senior NTR
-
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
'ఎన్టీఆర్ సినిమాతో చంద్రమోహన్‌కు చేదు అనుభవం'.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన చంద్రమోహన్ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్ సినిమా సెట్లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) -
సీనియర్ ఎన్టీఆర్ గ్రామం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
-
మద్యపాన నిషేధం చేస్తే చంద్రబాబు ఏం చేసాడంటే
-
టీడీపీని నవ్వుల పాలు చేసావ్ కదరా
-
తెలుగు దేశం పార్టీ ప్రారంభించింది నేను నువ్వెవడివిరా మధ్యలో...
-
ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్‌బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా) తొలిసారి రాముడిగా ఆయనే.. సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం. రాముడంటే ఆయనే అనేలా.. తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్‌ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్‌కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది. రావణుడిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ఒక్కసారైనా ఒదిగిపోయారు.. తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్‌బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్‌లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది. -పిన్నాపురం మధుసూదన్ -
నేడు సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్ధంతి
-
ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. అమెరికాలో విగ్రహం
2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ అనుమతి ఇచ్చారని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవలే ఎడిసన్ ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపారు. మెజారిటీ తెలుగువారు తమ యూఎస్ ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుంచే ప్రారంభించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు టీజీ విశ్వప్రసాద్ గారు శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో శ్రీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రతిపాదనను తీసుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు అభిమానులు మద్దతు అందించారు. ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషి ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత అంగీకరించారు. సామ్ జోషి భారత దేశానికి చెందిన మొదటి మేయర్. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీచే నియమించబడిన సాకేత చదలవాడ, కమీషనర్ న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల కమిషన్, ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించేలా అవుతుంది. ఇది భారతీయ వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది. ఈ కార్యక్రమం NASAA(నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి తానా అధ్యక్షుడు, రవి పొట్లూరి తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు. ఎన్టీఆర్ తెలుగువారిని ప్రపంచ వ్యాప్తంగా, తెలుగు వారు గొప్పగా గర్వించదగిన ప్రజలమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ లెజెండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: సాయి కుమార్
Sai Kumar About Gandharva Movie: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వలో కీలక పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. గంధర్వ కథ చెప్పగానే మీరెలా ఫీలయ్యారు? దర్శకుడు అప్సర్ ఆర్మీ మనిషి. ఏదో కొత్తదనం ఆయనలో కనిపించింది. నాకు దర్శకుడు వీరశంకర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త దర్శకుడు కథ చెబుతాడు వినమన్నారు. నేను ఈ మధ్య కన్నడలో `రంగీ తరంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్లింది. నేను ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని నన్ను చాలామంది అడిగారు. కథను నమ్మాను అన్నాను. అలాగే ఎస్.ఆర్. కళ్యాణమండపం కూడా అలానే జరిగింది. ఇప్పుడు గంధర్వ కథ కూడా అంతే. చాలా కొత్తగా కథ వుంది. మనసావాచా కర్మనా మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా హిట్ వస్తుంది. గంధర్వలోనూ అంతా కొత్తవారైనా కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వున్నాయి. కలికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వస్తే ఎలా వుంటుందనే ఆసక్తికరంగా అనిపిస్తుంది. గంధర్వలో అలానే వుంటుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. చాలా పాత్రలు పోషించిన మీకు గంధర్వ ఎంత మేరకు కొత్తగా అనిపించింది? నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్లయింది. ఈరోజుకీ ఇంకా అదే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని పలుకరిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయడానికి కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా కిక్ ఇచ్చింది. అండర్ ప్లే, డ్రామా.. ఇలా ప్రతీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్రయత్నమే గంధర్వ సినిమాలోని నా పాత్ర వుంటుంది. గంధర్వలో 1971-2021 అని వుంది. దానికి మీ పాత్రకు సంబంధం వుందా? నేను ఇంతకుముందు ఇప్పుడు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా భిన్నంగా చేస్తున్నవే. ధనుష్ చిత్రం `సర్`లో నెగెటివ్ పాత్ర చేస్తున్నా. అలాగే దసరాలో ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంటుంది. ఇప్పుడు గంధర్వలో కూడా ఎవరూ ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంది. నేను పొలిటీషియన్. సీఎం అవ్వాలనుకుంటాను. సరిగ్గా ఆ టైంలో నా తండ్రి అంటూ సందీప్ మాధవ్ నా జీవితంలోకి వస్తాడు. తను యంగ్‌గా వుంటాడు. మా అమ్మకు, ఈయనకు వున్న రిలేషన్ ఏమిటని. మీడియా హైలైట్ చేస్తుంది. కథలో ట్విస్ట్ అదే. 1971-2021 టైం ట్రావెల్లో జరిగే కథ కాబట్టి అలా పెట్టారు. గంధర్వ చూశారు కదా ఎలా అనిపించింది? ఇప్పటి జనరేషన్ ప్రతీదీ పరిశీలిస్తున్నారు. మేథావుల్లా ఆలోచిస్తున్నారు. కంటెన్యూటీకూడా వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే కథను ముగింపులో చాలా జాగ్రత్తగా చెప్పాలని దర్శకుడితో అన్నాను. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సినిమాటిక్‌గా ఒప్పించగలగాలి. క్లైమాక్స్‌లో సైంటిఫిక్‌గా వుంటూనే అందరినీ మెప్పించేలా చేశాడని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయన సినిమా చూసి సూపర్‌డూపర్ హిట్ అవుతుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని డబ్బింగ్ చెప్పినవాళ్లు, సందీప్ మాధవ్, జయసింహ కూడా చెప్పారు. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ వుంటుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ వుంటాయి. ఓ పజిల్ కూడా వుంటుంది. సేమ్ మా నాన్నలా వుండే సందీప్‌ను చూసి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారనుకుంటాం. అనేది లాజిక్‌గా దర్శకుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది. ఈ జనరేషన్ హీరోలతో నటించడం ఎలా అనిపిస్తుంది? సందీప్ చేసిన గత సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్. కొత్త జనరేషన్ అయిన సత్యదేవ్, ప్రియదర్శితో నేను చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధర్వలో సందీప్‌తో చేశా. టైటిల్‌కు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం. ఇన్నేళ్ల కెరీర్లో చేయని పాత్రలేదు. ఇంకా కొరత వుందా? నేను నాటకాలు వేసే నాటినుంచి మేకప్ వేసుకుని ఇప్పటికి 50 ఏళ్లయింది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ల ప్రస్థానం నాది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలని నటుడిగా అనిపిస్తుంది. నటుడికి సంతృప్తి వుండదు. మేజర్ చంద్రకాంత్ షూట్లో ఎన్టీఆర్‌కు 72 ఏళ్లు. ఆ వయస్సులో ఆయన ఓ సీన్లో పైనుంచి దూకాలి. డూప్‌లేకుండా దూకేస్తానని చేసేశాడు. నటుడిగా అంత డెడికేషన్ వుండాలి. నేను నేర్చుకుంది అదే. కన్నడలో కామెడీ చేశాను. ఇటీవలే పౌరాణికంలో దుర్యోధనుడిగా నటించాను. ఇంకా పలు భిన్నమైన పాత్రలు చేయాలనుంది. కొత్త చిత్రాలు? తమిళంలో `డీజిల్` సినిమా చేస్తున్నా. అందులో డీజిల్ మాఫియా లీడర్‌గా నటిస్తున్నా. ఇందులో మూడు గెటప్లుంటాయి. ఇంకా ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నా. -
1995లో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అండ్ కో
-
అందరికీ ఒక్కడే దేవుడు!
అది 50 ఏళ్ళ క్రితం సంగతి. తెలుగునాట ఓ కాలేజీలో విభిన్న మతాల విద్యార్థుల మధ్య ఘర్షణ రేగింది. సమ్మె జరిగింది. మతవిద్వేషాల మధ్య చివరకు ఆ కాలేజీని కొంతకాలం తాత్కాలికంగా మూసేశారు. మమతలు పెంచవలసిన మతాలు, మనుషులను విడదీస్తున్న సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ సినిమా వచ్చింది. సీనియర్ క్యారెక్టర్ నటుడు నాగభూషణం స్వయంగా ఓ కీలకపాత్ర పోషిస్తూ, ఓ సినిమాను సమర్పించారు. అదే పెద్ద ఎన్టీయార్ హీరోగా చేసిన – ‘ఒకే కుటుంబం’. ఈ క్రిస్మస్తో స్వర్ణోత్సవం (రిలీజ్ తేదీ 1970 డిసెంబర్ 25) పూర్తి చేసుకున్న ప్రబోధాత్మక చిత్రం. ఎన్టీఆర్ సినీ కుటుంబం: హిందువైన రాముగా పుట్టి, అనుకోకుండా ఓ ముస్లిమ్ ఇంట రహీముగా పెరిగి, ఓ క్రైస్తవ అమ్మాయి మేరీని ప్రేమించి, పెళ్ళాడిన ఓ యువకుడి (ఎన్టీఆర్) కథ ఇది. ఆ యువకుడి కన్నతండ్రి దుర్మార్గుడైన వజ్రాల వర్తకుడు (నాగభూషణం). కుమారుడని తెలియక, హీరో మీదే యాసిడ్ దాడి చేయిస్తాడు. అలా ముఖం అందవిహీనంగా మారే హీరో పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తరువాత పుట్టుకతో వికారమైన ముఖం ఉన్న హీరో పాత్ర తమిళ, తెలుగు తెరపై అనేకం వచ్చాయి. శివాజీగణేశన్ సూపర్ హిట్ ‘దైవ మగన్’ (తెలుగులో ‘కోటీశ్వరుడు’) లాంటివి అందుకు ఉదాహరణ. (చదవండి: వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్) ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో నాగభూషణానికి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’ లాంటి తన సొంత చిత్రాలు చాలావాటిలో పాత్రలను ఎస్వీఆర్ అందుబాటులో లేనప్పుడల్లా, నాగభూషణానికి ఇచ్చేవారని పాత సినీ పరిశీలకుల మాట. అలాగే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో అయినా... సినీపరిశ్రమలోని తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సొంతంగా సినిమాలు తీసుకుంటామంటే, వారికి డేట్లిచ్చి, ప్రోత్సహించేవారు. తోటివారికి అలా చాలా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ క్రమంలోనే నాగభూషణానికి ఎన్టీఆర్ ఈ ‘ఒకే కుటుంబం’ చేశారు. మంచి సినిమాల మన భీమ్ సింగ్: తమిళంలో అగ్ర దర్శకుడైన ఎ. భీమ్‌సింగ్ ఈ ‘ఒకే కుటుంబం’కి రూపకర్త. ఎన్టీఆర్ హీరోగా భీమ్‌సింగ్ దర్శకత్వంలో తొలి సినిమా ఇదే. తమిళంలో అగ్ర హీరో శివాజీ గణేశన్‌తో అనేక సూపర్ హిట్లు తీసి, హిందీలో కూడా పలు చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత భీమ్సింగ్ది. తమిళనాట ఎంతో పేరున్న భీమ్‌సింగ్ నిజానికి అచ్చంగా మన తెలుగువారే. తిరుపతి దగ్గర రాయలచెరువు ఆయన స్వస్థలం. ఏసుక్రీస్తుపై విజయచందర్ నిర్మించిన ‘కరుణామయుడు’కు కూడా దర్శకుడు భీమ్సింగే. ఆ చిత్రం తీస్తున్నప్పుడే అస్వస్థతకు గురై, భీమ్‌సింగ్ మరణించారు. 1980 – 90లలో తెలుగులో మనకు దాసరి – రాఘవేంద్రరావుల లాగా, వాళ్ళ కన్నా చాలాముందే తమిళ వెండితెరను ఇద్దరు ప్రముఖ దర్శకులు – భీమ్‌సింగ్, శ్రీధర్ ఏలారు. సూపర్ హిట్లిచ్చి, తమిళ సినీచరిత్రలో వారిద్దరూ భాగమయ్యారు. తమిళ సినీరంగం ఇప్పటికీ తలుచుకొనే ఆ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం విశేషం. దాసరి వర్సెస్ నాగభూషణం?: ‘ఒకే కుటుంబం’కి భీమ్‌సింగ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ఆయన ఓ పాట కూడా రాశారు. అప్పట్లో తమిళ, హిందీ చిత్రాల బిజీతో ఉన్న భీమ్ సింగ్ కు కుదరనప్పుడు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను దాసరే డైరెక్ట్ చేయడం విశేషం. ఆ చిత్రీకరణ సమయంలో ఏమైందో, ఏమో కానీ దర్శకుడిగా మారాలన్న ప్రయత్నంలో ఉన్న దాసరికీ, నటుడు – నిర్మాత నాగభూషణానికీ ఎక్కడో తేడా వచ్చింది. సినిమా అయిపోయినా, ఆ తరువాత కూడా వారి మధ్య ఆ పొరపొచ్చాలు సమసిపోయినట్టు లేవు. అందుకేనేమో... ఆ తరువాత దాసరి దర్శకుడై, అనేక చిత్రాలు రూపొందించినా ఆయన సినిమాల్లో నాగభూషణం కనిపించరు. ఎన్టీఆర్ సరసన లక్ష్మి నటించారీ చిత్రంలో. కాంతారావు, రాజశ్రీ మరో జంట. మతసామరస్యానికి ప్రతీకగా..: ఒక మతం ఎక్కువ, మరో మతం తక్కువ కాదంటూ... మతసామరస్యం బోధించే ఈ సినిమా కథకు తగ్గట్టుగా... టైటిల్‌కు పక్కనే గుడి, మసీదు, చర్చి శిలువ – మూడూ ఉండేలా అర్థవంతమైన డిజైన్ చేశారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా అప్పట్లో కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడడం విశేషం. మూడు వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాలో కనిపిస్తారు. తొలి తరం అగ్ర హీరో నాగయ్య చుట్టుపక్కల అందరికీ మంచి చేసే ముస్లిమ్ పెద్ద ఇస్మాయిల్ పాత్రలో, అలాగే మరో తొలినాళ్ళ హీరో సిహెచ్. నారాయణరావు క్రైస్తవ ఫాదర్ జేమ్స్ పాత్రలో నటించారు. ఆకాశవాణిలో ‘రేడియో బావగారు’గా సుప్రసిద్ధులైన ప్రయాగ నరసింహశాస్త్రి ఈ చిత్రంలో హిందువైన శాస్త్రి పాత్రలో కనిపిస్తారు. ఎస్పీ కోదండపాడి సంగీతంలో దాశరథి రాయగా, ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘అందరికీ ఒక్కడే దేవుడు’ పాట ప్రబోధాత్మకంగా సాగుతుంది. ఒకప్పుడు తరచూ రేడియోల్లో వినిపించిన ‘మంచిని మరచి వంచన చేసి’ అనే పాట సమాజంలోని పరిస్థితులను స్ఫురింపజేస్తూ, 50 ఏళ్ళ తరువాత ఇవాళ్టికీ సరిగ్గా సరిపోవడం విశేషం. మిస్సయిన సెంచరీ! ‘ఒకే కుటుంబం’కి మాటలు రాసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఆయన మాటలు, మరీ ముఖ్యంగా వినోదభరితమైన విలనీ పండిస్తూ నాగభూషణం పోషించిన మార్తాండం పాత్రకు రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నాగభూషణం పక్కన ఉండే అల్లు రామలింగయ్యతో ఈ సినిమాలో ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’ అనే శ్లోకానికి శివుడు, విష్ణువు అంతా రూపాయిలోనే కనిపిస్తారు అంటూ చేసిన సోషల్ సెటైర్ డైలాగ్ అప్పట్లో అందరికీ తెగ నచ్చింది. అప్పట్లో జనాదరణ పొందిన ఈ చిత్రం నిజానికి శతదినోత్సవం జరుపుకోవాల్సిందే. అయితే, అప్పట్లో సినిమా వందరోజులు ఆడితే థియేటర్లలో వర్కర్లకు బోనస్ ఇచ్చే పద్ధతి ఉండేది. దాంతో, వర్కర్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సరిగ్గా 97 రోజులకు ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మాతలు హాలులో నుంచి తీసేయడం విచిత్రం. – రెంటాల జయదేవ -
ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి
-
అసలు 1989లో ఏం జరిగింది..?
-
‘ఎన్టీఆర్‌తో సమానమైన హీరో ఆయన’
నల్లగొండ: జానపదం అంటే గుర్తొచ్చే నటుడు కత్తి కాంతారావు అని... ఆయన ఒక్కడే జానపద కథానాయకుడని ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాంతారావు 93వ జయంతి సందర్భంగా నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కాంతారావు పేరుతో నెలకొల్పిన అవార్డును సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 500కు పైగా సినిమాల్లో నటించిన కాంతారావు.. ఎన్టీఆర్‌కు సమానంగా రాణించిన మహనీయుడని కొనియాడారు. గతంలో తనదైనశైలిలో విలనిజాన్ని ప్రదర్శించిన జయప్రకాశ్.. ప్రస్తుతం కామెడీ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ హాస్య దర్శకుడు రేలంగి నర్సింహ్మారావు మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీలో కాంతారావుకు ఏనలేని గౌరవముందన్నారు. నటనలో జీవించిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. -
నేడు ఎన్టీఆర్ జయంతి