ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలతో హిట్ కొట్టారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య. దర్శకుడిగా అవసరాల టైమింగ్, టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో లాంటి హిట్ మూవీ తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరోతో కలిసి మళ్లీ మరో సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.
అవసరాల శ్రీనివాస్ నానితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపినా.. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. నాగశౌర్యతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడని సమాచారం. మరి ఈ మూవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment