Poster Launch
-
హనుమంతుని నేపథ్యంలో రణమండల
‘‘నా స్వస్థలం ఆదోనిలో షూటింగ్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘రణమండల’ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే జరుపుతాం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న 46వ చిత్రానికి ‘రణమండల’ టైటిల్ ఖరారు చేసి, ఆదోని రణమండల దేవాలయంలో ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.హనుమంతుని నేపథ్యంలో భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘రణమండల ఆంజనేయుని దేవాలయ క్షేత్ర నామాన్నే మా చిత్రానికి టైటిల్‌గా పెట్టడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కీలకంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇక మా సంస్థ నుంచి రానున్న 47వ చిత్రం షూటింగ్‌ని కూడా ఆదోనిలోనే జరుపుతాం’’ అని టీజీ విశ్వప్రసాద్ అన్నారు. -
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. ఘనంగా సీజన్ 2 పోస్టర్ లాంచ్ (ఫోటోలు)
-
సైంటిఫిక్ థ్రిల్లర్
శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాత్రు’. జాన్ జక్కీ దర్శకత్వంలో శ్రీ పద్మినీ సినిమాస్‌పై బి. శివప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్ని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘‘యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మాత్రు’.పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. అలీ, ఆమని ఇతర కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్. -
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్‌గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ 'మాత్రు'. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు.ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించింది. అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ఎడిటర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. -
థ్రిల్లర్ దర్శిని
వికాస్ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాను.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్వీ సూర్యం. -
గచ్చిబౌలిలో ది సాగా బిగ్గెస్ట్ కార్నివాల్ పోస్టర్ లాంచ్(ఫొటోలు)
-
గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో 'రాధా మాధవం'
టాలీవుడ్లో విలేజ్ లవ్ స్టోరీలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఇండస్ట్రీలో ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డీ.ఎస్.ఎన్. రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'చీర్ అప్ భారత్' పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్ : ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కేవలం కళల ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడటం సాధ్యమవుతుందని భావించి సిరిమువ్వ ఆర్ట్స్ బృందం వారు 'చీర్ అప్ భారత్(invoking inner happiness)' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిమువ్వ ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్యకళలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమం ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా 'చీర్ అప్ భారత్' లోగోను వారి ఆశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం అన్నారు. ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి, ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు -
భయపెడుతున్న 'ఎర్రచీర' మోషన్ పోస్టర్
పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ఎర్రచీర. నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించిందో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్ ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్‌గా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్‌లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమాలో Eight Layers వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు. ఎర్రచీర సినిమాలో ప్రధాన పాత్రగా శ్రీరామ్, కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, అలీ, రఘుబాబు, గీతాసింగ్, అన్నపూర్ణమ్మ, తదితరులు నటించారు. -
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు
'ఆకాశం దాటి వస్తావా’ మంచి మ్యూజికల్ మూవీ. కొత్త ప్రతిభని పరిచయం చేయాలనే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో శశి, యష్‌లతో ఈ యూత్‌ఫుల్ సినిమా చేస్తున్నాం' అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీక మురళీధరన్ హీరోయిన్. ‘దిల్’ రాజుప్రొడక్షన్ బ్యానర్లో ‘బలగం’ తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, పోస్టర్ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– 'నా సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని యష్‌తో అన్నాను. కానీ లుక్ పరంగా బాగున్నాడు. అందుకే హీరోగా పరిచయం చేస్తున్నాం. సింగర్ కార్తీక్ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు' అన్నారు. 'జీవితంలో అన్ని బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఇదే ΄పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది' అన్నారు శశి కుమార్ ముతులూరి. 'నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శశి, హర్షిత్, హన్షితగార్లకు థ్యాంక్స్' అన్నారు యష్. -
సస్పెన్స్.. థ్రిల్
జయరామ్ తేజ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘హింట్’. చందూ బిజుగ దర్శకత్వంలో మైత్రీరెడ్డి, రిజ్వాన్ అహ్మద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎస్వీఎన్ రావు రిలీజ్ చేశారు. ‘హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు చందూ. ‘‘టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న నాకు హీరోగా చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జయరామ్ తేజ. ‘‘సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు మైత్రీ రెడ్డి. -
నాగశౌర్య హీరోగా రంగబలి, స్పెషల్ పోస్టర్ రిలీజ్
నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రంగబలి’ని జూలై 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నాగశౌర్య ట్రెండీ గెటప్‌లో కనిపిస్తున్న ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ‘రంగబలి’ ఫన్ రైడ్ (సరదా ప్రయాణం) గా ఉండబోతోంది. ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.. ఇందుకు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్ మణి. -
25 దేశాల్లో వరల్డ్ మ్యూజిక్ టూర్.. రాజమౌళి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సినిమా రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 దేశాల్లో వరల్డ్ మ్యూజికల్ టూర్‌ని మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారామె. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ. తను ఎంతో సాధించినందుకు అభినందనలు’’ అన్నారు. ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి అన్న చేతుల మీదగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి నేను సంగీతం అందించాను. రవి మెలోడీస్ బ్యానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలయ్యే వరల్డ్ మ్యూజిక్ టూర్ 25 దేశాల్లో జరుగుతుంది. ఈ టూర్లో 25 మంది సింగర్స్ పాల్గొంటారు’’ అన్నారు. -
హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో సినీ తారలు, మోడల్స్ సందడి
-
గ్రాండ్‌గా "రూమ్" ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా నటించిన చిత్రం "రూమ్". పద్మమగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అశ్విన్ & రమేష్.కె సమర్పణలో, పద్మావతి పిక్చర్స్ పతాకంపై వి. యస్. సుబ్బారావు దీన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పద్మ మగన్ మాట్లాడుతూ.. కొత్త వారితో ఏ జానర్ చేసినా క్వాలిటీలో రాజీ పడకుండా సినిమా చేస్తాను. ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్ లో ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీ తో ఈ సినిమా చేశాము అని తెలిపారు. -
కొత్త సినిమాను ప్రకటించిన సుధీర్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్టర్
హిట్టు, ప్లాఫులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో సుధీర్‌బాబు. డిఫరెంట్ జోనర్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుధీర్‌బాబు ఇటీవలె ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ను వదిలాడు. సుధీర్‌బాబు కెరీర్లో ఇది 18వ సినిమా. 'సెహరి' ఫేం జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించి ఇన్లాండ్ లెటర్‌తో ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అరుణ్ గౌలి ఆఫ్ సౌత్ బాంబే ఫ్రమ్ అడ్రస్‌తో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యంకు ఈ లేఖను రాసినట్టు అర్థమవుతుంది.1989 కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్‌తో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!#Sudheer18@gnanasagardwara #SumanthGNaidu @SSCoffl pic.twitter.com/ymoEU9ABFN — Sudheer Babu (@isudheerbabu) October 27, 2022 -
‘అధర్వ’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రవితేజ
కార్తీక్ రాజు హీరోగా, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అధర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ని హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటివరకు వచ్చిన ఈ జానర్ సినిమాలతో పోల్చితే మా సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన బాణీలు అందించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: విజయ, ఝాన్సీ. -
పూరీ జగన్నాథ్ 'జనగణమన' పోస్టర్ లాంచ్.. అప్పుడే వార్ స్టార్ట్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'జనగణమన' (JGM). రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జగన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే పాన్ ఇండియాగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ 'జనగణమన' చిత్రం పోస్టర్, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని విశ్వవిస్తున్నాను.' అని తెలిపాడు. 'మా తర్వాతి ప్రాజెక్ట్ జెజీఎం పోస్టర్‌ను నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్.' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది. -
సినిమాలోని అందరూ 'మహానటులే'..
Maha Natulu: Character Reveal Posters Unveiled: అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి ముఖ్య తారలుగా అశోక్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటులు’. అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్ యర్రం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్యారెక్టర్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ – ‘‘టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమాలోని అందరూ మహానటులే. నలుగురు వ్యక్తులు మహానటులు అనే యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసి, ఎలా డెవలప్ చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తాం’’ అన్నారు అనిల్. ‘‘ఈ సినిమా బాగా వచ్చింది. త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ నిర్మించనున్నాం’’ అన్నారు తిరుపతి. -
'ట్రూ' మూవీ ఫస్ట్ లుక్ విడుదల..
గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన 'ట్రూ' మూవీ :ఫస్ట్ లుక్ రిలీజైంది. మూవీ క్రిటిక్, ప్రముఖ యాంకర్ టి.ఎన్ ఆర్ ట్రూ మూవీ పోస్ట్‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్యామ్ మండల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హరీష్ వినయ్ హీరోగా నటించగా, మణికంఠ ముఖ్య పాత్ర పోషించారు. హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ " బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి, డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. . డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ " నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం.. ఇక ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ ముగించారు. -
కదిలే కాలాన్ని అడిగా...
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కదిలే కాలాన్ని అడిగా..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ, లావణ్య ఉన్న ఓ పోస్టర్‌తో ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘చావు కబురు చల్లగా’ చిత్రం టైటిల్, కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ వీడియో, లావణ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్, మైనేమ్ ఈజ్ రాజు.. అనే పాటకు అనూహ్య స్పందన లభించింది. మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కరమ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ కరుటూరి, శరత్ చంద్ర నాయుడు. -
మెడికల్ థ్రిల్లర్ ‘ఏ’ టైటిల్ పోస్టర్ ఇదుగో!
నితిన్ ప్రసన్న, ప్రెజర్ కుక్కర్ ఫేం ప్రీతీ అశ్రాని ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏ’. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ మెడికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టైటిల్ పోస్టర్ డిఫరెంట్‌గా ఉండటంతో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు ముని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథాంశం చాలా అనుహ్యమైనది , ఇప్పటివరకు ప్రపంచ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైనటువంటి కథ. 1977 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. దర్శకునితో సహా మిగిలిన టెక్నిషన్స్ అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లు కావటం తో సినిమా టెక్నికల్ గా అద్భుతంగా వచ్చింది. నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో 300 కి పైగా ఆడిషన్స్ చేశాం. ఖచ్చితంగా థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకు ఒక క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తి ని ఇస్తుంది. మేకింగ్ విషయం లో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా శంషాబాద్ దగ్గర్లో ఒక సెట్ ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం’అని అన్నారు. జబర్దస్త్ బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అవంతికి ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. -
వెల్కమ్ వైష్ణవ్
చిత్ర పరిశ్రమకు వైష్ణవ్ తేజ్‌కి ఆహ్వానం పలికారు రామ్‌చరణ్ తేజ్. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘‘వెల్కమ్ వైష్ణవ్. ఈ ప్రయాణాన్ని నువ్వు ప్రేమిస్తావు. ప్రతిరోజూ పూర్తిగా ఆస్వాదించు. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొంటూ ‘ఉప్పెన’ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చరణ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతీ శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. -
మురికివాడలో ప్రేమ
ప్రదీప్ వలజ, మిధునా ధన్పాల్ జంటగా నటించిన చిత్రం ‘భగత్‌సింగ్ నగర్’. వలజ క్రాంతి దర్శకత్వంలో గౌరి, రమేష్ ఉడత్తు నిర్మించారు. భగత్‌సింగ్ 112వ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాలో ప్రేమను ఎలా చూపించారో తెలియదు కానీ పోస్టర్, ఫస్ట్ లుక్స్ బాగున్నాయి’’ అన్నారు సీపీఐ నారాయణ. ‘‘భగత్‌సింగ్ నగర్’ అనే మురికి వాడలో జరిగే ప్రేమకథతో మొదలై థ్రిల్లర్‌గా మారే చిత్రం ఇది’’ అన్నారు క్రాంతి. ‘‘అవకాశాల కోసం వెతుక్కోకుండా మా అన్నయ్య క్రాంతి దర్శకత్వంలోనే నాకీ సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు ప్రదీప్. ‘‘నాకు తెలిసింది రెండే విషయాలు. సక్సెస్..ఫెయిల్యూర్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మంచి సినిమా తీశాననే భావన ఉంది నాకు’’ అన్నారు నిర్మాత రమేష్. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, దర్శకుడు చంద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.