
యంగ్ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నాడు.
Sudheer Babu Pre Look Poster From His Action Thriller Sudheer 16: యంగ్ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను బుధవారం (మే 11) సుధీర్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు తలికిందులుగా పుష్ అప్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్ ద్వారా సూపర్ ఫిట్‌గా ఉన్న సుధీర్‌బాబుకు 'హ్యాపీ బర్త్‌డే నైట్రో స్టార్' అని విష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల గన్స్ డోంట్ లై అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
చదవండి: మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా?
Here's the Terrific Pre-Look Poster of 'Nitro Star' @isudheerbabu's #Sudheer16 💥
— Bhavya Creations (@BhavyaCreations) May 11, 2022
The Monstrous cop in Action! 🛡️
A @GhibranOfficial Musical 💥 #HBDSudheerBabu @bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema @PulagamOfficial pic.twitter.com/PU0yYNdLEY