Kanta Rao
-
అద్దె ఇంట్లో ఉంటున్నాం.. సాయం చేయండి: స్టార్ హీరో కొడుకు
అలనాటి హీరో కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు వందల సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాంతారావు దిగ్గజ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన కుమారులు ఈ సందర్భంగా తమ దీనస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దీనివల్ల మేం ఆర్థికంగా చాలా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ బారినపడినప్పుడు కూడా చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఒకప్పుడు మద్రాసులో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోరారు. -
‘ కాంతారావు’ బయోపిక్
కోదాడరూరల్ : సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్కు దర్శకుడు దాదాసాహెబ్‌పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సమానంగా వెలుగొందిన గొప్పనటుడిపై బయోపిక్‌ను తీసేందుకు 50శాతం వివరాలు సేకరించానని మిగిలిన వివరాల కోసం ఆయన స్వగ్రామం వచ్చానని దర్శకుడు ఆదిత్య తెలిపారు. కాంతారావు జీవిత చరిత్ర తెలుసుకునేందుకు ఆదివారం దర్శకుడు ఆదిత్య కోదాడ మండలం గుడిబండ గ్రామానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనవ విలేకరులతో మాట్లాడారు. కాంతారావు జీవితాన్ని రెండు కోణాల్లో చంద్రదివ్య ఫిలీం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనగనగా ఓ రాకుమారుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో కాంతారావు 1950 నుంచి 1971 వరకు గల స్వర్ణయుగం.. ఆ తర్వాత కష్టాకాలంపై రెండుగంటల నిడివి గల సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలతో పాటు బి.విఠాలాచార్య, హీరోయిన్లు కృష్ణకుమారి, రాజశ్రీ పాత్రలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాంతారావు కుటుంబ సభ్యులతో, పెద్దకుమారుడు ప్రతాప్‌తో సినిమా కథపై చర్చించనని అ న్నారు. దీనిలో భాగంగానే స్వగ్రామంలో ఆయన గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు ఆదిత్య కాంతారావు ఇంటి వరండాలో కూర్చొని గ్రామస్తులు, ఆయన జీవితాన్ని చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుల సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలను దర్శకుడికి వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి గ్రామస్తులు, ఆయన అభిమానుల సహా కారం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, యరగాని లక్ష్మయ్య, బాలేబోయిన సిద్దయ్య, పోలోజు నర్శింహచారి, వెంకటాచారి, శ్రీనివాసుల ప్రసాద్‌రెడ్డి, కుక్కడుపు సైదులు గ్రామ ప్రజలు ఉన్నారు. ఆనందంలో గ్రామస్తులు.. తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గొప్ప దర్శకుడి చేతిలోకే సినిమా.. కాంతారావు బయోపిక్‌ని సినిమా తీసే డైరెక్టర్ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్‌ఫిల్మ్‌లు తీసి 2015లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్ ఓపెన్ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్‌లో పేరు కూడా సంపాదించాడు. తెలుగు చిత్రసీమలో ఏఎన్ఆర్ తర్వాత ఆదిత్యకు ఆ తర్వాతే కళాతపస్వీ విశ్వనాథ్‌గారికి వచ్చింది. పిల్లలుకాదు పిడుగులు సినిమాకు 2004 ఉత్తమ బాలలచిత్ర కేటగిరికిలో నంది అవార్డు కూడా పొందారు. ‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చింది.. ఈనెల 19న సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన కాంతారావు బయోపిక్ వార్తాకు ఉమ్మడి రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సాక్షిలో వచ్చిన వార్తాను చూసిన ఆయన అభిమానులు అనేకమంది ఫోన్ చేశారని సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారని కావాల్సిన సహాయ సకారాలు అందజేస్తామని తెలిపారని అన్నారు. -
‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’
నల్లగొండ: జానపదం అంటే గుర్తొచ్చే నటుడు కత్తి కాంతారావు అని... ఆయన ఒక్కడే జానపద కథానాయకుడని ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాంతారావు 93వ జయంతి సందర్భంగా నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కాంతారావు పేరుతో నెలకొల్పిన అవార్డును సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 500కు పైగా సినిమాల్లో నటించిన కాంతారావు.. ఎన్టీఆర్‌కు సమానంగా రాణించిన మహనీయుడని కొనియాడారు. గతంలో తనదైనశైలిలో విలనిజాన్ని ప్రదర్శించిన జయప్రకాశ్.. ప్రస్తుతం కామెడీ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ హాస్య దర్శకుడు రేలంగి నర్సింహ్మారావు మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీలో కాంతారావుకు ఏనలేని గౌరవముందన్నారు. నటనలో జీవించిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు
► 9న పదవీ విరమణ చేయనున్న ఇరువురు న్యాయమూర్తులు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. మే 2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వారిద్దరికీ వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని శుక్రవారమే ఏర్పాటుచేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులు తమకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే మాట్లాడుతూ...జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ కాంతారావులు న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల తరఫున వాటి అధ్యక్షులు సి.నాగేశ్వరరావు, గండ్ర మోహనరావులు ఘనంగా సన్మానించారు. -
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: భూమి ఆక్ర మణదారులపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూదందాలపై.. వివాదాలపై మరింత కఠినంగా వ్యవహరించడంలో పోలీసుల పాత్రపై జోన్ స్థాయిలో అవగాహన సదస్సును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనేక నేరాలతో సంబంధమున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు. పిల్లలతో పని చేయిస్తే కేసులు పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రులపై, పని చేయించుకున్న వారిపై, బ్రోకర్లుగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామని డీఐజీ హెచ్చరించారు. ఎక్కడైనా పిల్లలతో పని చేయిస్తున్నా, దుస్తులు లేకుండా వీధుల వెంట చిన్నారులు కనిపించినా 100కు ఫోన్ చేసి చెబితే పోలీసులు వెంటనే స్పందిస్తారని చెప్పారు. సారా వ్యాపారం, తాగితే వచ్చే అనర్థాలు, పిల్లలతో పని చేయిస్తే జరిగే నష్టాలు తదితరాంశాలపై గ్రామా ల్లో, తండాల్లో క ళాజాతాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. నల్ల బెల్లం, గుడుంబా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాల ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. రేంజ్ పరిధిలో ఇప్పటికే నిర్భయ కేసులు కూడా నమోదు చేసినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు డీఐజీ చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లపై మార్కింగ్ వేయిస్తున్నామని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నామని.. అవసరమైతే అక్కడ పోలీసులను ఉంచుతున్నామని అన్నారు. డాబాల్లో, హోటల్స్‌లో కొందరు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడంతో.. ఆ పరిసరాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ తనిఖీ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ మొత్తం కలియతిరిగారు. స్టేషన్లో మూల నున్న కార్లు, ద్విచక్ర వాహనాలు ఉండడాన్ని గమనించి, డీఎస్పీ బాలకిషన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఇక్బాల్, డీఎస్పీ బాలకిషన్, సీఐ సారంగపాణి, ఎస్సైలు గణేష్, సుబ్బయ్య ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మం జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు చెప్పారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇంకా మెరుగుపడాలని, కొన్ని ప్రాంతాల్లో మార్పు రాలేదని అన్నారు. నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను పక్కగా అమలు చేసేందుకు కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో సలహా కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నగరంలో ధర్నా చౌక్లు.. అక్కడ సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులు, రోడ్డుపై జీబ్రాై లెన్స్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేప్పుడే సెల్లార్‌ను పార్కింగ్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై మున్సిపల్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల పని దినాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వారు అనారోగ్యంపాలు కాకుండా చూసేందుకుగాను హెల్మెట్లు, మాస్కులు ఇచ్చామన్నారు. ట్రాఫిక్ మెరుగుపరిచేందుకు డీఎస్పీ బాలకిషన్‌రావు, సీఐ రామోజి రమేష్ మంచి కృషి చేస్తున్నారని డీఐజీ అభినందించారు. తొలుత, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు హెల్మెట్లు, మాస్కులు, హ్యాండ్ సిగ్నల్ లై ట్లు పంపిణీ చేశారు.