Srinivas Avasarala
-
మగపిల్లలనే కబళించే భయంకర వ్యాధి..! బారిన పడితే అంతే ..!
కేవలం మగపిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి ఇది. వచ్చిందో అంతే సంగతులు. సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. కుటుంబంలో ఒక్కరూ బారిన పడ్డారంటే..ఆ తల్లి కడుపున పుట్టిన వారందరికీ కూడా వచ్చేస్తుంది. ఇంతకీ ఈ వ్యాధి పేరేంటంటే..?ఈ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ). దీన్ని ‘పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు ఏళ్ల వయస్సు నుంచి మొదలై ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల తెలంగాణలోనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం అందరీలోనూ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఒకేసారి తోబుట్టువులకీ వచ్చే అవకాశం..ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగేళ్లపాటు చాలా సాధారణంగా ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగా చక్కగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవారు. సడెన్‌గా పెద్దవాడు శారీరకంగా బలహీనంగా కనిపించడం ప్రారంభించాడు. దీంతో వైద్యులను సంప్రదించగా ..అసలు విషయం విని షాకయ్యారు. వెంటనే తమ్ముడుకు కూడా ఇవే టెస్టులు చేయగా.. ఇద్దరూ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిబారిన పడ్డట్లు పేరెంట్స్‌కు తెలిపారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టువులందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే దీనికి చికిత్స అందుబాటులో లేదని, కొంతకాలం ఇలాగే జీవించి చనిపోతారని వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన పిల్లలు యుక్తవయస్సు దాటి బతకడం కష్టమేనని అన్నారు.తీరని కడుపుకోత..అలాంటి ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. మన టాలీవుడ్ సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. తనను ఒక పేరెంట్ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయం చేయమని కోరడంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నానని చెప్పారు. అంతేగాదు గర్భం దాల్చిన 3వ నెలలో దాదాపు రూ. 3000 రూపాయలకే ప్రతి స్త్రీ ప్రీ-నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ సూచిస్తున్నారు. పిండానికి డీఎండీ ఉన్నట్లు గుర్తించినట్లయితే తక్షణమే గర్భం తీయించుకోవడం లేదా అబార్షన్ చేయించడం వంటివి చేయొచ్చని అన్నారు. లేదంటే వారిని బతికించుకోలేక కళ్ల ముంగిటే చనిపోతున్న బిడ్డలను చూసి తట్టుకోవడం ప్రతి తల్లిదండ్రులకు కష్టమేనని అన్నారు. అలాగే ఇలా గర్భం దాల్చిన సమయంలోనే ఆ టెస్ట్‌లు చేయించుకుంటే.. ఏ తల్లిదండ్రులకు కడుపు కోత అనుభవించాలన్సి పరిస్థితి ఎదురవ్వదని చెబుతున్నారు శ్రీనివాస్ అవసరాల.(చదవండి: International Chocolate Day: చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!) -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
సంజయ్.. అనుపమ.. బెస్ట్ ఫ్రెండ్స్ అహో...
‘ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసు పాటి (నాగశౌర్య) మరియు అనుపమ కస్తూరి (మాళవిక) బెస్ట్ ఫ్రెండ్స్ అహో’ అనే డైలాగ్‌తో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదలైంది. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్, నా కాంబినేషన్లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల్లా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. కెమెరామేన్ సునీల్ కుమార్ నామ, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, పాటల రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూ పాల, ఎడిటర్ కిరణ్ గంటి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాస్ అవసరాల తో గరం గరం ముచ్చట్లు
-
సెప్టెంబర్ మొదటి వారం రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలివే
ప్రేక్షకులకు వినోదం పంచేందుకు అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు రెండూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధారపడకుండా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ పేరిట సొంత కంటెంట్‌ను అందిస్తూ యువతకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే థియేటర్లో రిలీజైన సినిమాలను వారం తిరిగేలోగా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఎప్పటిలాగే ఈవారం కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకు కొత్త సరుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలేంటో చూసేద్దాం.. 101 జిల్లాల అందగాడు బట్టతలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడానికి వచ్చాడు నటుడు అవసరాల శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. రుహానీ శర్మ హీరోయిన్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. డియర్ మేఘ మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా డియర్ మేఘ. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ది కిల్లర్ కార్తీక్ సాయి, నేహా దేశ్‌పాండే, డాలీ షా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది కిల్లర్. చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలవుతోంది. అప్పుడు ఇప్పుడు సుజన్, తనీష్క్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అప్పుడు ఇప్పుడు. శివాజీ రాజా, పేరుపురెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. చలపతి పువ్వల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఉషారాణి కనుమూరి, విజయ్ రామకృష్ణంరాజు నిర్మించారు. ఇది సెప్టెంబర్ మూడో తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అశ్మీ రుషికా రాజ్, రాజ నరేంద్ర, కేశప్ దీపకప్, ఇందు కుసుమ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం అశ్మీ. శేష్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సైతం సెప్టెంబర్ 3వ తేదీనే థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 యాక్షన్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే సిరీస్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు సినిమాలు రిలీజై కాసుల పంటను కురిపించాయి. తాజాగా తొమ్మిదో సిరీస్ భారత ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 3న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. విన్ డీజిల్, టైరీ గిబ్సన్, మిచెల్లీ రోడ్రిగోజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇవి కాకుండా ఓటీటీలో వస్తున్న మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ సిండ్రెల్లా - సెప్టెంబర్ 3 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ♦ బ్లాక్ విడో - సెప్టెంబర్ 3 ♦ షాంఘ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ - సెప్టెంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ♦ స్పార్కింగ్ జాయ్ - ఆగస్టు 31 ♦ గుడ్ గర్ల్స్ - ఆగస్టు 31 ♦ మనీ హెయిస్ట్ 5వ సీజన్ - సెప్టెంబర్ 3 జీ5 ♦ హెల్మెట్ - సెప్టెంబర్ 3 -
నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది.. ఏంటది?
అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీశర్మ హీరోయిన్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది చిత్ర యూనిట్. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. (చదవండి: ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్) అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం వంటి ఎమోషన్ సీన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది ఏంటది అని తల్లి పజిల్ వేయగా.. బట్టతల అని శ్రీనివాస్ జవాబుఇవ్వడం హిలేరియస్‌గా ఉంది. ‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం నవ్వులు పూయిస్తుంది. కాగా, గతంలో సినిమా ప్రమోషన్లో భాగంగా అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియోను చిత్ర యూనిట్ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. -
శ్రీనివాస్ అవసరాల ‘అలసిన సంచారి’ సాంగ్ విడుదల
డైరెక్టర్, నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. శ్రీనివాస్ అవసరాల స్క్రిప్ట్ నందించగా.. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అలసిన సంచారి వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ అలసిన సంచారి.. పరుగులు ఏ దారి.. నిలబడు ఓసారి’ అంటూ మెలోడీగా సాగుతున్న ఈ పాటలో దాదాపు సినిమాలోని క్యారెక్టర్లన్నింటినీ చూపించాడు డైరెక్టర్. రాచకొండ విద్యాసాగర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘దిల్’రాజు, జాగర్లమూడి క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. శ్రీ విశ్వ రాసిన ఈ పాటను హేమచంద్ర పాడాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. -
‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది
‘‘ఊరంతా అనుకుంటున్నారు’ ట్రైలర్ చూస్తే నవీన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలకు అంకితం ఇస్తున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నవీన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి’’ అని నటుడు కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజి సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇకపై గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘విజయ నిర్మలగారికి నవీన్ మంచి నటుడు కావాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే ‘నందిని నర్సింగ్ హోమ్’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊరంతా అనుకుంటున్నారు’తో నవీన్ కుటుంబ ప్రేక్షుకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు నరేశ్ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘నా కథకి నవీన్ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది’’ అన్నారు బాలాజి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మంగళంపల్లి అన్నారు. -
రొమాంటిక్ ఎన్ఆర్ఐ
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘నాయనా..! రారా ఇంటికి’ (ఎన్ఆర్ఐ) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా తెలుగు అమ్మాయి మహతి భిక్షు కథానాయికగా పరిచయం కానున్నారు. ప్రదీప్ కేఆర్ నిర్మిస్తారు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ బాల రాజశేఖరుని ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘బాల రాజశేఖరునిగారు చేసిన ‘బ్లైండ్ యాంబిషన్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. ఆ రకంగా ఆయనే నా ఫస్ట్ íసినిమా గురువు. ఆయనతో పని చేయాలనే ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. ఈ సినిమాతో నిర్మాత ప్రదీప్‌గారికి మంచి సక్సెస్ వచ్చి, ఆయన మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ‘సిరివెన్నెల’గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఆయన మా సినిమాకు పాటలు రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మాస్టర్స్ ఇన్ థియేటర్స్‌లో డిగ్రీ చేశాను. దాదాపు 20 ఏళ్లుగా అమెరికాలో ఉన్నాను. నా అనుభవాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. అక్కినేని ఫ్యామిలీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అమలగారు మా సినిమాకు క్లాప్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. స్విచ్చాన్ చేసిన ఇంద్రగంటి గారికి థ్యాంక్స్. ఆప్తులు, గురువు ‘సిరివెన్నెల’గారు మా సినిమాకు పాటలు రాస్తున్నందుకు సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే అవసరాల అయితే బాగుంటుందని అనుకున్నాను. హీరో క్యారెక్టర్ చిలిపిగా ఉంటుంది. నాగబాబు, మంచులక్ష్మి పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం లైన్ మాత్రమే విని సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్న నిర్మాత ప్రదీప్‌కు థ్యాంక్స్. ఇదో మంచి రొమాంటిక్ కమ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్’’ అని బాల రాజశేఖరుని అన్నారు. ‘‘బాలరాజశేఖరుని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమాతో అతనికి మంచి విజయం అందాలి’’ అన్నారు రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వరశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్. -
హ్యాట్రిక్ హిట్‌కు రెడీ అవుతున్న హీరో, డైరెక్టర్!
ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలతో హిట్ కొట్టారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య. దర్శకుడిగా అవసరాల టైమింగ్, టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో లాంటి హిట్ మూవీ తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరోతో కలిసి మళ్లీ మరో సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ నానితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపినా.. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. నాగశౌర్యతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడని సమాచారం. మరి ఈ మూవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. -
నాని అ!
హీరో నాని నిర్మాతగా మారారు. ఆ సినిమా పేరు ‘అ!’. ప్రపంచంలో నేను... నాలోని ప్రపంచం... అనేది ఉపశీర్షిక. ట్విస్ట్ ఏంటంటే... ఇందులో నాని నటించడం లేదు. నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బా, మురళీ శర్మ, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్య తారలు. రవితేజ, నానిలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించనున్న ‘అ!’ టైటిల్ లోగో, నటీనటుల వివరాలను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ‘‘ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఓ కథ చెప్పాడు. అందులోని చిన్న పాత్రకు నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడు. కథ కొత్తగా, విభిన్నంగా ఉంది. ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఇటువంటి కథను పెద్ద తెరపై చూడలేదనిపించింది. సరైన టీమ్, సపోర్ట్ ఇటువంటి ఐడియాకి అవసరమని భావించి... ‘ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రశాంత్?’ అనడిగా. ‘ఇంకా తెలీదు భయ్యా... ఎలాగోలా మేనేజ్ చేస్తా’ అన్నాడు. ‘మేనేజ్ చేసే సినిమా కాదిది. సరిగ్గా, బాగా చేయాలి’ అన్నాను. తర్వాత ‘ఇలాంటి ఐడియాను నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు?’ అన్పించి, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రశాంత్‌కి ‘నేనే ప్రొడ్యూస్ చేస్తా’ అని చెప్పాను. నేను దిగిన తర్వాత బోల్డంత మంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్లు, ప్రశాంతి... వీళ్లందరూ కథ విని, నచ్చి, ఎంతో ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 పర్సెంట్ సినిమా రెడీ. వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అంతకు ముందు నాని పేర్కొన్నారు. అదండీ సంగతి!! -
మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్
హైదరాబాద్: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది. ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీకి 'అమీ తుమీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఆదివారం సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నరసింహారావు మాట్లాడుతూ.. 'ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'అమీ తుమీ' తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటించారు. ఈ చిత్రానికి మేకప్ చీఫ్‌గా సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్‌గా డి.యోగానంద్, కో-డైరెక్టర్ గా కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్‌గా పి.జి.విందా పనిచేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్, ప్రొడ్యూసర్ కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. -
అవసరాల బాగా బిజీ!
ఇండస్ట్రీలో హీరోలను ‘బాబు’ అనడం కామన్. దర్శక–నటుడిగా వరుస సినిమాలు చేస్తోన్న అవసరాల శ్రీనివాస్ మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడీ హీరోగారు కూడా బాగా బిజీ అట! సాధారణంగా సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అవసరాల సినిమాలో నలుగురమ్మాయిలు మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి నటిస్తున్నారు. నలుగురు హీరోయిన్లు ఉంటే సినిమాలో హీరో బిజీగానే ఉంటారు కదా! అందుకేనేమో అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారంను దర్శకునిగా పరిచయం చేస్తూ అభిషేక్ నామా నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రానికి ‘బాబు బాగా... బిజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ హిట్ ‘హంటర్’కి తెలుగు రీమేక్ ఇది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
ప్రీలుక్కే ఇంత హాట్ గానా..?
కమెడియన్‌గా దర్శకుడిగా టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్, ఇటీవల జెంటిల్మన్ సినిమాతో విలన్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో అడల్ట్ మూవీగా తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. మనిషికి ఆకలి, దాహం, నిద్ర లాగే సెక్స్ కూడా ఓ అవసరం అనే ఆలోచన ఉన్న అబ్బాయిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. తెలుగులో సోగ్గాడు అనే టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిత్ర నటీనటుల పేర్లతో పాటు మునిపంటి కింద నలుగుతున్న అమ్మాయి పెదాలను పోస్టర్లో చూపించారు. ఈ పోస్టర్ తోనే సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన యూనిట్, సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ అడల్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
శోభన్ బాబు టైటిల్‌తో అవసరాల
దర్శకుడిగా రెండు విజయాలు అందుకున్న అవసరాల శ్రీనివాస్, నటుడిగానూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే కామెడీ, క్యారెక్టర్ రోల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్లో తెరకెక్కిన అడల్ట్ కామెడీ 'హంటర్' సినిమా తెలుగు రీమేక్‌తో హీరోగా మారుతున్నాడు అవసరాల శ్రీనివాస్. ఓ కుర్రాడి సెక్సువల్ ఫాంటసీలకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సోగ్గాడు అనే టైటిల్‌ను పరిశీలుస్తున్నారట. 70లలో శోభన్ బాబు, జయసుథ హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ సొగ్గాడు. తరువాత అదే టైటిల్ తోతరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిన ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. యాంకర్ శ్రీముఖి, మిస్తీ చక్రవర్తిలతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే కమెడియన్‌గా, దర్శకుడిగా సక్సెస్ అయిన అవసరాల శ్రీనివాస్, ఈ సినిమాతో హీరోగానూ హిట్ కొడతాడేమో చూడాలి. -
కంగారు మొత్తం పోయింది : అవసరాల శ్రీనివాస్
‘‘ ‘జ్యో అచ్యుతానంద’ చిత్రకథ రాసుకునేటప్పుడు, చిత్రీకరణ సమయంలో కాన్ఫిడెన్స్‌తో ఉండేవాణ్ణి. కానీ, సినిమా విడుదల టైమ్‌లో బాగా ఒత్తిడికి గురయ్యా. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించిన తీరు చూసి ఆ కంగారు మొత్తం పోయింది. రిలీఫ్ అనిపించింది’’ అని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘జ్యో అచ్యుతానంద’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’కి ఎంతటి ప్రేక్షకాదరణ లభించిందో, ఈ చిత్రానికీ అంత రెస్పాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రం చూసిన కొందరు ‘నాకూ ఓ అన్నయ్య.. తమ్ముడు ఉండుంటే బాగుండేది’ అని మెసేజ్‌లు పంపారు’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశా. వారు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యా’’ అని రెజీనా అన్నారు. కెమెరామ్యాన్ వెంకట్ సి.దిలీప్, సంగీత దర్శకుడు కల్యాణి రమణ తదితరులు పాల్గొన్నారు. -
రొమాంటిక్ కామెడీగా 'జో అచ్యుతానంద'
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీని.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ‘జో అచ్యుతానంద’ అనే పేరుతో మరో రొమాంటిక్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. బుధవారం దీని టీజర్ విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఆగష్టు 21న ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ కోడూరి ఈ చిత్రానికి స్వరాలందించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న కాన్సెప్ట్‌తో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటించారు. సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. -
రొమాంటిక్ కామెడీగా 'జ్యో అచ్యుతానంద'
-
'సెక్స్ అడిక్ట్'గా తెలుగు నటుడు
చెన్నై: ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన నటుడు అవసరాల శ్రీనివాస్ బోల్డ్ రోల్ చేయడానికి సిద్ధమయ్యాడు. బాలీవుడ్ అడల్డ్ కామెడీ 'హంటర్రర్' తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాలో 'సెక్స్ అడిక్ట్'గా అతడు నటించనున్నాడు. బోల్డ్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని శ్రీనివాస్ చెప్పాడు. 'సెకాండాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేస్తున్నా. ఈ చిత్రాన్ని అందరూ అడల్ట్ కామెడీ అంటున్నారు. కానీ స్టోరీ, నా కేరెక్టర్ కు లోతైన అర్థం ఉంద'ని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా సంతకం చేయలేదని, కొద్ది రోజుల్లో ఫైనల్ అవుతుందని వెల్లడించాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైందని, ఆగస్టు నుంచి తాను చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పాడు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదన్నాడు. రెజినా, రాశిఖన్నా పేర్లు విన్పిస్తున్నాయి. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. -
పదములు లేని మౌనలేఖ...
పాటతత్వం చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. ఈ అలవాటుతోనే కథలు రాయడం మొదలుపెట్టా. నటుడిగా ‘అష్టా చెమ్మా’ సినిమాతో తెరకు పరిచయమైనా... నా ఆలోచనలన్నీ రచన, దర్శకత్వం వైపే ఉండేవి. ఇలా కొంత హాస్యాన్ని మేళవించి... ఒక అందమైన ప్రేమకథను చూపించాలనుకుని ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నా. అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో బొత్తిగా తెలీని తన బాస్‌కు వాళ్లకు నచ్చేలా ఎలా ఉండాలో నేర్పుతుంటాడు కథానాయకుడు వెంకీ. వైజాగ్‌లో తన ప్రేమ గతాన్ని తల్చుకుంటూ... బాస్‌కు ప్రేమ పాఠాలు చెబుతుంటాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి ప్రభావతి... బాస్‌కు వచ్చిన పెళ్లి సంబంధంలో అమ్మాయి శిరీష ఒక్కరే అని వెంకీకి తెలీదు. ఈ సందర్భంలో వస్తుందీ పాట... మ్యూజిక్ సిట్టింగ్‌లో కూర్చోగానే... అప్పటికే తన దగ్గర ఉన్న ట్యూన్ వినిపించారు కళ్యాణ్ కోడూరి. బాగా నచ్చింది. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా పాట రాశారు... చరణాలు లేకుండా మూడు పల్లవులు ఉండటం ఈ పాట ప్రత్యేకత. ఏం సందేహం లేదు... ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది... ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు తెచ్చింది.. ఏం సందేహం లేదు.. ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది.. ప్రేమికుడికి సందళ్లు, తొందర్లు, ఆనందాలు తెచ్చేది చెలే కదా. ఆ అందాల నవ్వులు, కందేటి సిగ్గులు, గంధాల గొంతులు... అన్నీ చెలికాడికి అపురూపమే అని తొలి పల్లవి రాశారు అనంత్ శ్రీరామ్. వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే... ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే... నాకళ్లల్లోకొచ్చి నీ కల్లాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే... నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు... మది నిను చేరుతుందె చిలకా... తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది... హృదయము రాసుకున్న లేఖా... ప్రేమలోని విరహం వెన్నెల్లో వేడిని... ఎండల్లో హాయినీ పుట్టిస్తుంది... ఎందరిలో ఉన్నా... తన మోమునే చూడాలని తహతహలాడుతుంది మనసు. ఇక ఈ తపనలో నిద్ర అనే మాటే గుర్తుకురాదు. ఈ భావాలనే అక్షరాల్లో చూపించాడు అనంత్ శ్రీరామ్. కళ్లల్లోకి వచ్చి కల్లాపి జల్లి ముగ్గేసి వెళ్లావే అనే వ్యక్తీకరణ మా అందరినీ బాగా ఆకట్టుకుంది. నీ కొమ్మల్లో గువ్వ... ఆ గుమ్మంలోకెల్లి కూ అంటుంది విన్నావా... నీ మబ్బుల్లో జల్లు... ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా... ఏమవుతున్నా గానీ... ఏమైనా అయిపోనీ ఏం ఫర్వాలేదన్నావా... ఈ పల్లవి కథను వివరిస్తుంది. ఇంట్లో పోరు పడలేక పెళ్లి చూపులకు వస్తుంది నాయిక ప్రభావతి. ఆ విషయం తెలీని కథానాయకుడు... బాస్‌కు సాయం చేద్దామని ప్రేమ పాఠాలు చెబుతుంటాడు... తను ప్రేమించిన గువ్వ మరో గుమ్మంలో కూయ నుంది విన్నావా అంటాడు గీత రచయిత. నీ మబ్బుల్లో జల్లులాంటి ప్రేమ మరో ముంగిట్లో పూలు పూయిస్తే చాలా అని అడిగాడు... ఇలా చిన్న చిన్న పదాల్లో కథానాయకుడి పాత్రను ప్రశ్నించాడు అనంత్ శ్రీరామ్. సాహిత్యంలో తనకున్న పట్టుకు ఈ పాట మరో నిదర్శనం. సాధ్యమైనంత తెలుగు పదాలతోనే పాటలు రాసే అనంత్ శ్రీరామ్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. చిన్న వయసులోనే అపార ప్రజ్ఞను సంపాదించుకున్నారాయన. దర్శకుల ఆలోచనలను, సన్నివేశాల నేపథ్యాన్ని మనసును చదివినట్లుగా అర్థం చేసుకోగలరు. కథతో పాటే ప్రయాణించేలా ఈ పాట రాశారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వచ్చే ఈ పాట ఇంత హిట్ అయిందంటే... అనంత్ శ్రీరామ్ పనితనమే కారణం. ఇక సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఈ ట్యూన్ నా కోసమే ఉంచారేమో అనిపించింది. వేరే దర్శకులకు ఈ స్వరం వినిపించినా... వాళ్ల సినిమాలో సందర్భానికి సరిపోలేదట. నాయిక హృదయాన్ని ఆవిష్కరిస్తూ... చివరి పల్లవి ఇలా సాగుతుంది... అడుగులు వేయ్యలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుకా.. అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా... వైజాగ్ పరిసరాల్లో రాత్రి పూట ఈ పాట చిత్రీకరించాం. మంచి లొకేషన్లు ఎంచుకుని వారం రోజుల పాటు షూటింగ్ చేశాం. ఈ పాటకు నేనే కొరియోగ్రఫీ చేయడం మరో అనుభూతి. సినిమాలో ఈ పాట ఎంత కీలకమని మేము భావించామో... అంతే పర్ఫెక్ట్గా పాట వచ్చింది. కష్టే ఫలి అన్నట్లు సినిమాలో ఈ పాట సూపర్ హిట్. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా అంటే ‘ఏం సందేహం’ లేదు పాటే అంటుం టారు శ్రోతలు. అంతగా ఆకట్టుకుందీ పాట. సేకరణ: రమేష్ గోపిశెట్టి వారాహీ చలన చిత్రం సంస్థ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన ’ఊహలు గుసగుసలాడే’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో నాగశౌర్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా అరంగేట్రం చేశారు. నాగశౌర్య, రాశీ ఖన్నా ఇద్దరికీ ఈ సినిమా మంచి పునాది అయ్యింది. రాశీ ఖన్నా పెద్ద హీరోల సరసన నటిస్తుండగా...నాగశౌర్య హీరోగా నిలదొక్కుకున్నాడు. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్‌కు మొదటి చిత్రమిదే. తొలి సినిమా అయినా... కథను స్పష్టంగా తెరకెక్కించాడు. పాటల చిత్రీకరణలో దర్శకుడు వంశీ శైలిని ప్రదర్శించాడు. దర్శకత్వం వహిస్తూనే అవసరాల శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అమాయకత్వం, హాస్యం, కొంత స్వార్థం కలిసిన ఆ క్యారెక్టర్లో అంతే బాగా నటించారు. - అనంత శ్రీరామ్, గేయ రచయిత - అవసరాల శ్రీనివాస్, నటుడు, దర్శకుడు -
సినిమా రివ్యూ: ఊహలు గుసగుసలాడే
నటీనటులు: నాగశౌర్య, రాశి ఖన్నా, అవసరాల శ్రీనివాస్ నిర్మాత: రజని కొర్రపాటి సంగీతం: కళ్యాణి మాళిక్ ఫోటోగ్రఫి: వెంకట్ సి. దిలీప్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ ప్లస్ పాయింట్స్: అవసరాల డైరెక్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్: ఎడిటింగ్ కథ, కథనం టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి చలన చిత్రం' బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం జూన్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఊహలు గుసగుసలాడే' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను సంపాదించుకుంది. అవసరాల దర్శకుడిగా సక్సెస్ సాధించారా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే. టెలీ మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్ గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ (అవసరాల శ్రీనివాస్) బిహేవియర్ తో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్లి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్లి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్లి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతి లు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'. వెంకీ పాత్ర నాగశౌర్యకు మరో మంచి అవకాశం. మధ్య తరగతి చలాకీ యువకుడిగా, ప్రేమికుడిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. కొన్ని సన్నివేశాల్లో శౌర్య ఎనర్జీ, ఫర్ ఫెక్ట్ ఈజ్ తో ఆకట్టుకున్నాడు. ప్రభావతిగా రాశి ఖానా తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. గ్లామర్ తోనే కాకుండా యాక్టింగ్ తో రాశి ఖన్నా మెప్పించింది. ఇక టెలివిజన్ న్యూస్ చానెల్ యజమానిగా ఉదయ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ మరోసారి మంచి పాత్రలో కనిపించారు. వామనరావుగా టెలివిజన్ యాంకర్ గా పోసాని కృష్ణమురళి అక్కడక్కడ నవ్వించడమే కాకుండా చివరి సీన్ లో తనదైన ముద్రను ప్రేక్షకుల మదిలో వేసుకున్నాడు. కళ్యాణి మాళిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే కళ్యాణ్ అందించిన పాటలు ఓహో అనిపించేంతగా లేవు. వెంకట్ సి. దిలీప్ అందించిన ఫోటోగ్రఫి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ పదను తగ్గడంతో చిత్ర కథనం నెమ్మదించడమే కాకుండా చోట్ల పేలవంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే మంచి ఫలితం రాబట్టుకునే అవకాశం ఉండేది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంతో వన్ మ్యాన్ ఆర్మీ పాత్రను పోషించిన అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా సఫలయయ్యారు. అయితే కొంత అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. రొటిన్ ప్రేమకథను.. స్లో నేరేషన్ తో 'బ్లూటూత్' ద్వారా ప్రేక్షకుడికి ఎక్కించాలనుకునే ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేకపోయిందనిపించింది. తాను చిత్రీకరించిన సన్నివేశాలపై మమకారం ఉన్న కారణంగానో ఏమో.. సినిమా నిడివిని పెంచేశాడు. మంచి డైలాగ్స్ అందించిన అవసరాల ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంటే బాగుండేది. ప్రేమకథకు ఆకట్టుకునే పాటలు లేకపోవడం ఓ లోపంగా చెప్పవచ్చు. వెంకీ, ప్రభావతి, ఉదయ్ పాత్రల డిజైన్ లో ఫర్ ఫెక్షన్ సాధించినా.. ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ తో కూడిన ప్యాకేజిని అందించడంలో తడబాటుకు గురయ్యాడనిపించింది. నటుడిగానూ కాకుండా దర్శకుడిగా కూడా అవసరాల సక్సెసైనా... 'ఊహలు గుసగుసలాడే'ను కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ట్యాగ్ లైన్: ఊహలు రుసరుసలాడే -
వారాహి వారి రెండు సినిమాలు
‘ఈగ’, ‘అందాల రాక్షసి’ నిర్మాత సాయి కొర్రపాటి ఒకేసారి రెండు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఓ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా, మరో చిత్రానికి గోగినేని శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రాల పూజాకార్యక్రమాలు వారాహి సంస్థ కార్యాలయంలో జరిగాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. కల్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని అవసరాల శ్రీనివాస్ చెప్పారు. గోగినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని, ఈ చిత్రానికి సిల్లీ మాంక్స్ సినిమా సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి కుటుంబసభ్యులు, సిల్లీ మాంక్స్ సినిమా సీఈఓ సంజయ్‌రెడ్డి పాల్గొన్నారు.