ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. అమెరికాలో విగ్రహం | Legend Senior NTR statue in Edison City By greatest initiative of NASAA | Sakshi
Sakshi News home page

Senior NTR statue: అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం.. నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ 

Published Mon, Dec 19 2022 9:42 PM | Last Updated on Mon, Dec 19 2022 9:48 PM

Legend Senior NTR statue in Edison City By greatest initiative of NASAA  - Sakshi

2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు.   న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ అనుమతి ఇచ్చారని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవలే ఎడిసన్ ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపారు. మెజారిటీ తెలుగువారు తమ యూఎస్ ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుంచే ప్రారంభించారు. సీనియర్ ఎన్టీఆర్‌ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని తెలిపారు.

భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు టీజీ విశ్వప్రసాద్ గారు శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో శ్రీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రతిపాదనను తీసుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు అభిమానులు మద్దతు అందించారు. ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషి ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత అంగీకరించారు.

సామ్ జోషి భారత దేశానికి  చెందిన మొదటి మేయర్. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీచే నియమించబడిన సాకేత చదలవాడ, కమీషనర్ న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్,  పసిఫిక్ ద్వీపవాసుల కమిషన్, ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. 

యునైటెడ్ స్టేట్స్‌లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించేలా అవుతుంది. ఇది భారతీయ  వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది. 

ఈ కార్యక్రమం NASAA(నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి తానా అధ్యక్షుడు, రవి పొట్లూరి తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు.

ఎన్టీఆర్ తెలుగువారిని ప్రపంచ వ్యాప్తంగా, తెలుగు వారు గొప్పగా గర్వించదగిన ప్రజలమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ లెజెండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement