
డైరెక్టర్, నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. శ్రీనివాస్ అవసరాల స్క్రిప్ట్ నందించగా.. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అలసిన సంచారి వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ అలసిన సంచారి.. పరుగులు ఏ దారి.. నిలబడు ఓసారి’ అంటూ మెలోడీగా సాగుతున్న ఈ పాటలో దాదాపు సినిమాలోని క్యారెక్టర్లన్నింటినీ చూపించాడు డైరెక్టర్. రాచకొండ విద్యాసాగర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘దిల్’రాజు, జాగర్లమూడి క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. శ్రీ విశ్వ రాసిన ఈ పాటను హేమచంద్ర పాడాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment