
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సినిమా రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 దేశాల్లో వరల్డ్ మ్యూజికల్ టూర్‌ని మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారామె. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ. తను ఎంతో సాధించినందుకు అభినందనలు’’ అన్నారు.
ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి అన్న చేతుల మీదగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి నేను సంగీతం అందించాను. రవి మెలోడీస్ బ్యానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలయ్యే వరల్డ్ మ్యూజిక్ టూర్ 25 దేశాల్లో జరుగుతుంది. ఈ టూర్‌లో 25 మంది సింగర్స్ పాల్గొంటారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment