గ్రాండ్‌గా "రూమ్" ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ | Abhishek Varma Room Movie Poster Launch | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌గా "రూమ్" ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Published Sun, Oct 30 2022 8:37 AM | Last Updated on Sun, Oct 30 2022 8:42 AM

Abhishek Varma Room Movie Poster Launch - Sakshi

అభిషేక్ వర్మ, మనో చిత్ర  జంటగా  నటించిన చిత్రం "రూమ్".  పద్మమగన్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అశ్విన్ & రమేష్.కె సమర్పణలో,  పద్మావతి పిక్చర్స్ పతాకంపై వి. యస్. సుబ్బారావు దీన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పద్మ మగన్ మాట్లాడుతూ..  కొత్త వారితో  ఏ జానర్ చేసినా క్వాలిటీలో రాజీ పడకుండా  సినిమా చేస్తాను. ఈ సినిమాలో  మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్  ఉన్నా అది ఎంతవరకు  ఉండాలో  అంతే లిమిట్ లో ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే  ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీ తో ఈ సినిమా చేశాము అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement