‘ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసు పాటి (నాగశౌర్య) మరియు అనుపమ కస్తూరి (మాళవిక) బెస్ట్ ఫ్రెండ్స్ అహో’ అనే డైలాగ్‌తో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదలైంది. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు.
నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల్లా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. కెమెరామేన్ సునీల్ కుమార్ నామ, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, పాటల రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూ పాల, ఎడిటర్ కిరణ్ గంటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment