Pre Look Poster
-
నాగచైతన్య మూవీ తాజా అప్డేట్.. ఆసక్తి పెంచుతోన్న ప్రీ లుక్ పోస్టర్..!
అక్కినేని నాగచైతన్య హీరోగా తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'NC 22' ప్రీ లుక్ పోస్టర్ వచ్చేసింది. బంగార్రాజు సినిమా తర్వాత కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జంటగా కనిపించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. (చదవండి: 'అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లారేమో'.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఎమోషనల్ పోస్ట్) పోస్టర్లో నాగచైతన్య సీరియస్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో చైతూ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్ననట్లు తెలుస్తోంది. ప్రీ లుక్ పోస్టర్లో చైతూను చుట్టుముట్టి గన్లు పట్టుకుని ఉన్న పోస్టర్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. పోస్టర్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నారు. Bringing you the Pre-Look Poster of my next #NC22. Really excited about this one. @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @realsarathkumar #SampathRaj @Premgiamaren @VennelaKishore @srinivasaaoffl #PremiVishwanath @srkathiir #Priyamani @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/NhPN58189J — chaitanya akkineni (@chay_akkineni) November 22, 2022 -
VT13: ఆసక్తిగా వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రీలుక్ పోస్టర్
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రీసెంట్గా ఎఫ్-3 సినిమాతో హిట్టు కొట్టిన వరుణ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే వరుణ్ తన నెక్ట్స్ మూవీ కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వరుణ్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. తాజాగా తన 13వ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు వరుణ్. చదవండి: రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే.. ఈ పోస్టర్లో వరుణ్ యుద్ధ విమాన పైలట్‌గా కనిపించాడు. సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా. ఇది యాక్షన్, ఎమోషన్‌తో కూడిన సినిమాగా ఉండబోతుందని టాక్. ఇక తన కెరియర్లోనే ప్రత్యేకమైన సినిమా అని వరుణ్ చెప్పడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫ్లాపులను పట్టించుకోకుండా విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ఓకే చెబుతూ, కొత్త దర్శకులతోను కలిసి పని చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రం బృంద ప్రకటించినుంది. చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్! Bravery that knows no bounds, celebrating the valour of Indian Air Force. Get ready to witness the battle in the skies on the big screen, taking off soon! 🇮🇳#VT13 pic.twitter.com/QvSJL62DRf — Varun Tej Konidela (@IAmVarunTej) September 19, 2022 -
రుద్రవీణ హిట్ కావాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
‘‘చిరంజీవిగారు సాఫ్ట్ పాత్రలో నటించిన ‘రుద్రవీణ’ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు రౌద్రం నేపథ్యంలో వస్తున్న ‘రుద్రవీణ’ కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రవీణ’. రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించారు. ఈ సినిమా ప్రీ లుక్‌ని కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’’ అన్నారు శ్రీనివాస్ గుప్తా. ‘‘రివెంజ్ డ్రామాతో వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’’ అన్నారు మధుసూదన్ రెడ్డి. ‘‘చిరంజీవిగారంటే నాకు సెంటిమెంట్. అందుకే ‘రుద్రవీణ’ టైటిల్ పెట్టాను’’ అన్నారు రాగుల లక్ష్మణ్. -
తలకిందులుగా సుధీర్ బాబు.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Sudheer Babu Pre Look Poster From His Action Thriller Sudheer 16: యంగ్ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను బుధవారం (మే 11) సుధీర్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ పోస్టర్లో సుధీర్ బాబు తలికిందులుగా పుష్ అప్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్ ద్వారా సూపర్ ఫిట్‌గా ఉన్న సుధీర్‌బాబుకు 'హ్యాపీ బర్త్‌డే నైట్రో స్టార్' అని విష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల గన్స్ డోంట్ లై అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. చదవండి: మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా? Here's the Terrific Pre-Look Poster of 'Nitro Star' @isudheerbabu's #Sudheer16 💥 The Monstrous cop in Action! 🛡️ A @GhibranOfficial Musical 💥 #HBDSudheerBabu @bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema @PulagamOfficial pic.twitter.com/PU0yYNdLEY — Bhavya Creations (@BhavyaCreations) May 11, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్..
‘అర్జున్ సురవరం’ హిట్‌తో జోరు మీదున్న నిఖిల్ చేస్తున్న తర్వాతి చిత్రం 18 పేజెస్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ చేశారు. ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ చేతిలో పేపర్‌ను అంటిస్తున్నట్లుగా ఉంది. దీనిపై ఫస్ట్ లుక్ జూన్1న అని రాసి ఉంది. ఇప్పటికే సినిమాలో టైటిల్ క్యూరియాసిటీని పెంచుతుంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి : నిఖిల్‌కు పోలీసులు షాక్.. అలా చెప్పిన వదల్లేదంటూ ట్వీట్ -
పవన్ 27: ప్రీలుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా పవన్ 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ చేతికి బంగారు రంగులో ఉన్న కడియంతో పాటు రెండు వేళ్లకు ఉంగరాలు కూడా ఉన్నాయి. అలాగే నడుముకు ఎర్ర కండువా కట్టుకున్నారు. దానికి గరుత్మంతుడి బొమ్మకూడా ఉంది. ఈ వేషధారణ చూస్తుంటే ఇదేదో రాబిన్‌హుడ్ పాత్రలా అనిపిస్తోంది. (ఆ వార్త నా మనసును కలిచివేసింది: పవన్) ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్" అని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. సినిమా కథ విషయానికొస్తే మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకోనుందని భోగట్టా. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ చిత్రంలో రామ్‌చరణ్?) -
ఆసక్తికరంగా ‘ఆర్ఎక్స్ 100’
కార్తికేయ, పాయల్ రాజ్పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ RX 100. ఈ చిత్రం ప్రీ లుక్‌ను హోలీ సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. KCW బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీన్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఐ యామ్ బ్యాక్.. ఏదో ఒకరోజు..!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం చాలా వైవిధ్యభరితంగా ముందుకు సాగుతోంది. అర్జున్ రెడ్డి తర్వాత ఇతగాడి క్రేజ్ అమాంతం పెరిగిపోవటంతో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉండగా... అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇట్స్ టైమ్.. ఐ యామ్ బ్యాక్... అంటూ విజయ్ దేవరకొండ తన ట్విటర్లో ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్ కింద ‘ఫస్ట్ లుక్ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆసక్తికర టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. It's time. I am back. pic.twitter.com/2jQMmMr926 — Vijay Deverakonda (@TheDeverakonda) 9 February 2018 -
క్లాసీ డార్లింగ్!
సాక్షి, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓవైపు బాహుబలి మార్క్ నుంచి బయటపడే యత్నం చేస్తున్నాడు. అందుకే తన దృష్టంతా ఇప్పుడు తదుపరి చిత్రం సాహో పైనే పెట్టి, రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. త్వరలో డార్లింగ్ పుట్టిన రోజు రాబోతుంది. ఆ సందర్భంగా సినిమాకు సంబంధించి లుక్కులు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంతలో మచ్చుకు అందులోని ఒక ఫోటోను ఇంటర్నెట్లో వదిలింది చిత్ర యూనిట్. క్లాసీ లుక్కులో ప్రభాస్ కటౌట్ అద్భుతంగా ఉందన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఐదేళ్లపాటు గడ్డం, జట్టుతో బాహుబలి ఊరమాస్ లుక్కులో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు తమ కళ్లకు ఓ స్టైలిష్ గాయ్‌గా దర్శనమిస్తున్నాడంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సుమారు వంద కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో సుజిత్ దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా సాహో తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తుండగా.. 2018 ద్వితియార్థంలో చిత్రం విడుదల కానుంది. -
ప్రీలుక్కే ఇంత హాట్ గానా..?
కమెడియన్‌గా దర్శకుడిగా టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్, ఇటీవల జెంటిల్మన్ సినిమాతో విలన్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో అడల్ట్ మూవీగా తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. మనిషికి ఆకలి, దాహం, నిద్ర లాగే సెక్స్ కూడా ఓ అవసరం అనే ఆలోచన ఉన్న అబ్బాయిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. తెలుగులో సోగ్గాడు అనే టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిత్ర నటీనటుల పేర్లతో పాటు మునిపంటి కింద నలుగుతున్న అమ్మాయి పెదాలను పోస్టర్లో చూపించారు. ఈ పోస్టర్ తోనే సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన యూనిట్, సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ అడల్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
పబ్లిసిటీలో... తెలివైనోడు!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ఇప్పటి దాకా ప్రకటించలేదు కానీ, టైటిల్ ‘సరైనోడు’ అని ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. విచిత్రం ఏమిటంటే, ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు కూడా ఒక టీజర్ లాగా ‘ప్రీ-లుక్’ పోస్టర్‌ను అల్లు అర్జున్ అధికారికంగా సోషల్ మీడియాలో పెట్టారు. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. మరో హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తున్నారు. తమిళంలో హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి ఆది పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర ధరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో బోయపాటి రూపొందించిన మాస్ మసాలా చిత్రాల లానే ఈ సినిమా కూడా మాస్ సైలిలో ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ ప్రీ-లుక్ కూడా చేతిలో పెద్ద ఇనుప గుండు లాంటిది పట్టుకొని, అల్లు అర్జున్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. మొత్తం లుక్, టైటిల్ లోగో చూడాలంటే రిపబ్లిక్ డే దాకా వేచి ఉండాల్సిందే. మొత్తానికి, సోషల్ మీడియా పుణ్యమా అని టైటిల్ లోగోలు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ల లాంటివి పాపులరైతే, కొత్తగా ఈసారి ఫస్ట్‌లుక్‌కు టీజర్‌గా ‘ప్రీ-లుక్’ విడుదల చేయడం పబ్లిసిటీ వ్యూహంలో భాగమే. వెరసి, ఫ్రీ పబ్లిసిటీలో మనోళ్ళు ‘తెలివైనవాళ్ళే’.