‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’ | Kanta Rao is as fame as senior NTR, says jayaprakashreddy | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’

Published Thu, Nov 10 2016 7:24 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’ - Sakshi

‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’

నల్లగొండ: జానపదం అంటే గుర్తొచ్చే నటుడు కత్తి కాంతారావు అని... ఆయన ఒక్కడే జానపద కథానాయకుడని ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాంతారావు 93వ జయంతి సందర్భంగా నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

కాంతారావు పేరుతో నెలకొల్పిన అవార్డును సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 500కు పైగా సినిమాల్లో నటించిన కాంతారావు.. ఎన్‌టీఆర్‌కు సమానంగా రాణించిన మహనీయుడని కొనియాడారు. గతంలో తనదైనశైలిలో విలనిజాన్ని ప్రదర్శించిన జయప్రకాశ్.. ప్రస్తుతం కామెడీ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ హాస్య దర్శకుడు రేలంగి నర్సింహ్మారావు మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీలో కాంతారావుకు ఏనలేని గౌరవముందన్నారు. నటనలో జీవించిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement