సాక్షి, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓవైపు బాహుబలి మార్క్ నుంచి బయటపడే యత్నం చేస్తున్నాడు. అందుకే తన దృష్టంతా ఇప్పుడు తదుపరి చిత్రం సాహో పైనే పెట్టి, రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. త్వరలో డార్లింగ్ పుట్టిన రోజు రాబోతుంది. ఆ సందర్భంగా సినిమాకు సంబంధించి లుక్కులు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
అయితే ఇంతలో మచ్చుకు అందులోని ఒక ఫోటోను ఇంటర్నెట్‌లో వదిలింది చిత్ర యూనిట్. క్లాసీ లుక్కులో ప్రభాస్ కటౌట్ అద్భుతంగా ఉందన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఐదేళ్లపాటు గడ్డం, జట్టుతో బాహుబలి ఊరమాస్ లుక్కులో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు తమ కళ్లకు ఓ స్టైలిష్ గాయ్‌గా దర్శనమిస్తున్నాడంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
సుమారు వంద కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో సుజిత్ దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా సాహో తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తుండగా.. 2018 ద్వితియార్థంలో చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment