శోభన్ బాబు టైటిల్తో అవసరాల
దర్శకుడిగా రెండు విజయాలు అందుకున్న అవసరాల శ్రీనివాస్, నటుడిగానూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే కామెడీ, క్యారెక్టర్ రోల్స్తో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్లో తెరకెక్కిన అడల్ట్ కామెడీ 'హంటర్' సినిమా తెలుగు రీమేక్తో హీరోగా మారుతున్నాడు అవసరాల శ్రీనివాస్.
ఓ కుర్రాడి సెక్సువల్ ఫాంటసీలకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సోగ్గాడు అనే టైటిల్ను పరిశీలుస్తున్నారట. 70లలో శోభన్ బాబు, జయసుథ హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ సొగ్గాడు. తరువాత అదే టైటిల్ తోతరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిన ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. యాంకర్ శ్రీముఖి, మిస్తీ చక్రవర్తిలతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే కమెడియన్గా, దర్శకుడిగా సక్సెస్ అయిన అవసరాల శ్రీనివాస్, ఈ సినిమాతో హీరోగానూ హిట్ కొడతాడేమో చూడాలి.