
సీపీఎస్ విధానం రద్దుకు సహకరించండి
జగన్‌కు సీపీఎస్ ఉద్యోగుల వినతి
గుత్తి రూరల్ : ఉపాధ్యాయులకు గుదిబండలా మారిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్) విధానాన్ని రద్దు చేసేందుకు తమకు బాసటగా నిలవాలని సీపీఎస్‌ఎస్‌ఈఏ ప్రభుత్వ ఉపాధ్యాయుల నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా పెద్దవడుగూరు మండలం ది మ్మగుడికి వె ళ్తున్న జగన్‌ను జిల్లా సరిహద్దు ఊ బిచెర్ల వద్ద గుత్తి, పెద్దవడుగూరు వైఎస్సార్‌టీఫ్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబుళపతి, ఉపాధ్యక్షుడు హరినాథ్ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం గుత్తి మం డల అధ్యక్షుడు బి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి మహబూబ్ ఉల్లా, ఉపాధ్యక్షులు జయకుమార్, పెద్దవడుగూరు మండల ప్రధాన కార్యదర్శి ఇలియాజ్‌లు సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాలను జగన్‌కు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004 నుంచి అమలు చేయుచున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వల్ల ఉద్యోగులకు భవిష్యత్‌లో ఎలాం టి ఆర్థిక భరోసా లేకుండా పోతుందన్నారు.
సీపీఎస్ అమలు వల్ల పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూడేషన్ సదుపాయాలు లేకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతారన్నారు. ఒక వేళ సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసి పదవీవిరమణ చేసినా ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి అందదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పం దించిన వైఎస్.
జగన్ వచ్చే అ సెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతానని హామీ ఇ చ్చారు. యూనియన్ నాయకులు దాదా ఖలందర్, కార్యదర్శులు ఓబుళేసు, చంద్రశేఖర్‌రెడ్డి నూర్ మహమ్మద్, రాఘవేంద్ర, కష్ణారెడ్డి, రా జ్‌కుమార్, మల్లేష్, రామచంద్ర, నారాయణస్వామి, పాల్గొన్నారు.