ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: భూమి ఆక్ర మణదారులపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూదందాలపై.. వివాదాలపై మరింత కఠినంగా వ్యవహరించడంలో పోలీసుల పాత్రపై జోన్ స్థాయిలో అవగాహన సదస్సును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనేక నేరాలతో సంబంధమున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు.
పిల్లలతో పని చేయిస్తే కేసులు
పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రులపై, పని చేయించుకున్న వారిపై, బ్రోకర్లుగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామని డీఐజీ హెచ్చరించారు. ఎక్కడైనా పిల్లలతో పని చేయిస్తున్నా, దుస్తులు లేకుండా వీధుల వెంట చిన్నారులు కనిపించినా 100కు ఫోన్ చేసి చెబితే పోలీసులు వెంటనే స్పందిస్తారని చెప్పారు. సారా వ్యాపారం, తాగితే వచ్చే అనర్థాలు, పిల్లలతో పని చేయిస్తే జరిగే నష్టాలు తదితరాంశాలపై గ్రామా ల్లో, తండాల్లో క ళాజాతాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. నల్ల బెల్లం, గుడుంబా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాల ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. రేంజ్ పరిధిలో ఇప్పటికే నిర్భయ కేసులు కూడా నమోదు చేసినట్టు చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు డీఐజీ చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లపై మార్కింగ్ వేయిస్తున్నామని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నామని.. అవసరమైతే అక్కడ పోలీసులను ఉంచుతున్నామని అన్నారు. డాబాల్లో, హోటల్స్‌లో కొందరు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడంతో.. ఆ పరిసరాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ పోలీస్ స్టేషన్ తనిఖీ
పోలీస్ స్టేషన్‌ను వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ మొత్తం కలియతిరిగారు. స్టేషన్‌లో మూల నున్న కార్లు, ద్విచక్ర వాహనాలు ఉండడాన్ని గమనించి, డీఎస్పీ బాలకిషన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య ఉన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మం జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు చెప్పారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇంకా మెరుగుపడాలని, కొన్ని ప్రాంతాల్లో మార్పు రాలేదని అన్నారు. నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను పక్కగా అమలు చేసేందుకు కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో సలహా కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
నగరంలో ధర్నా చౌక్‌లు.. అక్కడ సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులు, రోడ్డుపై జీబ్రాై లెన్స్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేప్పుడే సెల్లార్‌ను పార్కింగ్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై మున్సిపల్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల పని దినాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వారు అనారోగ్యంపాలు కాకుండా చూసేందుకుగాను హెల్మెట్లు, మాస్కులు ఇచ్చామన్నారు. ట్రాఫిక్ మెరుగుపరిచేందుకు డీఎస్పీ బాలకిషన్‌రావు, సీఐ రామోజి రమేష్ మంచి కృషి చేస్తున్నారని డీఐజీ అభినందించారు. తొలుత, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు హెల్మెట్లు, మాస్కులు, హ్యాండ్ సిగ్నల్ లై ట్లు పంపిణీ చేశారు.
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు
Published Wed, Sep 25 2013 4:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement
Advertisement