Vishwa Prasad
-
ఫిల్మ్ విభాగాల్లో ఉచిత శిక్షణ: టీజీ విశ్వప్రసాద్
‘గూఢచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, చైర్మన్ టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్, బెంగళూరులో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ని ఆరంభించారు. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంలో రాణించాలనుకునే నేటి యువతకి మేం ఉన్నామని భరోసా ఇస్తూ ఉచిత శిక్షణ కల్పించి, ప్రతిభావంతులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ ప్రధాన లక్ష్యం. చైర్ఉమెన్ టీజీ వందనా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి శిక్షణతోపాటు భావితరాలకి మంచి భవిష్యత్తు అందించడానికి దిశా నిర్దేశంగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ అడుగులు వేస్తుంది. స్టూడెంట్స్‌కు రియల్ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కల్పించడంతోపాటు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఫిల్మ్ కోర్సులు పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తాం. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైనింగ్, వర్చ్యువల్ ప్రోడక్షన్– డిఐ, లైటింగ్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 90322 57101 నంబరులో సంప్రదించాలి’’ అని తెలిపారు. -
హనుమంతుని నేపథ్యంలో రణమండల
‘‘నా స్వస్థలం ఆదోనిలో షూటింగ్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘రణమండల’ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే జరుపుతాం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న 46వ చిత్రానికి ‘రణమండల’ టైటిల్ ఖరారు చేసి, ఆదోని రణమండల దేవాలయంలో ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.హనుమంతుని నేపథ్యంలో భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘రణమండల ఆంజనేయుని దేవాలయ క్షేత్ర నామాన్నే మా చిత్రానికి టైటిల్‌గా పెట్టడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కీలకంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇక మా సంస్థ నుంచి రానున్న 47వ చిత్రం షూటింగ్‌ని కూడా ఆదోనిలోనే జరుపుతాం’’ అని టీజీ విశ్వప్రసాద్ అన్నారు. -
లోకేష్ కనగరాజ్ స్టైల్లో 'ఈగిల్' క్లైమాక్స్ ఉంటుంది: నిర్మాత
హీరో రవితేజ లేటెస్ట్ మూవీ 'ఈగల్'. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. విడుదల దగ్గర పడటంతో సినిమా ఎలా ఉండబోతుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్.. 'ఈగల్' గురించి, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ మహేశ్, వెంకటేశ్, నాగార్జున చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో 'ఈగల్' పోటీ నుంచి తప్పుకొంది. తెలుగు నిర్మాతల మండలి సోలో డేట్ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 9కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా క్లైమాక్స్ వేరే లెవల్ ఉండబోతుందని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!) 'ఈగల్' సినిమాలోని చివరి 40 నిమిషాలు ఎక్స్‌ప్లోజివ్‌గా ఉంటుందని, లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటుందని.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరని నిర్మాత విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన చెప్పినట్లు క్లైమాక్స్ ఉంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. 'ఈగల్' సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్ కీలకపాత్ర పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' సినిమాకు మూడో పార్ట్? వర్కౌట్ అయ్యే పనేనా?) -
ఆ మైలురాయిని చేరుకుంటాం
‘‘మా బ్యానర్లో వంద సినిమాలను త్వరితగతిన పూర్తి చేయాలనే మా మిషన్ ఆన్‌లోనే ఉంది. మా నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాది కనీసం 15 సినిమాలు విడుదల కావొచ్చు. రవితేజగారి ‘మిస్టర్ బచ్చన్’, శర్వానంద్, శ్రీ విష్ణు సినిమాలు ఈ ఏడాదే విడుదలవుతాయి. నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ గురించి త్వరలోనే చెబుతాం. అలాగే ఈ ఏడాది మా సంస్థలో 50వ చిత్రం మైలురాయిని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈగల్’ను 2023 డిసెంబరు చివరి వారంలో విడుదల చేద్దామనే ఆలోచన చేశాం. అయితే ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ రిలీజ్ కన్ఫార్మ్ కావడంతో ‘ఈగల్’ను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నాం. కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్, పరిశ్రమ మేలుని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 9కి వాయిదా వేశాం. ఈ టైమ్‌కి ‘యాత్ర 2’ కూడా వస్తోంది. కానీ ఆ సినిమా డిఫరెంట్. ఏ సినిమా రీచ్ ఆ సినిమాకు ఉంటుంది. ‘ఈగల్’ క్లాసిక్ అండ్ స్టయిలిష్ మాస్ ఎంటర్టైనర్. రవితేజగారు కొత్తగా కనిపిస్తారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి’’ అన్నారు. -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
హవాలా డబ్బుతో సినిమా? ఏంటి 'బ్రో' ఇది!
పవన్ కల్యాణ 'బ్రో'.. బాక్సాఫీస్ దగ్గర చల్లబడింది. 50, 100 కోట్ల కలెక్షన్స్ అని హడావుడి చేస్తున్నారు కానీ అదంతా ఉత్తిదే. ఎందుకంటే అంత డబ్బులు వస్తే ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేయాలి. కానీ ఆ ఊసే లేదు. దీనిబట్టే అర్థమవుతోంది. సినిమాకు టాక్ ఫుల్.. వసూళ్లు నిల్ అని. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు చెప్పేది వింటే.. 'బ్రో' నిర్మాణం, బడ్జెట్‌పై ఫ్యాన్స్‌కి కూడా కొత్త డౌట్స్ వస్తాయి. (ఇదీ చదవండి: సినిమాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న పవన్) ఏం జరిగింది? ఓటీటీలో రిలీజైన తమిళ సినిమా 'వినోదయ సీతం'. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పవన్ రీమేక్ చేశాడు. తాజాగా థియేటర్లలో రిలీజ్ అయితే.. ఫ్యాన్స్‌కి తప్ప మిగతా ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. 'బ్రో' చూసిన వాళ్లని అడిగితే.. దీనిపై మీకే క్లారిటీ వచ్చేస్తుంది! ఈ సినిమాలో అవసరం లేకున్నా శ్యాంబాబు అనే పాత్ర పెట్టి, ఏపీ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. దీనిపై నటుడు పృథ్వీరాజ్ అవాకులు చవాకులు పేలడం వివాదం మరింత ముదిరేలా చేసింది. అంబటి సెటైర్స్ తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబు.. 'బ్రో' నిజస్వరూపం బటపెట్టారు. 'కలెక్షన్స్ పెంచుకునేందుకు దర్శకనిర్మాతలు తాపత్రాయ పడుతున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాని అద్భుతమని చెబుతున్నారు. కలెక్షన్స్ రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. సినిమాను సినిమాగా తీయాలి. పైశాచికానందం పొందాలనుకుంటే హిట్ కాదు. పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా 'బ్రో'కు రాలేదు. బ్లాక్ మనీని వైట్ చేసుకునే కుట్ర ఈ మూవీ వెనుక ఉంది. ఈ మూవీ నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఆయన ద్వారా టీడీపీ అందజేసింది' అని అంబటి చెప్పుకొచ్చారు. అలానే 'బ్రో' నిర్మాతలకు అమెరికా నుంచి అక్రమంగా హవాలా రూపంలో డబ్బు వచ్చిందని చెబుతూ, వైసీపీ ఎంపీలతో పాటు దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!) డబ్బు రూటింగ్ వైసీపీ నేత రవిచంద్రారెడ్డి కూడా 'బ్రో' చిత్రంపై ఆరోపణలు చేశారు. ఈ సినిమా కోసం ఫారెన్ మనీ రూటింగ్ జరిగిందని ఆరోపించారు. నిర్మాతలు పవన్‌కు ఎంత డబ్బు ఇచ్చారనే దానిపై విచారణ జరపాలని, నిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈడీ జోక్యం చేసుకోవాలని అన్నారు. పై విషయాలన్నీ చూస్తుంటే.. 'బ్రో' వెనక హవాలా హస్తం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాలన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిర్మాత రియాక్షన్ అంబటి ప్రెస్‌మీట్ తర్వాత ఓ టీవీ ఛానెల్ డిబేట్లో మాట్లాడిన 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్.. నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టామని చెప్పారు. పవన్‌కి ఎంతిచ్చామో, సినిమాకు ఖర్చు చేసిన మొత్తం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ నిధులు ఆర్బీఐ రూల్స్ ప్రకారమే వచ్చాయని, ఏజెన్సీలు వస్తే లెక్కలు చూపిస్తామని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
గోపిచంద్‌తో శ్రీవాస్ హ్యాట్రిక్ పక్కా! ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది..
‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు. ► సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ. ► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్పుట్ తీసుకొచ్చారు. ► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. -
ధమాకా.. మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది : నిర్మాత
‘‘ధమాకా’ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. రవితేజ ఎనర్జీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తూ చేసిన మూవీ ఇది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రచయిత ప్రసన్న కలిసి ‘ధమాకా’ కథ చెప్పారు. ఇది రవితేజగారికి బావుంటుందనుకున్నాం. గ్రాండ్‌గా నిర్మించాం. ‘ధమాకా’కి గ్రాండ్‌గా ఓపెనింగ్స్ వచ్చాయి. బీ, సీ సెంటర్ల నుంచి వచ్చే స్పందనను మేం ఊహించాం. అయితే మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మా బ్యానర్ నుంచి ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్‌ని ఓటీటీలో విడుదల చేశాం. ప్రస్తుతం నాగశౌర్య – శ్రీనివాస్ అవసరాల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, గోపీచంద్–శ్రీవాస్ కాంబినేషన్లో ‘రామబాణం’, లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ ఉంది. కొన్ని పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. అమెరికాలో విగ్రహం
2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ అనుమతి ఇచ్చారని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ వెల్లడించింది. ఇటీవలే ఎడిసన్ ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపారు. మెజారిటీ తెలుగువారు తమ యూఎస్ ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుంచే ప్రారంభించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు టీజీ విశ్వప్రసాద్ గారు శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో శ్రీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రతిపాదనను తీసుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆలోచన యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు అభిమానులు మద్దతు అందించారు. ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషి ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత అంగీకరించారు. సామ్ జోషి భారత దేశానికి చెందిన మొదటి మేయర్. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీచే నియమించబడిన సాకేత చదలవాడ, కమీషనర్ న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల కమిషన్, ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించేలా అవుతుంది. ఇది భారతీయ వైభవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది. ఈ కార్యక్రమం NASAA(నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్) ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి తానా అధ్యక్షుడు, రవి పొట్లూరి తానా 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు. ఎన్టీఆర్ తెలుగువారిని ప్రపంచ వ్యాప్తంగా, తెలుగు వారు గొప్పగా గర్వించదగిన ప్రజలమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రతి తెలుగువాడు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ లెజెండ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
‘‘37 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నాను. మన పాత హిట్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు సంతృప్తిగా అనిపించవు. హిట్ అవుతాయి. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. సొంత యాక్టర్స్‌ని పెట్టి సరైన సినిమాలు తీయకపోతే ప్రేక్షకులు నవ్వుతారనే భయం ఉంటుంది. అందుకే కథలను సులువుగా అంగీకరించలేను’’ అన్నారు సురేశ్‌బాబు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీ మామ’. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ శుక్రవారం చిత్రం రిలీజ్ సందర్భంగా సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘వెంకీ మామ’ కథను జనార్థన మహర్షి రాశారు. ఐడియా బావుంది. కానీ ట్రీట్మెంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ ఐడియాను కోన వెంకట్‌కు చెప్పాను. వర్క్ చేయొచ్చు అన్నారు. బాబీ పేరుని కోన వెంకట్ సూచించారు. బాబీ తన టీమ్‌తో తన స్టయిల్లో వర్క్ చేసి నాకు చెప్పాడు. మామాఅల్లుడి బంధాన్ని చూపించే ఓ సన్నివేశాన్ని నాకు వివరించగానే నా కళ్లలో నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నాం అన్నాను. ‘వెంకీ మామ’ సినిమా సూపర్, బంపర్ అలాంటివి చెప్పలేను. పూర్తి స్థాయి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుంది. వెంకీ, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇంతకుముందు కథ విన్న తర్వాత ‘కానీ... ఏదో మిస్ అయింది’ అనేవాణ్ణి. ఇప్పుడు ఏం మిస్ అయిందో చెప్పగలుగుతున్నాను. సినిమా గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ అందులో తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథ చెప్పే దశలోనే ఉన్న సందేహాలు ఎక్కువగా అడిగేస్తుంటాను. కథలు అంత సులువుగా ఓకే చేయనని కూడా అనుకోవచ్చు(నవ్వుతూ). ఇంతకుముందు షూటింగ్‌కి వెళ్లాక కూడా డౌట్స్ అడిగేవాణ్ణి. ఇప్పుడు వేలు పెట్టడం తగ్గించేశాను(నవ్వుతూ). గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేసే ‘హిర ణ్య’కు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను సక్రమంగా అనుసరించి ఆ సినిమాను తక్కువ టైమ్‌లో వరల్డ్ క్లాస్ మూవీగా రూపొందించనున్నాం. ‘అసురన్’ రీమేక్‌తో పాటు, తరుణ్ భాస్కర్‌తో, త్రినాథరావు నక్కినలతో సినిమాలు చేస్తారు వెంకటేశ్. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేయడంతో నమ్మకం ఏర్పడింది. ఈ కథను మొదట వివేక్ కూచిభొట్ల విన్నారు. ఆ తర్వాత సురేశ్‌బాబుగారి దగ్గరకు తీసుకెళ్లాం. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం. మా బేనర్లో 20 సినిమాల వరకూ సిద్ధం కాబోతున్నాయి’’ అన్నారు. ► ‘వెంకీ మామ’ను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాం. వెంకటేశ్ కాలికి గాయం కావడంతో ఆలస్యం అయింది. నవంబర్ అనుకున్నాం. ఆ తర్వాత డిసెంబర్ 13కి ఫిక్స్ చేశాం. రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం. సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ► డిజిటల్ మాద్యమాలు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ రావడంతో థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు తగ్గుతున్నారు అంటున్నారు. వాళ్లను థియేటర్‌కి రప్పించే సినిమాలు చేయడం మీద దృష్టిపెట్టాలి. హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బావుంటుంది. సినిమా మేకింగ్‌లో చాలా శాతం అసమర్థత కనిపిసోంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ► గతంలో దాసరి గురువు పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవడంలేదనే ప్రశ్నకు స్పందిస్తూ – ‘‘దాసరిగారిని గురువులా అందరూ అంగీకరించారు. ఆ స్థానంలో ఇప్పుడు ఎవర్నీ అంగీకరించలేకపోతున్నారు’’ అని అన్నారు. -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ అన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి కృషిచేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అటువంటి పార్టీలో తనను పీసీసీ ఉపాధ్యక్షునిగా నియమించడం గర్వకారణమన్నారు. వివిధ కారణాలతో 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2015లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు సాధించి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ పీసీసీ ఉపాధ్యక్షునిగా పీరుకట్లకు పార్టీ సముచిత స్థానం కల్పించడం అభినందనీయమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సతీష్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు నంబాళ్ల రాజశేఖర్, బీసీసెల్ రాష్ట్ర కన్వీనర్ సనపల అన్నాజీరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ గంజి ఎజ్రా, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాన్న రాము, పట్టణ అధ్యక్షుడు పుట్టా అంజనీకుమార్, పార్టీ నాయకులు ఎం.ఎ.బేగ్, అల్లిబిల్లి రాధ, కె.ఎల్.ఈశ్వరి, కొంక్యాణ మురళీధర్, తైక్వాండో శ్రీను, వైశ్యరాజు మోహన్, డి.త్రినాధరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి శ్రీకాకుళం అర్బన్: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి అనుబంధ విభాగాల ప్రతినిధులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, ఎస్టీ విభాగం రాష్ట్ర చైర్మన్ కె. సుధాకర్, ఏపీ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ ముస్తాక్ మహ్మద్‌లు కోరారు. బుధవారం స్థానిక ఇందిర విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్ అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర చైర్మన్ల అనుబంధ విభాగాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలనే అమలు జరుపుతున్నారు తప్ప కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. సమావేశంలోరాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జి చౌదరి సతీష్, రాష్ట్ర కమిటీ కన్వీనర్ గంజి ఆర్ ఎజ్రా (ఎస్సీ, ఎస్టీ విభాగం), బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ సనపల అన్నాజీరావు, అనుబంధ విభాగాల చైర్మన్ (బీసీ), నంబాళ్ల రాజశేఖర్, (ఎస్సీ) బాన్న రాము, (మైనారిటీ) బి.కోటేశ్వరరావు, (ఎస్టీ) బిడ్డిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.