invaders
-
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్‌ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
గాడ్సే భరతమాత ముద్దుబిడ్డ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొల్హాపూర్ అల్లర్ల తర్వాత అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా ఉన్నా కానీ రాజకీయ నేతలు మాత్రం ఆ చిచ్చును ఆరనీయడం లేదు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన "గాడ్సే వారసులు" వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గాంధీని చంపిన నాథూరాం గాడ్సే భరతమాత ముద్దుబిడ్డే అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే అవేమీ పట్టని రాజకీయ నాయకులు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి తెరతీశారు. కొల్హాపూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ "ఔరంగజేబు వారసులు" అంటూ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు గాడ్సే, ఆప్టేల వారసులు గురించి కూడా తెలిసి ఉండాలని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ నాథూరాం గాడ్సేను భరతమాత ముద్దుబిడ్డగా వర్ణించారు. మంత్రి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గాడ్సే గాంధీ హంతకుడయితే గాడ్సే కూడా భరతమాత ముద్దుబిడ్డే కదా. ఆయన భారత దేశంలోనే పుట్టాడు. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుండి వచ్చినవాడు కాదు. బాబర్ వారసులుగా పిలవబడటానికి ఇష్టపడేవారు ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరని అన్నారు. #WATCH | Chhattisgarh: If Godse is Gandhi's killer, he is also the nation's son. He was born in India, and he was not an invader like Aurangzeb & Babar. Whosoever feels happy to be called the son of Babar, that person can't be the son of Bharat Mata: Union Minister Giriraj Singh pic.twitter.com/7GIS3z7noM — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2023 ఇది కూడా చదవండి: రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది.. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై! -
ఛత్రపతి శివాజీ ప్రారంభించారు.. మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్ షా
పుణే: మొగలులు, ఇతర విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయాలను ఛత్రపతి శివాజీ పునర్నిర్మించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్లాఘించారు. మరాఠా యోధుడు ప్రారంభించిన ఆ పనిని ప్రధాని మోదీ నేడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే శివాజీ తన జీవితాన్ని పణంగా చెప్పారన్నారు. పుణేలోని నర్హే–అంబేగావ్‌లో శివాజీ జీవితగాథ ఆధారంగా ‘శివసృష్టి’ ఇతివృత్తంతో 21 ఏకరాల్లో ఏర్పాటవుతున్న పార్క్ మొదటి దశను అమిత్ షా ప్రారంభించారు. ‘శివాజీ అనంతరం ధ్వంసమైన ఆలయాల పనర్నిర్మాణాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు. పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు’అన్నారు. శివాజీ ఆశీస్సులతో విల్లు, బాణం: షిండే ఛత్రపతి శివాజీ ఆశీస్సులతో తమకు శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. శివసృష్టి ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని షిండే చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, అమిత్ షా తమ వెనక కొండంత అండగా నిలిచారని శనివారం ఆయన పేర్కొనడం తెలిసిందే. -
ఇక తగ్గేదేలే.. మొత్తం ఉక్రెయిన్ను ఆక్రమించండి: పుతిన్
ప్రతిఘటన ఆపి.. ఆయుధాలు పక్కనపెడితేనే చర్చలంటూ ప్రకటించిన రష్యా.. గంటల వ్యవధిలోనే మాట మార్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపొద్దంటూ స్వరం మార్చాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పూర్తిగా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి తగ్గొద్దంటూ సైన్యానికి కీలక సూచన చేశాడు. పనిలో పనిగా ఉక్రెయిన్ సైన్యానికి ఓ సలహా ఇస్తున్నాడు. గురువారం ఉదయం నుంచి మొదలైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలు.. శుక్రవారం కొనసాగాయి. అయితే మధ్యాహ్నం తర్వాతి పరిణామాలతో ఒక్కసారిగా సీన్ మారింది. ఉక్రెయిన్ ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని రష్యా.. ఈలోపే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఉక్రెయిన్ పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. చర్చల దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయని.. యుద్ధం ముగియొచ్చని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి విజ్ఞప్తిని సైతం లెక్కచేయకుండా.. దాడులు ముమ్మరం చేయాలని పుతిన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈయూ ఆంక్షలు, బంధువుల ఆస్తుల్ని సీజ్ చేయడం, అమెరికా సైబర్ దాడులు, నాటో దళాల కీలక సమావేశం.. ఒకదానివెంట ఒకటి వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పుతిన్ మనసు మార్చుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. శుక్రవారం ఓ టీవీ ఛానెల్లో ప్రసంగించిన పుతిన్, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యాన్ని కోరాడు. #UPDATE Russian President Vladimir Putin on Friday called on the Ukrainian army to overthrow the country's leadership whom he described in a televised address as "terrorists" and "a gang of drug addicts and neo-Nazis" pic.twitter.com/eFTPYcoO5n — AFP News Agency (@AFP) February 25, 2022 ప్రస్తుతం రాజధాని కీవ్ Kyiv పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా.. గెరిల్లా దళాలతో రష్యా ఆర్మీ దాడులు నిర్వహిస్తోంది. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా దళాలు ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఉక్రెయిన్ బలగాలు సైతం ధీటుగానే పోరాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఈ తరుణంలో నాటో దళాల ఎమర్జెన్సీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. చదవండి: ఉక్రెయిన్‌పై వార్.. పుతిన్‌కు ఊహించని షాక్ -
హైఅలర్ట్: ఏ క్షణంలోనైనా యుద్ధట్యాంకర్ పేలొచ్చు!
High Alert At Ukrain Border Amid Forces Deploy: అగ్రరాజ్యాల మధ్య వైరం.. ఎక్కడో చిన్న దేశం మీద అగ్గి కురిపించేందుకు సిద్ధమైంది. అమెరికా-నాటో, రష్యా దళాల మోహరింపు నడుమ ఉక్రెయిన్ సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణ రష్యా సిద్ధమైంది(ఆ ఉద్దేశం లేదని వ్లాదిమిర్‌పుతిన్ బుకాయిస్తుండడం తెలిసిందే) . తన సైన్య బలగాల్లో మెజార్టీని పశ్చిమ వైపున మోహరించింది. సుమారు లక్ష మంది సైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కొన్నిబయటకు లీక్ అయ్యాయి. బెలారస్‌లోని బ్రెస్ట్స్కై శిక్షణ కేంద్రం దగ్గర రష్యా దళాలు, వాళ్ల టెంట్లకు సంబంధించిన ఫొటోలు సైతం బయటకు పొక్కాయి. మరోవైపు అమెరికా 8,500 సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు NATO బలగాలను పంపుతూనే.. మరికొన్ని బలగాలను సిద్ధంగా ఉంచింది. ఈ రెండు వర్గాల విస్తరణ.. పొరుగున ఉన్న క్రిమియా, బెలారస్ పొడవునా ఉంది. కేవలం దళాల మోహరింపు మాత్రమే కాకుండా.. భారీ ఆయుధాలు, కవచాలు ఫిరంగిలతో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని చాలా వరకు దూరప్రాంతాల నుండి రైలులో రవాణా చేయబడినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఐరోపాలో బహిరంగ సంఘర్షణను నివారించడానికి.. పాశ్చాత్య దేశాలు దౌత్యపరమైన చర్చల దిశగా అగ్రరాజ్యాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా, అమెరికా సోమవారం UN భద్రతా మండలిలో చర్చలు నిర్వహించాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరిహద్దులో పోటాపోటీ బలగాలను మోహరించడం ద్వారా ప్రపంచానికి యుద్ధ సంకేతాలు పంపడం ఆపాలని, తమ పౌరుల భయాందోళనలను రెట్టింపు చేయొద్దంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ.. ఈ వేదిక నుంచి అగ్రరాజ్యాలకు పిలుపు ఇవ్వడం విశేషం. చెక్క తుపాకులతో శిక్షణ!! Ukrainian Civilians.. రష్యా ఆక్రమణ భయాందోళనల నడుమ.. ఎలాంటి కేవలం అమెరికా-నాటో దళాల్ని నమ్ముకోకూడదని ఉక్రెయిన్ బలంగా ఫిక్స్ అయ్యింది. సరిహద్దులో ఇప్పటికే లక్షా ముప్ఫైవేలమంది సైనికులను మోహరించింది. అందుకే సాధారణ పౌరులకు యుద్ధ శిక్షణను ఆఘమేఘాల మీద ఇస్తోంది. ఈ మేరకు ఢిపెన్స్ ఫోర్స్ అధికారులు.. యువత, వయో వృద్ధులను సైతం రంగంలోకి దించుతోంది. ఈమేరకు చెక్కు తుపాకులతో శిక్షణ ఇస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి కూడా. యుద్ధం తమదాకా వచ్చేసిందని బలంగా నమ్ముతున్న పౌరులు శిక్షణకు ఆసక్తి చూపిస్తున్నారు. సంబంధిత వార్త: ఉక్రెయిన్ కేంద్రంగా.. అగ్రరాజ్యాల కొట్లాటకు కారణం ఇదే.. -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
-
‘ఒరేయ్ కన్నా.. ఏంట్రా ఈ పని!’
ఎంతటోడైనా సరే అమ్మ ముందుకు వచ్చేసరికి పసివాడే అవుతాడు. అలాంటిది అమ్మ ముందు వేషాలేస్తే ఊరుకుంటుందా?. సాధారణంగా అభిమానంతోనో లేదంటే నిరసన తోనో కొందరు ఆట జరిగేటప్పుడు మైదానాల్లోకి పరుగులు తీయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడో బుడ్డోడు అల్లరిలో భాగంగా మైదానంలోకి పరుగులు తీశాడు. సీరియస్‌గా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. రెండున్నరేళ్ల పిలగాడు తల్లి ఒడి నుంచి తప్పించుకుని గ్రౌండ్లోకి దూరబోయాడు. ఆటలో పడి పరధ్యానంలోకి వెళ్లిన ఆ తల్లి.. కాసేపటికే కొడుకు ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది. We hope this mother and her young pitch invader are having a great day. 😂 pic.twitter.com/hKfwa6wyWI — Major League Soccer (@MLS) August 9, 2021 వెంటనే రియాక్ట్ అయ్యి ఒక దూకున బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్లోకి దౌడు తీసింది. ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టి, సిబ్బంది సహకారం లేకుండానే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంకేం గ్రౌండ్ మొత్తం ఒక్కసారి ఘొల్లుమని గోల చేసింది. A young pitch invader was quickly scooped up by their own personal security detail without incident. #FCCincy #mls pic.twitter.com/gK2bzgNdas — Sam Greene (@SGdoesit) August 8, 2021 కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. సిన్సిన్నాటి, ఓర్లాండో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్ కార్పెంటర్, ఆ తల్లి పేరు మోర్గాన్ టక్కర్. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు. -
ఆక్రమణలో ప్రభుత్వ ఆసుపత్రి స్థలం
► ఎకరా స్థలాన్ని ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించిన ఆక్రమణదారులు ► కళ్ల ముందే కట్టడాలు కడుతుంటే ప్రేక్షక పాత్ర వహించిన వైద్య సిబ్భంది ► సబ్‌సెంటర్‌ను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు కొత్తపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కాపాడిల్సిన ప్రజలే వైద్యశాల స్థలాన్ని ఆక్రమించున్నారు. పర్మినెంట్ కట్టడాలు నిర్మించుకున్నారు. వచ్చిన డాక్టర్లు పట్టించుకోవపోవడం ఆక్రమణదారులకు అడ్డుఅదుపు లేకుండ పోయింది. ప్రాధమిక స్థాయిలోనే చర్యలు తీసుకొనివుంటే హాస్పిటల్ స్థలం ఆక్రమణకు గురయ్యేది కాదని గ్రామస్తులు అంటున్నారు. కొత్తపట్నంలో మండల ఆరోగ్య కేంద్రానికి సర్వేనెంబర్ 1391లో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి కలెక్టర్ సునీల్‌శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కొలతలు కొలిచి హద్దు రాళ్లు కూడ వేయటం జరిగింది. కొంత మంది ఆక్రమణదారులు సుమారు ఎకరా స్థలాన్ని ఆక్రమణ చేసుకొని పెద్ద షెడ్డును ఏర్పాటు చేసుకుంటే స్థానిక డాక్టర్లు కనిసం ఆక్రమణదారులకు నోటీసులు కూడ జారీ చేయకపోవటం స్థానికలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంచాయతీ శాఖ అధికారులు ఇంటి పన్నులు కూడ వారికి హక్కు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి రోజు డాక్టర్లు హాస్పిట్లకు వస్తుంటారు, వారి కళ్ల ముందే నిర్మిస్తుంటే కనీసం జిల్లా అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించకుండ నిర్లక్ష్యం వ్వహరించారు. అంతేకాక వైద్యశాల ముందు భాగాన్ని ఆక్రమించుకొని ఇనుప తీగతో పెన్సింగ్ వేసుకున్నాడాక్టర్లు పట్టించుకోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పలు సార్లుఈ విషయాన్ని వైద్య అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఆక్రమణలో రెడ్డిపాలెం సబ్‌సెంటర్: కొత్తపట్నం రెడ్డిపాలెంలో సబ్‌సెంటర్ పూర్తిగా ఆక్రమణకు గురయ్యింది. బిల్డింగ్‌లో కొందరు నివాసం ఉంటున్నారు. వారికి పంచాయతీ అధికారులు గతంలో ఇంటి పన్నులు కూడ ఇచ్చి నివాస హక్కు కల్పించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయమని అడిగితే ఆక్రమణదారులు మాకు హక్కుందని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ స్థలాన్ని అప్పటిలో ఒక దాత సర్వే నెంబర్ 1429బిలో సుమారు 50 గదులు స్థలాన్ని ఉచితంగా సబ్సెంటర్కు బహుకరించారు. 30 సంవత్సరాలుదాక శిథిలావస్థకు చేరింది. ఇదే అదునుగా ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి మండల ఆరోగ్యకేంద్రం ఆస్తులను స్వాధీనం చేసుకోవలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. -
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: భూమి ఆక్ర మణదారులపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూదందాలపై.. వివాదాలపై మరింత కఠినంగా వ్యవహరించడంలో పోలీసుల పాత్రపై జోన్ స్థాయిలో అవగాహన సదస్సును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనేక నేరాలతో సంబంధమున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు. పిల్లలతో పని చేయిస్తే కేసులు పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రులపై, పని చేయించుకున్న వారిపై, బ్రోకర్లుగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామని డీఐజీ హెచ్చరించారు. ఎక్కడైనా పిల్లలతో పని చేయిస్తున్నా, దుస్తులు లేకుండా వీధుల వెంట చిన్నారులు కనిపించినా 100కు ఫోన్ చేసి చెబితే పోలీసులు వెంటనే స్పందిస్తారని చెప్పారు. సారా వ్యాపారం, తాగితే వచ్చే అనర్థాలు, పిల్లలతో పని చేయిస్తే జరిగే నష్టాలు తదితరాంశాలపై గ్రామా ల్లో, తండాల్లో క ళాజాతాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. నల్ల బెల్లం, గుడుంబా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాల ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. రేంజ్ పరిధిలో ఇప్పటికే నిర్భయ కేసులు కూడా నమోదు చేసినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు డీఐజీ చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లపై మార్కింగ్ వేయిస్తున్నామని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నామని.. అవసరమైతే అక్కడ పోలీసులను ఉంచుతున్నామని అన్నారు. డాబాల్లో, హోటల్స్‌లో కొందరు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడంతో.. ఆ పరిసరాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ తనిఖీ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ మొత్తం కలియతిరిగారు. స్టేషన్లో మూల నున్న కార్లు, ద్విచక్ర వాహనాలు ఉండడాన్ని గమనించి, డీఎస్పీ బాలకిషన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మం జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు చెప్పారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇంకా మెరుగుపడాలని, కొన్ని ప్రాంతాల్లో మార్పు రాలేదని అన్నారు. నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను పక్కగా అమలు చేసేందుకు కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో సలహా కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నగరంలో ధర్నా చౌక్లు.. అక్కడ సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులు, రోడ్డుపై జీబ్రాై లెన్స్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేప్పుడే సెల్లార్‌ను పార్కింగ్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై మున్సిపల్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల పని దినాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వారు అనారోగ్యంపాలు కాకుండా చూసేందుకుగాను హెల్మెట్లు, మాస్కులు ఇచ్చామన్నారు. ట్రాఫిక్ మెరుగుపరిచేందుకు డీఎస్పీ బాలకిషన్‌రావు, సీఐ రామోజి రమేష్ మంచి కృషి చేస్తున్నారని డీఐజీ అభినందించారు. తొలుత, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు హెల్మెట్లు, మాస్కులు, హ్యాండ్ సిగ్నల్ లై ట్లు పంపిణీ చేశారు.