VT13: ఆస‍క్తిగా వరుణ్‌ తేజ్‌ కొత్త మూవీ ప్రీలుక్‌ పోస్టర్‌ | VT13: Varun Tej Pre Look Poster Unveiled From His13th Movie | Sakshi
Sakshi News home page

VT13-Varun Tej Prel Look: VT13: ఆస‍క్తిగా వరుణ్‌ తేజ్‌ కొత్త మూవీ ప్రీలుక్‌ పోస్టర్‌

Published Mon, Sep 19 2022 2:12 PM | Last Updated on Mon, Sep 19 2022 2:47 PM

VT13: Varun Tej Pre Look Poster Unveiled From His13th Movie - Sakshi

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. రీసెంట్‌గా ఎఫ్‌-3 సినిమాతో హిట్టు కొట్టిన వరుణ్‌ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే వరుణ్‌ తన నెక్ట్స్‌ మూవీ కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో, రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వరుణ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు. తాజాగా తన 13వ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశాడు వరుణ్‌. 

చదవండి: రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే..

ఈ పోస్టర్‌లో వరుణ్‌ యుద్ధ విమాన పైలట్‌గా కనిపించాడు. సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా. ఇది యాక్షన్, ఎమోషన్‌తో కూడిన సినిమాగా ఉండబోతుందని టాక్‌. ఇక తన కెరియర్లోనే ప్రత్యేకమైన సినిమా అని వరుణ్ చెప్పడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫ్లాపులను పట్టించుకోకుండా విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ఓకే చెబుతూ, కొత్త దర్శకులతోను కలిసి పని చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రం బృంద ప్రకటించినుంది. 

చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్‌’ నుంచి తప్పుకున్న హీరోయిన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement