‘సమైక్యంపై చంద్రబాంబు’ పోస్టర్ ఆవిష్కరణ | Samaikyandhra,Above Candrabambu 'Poster Launch | Sakshi
Sakshi News home page

‘సమైక్యంపై చంద్రబాంబు’ పోస్టర్ ఆవిష్కరణ

Published Mon, Sep 16 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Samaikyandhra,Above Candrabambu 'Poster Launch

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘సమైక్యంపై చంద్ర బాంబు’ అనే వాల్‌పోస్టర్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ అయితే, అందుకు ఉపయోగిస్తున్న గండ్రగొడ్డలి చంద్రబాబు లేఖేనని పేర్కొన్నారు. ఆయన లేఖ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను వాల్‌పోస్టర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), కఠారి శంకర్, ముదివర్తి బాబూరావు, యర్రజర్ల రమేష్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement