High Alert At Ukrain Border Amid Forces Deploy: అగ్రరాజ్యాల మధ్య వైరం.. ఎక్కడో చిన్న దేశం మీద అగ్గి కురిపించేందుకు సిద్ధమైంది. అమెరికా-నాటో, రష్యా దళాల మోహరింపు నడుమ ఉక్రెయిన్ సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది.
ఉక్రెయిన్ ఆక్రమణ రష్యా సిద్ధమైంది(ఆ ఉద్దేశం లేదని వ్లాదిమిర్‌పుతిన్ బుకాయిస్తుండడం తెలిసిందే) . తన సైన్య బలగాల్లో మెజార్టీని పశ్చిమ వైపున మోహరించింది. సుమారు లక్ష మంది సైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కొన్నిబయటకు లీక్ అయ్యాయి. బెలారస్‌లోని బ్రెస్ట్‌స్కై శిక్షణ కేంద్రం దగ్గర రష్యా దళాలు, వాళ్ల టెంట్లకు సంబంధించిన ఫొటోలు సైతం బయటకు పొక్కాయి.
మరోవైపు అమెరికా 8,500 సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు NATO బలగాలను పంపుతూనే.. మరికొన్ని బలగాలను సిద్ధంగా ఉంచింది. ఈ రెండు వర్గాల విస్తరణ.. పొరుగున ఉన్న క్రిమియా, బెలారస్ పొడవునా ఉంది. కేవలం దళాల మోహరింపు మాత్రమే కాకుండా.. భారీ ఆయుధాలు, కవచాలు ఫిరంగిలతో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఎక్విప్‌మెంట్ మొత్తాన్ని చాలా వరకు దూరప్రాంతాల నుండి రైలులో రవాణా చేయబడినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఐరోపాలో బహిరంగ సంఘర్షణను నివారించడానికి.. పాశ్చాత్య దేశాలు దౌత్యపరమైన చర్చల దిశగా అగ్రరాజ్యాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా, అమెరికా సోమవారం UN భద్రతా మండలిలో చర్చలు నిర్వహించాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరిహద్దులో పోటాపోటీ బలగాలను మోహరించడం ద్వారా ప్రపంచానికి యుద్ధ సంకేతాలు పంపడం ఆపాలని, తమ పౌరుల భయాందోళనలను రెట్టింపు చేయొద్దంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ.. ఈ వేదిక నుంచి అగ్రరాజ్యాలకు పిలుపు ఇవ్వడం విశేషం.
చెక్క తుపాకులతో శిక్షణ!!
Ukrainian Civilians.. రష్యా ఆక్రమణ భయాందోళనల నడుమ.. ఎలాంటి కేవలం అమెరికా-నాటో దళాల్ని నమ్ముకోకూడదని ఉక్రెయిన్ బలంగా ఫిక్స్ అయ్యింది. సరిహద్దులో ఇప్పటికే లక్షా ముప్ఫైవేలమంది సైనికులను మోహరించింది. అందుకే సాధారణ పౌరులకు యుద్ధ శిక్షణను ఆఘమేఘాల మీద ఇస్తోంది. ఈ మేరకు ఢిపెన్స్ ఫోర్స్ అధికారులు.. యువత, వయో వృద్ధులను సైతం రంగంలోకి దించుతోంది. ఈమేరకు చెక్కు తుపాకులతో శిక్షణ ఇస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి కూడా. యుద్ధం తమదాకా వచ్చేసిందని బలంగా నమ్ముతున్న పౌరులు శిక్షణకు ఆసక్తి చూపిస్తున్నారు.
సంబంధిత వార్త: ఉక్రెయిన్ కేంద్రంగా.. అగ్రరాజ్యాల కొట్లాటకు కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment