కొత్త సినిమాను ప్రకటించిన సుధీర్‌ బాబు.. ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌ | Sudheer Babu Movie Titled Mass Sambhavam | Sakshi
Sakshi News home page

Sudheer Babu : కొత్త సినిమాను ప్రకటించిన సుధీర్‌ బాబు.. ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌

Published Thu, Oct 27 2022 3:22 PM | Last Updated on Thu, Oct 27 2022 3:23 PM

Sudheer Babu Movie Titled Mass Sambhavam - Sakshi

హిట్టు, ప్లాఫులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో సుధీర్‌బాబు. డిఫరెంట్‌ జోనర్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుధీర్‌బాబు ఇటీవలె ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ను వదిలాడు. సుధీర్‌బాబు కెరీర్‌లో ఇది 18వ సినిమా. 'సెహరి' ఫేం జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌కి సంబంధించి ఇన్‌లాండ్‌ లెటర్‌తో ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అరుణ్‌ గౌలి ఆఫ్‌ సౌత్‌ బాంబే ఫ్రమ్‌ అడ్రస్‌తో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యంకు ఈ లేఖను రాసినట్టు అర్థమవుతుంది.1989 కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్‌తో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement