో బంధువులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా ‘బిడ్డ ఆయుష్షు అంత వరకే ఉంది, అందుకే చనిపోయాడు’ అంటూ అవహేళనగా మాట్లాడడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సైతం సారపాక గ్రామం గాంధీనగర్ కాలనీకి చెందిన ఓ గర్భిణి ప్రసవ సమయంలో మృతి చెందడంతో బంధువులు నిలదీయగా సూపరింటెండెంట్ ఇటువంటి వ్యాఖ్యలే చేయడంతో ఆమె బంధువులు, మహిళలు దాడి చేశారు. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా ఆస్పత్రి నిర్వహణలోనూ, వైద్యాధికారులు అందించే సేవల్లోనూ మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిలతో పాటు, ముఖ్యమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్లు సమాచారం. -
దిగొచ్చిన పోలీసులు
- అంకన్నగూడెం బాధితులకు ఎట్టకేలకు విముక్తి - ఆస్పత్రిలో ఒకరు.. ఏలూరు సీసీఎస్‌లో ముగ్గురు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు పోలీ సులు దిగొచ్చారు. అంకన్నగూడెం బాధితులను తమ అదుపులో ఉంచుకుని.. వాళ్లెక్కడున్నారో తమకు తెలి యదంటూ చెప్పుకొచ్చిన పోలీసులు చివరకు వారికి విముక్తి కల్పిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిలో ఒకరైన ఎం.గోపాలరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను తీసుకువెళ్లాల్సిందిగా అత ని బంధువులకు పోలీసులు సూచిం చారు. కేసులో పురోగతి సాధించేందుకు మరికొద్ది రోజులు పడుతుందని, అప్పటివరకు తమకు అందుబాటులో ఉండాల్సిందిగా కోరారు. పోలీసులు అనుమతిచ్చిన వెంటనే గోపాలరావును ఆయన బంధువులు నూజివీడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధుమేహం, గుండెపోటు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ లేదా విజయవాడ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిందిగా నూజి వీడు ఆస్పత్రి వైద్యవర్గాలు సూచిం చాయి. ఇదిలావుండగా, పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని కూడా పంపించేందుకు వైఎస్సార్ సీపీ సీని యర్ నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భద్రత ఇవ్వడం కోసమే అదుపులోకి తీసుకున్నామే తప్ప వారిని అక్రమంగా నిర్బం ధించలేదని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీ నేతలతో చెబుతున్నట్టు సమాచారం. గత నెల 30న రాత్రి పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పం చ్, టీడీపీ నేత చిదిరాల రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆయనపై హత్యాయత్నం జరి గిందంటూ వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై అల్లరిమూకలు దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపర్చడం తెలిసిందే. ఈ ఘటన దరిమిలా ఈనెల 1న ఉదయం వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింస లకు గురి చేశారు. తొలుత వారిని ఏలూరు సీసీఎస్ స్టేషన్లోనే ఉంచినా తరువాత స్టేషన్లు మారుస్తూ ఇబ్బందులకు గురిచేశారు. పోలీసుల తీరుపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న వారిని ఒక్కొక్కరిగా విడుదల చేస్తున్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం
విశాఖపట్నం : బడుగు, బలహీన వర్గాల ప్రజ లకు మెరుగైన వైద్యం అందించేలా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అందుకనుగుణంగా కేజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశంలో పాల్గొనేం దుకు నగరానికి వచ్చిన ఆయనను బీజేపీ నేత లు దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ బుధవారం కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులను స్వయంగా పరి శీలించానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోని విమ్స్ ఆస్పత్రిని ఆరు నెలలోపు ప్రారంభిస్తామని లేదంటే ఎయిమ్స్ సహకారంతో నడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో సూపర్ హాస్పిటల్ ఏర్పాటు విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కన్నా పేదలకు వైద్యం అందించడమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.వి. చలపతి రావు, నగర అధ్యక్షుడు పి.వి. నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, నాయకులు చెరువు రామకోటయ్య, నరేంద్ర, విమ్స్ ఆస్పత్రి వైద్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
గల్లా హామీలన్నీ నీటి మూటలే
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పదేళ్లు మంత్రిగా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించి ఆ తర్వాత వాటిగురించి మరచిపోయారు. ప్రధానంగా మామిడి రైతులు ఉన్నారు. మ్యాంగోనగర్గా ఉన్న దామలచెరువు అభివృద్ధిని మరిచారు. మెరుగైన వైద్యం ప్రజలకు కలగా మారిపోయింది. కళ్యాణీ డ్యాంకు నీళ్లు తెప్పించి తీరుతానని హామీ ఇచ్చి పదేళ్లు అయినా నెరవేరలేదు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకున్నపాపాన పోలేదు. కలగా 100 పడకల ఆస్పత్రి చంద్రగిరి ప్రజలకు మెరుగైన వైద్యం కలగానే మిగిలిపోయింది. 2009 ఎన్నిక ల ప్రచారంలో భాగంగా పీఎల్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మూడు రోజుల్లో చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా ఆమె హామీని నెరవేర్చలేదు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా 100 పడకల ఆస్పత్రిగా మార్చలేదు. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదు. దామలచెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో 6 సంవత్సరాలుగా వైద్యులు లేరు. ఓట్లేసి గెలిపించండి, గెలిచిన వారంలోపు డాక్టర్‌ను నియమిస్తానని 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి హామీ ఇచ్చారు. గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు. బీడీ కార్మికులకు అండ ఇలాగేనా... చంద్రగిరిలో బీడీ కార్మికులకు గల్లా అరుణకుమారి పెద్ద ఎన్నికల వరం ప్రకటించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వం చేత బీడీలను కొనుగోలు చేసి లాభాల బాట పట్టిస్తానని చెప్పారు. గెలిచాక వారిని పట్టించుకోనేలేదు. అలాగే ఏనుగుల దాడుల్లో రైతులు పంటలు నష్టపోకుండా రంగంపేట, ఎర్రావారిపాళెం ప్రాంతాల్లో నెల రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని గతంలో చెప్పారు. దీనినీ ఇంతవరకు నెరవేర్చలేదు. కొయ్యబొమ్మలకు లెసైన్స్.. చంద్రగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో కొయ్యబొమ్మలు తయారు చేసేవారు ఉన్నారు. తనను గెలిపిస్తే టీటీడీ చైర్మన్‌తో మాట్లాడి కొయ్యబొమ్మలను విక్రయించేందుకు తిరుమలలో లెసైన్స్ ఇప్పిస్తానని 2004లోనే చెప్పారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు. డిగ్రీ కళాశాల పరిస్థితీ అంతే చంద్రగిరిలో డిగ్రీ కళాశాల ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని గల్లా అరుణకుమారి హామీ ఇచ్చి 10 ఏళ్లు అవుతున్నా నెరవేరలేదు. ‘కల్యాణీ’ నీళ్లు మనకే..? ‘మన కల్యాణి డ్యాం నీళ్లు మనేకే సొంతం... మనకు ఇచ్చిన తరువాతే తిరుమలకు, తిరుపతికి’ అంటూ మూడు పర్యాయాల ఎన్నికల్లో గల్లా గట్టిగా చెప్పారు. కల్యాణీ డ్యాం నీళ్లు తెప్పించి తీరుతానని శపథం చేశారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పట్టించుకోలేదు. అలాగే చంద్రగిరి నుంచి శ్రీనివాస మంగాపురానికి వెళ్లే రోడ్డును నాలుగు లేన్లుగా తీర్చి దిద్దుతానని ఇచ్చిన ఎన్నికల హామీ నేటికీ అమలు కాలేదు. మ్యాంగోనగర్ను మరిచారు దామలచెరువు మ్యాంగోనగర్లో అగ్నిప్రమాదం జరిగి మండీలన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన గల్లా అరుణకుమారి రైతులకు హామీల వర్షం కురిపించారు. శాశ్వత మండీలు కట్టిస్తానని చెప్పారు. ఇది కూడా నెరవేర్చలేదు. ఇలా ఆమె ఇచ్చిన హామీలు లెక్కలేననన్ని. అందుకే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు గల్లా అరుణకుమారి మాటలను నమ్మడం లేదు. అధ్వానంగా బస్టాండ్ చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లలేక పోతున్నారు. కుక్కలకు, పశువులకు నిలయంగా మారింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల హామీలో భాగం గా మాట ఇచ్చారు. నైట్ హాల్ట్ బస్సులు ఉంటాయన్నారు. ప్రతి బస్సు బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. టూరిజంహబ్చేస్తా చంద్రగిరి కోటను టూరిజం హబ్‌గా మారుస్తానని గల్లా అరుణకుమారి మంత్రి హోదాలో రెండుసార్లు ప్రజలకు హామీ ఇచ్చారు. కోటలో ఆడిటోరియం నిర్మిస్తానన్నారు. నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇవేవీ జరగలేదు. అలాగే కాణిపాకం వెళ్లే ప్రతి బస్సునూ పాకాలలో వెలసిన సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి తీసుకొస్తానని హామీ ఇచ్చి విస్మరించారు. పారిశుద్ధ్యం అధ్వానం ఈ సారి గెలిపిస్తే చంద్రగిరిని ఆదర్శంగా తీరిచదిద్దుతానంటూ 2004, 2009 ఎన్నికల ముందు నుంచి గల్లా అరుణకుమారి వాగ్దానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రగిరిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగునీటి కాలువలు సరిగా లేవు. మూడుసార్లు మంత్రిగా ఉన్న గల్లా మురుగు కాలువుల నిర్మాణం, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదు.