
‘‘నా స్వస్థలం ఆదోనిలో షూటింగ్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘రణమండల’ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే జరుపుతాం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న 46వ చిత్రానికి ‘రణమండల’ టైటిల్ ఖరారు చేసి, ఆదోని రణమండల దేవాలయంలో ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
హనుమంతుని నేపథ్యంలో భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘రణమండల ఆంజనేయుని దేవాలయ క్షేత్ర నామాన్నే మా చిత్రానికి టైటిల్‌గా పెట్టడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కీలకంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇక మా సంస్థ నుంచి రానున్న 47వ చిత్రం షూటింగ్‌ని కూడా ఆదోనిలోనే జరుపుతాం’’ అని టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment