ప్రీలుక్కే ఇంత హాట్ గానా..? | Srinivas Avasarala Hunterrr remake Pre look Poster | Sakshi
Sakshi News home page

ప్రీలుక్కే ఇంత హాట్ గానా..?

Published Wed, Nov 30 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

ప్రీలుక్కే ఇంత హాట్ గానా..?

ప్రీలుక్కే ఇంత హాట్ గానా..?

కమెడియన్గా దర్శకుడిగా టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్, ఇటీవల జెంటిల్మన్ సినిమాతో విలన్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో అడల్ట్ మూవీగా తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. మనిషికి ఆకలి, దాహం, నిద్ర లాగే సెక్స్ కూడా ఓ అవసరం అనే ఆలోచన ఉన్న అబ్బాయిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు.

తెలుగులో సోగ్గాడు అనే టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. చిత్ర నటీనటుల పేర్లతో పాటు మునిపంటి కింద నలుగుతున్న అమ్మాయి పెదాలను పోస్టర్లో చూపించారు. ఈ పోస్టర్ తోనే సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన యూనిట్, సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ అడల్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement