Malavika Nair
-
డబుల్ బొనాంజ
శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. గురువారం (మార్చి 6) శర్వానంద్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘మూడు తరాల నేపథ్యం, ప్రేమ, కలలు... వంటి అంశాల నేపథ్యంతో ముడిపడి 1990, 2000ప్రారంభంలో సాగే మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్.నారీ నారీ నడుమ మురారి: శర్వనాంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇలా బర్త్ డేకి తన ఫ్యాన్స్‌కు శర్వానంద్ డబుల్ బొనాంజ ఇచ్చారు. -
శర్వానంద్ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్స్
హీరో శర్వానంద్ బర్త్ డే (మార్చి 6) సందర్భంగా మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్ ఖరారు చేయగా, 36వ సినిమా బుధవారం ప్రారంభమైంది. అలాగే శర్వా నటించనున్న 37వ సినిమా ప్రకటన కూడా వెల్లడైంది. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’ టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే శర్వానంద్ 36వ సినిమా ఆరంభమైంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. శర్వా 37వ సినిమాని రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గత ఏడాది రక్షితను వివాహం చేసుకున్నారు. ఇటీవల పాపకు జన్మనిచ్చారు రక్షిత. పాపకు లీలాదేవి అని నామకరణం చేసినట్లు బుధవారం వెల్లడించారు. -
Devil Movie Review: డెవిల్ మూవీ రివ్యూ
టైటిల్: డెవిల్ నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 29,2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్కి విజయ కజిన్ నైషేద(సంయుక్త మీనన్)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్‌ను పట్టుకునే ఆపరేషన్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డెవిల్ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్‌గా ఉండి ఓ ఆపరేషన్‌లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది. ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ పాయింట్‌తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్‌లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్ రివీల్ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్ సీన్ మరింత బోరింగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్‌గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక మాళవిక నాయర్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు
∙‘డెవిల్’ సినిమా సీక్వెల్‌కి 50 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘డెవిల్’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్పుట్ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. అంతేకానీ అప్డేట్ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? ► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు.అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కల్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► 2021లో ‘బింబిసార’ షూటింగ్ టైమ్‌లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు ‘డెవిల్’ కథ చెప్పారు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్’ని కథగానే రాశాను. అభిషేక్ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్‌డ్రాప్ అలాగే ఉంచి, కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం. ► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్’కి మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్‌తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్‌ఫైర్ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్’ హిట్‌తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది. ► ‘డెవిల్’లో నా క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్ రాజన్‌గారు విజువల్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ‘డెవిల్’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్’ విషయంలో హర్షవర్ధన్ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్ తర్వాత సంయుక్తా మీనన్‌తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం (నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. -
రాసుకోండి...‘డెవిల్’ బాగుంటుంది: కల్యాణ్‌రామ్
‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ సినిమా టైమ్‌లో చెప్పాను. దాన్ని మీరు (ఫ్యాన్స్, ఆడియన్స్) నిజం చేశారు. అదే కోవలో ‘డెవిల్’ మంచి కథా కథనాలతో వస్తోంది. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. ఈ చిత్రం సరికొత్త కథతో ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా, మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఖర్చుకి వెనకాడకుండా ‘డెవిల్’ని రూపొందించిన అభిషేక్ నామాగారికి థ్యాంక్స్. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో మొదలుపెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌ని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘డెవిల్’ కోసం రెండేళ్ల పాటు కల్యాణ్ రామ్‌గారు మరో సినిమా చేయకుండా పని చేశారు. ఇందులో ఆయన యాక్షన్, నటన అదిరిపోతాయి. మా ‘డెవిల్’ హిట్‌తో 2023 ముగుస్తుంది’’ అన్నారు అభిషేక్ నామా. -
రాజకీయ నాయకురాలు మణి మేకల
మణి మేకల పవర్ఫుల్ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాయి. మరి.. ఆ రాజకీయ నాయకురాలికి, బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ‘డెవిల్’ చిత్రంలో చూడాల్సిందే. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. పొలిటీషియన్ మణి మేకల పాత్రను మాళవికా నాయర్ పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. నవంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డెవిల్’ రిలీజ్ కానుంది. దేవాన్‡్ష నామా సమర్పణలో స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్. -
వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి
‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్‌కి వెళ్లి చూడండి. మా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్ అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్‌లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ మంచి స్టార్స్ అయ్యారు.. అలాగే సంతోష్‌కి కూడా ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్ సంతోష్) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్ శోభన్ . -
‘అన్నీ మంచి శకునములే’మూవీ రివ్యూ
టైటిల్: అన్నీ మంచి శకునములే నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి, గౌతమి, వాసుకి, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ నిర్మాతలు: స్వప్నాదత్, ప్రియాంకా దత్ దర్శకత్వం: నందినీ రెడ్డి సంగీతం: మిక్కీ జే.మేయర్ సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ ఎడిటర్: జునైద్ విడుదల తేది: మే 18, 2023 టాలీవుడ్లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన కళ్యాణం కమనీయం చిత్రం కూడా సంతోష్‌కి సూపర్ హిట్‌ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’అనే చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందల లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాడ్గా నిర్వహించడంలో ‘అన్నీ మంచి శకునములే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు నందినీ రెడ్డి. ఈమె సినిమాల్లో అందరూ మంచి వాళ్లే ఉంటారు. ఓ పెళ్లి సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ని ఎమోషనల్ చేసేందుకు కొన్ని సన్నివేశాలు పక్కా ఉంటాయి. అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రతీ సీన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. పైగా స్లో నెరేషన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో నందినీ రెడ్డి..‘ఈ సినిమాలో అవసరం లేని సీన్స్ ఒక్కటి కూడా ఉండదు’అని చెప్పారు. కానీ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓల్డ్ మూవీస్ పాటలకు పెళ్లిలో ఫ్యామిలీ మెంబర్స్ స్టెప్పులేయడం.. షావుకారు జానకీకి చెందిన సీన్స్.. డాక్టర్ మద్యం సేవించే సీన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ సీరియస్‌గా చేసే కామెడీ, వెన్నెల కిశోర్ ఫన్ సీన్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం రోటీన్‌గా సాగడమే కాదు.. చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా సరిగా పండలేదు. సినిమా చివరి 25 నిమిషాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. ఆరిస్టుల నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు వందశాతం సఫలం అయింది. కానీ కథ,కథనం విషయంలో జాగ్రత్తగా తీసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. ఎలాంటి గోల్స్ లేకుండా.. తండ్రి చేతిలో తిట్లు తింటూ.. ఫ్యామిలీ కోసం మంచి చేసే క్యారెక్టర్ తనది. ఇక అనుకున్నది సాధించే అమ్మాయి ఆర్య పాత్రకు మాళవిక నాయర్ న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేశ్ తమ అనుభవాన్ని తెరపై మరోసారి నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్ పెద్దమ్మగా షావుకారు జానకి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో సోదరిగా నటించిన వాసుకికి గుర్తిండిపోయే సన్నివేశాలేవి లేవు. గౌతమి, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే.మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మినహా మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
‘అన్నీ మంచి శకునములే' మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా సినిమా పై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్ కొట్టారా? లేదా? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌పై సునిశిత్ అనుచిత వ్యాఖ్యలు) ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొన్ని సన్నివేశాలు బాగున్నా.. కథలో బలం లేదని అంటున్నారు. అలాగే స్క్రీన్‌ప్లే కూడా చాలా స్లోగా ఉన్నాయి అంటున్నారు. కొన్ని సన్నివేశాలు చాలా హిలేరిస్‌గా ఉన్నాయట. సంతోష్ కామెడీ టైమింగ్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. #AnniManchiSakunamule : “Boring to the Core” 👉Rating : 2.25/5 ⭐️ ⭐️ Positives: 👉Better Second Half Negatives: 👉Boring First Half 👉1950’s Story 👉Dragged Scenes & Narration 👉Songs & BGM#SantoshShoban #MalvikaNair — PaniPuri (@THEPANIPURI) May 18, 2023 అన్నీ మంచి శకునములే మూవీ బోరింగ్ ఫిల్మ్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. నెరేషన్ బాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #AnniManchiSakunamule A Family Entertainer that had its moments but falters with the overall execution. Has a few decent comedy scenes/feel good moments but the rest is totally dragged out with a lengthy runtime and snail paced narration in many parts. Mediocre! Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) May 18, 2023 అన్నీ మంచి శకునములే మూవీ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో టీమ్ తడబడింది. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం, రన్ టైమ్ ఎక్కువగా ఉండడంతో సాగదీతగా అనిపిస్తుంది అంటూ మరో నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు. #AnniManchiSakunamule Positives:Movie concept explored is really good. Marriage traditions are well picturised. There were a few scenes, including the climax and initial portion that stood out. Reach Production values. Negatives:Lead pair's drama fell flat. Slow paced narration. — America Cini Pandits (@CiniPandits) May 18, 2023 #AnniManchiSakunamule disappoint chesindi. Moments lo shine avthadi cinema. There are some good laugh out loud moments, there are some good dramatic moments but overall ga cinema for the most part flat ga potha untadi. Oka climax lo thappithe never did the movie manage to make.. pic.twitter.com/E8aPL6CTUh — Likith (@likitongue) May 18, 2023 Overall: #AnniManchiSakunamule is a misfired family drama with dragged out screenplay and low on emotions. Few hilarious scenes with #VennelaKishore. Below par music and bgm. Predictable and boring. Rating: 2/5 #SanthoshSobhan#MalavikaNair#NandiniReddy pic.twitter.com/vuwYKmehhC — TFI Talkies (@TFITalkies) May 18, 2023 #AnniManchiSakunamule 1st Half Review: ⭐️some comedy scenes ⭐️breezy feel 👎🏼very slow screenplay 👎🏼Lot of boring scenes Need a bug second half!!#NandiniReddy #AnniManchiShakunamule pic.twitter.com/JI2xAlP6Ot — ReviewMama (@ReviewMamago) May 18, 2023 FirstHalf: Dragged out #AnniManchiSakunamule life drama. Few laughs here and there, average songs and bgm. Story is flat nothing clicks till the interval.#AMS #SanthoshSobhan#malavikanair #NandiniReddy #MickeyJMeyer #swapnacinemas — TFI Talkies (@TFITalkies) May 18, 2023 #AnniManchiSakunamule movie is a winner again for @SwapnaCinema.But there is lot to look at I'm literally not convinced at climax something is missing. Emotionally I was connected through climax but there should be some conflict emotion between hero and heroine. — Rowdy boy (@devarakonda7007) May 17, 2023 -
'ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది': మిక్కీ జే మేయర్
‘‘నా మ్యూజిక్ కంపోజర్స్ టీమ్ అందరూ అమెరికా, లండన్‌లో ఉంటారు. సో.. నేను అమెరికాలో ఉన్నప్పటికీ నిర్మాతలు ఇబ్బందిపడటంలేదు. ఓ సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్స్‌తో పాటు సంగీత దర్శకుడికి మంచి పేరు వస్తుంది. అందుకే స్క్రిప్ట్ ముఖ్యమని నమ్ముతాను. ఇక ఇటు శేఖర్ కమ్ములగారి నుంచి హరీష్ శంకర్, అటు నాగ్ అశ్విన్ నుంచి నందినీ రెడ్డిగార్ల సినిమాలు.. ఇలా డిఫరెంట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన అతి కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్స్‌లో నేనూ ఒకణ్ణి’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ తర్వాత వైజయంతీ మూవీస్‌లో నేను చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. నందినీ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. అలాగే కథలో ఆమె క్రియేట్ చేసిన విక్టోరియాపురం ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలకు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలగారితో ఓ ప్రాజెక్ట్, ‘చాంపియన్’ అనే మరో ప్రాజెక్ట్, ‘సెల్ఫిష్’, అమెరికాలో ఉన్న మరో దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాని
-
సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్‌కాల్ తనదే: హీరో
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద సినిమా ఇది. వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్‌కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్. ‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్‌కు ఎంత వేల్యూ ఇస్తాం. ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అది నాకు బోనస్: సంతోష్ శోభన్
‘‘గోల్కొండ హైస్కూల్’ (2011) చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఈ సినిమాలోని నా పెర్ఫార్మెన్స్ నాకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా దాదాపు నాలుగేళ్లు నాకు అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు, కొన్ని కథలు కరెక్ట్ అని భావించి కొన్ని సినిమాలు చేశాను. అవి వర్కౌట్ కాలేదు. ఇక నా కెరీర్ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మంచి బిగ్‌స్క్రీన్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు సంతోష్ శోభన్. నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నామూవీస్, మిత్రవిందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా..మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఓ యాక్టర్‌గా నాకు తొలి అడ్వాన్స్ చెక్ ఇచ్చింది ప్రియాంకా దత్‌గారు. ఇలా.. వీరి కాంబినేషన్స్‌తో నా కెరీర్‌కు కావాల్సిన టైమ్‌లో ‘అన్నీ మంచి..’ లాంటి సినిమా వస్తుండటం లక్‌గా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం నాకు బోనస్’’ అన్నారు. నేడు మదర్స్ డేని పురస్కరించుకుని శోభన్ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. నటుడిగా నాకు అవకాశాలు తగ్గినప్పుడు అమ్మ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు సొంత ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి
‘‘సినిమా నా ఫస్ట్ లవ్. అందుకే నటిగా మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన పలు విభాగాల్లో పని చేశాను. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ మరింత ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. నటిగా షూటింగ్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఒక రకంగా గర్వపడుతున్నాను కూడా’’ అన్నారు గౌతమి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గౌతమి మాట్లాడుతూ– ‘‘అన్నీ మంచి..’లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే మీనాక్షీ పాత్ర చేశాను. ఓ డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా ఉండాలని కోరు కుంటారో అలా ఉంటుంది మీనాక్షీ పాత్ర. నా కెరీర్ తొలినాళ్లలో నేను రాజేంద్రప్రసాద్‌గారితో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించాను. నటన పట్ల ఆయన అంకితభావం సూపర్. వీకే నరేశ్, ‘షావుకారు’ జానకి, ఊర్వశి.. ఇలా అందరూ ఓకే సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అసలు.. ఇంతమంది మంచి నటీనటులను దర్శకురాలు నందినీ, నిర్మాతలు స్వప్న, ప్రియాంకాగార్లు ఓ చోటకు చేర్చి సినిమా చేయడం అద్భుతం. ప్రేక్షకులకు ఈ సినిమా మర్చిపోలేని బహుమతి. స్వీయనియంత్రణ ఉన్న దర్శకురాలు నందిని. మంచి నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాలు ప్రియాంక, స్వప్నగార్లలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటిగారి సినిమాలో నటిస్తున్నాను. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనక ఉండటం ఇష్టం’’ అని చెప్పారు గౌతమి. -
‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆర్టిస్టులు నటిస్తారు. కానీ మనుషులుగా మనందరం నిత్యం విభిన్నమైన సందర్భాలు, పరిస్థితుల్లో నటిస్తుంటాం. సో.. మనందరం నటులమే. ఇరవయ్యేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను భయపడలేదు. సెట్స్‌లో ఎక్కువగా టేక్స్ తీసుకోకుండానే యాక్ట్ చేశాను. అయినా నా భర్త ఆనంద సాయి (ఆర్ట్ డైరెక్టర్)తో నిత్యం సినిమాలు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నాను’’ అన్నారు వాసుకి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాసుకి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలే ప్రాధాన్యంగా అనిపించాయి. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ప్రస్తుతం ఫారిన్లో మా అమ్మాయి మెడిసిన్ ఫోర్త్ ఇయర్, అబ్బాయి ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దాంతో నాకు ఖాళీ దొరికింది. నేను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. ఇటు నటిగా నాకు నచ్చే, నప్పే పాత్రలు చేస్తాను. ‘అన్నీ మంచి శకునములే’లో సంతోష్ శోభన్‌కు అక్కగా నటించాను. తమ్ముడ్ని సపోర్ట్ చేసే అక్క పాత్ర ఇది. కథ బాగుంటే తల్లిగా చేయడానికి కూడా రెడీ’’ అన్నారు. -
అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది
‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్‌గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్. అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్. -
‘అన్నీ మంచి శకునములే’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. యంగ్ హీరో నాగశౌర్యతో ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో కనిపించింది. ఆ చిత్రంలో బోల్డ్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అన్నీ మంచి శకునములే అంటూ మరోసారి టాలీవుడ్ సినీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది భామ. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రమోషన్లలో భాగంగా మాళవిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో కలిసి వీడియోలో కనిపించింది. ఆయనతో మాట్లాడుతూ.. 'నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దానికి అనుదీప్ సిగ్గుపడుతూ మరీ కళ్లు మూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే చేసినా.. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంతే కాకుండా 'అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: స్విమ్ షూట్లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్‌డ్రాప్‌లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్‌ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్‌కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్‌ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్‌తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్‌మెంట్‌కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్‌కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
ఆ సినిమా విలువ నాకు తర్వాత తెలిసొచ్చింది: హీరోయిన్
‘‘ఓ నటిగా నేను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాను. రొటీన్ రోల్స్ అయితే కొత్తగా నేను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతుంటాను’’ అని అన్నారు హీరోయిన్ మాళవికా నాయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా నాయర్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘అన్నీ మంచి..’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రలు చేశాను. కానీ ఈ చిత్రంలో కాస్త కోపంగా, ధైర్యంగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్ర చేశాను. కాస్త హ్యూమర్ కూడా ఉంటుంది. నందినీ రెడ్డిగారు నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నటీనటుల నుంచి ఆమెకు కావాల్సింది రాబట్టుకుంటారు. ‘కల్యాణ వైభోగమే’ తర్వాత నందినీ గారితో మళ్ళీ సినిమా చేయాలని వుండేది. అది వైజయంతీ ఫిల్మ్స్‌తో నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వీకే నరేశ్, వాసుకీగార్ల వంటి అనుభవజ్ఞులైన వారితో నటించడం కొత్త ఎక్స్పీరియన్స్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు అన్నీ మంచి శకునములే అనిపించాయి. ఈ పాత్ బ్రేకింగ్ సినిమా విలువ ఏంటో నాకు తర్వాత తెలిసొచ్చింది. ప్రియాంక, స్వప్నగార్లు నాకు పరిచయం అయ్యింది కూడా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే. ఇండస్ట్రీలో వారు నాకు మెంటర్స్లా ఉంటున్నారు. ఓ నటిగా నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం డెవిల్ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
అప్పుడు టామ్‌బాయ్ స్టయిలే.. ఇప్పుడిప్పుడే కాస్త ఇలా: హీరోయిన్
గ్లామర్ షో చేయకుండా కేవలం అభినయంతోనే పేరు తెచ్చుకున్న నటి మాళవిక నాయర్. అలా తెర మీదే కాదు.. తెర బయటా ఆమె సంప్రదాయ శైలిని ఎలివేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉంటాయి.. షెహరి బై సాహితి రెడ్డి హైదరాబాద్ హ్యామ్స్టెక్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సాహితి రెడ్డి.. 2012లో ‘సహారా బై సాహితి రెడ్డి’ పేరుతో బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఎటువంటి ఫ్యాబ్రిక్ మీదైనా సరే.. ఫ్లవర్ డిజైన్ ఆర్ట్‌తో మెప్పించటం ఆమె ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. జ్యూలరీ.. ఇద్దరు స్నేహితులు శిల్ప, గీత ప్రారంభించిన ఆన్లైన్ జ్యూలరీ స్టోర్ ఇది. ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజే వారిని సెలిబ్రిటీలకు కూడా డిజైన్స్ అందిచే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేసే వీలు ఉంది. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: షెహరి బై సాహితి రెడ్డి ధర: రూ. 19,800 జ్యూలరీ బ్రాండ్: శిల్ప గీత స్టయిల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడిలా సంప్రదాయబద్ధంగా.. ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నా కానీ, చిన్నప్పుడు మాత్రం నాది టామ్‌బాయ్ స్టయిలే. ఇప్పుడిప్పుడే కాస్త ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్‌బుల్‌గా రెడీ అవుతున్నా. – మాళావిక నాయర్ ∙దీపిక కొండి -
Anni Manchi Sakunamule: రిషి– ఆర్యని ఏప్రిల్ 20న ఇటలీలో కలవండి
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది. కాగా ‘ఏప్రిల్ 20న మీట్ రిషి– ఆర్య ఇన్ ఇటలీ’ అంటూ ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది యూనిట్. ‘‘ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’. విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన బంధం ఎలా ఏర్పడింది? వారి జర్నీ ఎలా సాగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. రిలీజ్ చేసిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్. Get ready for summer vacation, Meet Rishi & Arya in Italy on this Thursday 🍃💚 Our summer song #MeriseMabbullo on April 20th.https://t.co/W4L5PBmGP0#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms@SonyMusicSouth pic.twitter.com/Vbro2PTlDT — Swapna Cinema (@SwapnaCinema) April 17, 2023 -
హిట్ కాంబినేషన్స్ రిపీట్.. ఆ హీరోయిన్సే కావాలంటున్న డైరెక్టర్స్!
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు. ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైంధవ్..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి! -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
ముద్దు సీన్ కావాలని చేసింది కాదు: మాళవిక నాయర్
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ప్రస్తుతం నాగశౌర్యకు జంటగా ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో నటిస్తోంది. అవసరాస శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక సినిమాకు సంబంధించి పలు ఆసక్తిసకర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో బోల్ట్ సీన్ అంటే హీరోయిన్లకు కాస్తా కష్టంగానే ఫీలవుతారు. ఈ సినిమాలో అలాంటి సీన్లలో నటించడంపై మాళవిక స్పందించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తొలిసారి మాళవిక ముద్దు సీన్లలో నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ముద్దు సీన్‌పై మాళవిక మాట్లాడుతూ..'ముద్దు సీన్లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సీన్ కాదు. కథలో భాగమే. ఆ సీన్ కథకు చాలా అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు. -
అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక నాయర్ (ఫోటోలు)
-
ఓ అబ్బాయిని ఇష్టపడ్డా, అతడే నా ఫస్ట్ క్రష్.. కానీ విజయ్..: మాళవిక
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే, టాక్సీవాలాతో యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మూడు భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘కుకూ సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది విజయ్ గురించే ప్రశ్నలు మాళవిన నాయర్ మాట్లాడుతూ..' ఉహా తెలియని రోజుల్లో ఎల్కేజీలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. అదే నా ఫస్ట్ క్రష్. రోజూ తనను చూసేదాన్ని. క్లాస్మేట్స్ అందరం కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోని దాచుకున్నా. ఆ అబ్బాయి ఫొటోను స్కెచ్‌తో రౌండప్ చేసి అప్పుడప్పుడు చూసుకుని మురిసిపోయేదాన్ని. ఆరో తరగతి తర్వాత నేను వేరే స్కూల్‌కు మారిపోవడంతో ఆ కథ ముగిసిపోయింది. ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వొస్తుంది. ఆ తర్వాత ఇంటర్ వరకు ఢిల్లీలో చదువుకున్నా. మొదటి ఏడాది వేసవి సెలవుల్లో ‘ఎవడే సుబ్రమణ్యం’ షూట్లో పాల్గొన్నా. ఫస్ట్ నేను పైలెట్ కావాలనుకున్నా. కానీ వరుస సినిమాల వల్ల నా డ్రీమ్ నెరవేరలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ చదివా. ఆ సమయంలో నా స్నేహితులంతా విజయ్ దేవరకొండ గురించే అడిగేవారు. వాళ్లకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని. అలా సినిమాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశా. ' అని తన అనుభవాలను పంచుకున్నారు. మహానటిలో పాత్రకు మంచి ఆదరణ ‘మహానటి’లో నేను పోషించిన అలిమేలు పాత్రకు మంచి ఆదరణ లభించిందని మాళవిక తెలిపింది. ఆ సినిమా తర్వాత చాలామంది తల్లి పాత్రల్ని ఆఫర్ చేశారు. అప్పటికి నాకు కేవలం ఇరవై ఏళ్ల వయసే కాబట్టి సున్నితంగా తిరస్కరించాను. అలాంటి పాత్రలు నా కెరీర్‌కు రిస్కే కానీ.. చిన్న పాత్ర అయినా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా చేయాలనే నా లక్ష్యమని అన్నారు. అలాగే ‘టాక్సీవాలా’లో శిశిర, ‘మహానటి’లో అలిమేలు పాత్రలు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటానని మాళవిక నాయర్ తెలిపింది. -
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్‌ని రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం’ అంటూ సాగే మెలోడి పాటను విడుదల చేశారు. గీతా మాధురి ఆలపించిన ఈ సాంగ్ అలరిస్తుంది. Groove to this Magical Melody #NeethoeeGadichinaKalam Out now😍🎼 Watch Full lyrical👇https://t.co/1hhz90TtEd#PAPA#PAPAOnMarch17@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla@PSrividya53 pic.twitter.com/RQT4cb82S0 — People Media Factory (@peoplemediafcy) March 10, 2023 Feel the vibe of Magical Melody #NeethoeeGadichinaKalam Out now😍🎼 Watch Full lyrical👇https://t.co/aRUeMLm9cb#PAPA#PAPAOnMarch17@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla@PSrividya53 pic.twitter.com/9wpLw1qPnz — People Media Factory (@peoplemediafcy) March 9, 2023 -
ఇవాళే కలిశారు తొలిసారిగా..
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే రెండో పాటని సోమవారం విడుదల చేశారు. గాయని నూతన మోహన్, కళ్యాణీ మాలిక్ పాడిన ఈ పాటకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘‘హీరో, హీరోయిన్ల పరిచయ గీతం ఇది. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను’’ అన్నారు భాస్కరభట్ల రవికుమార్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్). -
కనుల చాటు మేఘమా...
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా..’ అంటూ సాగే మొదటి పా టను విడుదల చేశారు మేకర్స్. ఈ పా టకు లక్ష్మీ భూపా ల సాహిత్యం అందించగా ఆభాస్ జోషి పా డారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ అనుకున్నాక కళ్యాణీ మాలిక్గారితో ‘ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం.. దానికి మంచి పా ట కావాలి’ అన్నాను. ఆయన అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు’’ అన్నారు. ‘‘కనుల చాటు మేఘమా..’ పా ట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పా టా ఇవ్వలేదు’’ అన్నారు కళ్యాణీ మాలిక్. -
ప్రేమకథా చిత్రమ్
‘ప్రేమకథ’లు చూడ్డానికి బాగుంటాయి. గాఢమైన ‘ప్రేమ కథలు’ అయితే మనసులో నిలిచిపోతాయి. దుష్యంతుడు, శకుంతలది అలాంటి ప్రేమకథే. కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నా వీరి ప్రేమ బలమైనది కాబట్టే నిలబడింది. ఈ ప్రేమకథని త్వరలో వెండితెరపై చూడనున్నాం. మరికొన్ని ప్రేమకథలు కూడా రానున్నాయి. ఒక్కో ‘ప్రేమకథా చిత్రమ్’ది ఒక్కో కథ. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రేమకావ్యాల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ది ప్రత్యేకమైన స్థానం. కాళిదాసు రచించిన ఈ ప్రేమకథ ఆధారంగా ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమ చుట్టూ ఈ సినిమా సాగు తుందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ కొత్త ప్రేమకథతో ఖుషీగా రానున్నారు విజయ్ దేవరకొండ–సమంత. ఈ ఇద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘ఒక రొమాంటిక్ ప్రేమకావ్యం నిర్మాణంలో ఉంది’ అని విజయ్, ‘కుటుంబమంతా చూసి మంచి అనుభూతికి గురయ్యే సినిమా’ అని సమంత ‘ఖుషి’ అప్డేట్ అప్పుడు పేర్కొన్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటోంది యూనిట్. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో 2018లో వచి్చన లవ్‌స్టోరీ ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ‘గీత గోవిందం’కు సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చ్చింది . ఇదే నిజమైతో విజయ్ వెంట వెంటనే ప్రేమకథా చిత్రాల్లో నటించినట్లు అవుతుంది. ఇక అబ్బాయి, అమ్మాయి స్నేహం ప్రేమగా మారిన ఎన్నో కథలు వెండితెరపైకి వచ్చాయి. ప్రేక్షకుల మనసులను మెప్పించాయి. ఈ కోవలో రానున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అబ్బాయి సంజయ్ పీసపాటి, అమ్మాయి అనుపమా కస్తూరిల ప్రేమకథ ఇది. సంజయ్ పాత్రలో నాగ సౌర్య , అనుపమ పాత్రలో మాళవికా నాయర్ నటించారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ అంశాల మేళవింపుతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా, విరాజ్ అశి్వన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఫస్ట్ లవ్ కాన్సెప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక శ్రీదేవి ఎక్కడుంటే శోభన్‌బాబు అక్కడే ఉంటాడట. ఎందుకంటే ప్రేమంట. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఇందులో శోభన్‌బాబుగా సంతోష్ శోభన్, శ్రీదేవిగా గౌరి కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో ఫేమ్ సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఫోన్ నంబర్ నైబర్‌హుడ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో కాశ్మీర హీరోయిన్గా నటించగా, కిశోర్ డైరెక్టర్ చేశారు. ఈ చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇవి కాక మరికొన్ని ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. -
సంజయ్.. అనుపమ.. బెస్ట్ ఫ్రెండ్స్ అహో...
‘ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసు పాటి (నాగశౌర్య) మరియు అనుపమ కస్తూరి (మాళవిక) బెస్ట్ ఫ్రెండ్స్ అహో’ అనే డైలాగ్‌తో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదలైంది. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్, నా కాంబినేషన్లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల్లా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. కెమెరామేన్ సునీల్ కుమార్ నామ, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, పాటల రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూ పాల, ఎడిటర్ కిరణ్ గంటి తదితరులు పాల్గొన్నారు. -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి) -
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్‌కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్‌గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్‌లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
లండన్‌లో ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ టీం సందడి
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. -
‘థ్యాంక్ యూ’ నుంచి మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా చై విభిన్న లుక్‌లో అలరించనున్నాడు. రాశీఖన్నా, మళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్ ఓ కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడదులై టీజర్, పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఏంటో ఏంటేంటో అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగ చైతన్య, మాళవిక నాయర్ల మధ్య తెరకెక్కిన ఈ పాటకు ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్ స్వరాలను సమకూర్చారు. కాగా శ్రీవెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్‌తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్‌కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
'ఒరేయ్ బుజ్జిగా’ మూవీ స్టిల్స్
-
ఒకరోజు ముందే ‘ఒరేయ్ బుజ్జిగా’ ..
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా.'. విజయకుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధమోహన్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూత పడటంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. థియేటర్లు ఓపెన్ చేశాక రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే పెద్ద సినిమాలే ఓటీటీ బాట పట్టిన తరుణంలో ఒరేయ్ బుజ్జిగా కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించింది. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ) కానీ అదే రోజు అగ్రతార అనుష్క నటించిన "నిశ్శబ్ధం" సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఒకరోజు ముందుగానే రిలీజ్ చేయాలన్న ప్రేక్షకుల కోరిక మేరకు 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు రాజ్ తరుణ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బహిరంగంగా ప్రకటించేంతవరకు నిర్మాతకు కూడా తెలియకపోవడం గమనార్హం. అనంతరం ఇదే విషయాన్ని అభిమానులకు తెలుపుతూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. సర్ప్రైజ్.. రేపు సాయంత్రం ఆరు గంటలకే సినిమా చూసేయండని చెప్పుకొచ్చారు. రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు అని హామీ ఇస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. (చదవండి: హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్) Surprise surprise!!! 🤗😀 pic.twitter.com/KhQNRQcKe2 — Raj Tarun (@itsRajTarun) September 29, 2020 -
‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ వేడుక
-
నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం
రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ కరీంనగర్లో జరిగిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో సునీల్‌రావు (కరీంనగర్ మేయర్) ముఖ్య అతిథిగా హాజరై ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు. నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా ఇది నా ఎనిమిదో సినిమా. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. టీమ్ అందరి సహకారం వల్ల సినిమా బాగా వచ్చింది. ముందుగా ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 25న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 21వరకు థియేటర్స్ మూసివేస్తున్నారు. తిరిగి సినిమా థియేటర్స్ ఓపెన్ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది క్లీన్ ఎంటర్టైనర్. రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. రాజ్‌తరుణ్ ఫైట్స్, డ్యాన్స్‌లు ఇరగదీశాడు. రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు విజయ్‌కుమార్ కొండా. ‘‘థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ తర్వాత డైరెక్టర్ విజయ్‌కుమార్‌గారితో ఇది నా హ్యాట్రిక్ ఫిల్మ్. రాజ్ తరుణ్ ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. రాజ్ తరుణ్‌తో నాకిది రెండో సినిమా’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. నటుడు మధుసూధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమే‹ష్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నీతోని కష్టమే కృష్ణవేణి!
యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ కృష్ణవేణి ఓ కృష్ణవేణి నీతోని కష్టమే కృష్ణవేణి, కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి’ పాట యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక ఈ సినిమా నుంచి ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున’ అనే పాట ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: ఒరేయ్ బుజ్జిగా.. ఫస్ట్ సాంగ్ రిలీజ్) Here’s the mass song “Krishnaveni” from #Oreybujjiga https://t.co/mNtvpag03i Hope u guys like it :) — Raj Tarun (@itsRajTarun) March 14, 2020 (చదవండి: ఈ సినిమా టైటిల్ బాగా పాపులర్ అయింది) -
రెండున్నర గంటలు నవ్వులే
‘‘ఒరేయ్ బుజ్జిగా’ కంప్లీట్ ఎంటర్టైనర్. థియేటర్లో రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా వచ్చి సంతోషంగా నవ్వుకుని వెళ్లే సినిమా’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా’ చేశా. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే మా సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘యువతకి, కుటుంబ సభ్యులకి నచ్చే అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. ఈ నెల 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తాం’’ అన్నారు. మాళవికా నాయర్, నటుడు మధునందన్, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, కో– డైరెక్టర్ వేణు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు
యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఒరేయ్ బుజ్జిగా’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థియేటర్లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఆ సమయానికి విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్, దర్శకుడు విజయ్ కుమార్‌కు ధన్యవాదాలు" తెలిపారు. ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. ‘సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు. విజయ్ కుమార్ సినిమా ఆరంభం నుంచి నాకు గైడింగ్ స్పిరిట్‌గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక హ్యూగ్ ఇన్స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. నిర్మాత రాధామోహన్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించారు. ఆండ్రూతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది’ అన్నారు. (ఒరేయ్ బుజ్జిగా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సినిమా ఉగాది షడ్రుచిలా ఉంటుంది దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.."రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కథకు ఏమి కావాలో అన్నీ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా నటించారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూ, అనూప్ ఇలా అందరు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఏ జోనర్లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ప్రేక్షకులందరూ పడిపడి నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా..’ చేశాం. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలు ఉంటాయి' అన్నారు. టైటిల్ బాగా పాపులర్ అయింది చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - "నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ కథ వినిపించారు. అక్కడ మొదలైన చిత్రం ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన ‘కురిసెన, కురిసెన’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ సినిమాకు మార్చి 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌కు మేము అందరం వెళ్లాం' అన్నారు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది నటుడు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘నిర్మాతకు ఇది ఎనిమిదవ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా ఎనిమిది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘విజయ్ కుమార్‌తో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
బుజ్జిగాడు వస్తున్నాడు
రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జంటగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగ్గట్లు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు విజయ్ కుమార్. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మా బ్యానర్లో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు రాధామోహన్. హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. -
ఒరేయ్.. బుజ్జిగా
‘ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలు రూపొందించిన కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. మాళవికా నాయర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్లో మా బ్యానర్లో ప్రొడక్షన్ నెం 8గా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా ప్రారంభించాం. మంగళవారం నుంచే నాన్ స్టాప్‌గా రెగ్యులర్ షూటింగ్ జరగుతుంది’’ అన్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ బాబు, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్. -
మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో అవసరాల
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా తన మార్క్ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. అచ్చమైన తెలుగు టైటిల్స్‌ను ఎంచుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రాన్ని పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్ నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రేసింగ్ హీరో!
బైక్ రేసర్‌గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారట విజయ్ దేవరకొండ. బైక్ రైడింగ్ కోసం ఆల్రెyీ స్పెషల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట విజయ్. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నారు. తమిళం చిత్రం ‘కాకముటై్ట’కు డైలాగ్ రైటర్‌గా పని చేశారట ఆనంద్. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మాళవిక మోహనన్ కనిపిస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్‌నే హీరోగా నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో కెరీర్లో టాప్‌గేర్ వేశారు విజయ్. -
హ్యాట్రిక్ లక్ష్యంగా!
నాగశౌర్య హీరోగా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు వీరిద్దరు హ్యాట్రిక్ పై గురిపెట్టారు. అవును... నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తారు. నాగశౌర్య, మాళవిక జంటగా ‘కల్యాణ వైభోగమే’లో నటించిన విషయం తెలిసిందే. తాజాచిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇక తాజా సినిమా షూటింగ్ ఈనెల రెండో వారంలో స్టార్ట్ కానుంది. -
చిత్ర రచయిత్రి
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణవైభోగమే’, ‘మహానటి’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది మాళవిక నాయర్. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మకుట్టి కోచిలో చదువుకుంది. బాలనటిగా చేసింది.‘‘పాత్ర నిడివి గురించి కాదు... అది ఎంత శక్తిమంతమైనది? అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న మాళవిక మనసులో మాటలు ఇవి.... ఆ పాత్రలో నటించాలని ఉంది... కంఫర్ట్జోన్లో ఉండే పాత్రలు చేయడం కంటే సవాలు విసిరే పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. మానసిక వైకల్యం ఉన్న యువతిగా నటించాలని ఉంది. మలయాళ చిత్రంలో ‘కూకూ’ అంధురాలిగా నటించాను. ఈ పాత్ర నాకు సంతృప్తి ఇచ్చింది. ఆమిర్‌ఖాన్ ఆదర్శం పాత్రల ఎంపికలో ఆమిర్‌ఖాన్‌తో పాటు విద్యాబాలన్ నాకు ఆదర్శం. కమర్షియల్–నాన్ కమర్షియల్ సినిమాలను సమన్వయం చేసుకోవడంలో అమీర్ నాకు బాగా నచ్చుతారు. బాలీవుడ్‌లోకి వెళ్లాలనే ఆతృత లేదు. ఆసక్తి కూడా లేదు. గ్లామర్‌రోల్స్ పోషించడం నాకు కంఫర్ట్ కాదు. తొందరేమీ లేదు ఒక సినిమా సక్సెస్ అయితే ‘సంతోషం’తో పాటు, స్క్రిప్ట్ ఎంపికలో నా మీద నాకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. ‘ట్యాక్సీవాలా’ విషయంలో ఇలాగే జరిగింది. డైరెక్టర్ రాహుల్ స్క్రిప్ట్ నెరేట్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. మంచి పాత్రల విషయంలో నిడివి గురించి ఆలోచించను. ఎడాపెడా సినిమాలు చేసేయాలనే తొందర లేదు. నచ్చే పాత్రలు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాను. రాకపోతే బాధ పడను. దూరం ఎందుకంటే... ‘సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు ఎందుకు?’ అని అడుగుతుంటారు. మన గురించి మన సినిమాలు మాట్లాడాలి తప్ప మనం కాదు అనేది నా అభిప్రాయం. ‘వైడ్ రీచ్’ అనేది సోషల్ మీడియాకు ఉన్నదనేది నిజమేగానీ, టైమ్ ఎక్కువగా తినేస్తుంది. దానికి దూరంగా ఉండడంలో కూడా హాయిగా ఉంది. రచనలు చేయడమన్నా , పెయింటింగ్స్ వేయడమన్నా నాకు చాలా ఇష్టం. నా పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉంది. నా రోల్‌మోడల్ ప్రజలతో మమేకమైనప్పుడే వారి ప్రవర్తన, పద్ధతులు తెలుస్తాయి. అవి నటనకు ఉపయోగపడతాయి. కమర్షియల్ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు. అయితే అందులో నేను చేస్తున్న పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. పాత్ర నచ్చకపోవడంతో ఈమధ్య ఒక కమర్షియల్ సినిమాను వద్దనుకున్నాను. నా రోల్ మోడల్ మలయాళ నటి పార్వతి. ఆమె చేసిన పాత్రలు ఇష్టం. ఒక పాత్ర చేసే ముందు ఎంతో రీసెర్చి చేసిగాని ఆమె కెమెరా ముందుకు రాదు. -
‘టాక్సీవాలా’ సక్సెస్ సెలెబ్రేషన్స్
-
ఇక గ్లామర్‌కు సై!
సినిమా: హీరోయిన్లకు అభినయం అవసరమే కానీ, ఈ తరంలో అంతకు మించి అందాలారబోత అవసరం. స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారంతా అంతా గ్లామర్‌ను నమ్ముకున్నవారే. ఈ విషయం కొంచెం ఆలస్యంగా నటి మాళవిక నాయర్‌కు అర్థమైనట్లుంది. ఈ అమ్మడు ఇకపై గ్లామర్‌కు హద్దులు చెరిపేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ పలు కమర్శియల్ యాడ్స్‌లోనూ నటించింది. ఆ తరువాత 2013లో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా అవకాశాన్ని అందుకుంది. ఇక 2014లో కుక్కూ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయింది. అలా అక్కడ, ఇక్కడా ఒక్కో చిత్రం చేస్తూ వచ్చిన మాళవిక నాయర్ ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకూ వచ్చింది. ఆ తరువాత కల్యాణ వైభోగమే చిత్రాలు చేసినా, తాజాగా టాక్సీవాలాతో మరో మంచి హిట్‌ను అందుకుంది. తమిళంలో కుక్కూ చిత్రంలో అంధురాలిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ భామ చాలా కాలం తరువాత ఇక్కడ అరసియల్ల ఇదెల్లాం సహజమప్పా చిత్రంలో నటిస్తోంది. మరో పక్క బీఏ చదువుతున్న ఈ అమ్మడు ఇకపై నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. అదేవిధంగా ఇప్పటి వరకూ గ్లామర్‌కు ఆమడ దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న మాళవికనాయర్‌కు ఇప్పుడు కమర్శియల్ హీరోయిన్గా మారాలనే ఆశ పుట్టిందట. అలా కావాలంటే గ్లామరస్‌గా నటించాల్సిందే. అందుకూ సిద్ధమైపోయిందట. ఇకపై ఎలాంటి పాత్ర అయినా హద్దులు మీరని విధంగా అందాలారబోతకు మాళవికానాయర్ సిద్ధం అంటోందని çకోలీవుడ్ వర్గాల టాక్. -
కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి
‘నేను చేసిన కొన్ని పాత్రలు హీరోయిన్గా నా కెరీర్‌కు ప్లస్ కాకపోవచ్చు కానీ ఆ పాత్రల వల్ల యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యాను. కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్ చేయలేక పోయినందుకు గిల్టీ ఫీలవ్వడం లేదు. నాలో ఉన్న నటి ‘టాక్సీవాలా’, ‘మహానటి’ వంటి మంచి సినిమాల్లో మంచి రోల్స్ చేసేలా చేసింది. స్టార్ అనడంకన్నా ‘యాక్టర్’గా మారిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అన్నారు కథానాయిక మాళవికా నాయర్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘టా క్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా మాళవిక చెప్పిన విశేషాలు... ∙‘టాక్సీవాలా’ రిలీజ్ తర్వాత స్క్రిప్ట్స్‌ను ఎంచుకునే విషయంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందులో నా క్యారెక్టర్‌ను రాహుల్ బాగా డిజైన్ చేశారు. నా స్నేహితులతో కలిసి థియేటర్లో సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కేరింతలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంది. నాకు నచ్చిన కమర్షియల్ రోల్ వస్తే తప్పకుండా చేస్తాను. ∙ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ నుంచి దూరం కాలేదు. ‘టాక్సీవాలా’ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితం మొదలైంది. సావిత్రిగారి లాంటి గొప్ప నటి బయోపిక్‌లో భాగమవ్వాలని ‘మహానటి’లో నటించాను. ఆ మధ్య విడుదలైన ‘విజేత’లో హీరోయిన్‌గానే నటించాను. కెరీర్ బాగుండాలంటే కమర్షియల్ రోల్స్ చేయాలి. అలాగే నాకు సంతృప్తినిచ్చే పాత్రలూ చేయాలి. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. ∙ నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. ప్రతి సినిమాలో చాలెంజింగ్ రోల్స్ కుదరకపోవచ్చు. స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండాలి. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘ఎవడే సుబ్రమణ్యం’ వన్నాఫ్ మై ఫేవరెట్ మూవీస్. విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ స్టార్ . నేను తెలుగులో 5 సినిమాలు చేశాను. అందులో మూడు సినిమాలు విజయ్‌తోనే ఉన్నాయి. ∙ మహిళలను వే«ధించడం అన్ని ఇండస్ట్రీస్లోనూ ఉంది. లక్కీగా నాకు ఎంటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో నా కెరీర్ ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. ‘మీటూ’ వంటి ఉద్యమాలు మంచివే. కాస్త ఆలస్యమైందని నా భావన. ఇండస్ట్రీలో మహిళల భద్రతకు సంబంధించి మార్పు రావాల్సిన అవసరం ఉంది. ∙ ఇంటర్లో ఉన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నాను. కానీ ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెయింటింగ్, స్క్రిప్టింగ్ అంటే కూడా ఇష్టం. డైరెక్షన్ చాలా కష్టం. భవిష్యత్తులో సినిమా స్క్రిప్ట్స్ రాస్తానేమో ఇప్పుడే చెప్పలేను. స్పోర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. తెలుగు అర్థం అవుతుంది. మాట్లాడటానికి కాస్త టైమ్ పడుతుంది. ∙ తెలుగులో కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. -
‘టాక్సీవాలా’ సక్సెస్ సెలెబ్రేషన్స్
-
విజయ్‌కి సక్సెస్ కొత్త కాదు
‘‘మేమంతా వెనకుండి కేవలం సపోర్ట్ చేశాం. ‘టాక్సీవాలా’ విజయం యూనిట్ సమిష్టి కృషి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘టాక్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌కి సక్సెస్ కొత్తేమీ కాదు. అతను చాలా సక్సెస్‌లు అందుకున్నాడు. నిర్మాత ఎస్కేఎన్కు ఇది తొలి విజయం. త్వరలో సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా పైరసీ అయినప్పుడు కొత్త టీమ్ కదా అని బాధపడ్డాను. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్ గురించి చెప్పినప్పుడు వంశీ నాకు విజయ్ దేవరకొండని సజెస్ట్ చేశాడు. రాహుల్ చాలా కొత్తగా తీశాడు. ఇంత హైప్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు మారుతి. ‘‘ఆడియో ఫంక్షన్లో థియేటర్స్‌ని నింపమని ప్రేక్షకులను కోరాను. అలా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘ఈ సినిమా టెక్నికల్‌గా సక్సెస్ అయ్యింది అంటున్నారు. అందుకే నా టెక్నికల్ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. వంశీగారు, బన్నీగారు, మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. ‘‘అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, వంశీ, బన్నీలకు థ్యాంక్స్. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’అన్నారు ఎస్కేఎన్. ‘‘ౖపైరసీ అయిన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నవారందరికీ థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక జవాల్కర్. -
‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : టాక్సీవాలా జానర్ : సూపర్ నేచురల్ కామెడీ తారాగణం : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణీ, ఉత్తేజ్ సంగీతం : జాక్స్ బెజోయ్ దర్శకత్వం : రాహుల్ సాంక్రుత్యాయన్ నిర్మాత : ఎస్కేయన్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ కన్నా చాలా రోజుల ముందే ఆన్లైన్ లో రిలీజ్ కావటంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..? కథ ; శివ (విజయ్ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్ ట్రై చేసిన వర్క్ అవుట్ కాకపోవటంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్ ఏంటి..? ఈ కథతో అను (ప్రియాంక జవాల్కర్), శిశిర (మాళవిక నాయర్)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు రాహుల్, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తయారు చేసుకున్న లైన్ కావటంతో లాజిక్ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్ సారంగ్ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ కామెడీ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు గ్రాఫిక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆ సినిమాల్లా హిట్ అవుతుంది
‘‘ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని సైన్స్ ఫిక్షన్ కామెడీని తీసుకుని రాహుల్ ‘టాక్సీవాలా’ తెరకెక్కించారు. తను చెప్పిన కథ అల్లుఅరవింద్గారికి, బన్నీగారికి, నాకు బాగా నచ్చి ఓకే చేశాము. ప్రస్తుతం అన్ని భాషల్లో కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అదేకోవలో మా సినిమా తెరకెక్కింది’’ అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ సినిమాల్లా ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా చిత్రం పైరసీ చూసిన వారంతా మళ్లీ థియేటర్‌కి వెళ్లి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభూతి వస్తుంది’’ అన్నారు. ‘‘సైన్స్ ఫిక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని రాహుల్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేశా’’ అన్నారు మళవికా నాయర్. ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది’’ అని ప్రియాంక జవాల్కర్ అన్నారు. -
వాళ్లు కనిపించని శత్రువులు
‘‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్‌కు ముందు ‘టాక్సీవాలా’కి జరిగినట్లే ఆ సినిమా లీక్ అయ్యుంటే నాకు ‘అర్జున్‌రెడ్డి’ అవకాశం వచ్చేది కాదు. అలాగే ‘పెళ్ళి చూపులు’ థియేటర్స్‌లో సరిగ్గా రిలీజై పెద్ద హిట్ సాధించేది కాదు. నాకు కెరీర్‌నే లేకుండా పోయేది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇంకా ఆడిషన్స్ ఇస్తూ, చాన్స్లకు కోసం ప్రయత్నిస్తూనే ఉండేవాడినేమో. లేకపోతే ప్రొడక్షన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్లిపోయేవాడినేమో. స్టార్డమ్ కోసం చాలా కష్టపడ్డాను’’ అన్నారు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా రూపొందిన సినిమా ‘టాక్సీవాలా’. మాళవికా నాయర్ కీలక పాత్ర చేశారు. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్కేయన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► ‘టాక్సీవాలా’లో యాక్టర్స్ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. మాళవికా నాయర్ పాత్ర సినిమాకి కీలకమైంది. అందుకే ట్రైలర్, టీజర్లో ఆమెను రివీల్ చేయలేకపోయాం. నిజానికి ఆ రోల్‌కి చాలా మందిని అడిగాం. మాళవిక చేయడం బాగా హెల్ప్ అయ్యింది. ► నాకు ఝలక్ తగిలింది ‘నోటా’ వల్ల కాదు... ‘టాక్సీవాలా’ పైరసీ కావడం వల్ల. ఈ సినిమా రైటర్, హీరోయిన్, దర్శకుడు, అందరూ ప్రతిభావంతులే. వీరందరికీ ఇది ఫస్ట్ సినిమా. నేనిప్పుడీ స్థాయిలో ఉండటానికి నా తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’ ఒక కారణం. కానీ వీళ్ల ఫస్ట్ సినిమా లీక్ అవ్వడం బాధగా ఉంది. ► ‘రెండు నెలలు క్రితమే సినిమా మా దగ్గరకు వచ్చింది. రిలీజ్ తర్వాత పెడదాం అనుకున్నాం. కాపీ వేరే వాళ్లు పెట్టడంతో మేం పెడుతున్నాం’ అని నిన్న మొన్న సినిమాను వైరల్ చేసిన వారు లెటర్స్ పెడుతున్నారు. ఈ సైట్స్‌ను కంట్రోల్ చేయలేం. యాంటీ పైరసీ టీమ్ లింక్‌ను తీసేసినా మళ్లీ పెడుతున్నారు. పోర్న్సైట్లను బ్యాన్ చేసినట్లు, పైరసీ సైట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాపై ఆధారపడి చాలా మంది ఉన్నారు. ఈ చిత్రం టీమ్ మెంబర్స్ నాలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లే. రీ రీకార్డింగ్ టైమ్‌లో జేక్స్ వాళ్ల ఫాదర్‌కు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కష్టపడి ఈ సినిమాకు పనిచేశాడు. వాళ్ల నాన్నకు కీమోథెరపీ చేయిస్తూనే జేక్స్ రీ–రీకార్డింగ్ను కంప్లీట్ చేశాడు. ► రిలీజ్‌కి ముందు నా సినిమాలే ఎందుకు లీక్ అవుతున్నాయి? అనిపిస్తుంటుంది. ఇటీవల మా స్కూల్ ఫ్రెండ్స్‌ను లొకేషన్లో మీట్ అయ్యాను. నా సినిమాలు లేని టైమ్‌లో మేం కలిసి ఉన్న ఫొటోలను చూపించారు. 2012–2013 ఫొటోలు అవి. వాటిలో నన్ను నేను చూసుకుని గుర్తు పట్టలేకపోయాను. కెరీర్ ఏంటి? అనే టెన్షన్ ఉండేది. సినిమాలు వస్తాయా? డబ్బులు ఏంటీ? లైఫ్ ఏం అవుతుంది? అని ఆలోచిస్తుండేవాడిని. ఫ్రెండ్స్ నా కోసం ఖర్చు పెట్టేవారు. ఒకప్పుడు సినిమాలు లేవనే టెన్షన్. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు సినిమా ఉంది. అది పైరసీ అవుతుంది. సర్లే.. ఇది బెటర్ కదా అనిపిస్తోంది. ఒక సినిమా అటూ ఇటూ అయితే సేఫ్‌గార్డ్‌గా ఉండగలిగే స్థాయిలో మనం ఉన్నాం అనే ఫీలింగ్ ఉంది. ► థియేటర్స్‌లోకి రాకముందే నీ సినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే పాజిటివ్ యాంగిల్లో ఆలోచించవచ్చు కదా అని నా స్నేహితుడు అన్నాడు. కానీ టీమ్ అందరి లైఫ్స్ ఆధారపడి ఉంటాయి. లీక్ చేసిన వారు కనిపించని శత్రువులు. వారిపై ఎలా పోరాడగలం. ► ‘నోటా’ ప్రమోషన్స్ టైమ్‌లో మా అమ్మ ఆరోగ్యం పాడైంది. హాస్పిటల్‌కి వెళ్లే దారిలో.. అమ్మ గురించి ఆలోచించా. హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలీదు నాకు. ఆ జర్నీలో మెంటల్‌గా యాక్టింగ్‌ను వదిలేశాను. అయినవాళ్లను చూసుకోలేనంతగా బిజీయా? అనిపించింది. నాకు ఈ కేరీర్ వద్దు. డబ్బు వద్దు. ఫేమ్ వద్దు. అన్నీ వదిలేద్దాం అనుకున్నా. మెంటల్‌గా నా ప్రొడ్యూసర్స్‌కి కాల్ చేసి అడ్వాన్సులు రిటర్న్ చేద్దామని అనుకున్నా. యాక్టింగ్‌ను వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హాస్పిటల్‌కి వెళ్లిన తర్వాత అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. ► నేనంటే ఇష్టపడేవారిని కొందరు సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తున్నారు. అందుకే ‘‘నేను చేయబోయే సినిమాలు నాకు తెలుసు. వాళ్లకు తెలీదు. మాట్లాడిన వాళ్లకు సక్సెస్‌తో సమాధానం చెబుదాం’’ అనే పోస్ట్‌ను షేర్ చేశాను. నాపై కొందరు యంగ్ హీరోలు అసూయగా ఉన్నారు అంటే నాకు ఓకే. కానీ ఎవ్వరితో ఎక్కువగా ఏం మాట్లాడను. నేను, నా టీమ్, నా స్కూల్ ఫ్రెండ్స్‌తో ఉంటాను.. అంతే. ► యాక్టర్‌ని అవుతాననుకోలేదు. అయ్యాను. నా ఒకటో తరగతి నుంచే చిరంజీవిసార్ సినిమాలు చూస్తున్నాను. అలాంటిది చిరంజీవిసార్,బన్నీ అన్న నా సినిమాల ప్రీ–రిలీజ్ ఈవెంట్లకు వచ్చి నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి వాటిని మర్చిపోవాలనుకుంటున్నా. నాకు అరవయ్యేళ్లు వచ్చినప్పుడు ఈ వీడియోస్ పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తాను. ► ఒక సినిమా రిలీజైన తర్వాత ఏం జరిగిందో ఆలోచించి నెక్ట్స్ స్టెప్ తీసుకోవాలి. ఇటీవల ‘గీతగోవిందం, టాక్సీవాలా, నోటా’సినిమాలకు ఒకే టైమ్‌లో వర్క్ చేశాను. ఒక టైమ్‌లో ఒక సినిమాపైనే ఫోకస్ పెట్టి తక్కువ సినిమాలు చేద్దామనుకున్నా. కానీ చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎన్నింటికి నో చెప్పినా ఇప్పటికీ ఫుల్ బిజీ వర్క్‌లోనే ఉన్నాను. ‘డియర్ కామ్రేడ్’ సినిమా 30 పర్సెంట్ అయిపోయింది. నా ప్రొడక్షన్ హౌస్ గురించి త్వరలో అనౌన్స్ చేస్తాను. -
‘టాక్సీవాలా’ వచ్చేస్తున్నాడు..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డీలే కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టాక్సీవాలా టీం. -
సింహం సింగిల్‌గా...
ఐదు వందల మంది స్టూడెంట్స్‌తో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. అక్కడికొచ్చిన రజనీ కాంత్ మైక్ అందుకుని స్టూడెంట్స్‌ని ఉద్దేశిస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు. విద్యార్థులంతా రజనీ స్పీచ్‌కి ఇంప్రెస్ అయిపోయి ఈలల కొట్టసాగారు. ఏంటీ రజనీకాంత్ రాజకీయ సభ గురించి ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం షూట్ చేసిన ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నాం. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా త్రిష, మాళవికా మోహనన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. అందులో భాగంగానే సుమారు 500 మంది స్టూడెంట్స్‌కి ఉపన్యాసం ఇస్తున్నటువంటి ఓ సన్నివేశాన్ని షూట్ చేశారట దర్శకుడు కార్తీక్. స్టేజ్ మీద సింహంలా సింగిల్‌గా డైలాగ్స్ పలికే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. మరి సినిమా మొత్తం ప్రొఫెసర్‌గానే రజనీకాంత్ కనిపిస్తారా అంటే? కాదు.. ఫ్లాష్‌బ్యాక్‌లో డాన్‌గా కనిపిస్తారట. విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
నటనతో కంటతడి పెట్టించాడు
‘‘ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు తీస్తున్న సాయి కొర్రపాటిగారికి కంగ్రాట్స్. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ మంచి కంటెంట్‌తో చిత్రాలు తీస్తున్న ఆయనంటే నాకు చాలా గౌరవం. మంచి కథతో వస్తే వారాహి బ్యానర్లో సినిమా చేస్తాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘విజయోత్సవం’ నిర్వహించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడా అనుకున్నా. ఎమోషనల్ సీన్స్‌లో కంట తడి పెట్టించాడు. మురళీశర్మగారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాకేష్ శశి చాలా బాగా తీసాడు. బ్యూటీతో పాటు నటన కనబరచే కథానాయికలంటే నాకు ఇష్టం. మాళవిక వండ్రఫుల్‌గా చేశారు. సినిమా నచ్చబట్టే విజయోత్సవానికి వచ్చా. నేను, నా భార్య స్నేహ సినిమా చూశాం. క్లైమాక్స్ అయిపోయాక నేను ఐదు నిమిషాలు లేవలేదు. ‘దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ ఇన్ మై లైఫ్’’ అన్నారు. ‘‘విజేత’ సినిమా చూసాక కొన్ని వందల మెసేజ్‌లు పంపించారు. తండ్రీ కొడుకుల కథతో జెన్యూన్ గా మంచి సినిమా చేశారని అభినందించారు’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ప్రేక్షకుల స్పందన బాగుంది. ‘చాలా బాగా ఏడ్చా వు’ అన్నది నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్’’ అన్నారు కల్యాణ్ దేవ్. నిర్మాత సాయి కొర్రపాటి, మాళవికా నాయర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్, నటులు మురళీ శర్మ, రాజీవ్ కనకాల, మహేశ్, సుదర్శన్, కిరీటి, భద్రం, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. -
విశ్వనాథ్‌గారి క్లైమాక్స్ గుర్తుకొస్తోంది
‘‘నేను నటించిన ‘విజేత’ టైటిల్‌తో వస్తున్న సినిమా కావడం, కల్యాణ్ నటించడంతో ఈ ‘విజేత’ సినిమాపై నాకు ఉత్సాహం, క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది. సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా’’ అని హీరో చిరంజీవి అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని హీరో చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ‘విజేత’ టీమ్‌ని అభినందించి, విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా ఇమేజ్‌ని మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా ‘విజేత’. ఇప్పుడు ఈ ‘విజేత’ కూడా కుటుంబ విలువలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, వాళ్ల బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పింది. నేటి యువత వేరే ఆకర్షణలతో ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం.. తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోవడం.. పిల్లల భవిష్యత్తుపై పేరెంట్స్ వర్రీ అవుతుండటం మనం చూస్తుంటాం. అలాంటి వారందరికీ ఈ సినిమా ఓ కనువిప్పు. కచ్చితంగా ఈ సినిమా చూడాలి. రాకేశ్ ‘విజేత’ని అద్భుతంగా తెరకెక్కించి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మురళీశర్మ ప్రతి సీన్లో అత్యద్భుతంగా నటించి వావ్ అనిపించాడు. క్లైమాక్స్‌లో ఆయన హావభావాలు చూసి తోటి నటుడిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నటుడికి న్యాయం అంటూ జరిగితే ఈ సినిమాకి ఉత్తమ క్యారెక్టర్ అవార్డు మురళీశర్మకి రావాలి, వస్తుందనే నమ్మకం ఉంది. తనకు మంచి భవిష్యత్తు ఉందని కల్యాణ్ ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ‘విజేత’కి కెమెరామెన్ సెంథిల్‌గారు పెద్ద ఎస్సెట్. సాయిగారిని చూస్తే నిర్మాత అంటే ఇలా ఉండాలనిపిస్తోంది. సినిమా చూసి బయటికొచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్‌లో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. ఎమోషన్ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ్‌గారి చిత్రాల్లోని క్లైమాక్స్ గుర్తొచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేసేటప్పుడు నేను మురళీశర్మని, యాక్టర్‌ని అనే విషయం మరచిపోయా. క్లైమాక్స్‌లో నిజంగానే ఏడ్చేశా. ఈ చిత్రాన్ని మా నాన్నకు అంకితం చేస్తున్నా. ఆయనే నా హీరో’’ అన్నారు మురళీశర్మ. ‘‘చూసిన వారందరూ మంచి సినిమా అని అభినందిస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు రాకేశ్ శశి. ‘‘ఇంత మంచి కథతో నా కెరీర్ స్టార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. వారాహి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కల్యాణ్ దేవ్. నిర్మాత సాయి కొర్రపాటి, కెమెరామెన్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. -
చిరంజీవి చెప్పిందే జరిగింది!
సాక్షి, హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన హీరో కల్యాణ్ దేవ్. రాకేశ్ శశి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తాజాగా విడుదలై పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘విజేత’.. నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం సాయంత్రం అల్లుడు కల్యాణ్ దేవ్ తెరంగేట్రం చేసిన విజేత మూవీని చిరంజీవి వీక్షించారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడిని మెగాస్టార్ ప్రశంసించారని, తొలి సినిమా అయినా కల్యాణ్ దేవ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించారని చిరు కితాబిచ్చినట్లు సమాచారం. చిరుతో పాటు కల్యాణ్ దేవ్, నిర్మాత అల్లు అరవింద్, మురళీ శర్మ, మూవీ యూనిట్ సభ్యులు ‘విజేత’ స్పెషల్ షో చూశారు. యంగ్ హీరో కల్యాణ్ దేవ్ కెరీర్ సజావుగా సాగాలని వారు ఆకాంక్షించారు. కాగా, యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన ఒక వారానికే విజేత ఆఫర్ వచ్చిందని, కథను మామయ్యకి చెప్పగానే చాలా బాగా నచ్చిందన్నారని కల్యాణ్ దేవ్ ఇటీవల తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని కల్యాణ్ దేవ్‌తో మెగాస్టార్ చెప్పిన మాటలు నిజమయ్యాయని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో మురళీ శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీలో కల్యాణ్ దేవ్‌కు జోడీగా మాళవికా నాయర్ నటించారు. సంబంధిత కథనాలు మెగా అల్లుడి ‘విజేత’ మూవీ రివ్యూ కథ విని చిరంజీవిగారు అలా అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘విజేత’ మూవీ రివ్యూ
టైటిల్ : విజేత జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్ సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్ దర్శకత్వం : రాకేష్ శశి నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా..? తొలి సినిమాతో కల్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్ ముందు విజేతగా నిలిచాడా..? కథ; రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. కానీ ఈ బాధ్యతలేవి పట్టని రామ్, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అల్లరి చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) రామ్ చేసిన ఓ పని కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్ చేసిన అల్లరి పనుల కారణంగా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా సహాయం చేయడు. చివరకు ఎలాగోలా తండ్రిని కాపాడుకున్న రామ్ ఎలాగైన జీవితంలో నిలబడాలనుకుంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్గా మాళవిక నాయర్ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్ ప్లస్ పాయింట్ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్, నోయల్, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ; మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్ శశి ఆ పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్ తనదైన టేకింగ్ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మలిచాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాల్లో రామ్ పాత్ర ఈ జనరేషన్ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్ చూపించాడు. సెంథిల్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. నిర్మాత సాయి కొర్రపాటి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; ఫస్ట్ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మరో విజేత
-
మామయ్య చేతుల మీదగా సర్టిఫికెట్ తీసుకున్నా
‘‘మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నా అనే టెన్షన్‌ని ప్రెషర్లా భావించకుండా ప్లెజర్లా తీసుకొని ఈ సినిమా చేశాను. చిరంజీవిగారు సినిమా చూడలేదు. రషెస్ మాత్రమే చూశారు. సినిమా ఇవాళ రిలీజ్ అవుతుంది. మొన్నటిదాకా చాలా టెన్షన్‌గా ఉండేది. నిన్నటి నుంచి ఎగై్జట్‌మెంట్‌గా ఉంది’’ అన్నారు కల్యాణ్ దేవ్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించారు. మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ► నాకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇంట్రెస్ట్. మా పేరెంట్స్ బాగా ప్రోత్సహించేవారు. స్కూల్ డేస్‌లో స్కెచ్చింగ్, డ్యాన్స్, డ్రామాల్లో చురుకుగా పాల్గొనేవాణ్ని. స్కూల్లో ఓసారి చిరంజీవిగారి చేతుల మీదగా సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను. ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే అది కుదర్లేదు. ► ‘విజేత’ సినిమా చేసే ముందు ఇండస్ట్రీలో నిలబడాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనే లాంగ్ టెర్మ్ గోల్స్ ఏం ఆలోచించలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన ఒక వారానికే ఈ ఆఫర్ వచ్చింది. విన్న వెంటనే నచ్చింది. ఒక కథ ఉంది అని మామయ్యగారికి చెప్పగానే ఆయన కూడా విన్నారు. ఆయనకూ చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పిన ఒకే ఒక్క సజెషన్.. ఇందులో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని. అంతకు మించి ఏమీ చెప్పలేదు. ► చిరంజీవిగారికి ఉన్న ఎక్స్పీరియన్స్ మనందరికీ తెలిసిందే. నాకు కథ నచ్చింది, ఆయన కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో కళ్లు మూసుకొని ఈ సినిమా చేసేశాను. మన పక్కింటి కుర్రాడిలా ఉంటుంది నా పాత్ర. ఆకతాయిగా ఏ లక్ష్యం లేకుండా తిరిగే పాత్ర నాది. రొటీన్ లైన్ అయినప్పటికీ చాలా ఫ్రెష్‌గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ రాకేశ్. ► సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్‌డే ఏమీ అనిపించలేదు కానీసెకండ్ డే చాలా నెర్వస్‌గా అనిపించింది. రెండు పేజీల డైలాగ్ చెప్పాలి. మెల్లి మెల్లిగా వారానికి సెట్ అయిపోయాను. ► సత్యానంద్‌గారి దగ్గర ట్రైన్ అవుతున్నప్పుడు మా బ్యాచ్ ఫొటోలు పంపించారు. దాంట్లో సాయి కొర్రపాటిగారు నన్ను సెలెక్ట్ చేశారు. ‘ఈ కుర్రాడివి ఇంకొన్ని ఫొటోలు పంపించండి’ అంటే సత్యానంద్‌గారు చిరంజీవిగారి అల్లుడు అని చెబితే మామయ్యని అప్రోచ్ అయ్యారు. బిజినెస్, సినిమా ఏది ఈజీ అంటే ప్రస్తుతానికి సినిమాలు అంటానేమో. ► నెక్ట్స్ సినిమా ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకే జానర్‌కి స్టిక్ అయిపోవాలని లేదు. -
‘విజేత’ కల్యాణ్ కోసం రాసిన కథ కాదు!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 2015లో జతకలిసే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాకేష్ శశి డైరెక్షన్లో ‘విజేత’ సినిమాతో కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజేత సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు రాకేష్ శశి మీడియాతో పంచుకున్నారు. తొలిచిత్రం ‘జతకలిసే’ సమయంలోనే సాయి కొర్రపాటి గారితో పరిచయం ఏర్పడింది. అప్పడే వారాహి చలనచిత్రం బ్యానర్లో సినిమా చేయాలన్నారు. ఈ లోగా సాయి గారు ఇతర సినిమాల్లో బిజీ కావటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఫైనల్‌గా మూడేళ్ల తరువాత విజేతతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. విజేత, కల్యాణ్ దేవ్ కోసం రాసుకున్న కథ కాదు. ముందే కథ తయారు చేసుకున్నాం. హీరో కోసం వెతుకుతున్న సమయంలో వైజాగ్ సత్యానంద్ గారి ద్వారా కల్యాణ్ గురించి తెలిసింది. కల్యాణ్‌ను మా సినిమా ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. కల్యాణ్ రిచ్ ఫ్యామిలీలో పెరిగారు. మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం చాలా హోం వర్క్ చేశారు. సినిమా కథ.. టీజర్, ట్రైలర్లలో చూపించినట్టుగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుంది. అంతేకాదు మధ్య తరగతి కుటుంబాల్లోని అనుబంధాలు, ప్రేమలు, కష్టాలు, సర్థుబాట్లు అన్నిచూపించాం. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంతో విజేత కనెక్ట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. శ్రీనివాస రావు అనే ఫ్యాక్టరీ ఎంప్లాయ్ ఆయన కొడుకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి రామ్‌ల మధ్య జరిగే కథే విజేత. తండ్రి ఆశయం నిలబెట్టే కొడుకు కథ ఇది. అయితే గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా విజేత కొత్తగా అనిపిస్తుంది. సమాజంలోని 90 శాతం మంది జీవితాలను మా సినిమా ప్రతిభింబిస్తుంది. ఓ గొప్ప వ్యక్తి గెలుపు కన్నా, సామాన్యుడి విజయాన్ని ప్రేక్షకుల ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సామాన్యుడి కథే విజేత. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. కల్యాణ్ తో సినిమా అనుకున్న తరువాత సాయి గారితో కలిసి చిరంజీవి గారికి కథ వినిపించాం. పూర్తి స్క్రిప్ట్ (స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో సహా) విన్న తరువాతే చిరంజీవి గారు ఓకె చెప్పారు. ఆ తరువాతే సినిమా మొదలైంది. టైటిల్ తప్ప చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన అంశాలేవి విజేతలో కనిపించవు. ఇది పూర్తిగా కల్యాణ్ సినిమాలాగే ఉంటుంది. చిరంజీవి గారికి కథ వినిపించాలన్న కోరిక ఉండేది. ఆయనతో సినిమా చేయకపోయినా.. నా రెండో సినిమాకే ఆయనకు కథ వినిపించే అవకాశం రావటం ఆనందంగా ఉంది. గత చిత్రాల్లో మాళవిక నటన నాకు చాలా బాగా నచ్చింది. విజేతలో హీరోయిన్ పాత్రకు ఆమె అయితే పర్ఫెక్ట్ అన్న నమ్మకంతో ఆమెను సెలెక్ట్ చేసుకున్నాం. మా నమ్మకాన్ని మాళవిక నిలబెట్టారు. సినిమాలో ఆమె స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 12 ఏళ్ల వయసుల్లో మా ఫాదర్ చనిపోయారు. చిన్నతనంలో ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుక మేం చాలా కష్టపడ్డాం. అలాంటి సందర్భాలు సినిమాలో ప్రతిభింబిస్తాయి. పూర్తిగా అదే నేపథ్యం మాత్రం కాదు. తరుపరి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం విజేత రిలీజ్, రిజల్ట్కోసం ఎదురు చూస్తున్నాం. -
కథకు ప్లస్ అయ్యే క్యారెక్టర్సే ఇష్టం
‘‘నేను ఇప్పటి వరకు చేసిన ప్రతీ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే, మహానటి’ ఇలా సినిమా సినిమాకు డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. సినిమాలో నా పాత్ర వల్ల కథకు ప్లస్ అవ్వాలని కోరుకుంటాను. అందుకే క్యారెక్టర్స్ ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అని మాళవికా నాయర్ అన్నారు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందించిన చిత్రం ‘విజేత’. ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ– ‘‘విజేత’ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. చేసే పనిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్న క్యారెక్టర్. నా పాత్రకు కంప్లీట్ అపోజిట్‌గా కల్యాణ్ పాత్ర ఉంటుంది. జులాయిగా, ఏ లక్ష్యం లేకుండా తిరుగుతుంటాడు. కల్యాణ్ దేవ్ చాలా హానెస్ట్. సింపుల్‌గా ఉంటాడు. శ్రీజ సెట్స్‌కి వచ్చేవారు. జనరల్‌గా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. కానీ ఈ సినిమాలో చెప్పుకోవడం కుదరలేదు. ఫ్యూచర్లో నా గొంతే వినపించడానికి ట్రై చేస్తాను. నా పదో తరగతి నుంచే యాక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. మూవీస్‌ను, స్టడీస్‌ను బాలెన్స్ చేస్తున్నాను. స్విమ్మింగ్ బాగా చేస్తాను. మా కాలేజ్ తరఫున స్విమ్మింగ్ ప్లేయర్‌ని. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ మొదటి భార్య అలమేలుగా నటించాను. పాత్ర చాలా చిన్నది, డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అయినా సావిత్రి గారి బయోపిక్కు నో అని ఎవరు చెప్తారు? ఆల్రెడీ నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేయడం కూడా ఓ కారణం. హీరోయిన్స్‌లో నేను రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యేది మలయాళ నటి పార్వతిని. క్యారెక్టర్ క్యారెక్టర్‌కి తను భలే మారిపోతుంది. చేసే ప్రతి పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని, రీసెర్చ్ చేసి చేస్తుంది. ‘మహానటి’ సినిమాలో ‘అలమేలు’ పాత్రకు నేను కూడా బాగా రీసెర్చ్ చేశాను. విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
‘విజేత’కు క్లీన్ యూ
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నాటి సూపర్ హిట్ మూవీ ‘విజేత’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య జరిగే సన్నివేశాలే హైలెట్‌గా నిలవనున్నాయి. విజేత ట్రైలర్, సాంగ్స్‌కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. -
హిట్ గ్యారంటీ... గో ఎహెడ్ అన్నాను
‘‘చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని నాతో కల్యాణ్ దేవ్ ఓసారి చెప్పాడు. ‘సినిమా అన్నది మహా సముద్రం లాంటిది. ఎంత మందినైనా తనలో చేర్చుకుంటుంది. సినిమాకు మనం ఏం ఇస్తున్నాం? అన్నదాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గ్లామర్ ఉంది. నీలో ఆ జోష్ ఉందా? లేదా? తపన ఉందా? లేదా? ఎంత స్థాయిలో ఉంది? అన్నదాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని చెప్పాను’’ అన్నారు చిరంజీవి. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘విజేత’ టైటిల్ పెట్టిన వెంటనే నేను చేసిన ‘విజేత’ గుర్తుకు వచ్చింది. ఆ కథకు, ఈ కథకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఫస్ట్ హియరింగ్‌లోనే చాలా నచ్చింది. ‘చక్కటి కుటుంబ కథా చిత్రం. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్షిప్ మనసుకు హత్తుకునేలా ఉంది. కచ్చితంగా సక్సెస్ అవుతుంది. గో ఎహెడ్’ అన్నాను. అప్పట్లో మాస్ యాక్షన్ సినిమాలు చేసేప్పుడు అరవింద్‌గారు నాకు ‘విజేత’ కథ వినిపించినప్పుడు కొంచెం బెరుకుగా అనిపించింది. అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనుకున్నాను. ఆ సినిమా కొత్త ఆడియన్స్ కోసం, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేశాం. అంతకంత ఆదరణ లభించింది. ఎలాంటి ఇమేజ్ లేని కల్యాణ్‌కు కొత్త ఆడి యన్స్, అభిమానం లభిస్తుందని నమ్ముతున్నాను. కంట తడి పెట్టించే సీన్స్ రాకేశ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తన మార్క్‌తో ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. దర్శక–నిర్మాతలు అమ్మ, నాన్నలు లాంటి వాళ్లు అంటారు. రాను రాను నిర్మాత పాత్ర క్యాషియర్లాగా అయిపోయింది. డబ్బులు పెట్టడం తప్ప తను ఇన్వాల్వ్ అవ్వడం కానీ, తనని ఇన్వాల్వ్ చేయడం కానీ లేదు. ఇలాంటి రోజుల్లో సాయిగారు కథల్లో మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఈ కథను ఎంతమందికి అందించగలం? ఆడియన్స్‌ని ఎలా అలరించాలి? మన బ్యానర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించే నిర్మాత కొర్రపాటి సాయిగారు. ఆయన తీసిన ‘ఈగ’, జో అచ్యుతానంద, లెజెండ్’ చాలా బావుంటాయి. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. సెంథిల్ కెమెరా అంటే విజువల్స్ పరంగా చూసుకునే పని ఉండదు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ‘కొ కొ కోడి...’ నా ఫేవరేట్ సాంగ్. సినిమాల్లోకి ఎవరూ వెల్కమ్ చేయరు. ట్రైనింగ్ తీసుకుని ప్రయత్నించు అని కల్యాణ్‌తో అన్నాను. సత్యానంద్ దగ్గర తీసుకున్నాడు. ట్రైనింగ్‌లో ప్లస్‌లు మైనస్‌లు తెలుసుకున్నాడు. ఎంతో పరిణితితో చేశాడు. డ్యాన్స్ బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ చెప్పనక్కర్లేదు. రాకేశ్ తనకు కావల్సింది రాబట్టాడు. మాళవికా కొంటెగా, ఇంటెన్స్‌గా చేసింది. ఇందాక రాజమౌళి చెప్పినట్టు ఆ ‘విజేత’ ఎంత సక్సెస్ ఆయ్యిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాను జూలై 12న విడుదల చేస్తున్నాం. తేజ్ సినిమా 6న ఉంది. అభిమానులు ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు. వాడికీ ఆశీస్సులు లభిస్తాయి. కల్యాణ్‌కీ ఆశీస్సులు లభిస్తాయి’’ అన్నారు. కల్యాణ్ దేవ్ మాట్లాడుతూ – ‘‘సాయిగారు చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను వాళ్ల లాగే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. రాకేశ్‌కి క్లారిటీ ఉంది. ప్రతీ ఫ్రేమ్ బాగా తీశారు. సెంథిల్‌గారు చాలా కూల్. మ్యూజిక్ హర్షవర్థన్ రామేశ్వర్ అమేజింగ్ ఆల్బమ్ ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు మంచి యాక్టర్, డ్యాన్సర్, ఫైటర్. అది అందరికీ తెలిసిందే. ఆయన స్టోరీని బాగా జడ్జ్ చేయగలుగుతారు. స్టోరీ విన్న వెంటనే ఏది తగ్గించాలి? పెంచాలి అని చెబుతారు. ‘మగధీర’ కథ ఫస్ట్ చిరంజీవిగారికే చెప్పాను. ఆయన అప్రూవ్ తీసుకొనే చేశాం. ఈ సినిమా కూడా ఆయనకు నచ్చాకే చేశారు. అదే బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో సాయిగారు ఎక్కడా తగ్గలేదు. సాంగ్స్ చాలా బావున్నాయి. అప్పుడు ‘విజేత’ చిరంజీవిగారికి ఎంత సక్సెస్ తెచ్చిందో, ఈ సినిమా కూడా కల్యాణ్‌కి అంతే సక్సెస్ తేవాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి వరుసగా యాక్షన్ పిక్చర్స్ చేస్తున్నపుడు ‘విజేత’ సినిమా కథ విన్నాను. నచ్చింది చేయాలనుకున్నాను. చిరంజీవిని అడిగితే ‘నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాత సాయిగారు కొత్త టాలెంట్ ఎక్కడున్నా వెతికి సినిమా నిర్మిస్తుంటారు. అటువంటి నిర్మాతలు మనకి ఉండాలి. మెగా కుటుంబం నుంచి ఎవరు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నా ఒక ధైర్యం చిరంజీవిగారి అభిమానులు. దానికి హీరోలు టాలెంట్‌ని యాడ్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. కల్యాణ్ కూడా అలాంటి టాలెంట్‌తో సక్సెస్ అందుకుంటాడని ఆశీస్తూ, ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. రాకేశ్ శశి మాట్లాడుతూ– ‘‘కథ మొదలుపెట్టక ముందు ‘మన కథే హీరోని తీసుకురావాలి’ అని సాయిగారు నాతో అన్నారు. ఆ కథే మమ్మల్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకువెళ్ళింది. చిరంజీవి అల్లుణ్ణి సినిమాలో హీరోని చేసింది. చిరంజీవిగారి ముందు కూర్చుని కథ చెప్పినప్పుడు నాలో ఉన్న ఎమోషన్ జీవితాంతం గుర్తుంటుంది. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోని ఎంత బాగా ప్రజెంట్ చేయాలో అంత బాగా ట్రై చేశాం. ఈ చిత్రంలో కల్యాణ్ చేసిన క్యారెక్టర్‌కి, రియల్ లైఫ్ పర్శనాలిటీకి చాలా తేడా ఉంది. తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం’’ అన్నారు.కీరవాణి మాట్లాడుతూ – ‘‘మన హృదయాల్ని గెలుచుకుని శాశ్వత విజేతగా నిలిచిపోయిన చిరంజీవిలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు అలానే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సాయిగారు మా ఫ్యామిలీ మెంబర్‌లాగా. ఈ సినిమాతో కల్యాణ్ దేవ్‌కి మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను. రామేశ్వర్ మంచి కంపోజర్’’ అన్నారు. -
అల్లుడు ఆడియోకి అతిథి
చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. ఆ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కానున్నారు. రాకేశ్ శశి దర్శకత్వంలో వారాహి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. మామ మూవీ టైటిల్‌తో, ఆయనే ముఖ్య అతిథిగా వస్తున్న ఈ ఫంక్షన్ అల్లుడికి సూపర్ స్పెషల్‌గా ఉండబోతుందని ఊహించవచ్చు. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) 1 నేనొక్కడినే బి) బిజినెస్ మేన్ సి) పోకిరి డి) ఖలేజా 2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్... ఈ మూడు పురస్కారాలను దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్ 3. ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) షెర్లిన్ చోప్రా బి) సన్నీ లియోన్ సి) మల్లికా శెరావత్ డి) పూనమ్ పాండే 4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) శ్రుతీహాసన్ బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) అదితీరావ్ హైదరీ 5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు? ఎ) నాగిరెడ్డి–చక్రపాణి బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ డి) డి. రామానాయుడు 6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్ రాసిన రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది) ఎ) అబ్బూరి రవి బి) కోన వెంకట్ సి) మేర్లపాక గాంధీ డి) బుర్రా సాయిమాధవ్ 7. బాలీవుడ్లో నానాపటేకర్ నటించిన ‘క్రాంతివీర్’ తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శోభన్ బాబు బి) మోహన్ బాబు సి) నాగార్జున డి) వెంకటేశ్ 8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’ అనే పాటను రాసింది పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కోడి రామకృష్ణ సి) కె. రాఘవేంద్ర రావు డి) దాసరి నారాయణరావు 9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్గా నటించిన హీరోయిన్ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శారద బి) జయప్రద సి) విజయశాంతి డి) జయసుధ 10. ‘చారులత’ సినిమాలో అవిభక్త కవలలుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అంజలి బి) ప్రియమణì æ సి) స్నేహ డి) హన్సిక 11. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి? ఎ) 12 బి) 15 సి) 18 డి) 19 12. వేల్ రికార్డ్స్ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి. ఎ) వల్లీ బి) రమా సి) సునీత డి) కౌసల్య 13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ‘క్వీన్’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో? ఎ) సందీప్ కిషన్ బి) నాగశౌర్య సి) నాని డి) నాగచైతన్య 14. నాగార్జున, అమల వివాహ తేదీ జూన్ 11. ఏ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది? ఎ) 1990 బి) 1989 సి) 1995 డి) 1992 15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) తమన్నా సి) సోనాల్ చౌహాన్ డి) మాళవికా శర్మ 16. ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్.యస్. తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) సాయి కార్తీక్ 17. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) కత్రినా కైఫ్ సి) ఆలియా భట్ డి) డయానా పెంటీ 18. 1961లో ఎన్టీఆర్ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా. ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కాంతారావు డి) యస్వీ రంగారావు 19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) నిత్యామీనన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) ఆలియా భట్ డి) శోభన 20. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పుకోండి? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మకథ సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
వచ్చే నెలలో విజేత
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్ కథనాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్లో కాలేజ్‌లో జరిగే ఇంటర్వ్యూల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాటలు మినహా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. సినిమాను జూలైలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. చిరంజీవిగారి అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. రాకేశ్ శశి బాగా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని పేర్కొంది చిత్రబృందం. తనికెళ్ల భరణి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
విజేత వచ్చేశాడు
చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా ‘విజేత’. ఇందులో మాళవిక నాయర్ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. సాయి కొర్రపాటి మాట్లాడుతూ–‘‘కల్యాణ్‌దేవ్ తొలి సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘విజేత’ టైటిల్‌ను ఆయన అల్లుడు కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్. చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసి, జూలైలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు. తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కల్యాణి నటరాజన్ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
‘విజేత’గా వస్తున్న చిరు చిన్నల్లుడు
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం. టైటిల్ లోగోను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్ -
‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అప్పటికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు రిలీజ్ చేస్తే సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్మోహనం’ సినిమాతో విజయ్ పోటి పడాల్సి వస్తుంది. త్వరలోనే టాక్సీవాలా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
క్రేజీవాలా
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో జిఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ పతాకంపై ఎస్.కె.ఎన్. నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ రెండవ వారంలో విడుదల చేయనున్నారు. నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ– ‘‘విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం నిర్మించాం. విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ‘టాక్సీవాలా’లో క్యారెక్టర్‌ను రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించాం’’ అన్నారు. కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. -
నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే...
‘ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తో్తంది’ అంటూ ప్రారంభమయ్యే ‘నేల టిక్కెట్టు’ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి హిట్ చిత్రాల తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఎస్ఆర్టి ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం.. అది కదరా లైఫ్... ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు... ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ వంటి అర్థవంతమైన డైలాగులు ఒకవైపు.. ‘నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా. ఇదే మూడ్ మెయిన్టైన్ చెయ్... నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’... వంటి రవితేజ మార్కు మాస్ డైలాగులు మరోవైపు... మొత్తంగా ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. -
మహానటి స్పెషల్ స్క్రీన్ టెస్ట్
1 దర్శకుడిగా ‘మహానటి’ నాగ్ అశ్విన్‌కి రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) పెళ్ళిచూపులు బి) ఘాజీ సి) అర్జున్ రెడ్డి డి) ఎవడే సుబ్రమణ్యం 2 సావిత్రి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ హీరో కాకముందు సినీ పరిశ్రమలో ఏ శాఖలో పని చేసేవారు? ఎ) దర్శకుడు బి) ఎడిటర్ సి) సింగర్ డి) కాస్టింగ్ మేనేజర్ 3 ‘మహానటి’ చిత్రంలో సావిత్రి స్నేహితురాలు సుశీలగా నటించిన నటి ఎవరో తెలుసా? ఆమె గతేడాది నటించిన ఓ తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్? ఎ) షాలినీ పాండే బి) సమంత సి) అనుష్క డి) మాళవికా నాయర్ 4 సావిత్రి మొదట మద్రాసులో అడుగుపెట్టినప్పుడు ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నటించారు. అయితే హీరోయిన్గా కాదు. ఆ సినిమా పేరేంటి? ఎ) పాతాళభైరవి బి) సంసారం సి) పలలెటూరి పిల్ల డి) అర్ధాంగి 5 1957లో వచ్చిన ‘మాయా బజార్’ చిత్రంలో సావిత్రి ఓ పాత్రను అనుకరించారు. ఆమె ఏ పాత్రను అనుకరించారో తెలుసా? ఎ) కృష్ణుడు బి) అర్జునుడు సి) అభిమన్యుడు డి) ఘటోత్కచుడు 6 అక్కినేని నాగేశ్వరరావుతో సావిత్రి నటించిన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) వేదాంతం రాఘవయ్య బి) ఘంటసాల బలరామయ్య సి) విఠలాచార్య డి) కమలాకర కామేశ్వరరావు 7 ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ‘తొడరి’ అనే ఓ తమిళ సినిమా చూస్తున్నప్పుడు కీర్తీ సురేశ్‌ను సావిత్రిలా ఊహించుకున్నారట. ఆ తమిళ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) బాబీ సింహ బి) శివ కార్తికేయన్ సి) ధనుష్ డి) సూర్య 8 1962వ సంవత్సరంలో ‘సావిత్రి గణేశ్’ పేరు మీద ‘వడ్డివారి పాలెం’అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. అది ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) నెల్లూరు జిల్లా బి) కృష్ణా జిల్లా సి) గుంటూరు జిల్లా డి) చిత్తూరు జిల్లా 9 ‘మహానటి’ కథ వినమని ఓ హీరో కీర్తీ సురేశ్‌ను రికమెండ్ చేసి, ఆ చిత్రదర్శకుణ్ణి ఆమెకి పరిచయం చేశారు. సినిమా రిలీజైన తర్వాత ఆ హీరోకు కృతజ్ఞతలు తెలిపారామె. ఆ తెలుగు హీరో ఎవరు? ఎ) విజయ్ దేవరకొండ బి) నానీ సి) రామ్ డి) దుల్కర్ సల్మాన్ 10 సావిత్రి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పేరేంటో తెలుసా? ఎ) చిన్నారి పాపలు బి) మాతృదేవత సి) చిరంజీవి డి) వింత సంసారం 11 సినిమాల్లోకి రాకముందు సావిత్రి ఓ నాటక సమాజంలో డాన్స్ చేసేవారు. ఆ నాటక సమాజ యజమాని తర్వాతి కాలంలో సినిమాల్లో అద్భుతంగా రాణించిన నటుడు. ఎవరా నాటక సంఘ యజమాని? ఎ) గుమ్మడి బి)చిత్తూరు వి.నాగయ్య సి) ఎస్వీ. రంగారావు డి) కొంగర జగ్గయ్య 12 ‘మహానటి’లో ఓ సీన్లో యస్వీ రంగారావు పాత్రను చేసిన మోహన్‌బాబు సావిత్రి పాత్రధారి కీర్తీ సురేశ్‌కు ఓ సీన్లో భోజనం పెట్టించినట్లు చూపిస్తారు. కానీ ఒరిజినల్‌గా ఆ టైమ్‌లో భోజనం పెట్టింది వేరే నటుడని కొందరు అంటున్నారు. వాళ్లు చెప్పిన ఆ నటుడెవరు? ఎ) రమణా రెడ్డి బి) గుమ్మడి సి) రేలంగి డి) కాంతారావు 13 సావిత్రి భర్త జెమినీ గణేశన్ అసలు పేరు ‘రామస్వామి గణేశన్’. ఆమె ఆయన్ని ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నారో తెలుసా? ఎ) 1950 బి) 1951 సి) 1952 డి) 1954 14 1960వ సంవత్సరంలో సావిత్రి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆమెకు అవార్డు తెచ్చిన ఆ సినిమా పేరేంటో తెలుసా? ఎ) చివరకు మిగిలేది బి) తొలిప్రేమ సి) బాంధవ్యాలు డి) మూగజీవులు 15 ‘మహానటి’ చిత్రంలో కె.వి. చౌదరి పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) మోహన్ బాబు బి) రాజేంద్ర ప్రసాద్ సి) నాగచైతన్య డి) క్రిష్ 16 సావిత్రి ఏ సంవత్సరంలో తనువు చాలించారో తెలుసా? ఎ) 1978 బి) 1991 సి) 1988 డి) 1981 17 సావిత్రి భర్త జెమినీ గణేశన్ ఆమెని ఏమని పిలిచేవారో కనుక్కోండి? ఎ) శ్రీమతి గారు బి) అమ్మణి సి) అమ్మాడి డి) బేబి 18 దిగ్దర్శకుడు కె.వి రెడ్డి ఓ చిన్న డాన్స్ సీక్వెన్స్‌లో నటించటానికి సావిత్రిని ఆడిషన్ చేశారు. అది చాలా చిన్న పాత్ర. అది ఏ సినిమా కోసమో తెలుసా? ఎ) రూపవతి బి) దేవదాసు సి) పాతాళభైరవి డి) ఆదర్శం 19 ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు మొదట అనుకున్న నటి సావిత్రి కాదు. మరి ఆ నటెవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) భానుమతి సి) అంజలీదేవి డి) జమున 20 సావిత్రి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మూగ మనసులు బి) చదువుకున్న అమ్మాయిలు సి) డాక్టర్ చక్రవర్తి డి) తోడి కోడళ్లు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (డి) 2) (డి) 3) (ఎ)4) (బి) 5) (డి) 6) (ఎ) 7) (సి) 8) (సి) 9) (బి) 10) ఎ 11) (డి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (డి) 17) (సి)18) (సి) 19) (ఎ)20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
డబ్బింగ్ మొదలెట్టిన చిరు చిన్నల్లుడు
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర మీద సందడి చేయనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
‘టాక్సీవాలా’ వాయిదా..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించకపోవటంతో ముందుగా ప్రకటించిన సమయానికి టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినా.. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావటానికి మరింత సమయం పట్టనుందట. అందుకే సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇంతవరకు ప్రమోషన్ హడావిడి కనిపించకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక జువాల్కర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
మహానటిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది
-
క్రేజ్‌కి తగ్గట్టుగా...
‘అర్జున్ రెడ్డి’ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నూతన దర్శుకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జిఏ2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఎస్.కే.యన్ నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తన క్యారెక్టర్‌ను డెవలప్ చేశాడు దర్శకుడు రాహుల్. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. సినిమా టీమ్ అంతా చాలా బాగా వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 18న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమాకు చక్కని టైటిల్, అలాగే ఫస్ట్ లుక్‌ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: సుజిత్ సారంగ్. -
అల్లుడు ఆన్ లొకేషన్
మెగా అల్లుడు ఇన్ యాక్షన్. యస్... హీరోగా బుధవారం చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ యాక్షన్ మొదలు పెట్టారు. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్ దేవ్ పరిచయం అవుతున్న ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాకేశ్ శశి ప్రిపేర్ చేసిన బ్యూటిపుల్ స్క్రిప్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ కెమెరామేన్ సెంథిల్ ఈ సినిమాకు పని చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో కల్యాణ్‌తో పాటు కీలక నటీనటుల పాల్గొంటారు’’ అని అన్నారు. ఈ సినిమాకు సమర్పణ: సాయి శివాని, సంగీతం: యోగేష్, సాహిత్యం: రెహమాన్. -
మహానటిలో మరో హీరోయిన్..!
అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా రోజుకో వార్తతో ఆసక్తి కలిగిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ లాంటి తారలు నటిస్తున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి జంట విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈలిస్ట్ లో తాజాగా మరో హీరోయిన్ చేరింది. నాగ అశ్విన్ తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవికా నాయర్ మహానటిలో అతిథి పాత్రలో నటించనుందట. నిడివి తక్కువే అయినా.. మాళవిక పాత్ర ఎంతో కీలకమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెరనిండుగా తారలతో కనిపిస్తున్న మహానటిలో ముందు ముందు ఇంకెంత మంది తారలు తళుక్కుమంటారో చూడాలి. -
అలాంటి ఆశలు లేవు
కోలీవుడ్‌లో ‘కుక్కూ’ చిత్రంతో అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్న అందాల తార మాలవిక నాయర్. ఆ చిత్రంలో అంధ యువతిగా, సహజ నటనతో ఆకట్టుకుంది. జాతీయ పురస్కార స్థాయికి మంచి టాక్ తెచ్చుకుంది. కుక్కూ చిత్రం విజయం తర్వాత అమ్మడు తమిళంలో చక్కర్లు కొడతారని అందరూ అనుకుంటే ఆమె మాత్రం చదువుకోవాలి అంటూ సినిమాలకు టాటా చెప్పి ఢిల్లీ వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ నటించడానికి వచ్చింది. అమ్మడు ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ అనే చిత్రంలో యువ హీరో వీరాకు జోడీగా నటిస్తోంది. పచ్చైకిళి ముత్తుచ్చరం, వారణం ఆయిరం, నడునిసి నాయ్గల్, రాజతందిరం చిత్రాల్లో వీరా నటించాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ చిత్రానికి హరికరన్ దర్శకత్వం వహిస్తున్నారు. జలందర్ వాసన్ స్క్రీన్ ప్లే చేస్తున్నారు. మెల్ట్ బ్లూస్ బృందం సంగీతం సమకూరుస్తున్నారు. నటించడానికి తిరిగొచ్చిన విషయం గురించి మాలవిక మాటల్లోనే ‘మా కుటుంబంలో అందరూ చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందువల్ల నాకు కూడా చదువుపైనే అధిక ఆసక్తి. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు అన్ని సెలవుల్లో వచ్చి నటించినవే. ‘కుక్కూ’ చిత్రం కూడా పదో తరగతి వేసవి సెలవుల్లో వచ్చి నటించిందే. తర్వాత ప్లస్ వన్, ప్లస్‌టూ తరగతులు ముఖ్యం కావడంతో నటనకు సెలవుపెట్టి చదువుకోవడానికి వెళ్లాను. ఇప్పుడు ప్లస్‌టూ పరీక్షలు ముగించుకుని, ఫలితాల కోసం వేచి ఉన్నా. వేసవి సెలవులు కావడంతో ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ చిత్రంలో నటించడానికి వచ్చాను. సినిమాల వల్ల చదువుకు, చదువు వల్ల సినిమాలకు నష్టం వాటిళ్లని రోజుల్లో మాత్రమే నటిస్తాను. ఇన్ని సినిమాల్లో నటించేయాలి, ఇంత డబ్బు సంపాదించాలని వంటి ఆశలు నాకు లేవు. మనస్సుకు నచ్చిన కథ, పాత్రల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు‘ అంటోంది మాలవిక నాయర్. -
కామెడీ కథా చిత్రంలో మాళవికానాయర్
కొందరు అవకాశాలను వెతుక్కుంటూ వెళతారు. కొన్ని అవకాశాలు మాత్రం ప్రతిభను వరిస్తాయి. అలా నటి మాళవికనాయర్ను వెతుక్కుంటూ వచ్చిన చిత్రం అరసియల్ల ఇదెల్లా సహజమప్పా.కేరళకు చెందిన ఈ మలయాళ కుట్టి ఢిల్లీలో చదువుకుంటూ మధ్యమధ్యలో సినిమాల్లో నటిస్తోంది. మాలీవుడ్‌లో ఉస్తాద్ హోటల్, కర్మయోగి, పుదియగీతంగళ్ చిత్రాల్లో నటించింది.ఆ తరవాత దర్శకుడు రాజుమురుగన్ కంటపడింది. అంతే కుక్కూ చిత్రంలో నాయకిగా అంధురాలి పాత్రలో జీవించిందనే చెప్పాలి. ఆ తరువాత ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించి మళ్లీ చదువుపై దృష్టి సారించిందట. ఇక చదువు పూర్తి అయిన తరువాతే నటించాలని నిర్ణయించుకోవడంతో సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని అంటున్న మాళవికనాయర్ ఇప్పుడు అరసియల్ల ఇదెల్లా సహజమప్పా అనే రాజకీయ నేపథ్యంలో సాగే వినోద భరిత కథా చిత్రంలో నటించడానికి సిద్ధమైంది.ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తమిళనాట డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆరా సినిమాస్ సంస్థ అధినేత మహేశ్ గోవిందరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అవినాష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజతందిరం చిత్రం ఫేమ్ వీరా కథానాయకుడిగా నటించనున్న ఇందులో నటి మాళవికానాయర్ రాజకీయనాయకుడి కూతురిగా నటించనున్నారని తెలిసింది.ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. -
విజయ్ మరో ఛాన్స్ కొట్టేశాడు
లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, తరువాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పెళ్లిచూపులు సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న విజయ్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ఆఫర్ విజయ్‌ని వెతుక్కుంటూ వచ్చింది. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రెడ్డి, తరువాత కాస్త తడబడినా ఇటీవల కళ్యాణ వైభోగమే సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కూడా కళ్యాణ్ వైభోగమే ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తవ్వగానే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మొదలు పెడతాడు విజయ్. -
సేమ్ టీమ్‌తో మరో సినిమా
- నిర్మాత దామోదర్‌ప్రసాద్ ‘‘నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. నాగశౌర్య, మాళవికా నాయర్, సాయి రిత్విక్ 100 శాతం వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇండస్ట్రీలో నన్ను ఎవరూ నమ్మనప్పుడు దామోదర్‌గారు నమ్మి ఈ చిత్రం తీశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టినందుకు గర్వంగా ఉంది. మా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘ఈ టీమ్ నా ఫ్యామిలీ లాంటిది. ‘అలా మొదలైంది’ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్లో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. ఇదే టీమ్‌తో త్వరలో మరో సినిమా చేస్తా’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ఈ చిత్రంలోని పెళ్లి పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా పెళ్లిలో అదే పాట పెట్టుకుంటా. ఇప్పటి దాకా 8 చిత్రాలు చేసినా దేనికీ రాని ప్రశంసలు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది’’ అని నాగశౌర్య చెప్పారు. సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమేరామ్యాన్ జివిఎస్ రాజు, రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కళ్యాణ వైభోగమే కథ చెప్పినప్పుడే ఈ రేంజ్ హిట్ ఊహించాను
‘‘సినిమా హిట్ అయితే ఆనందంగా ఉండాలి. కానీ, నాకు ఆనందంతో పాటు చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఇలాంటి విజయాలతో నాపై ఇంకా బాధ్యత పెరిగిందనిపిస్తోంది’’ అని హీరో నాగశౌర్య అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ ఈ నెల 4న విడుదలైంది. తాము ఊహించిన విధంగానే ఈ సినిమా ఘనవిజయం సాధించిందని నాగశౌర్య సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన మరిన్ని విశేషాలు... ♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమా కథ చెప్పినప్పుడే నేను ఈ రేంజ్ హిట్ ఊహించాను. కథలో ఉన్న కంటెంట్ అలాంటిది. నందినీ రెడ్డిగారు నాకు ఎంత బాగా చెప్పారో, అంతకన్నా పదిరెట్లు బాగా తీశారు. పబ్లిక్ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూశాను. ఆడియన్స్ ఈ సినిమాలోనికామెడీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ల రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ♦ షూటింగ్ సమయంలో ఓ రోజు నందినిగారిని ఏ టైటిల్ పెడుతున్నారని అడిగితే ‘కళ్యాణ వైభోగమే’ అని చెప్పారు. టైటిల్ వింటేనే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఈ సినిమాలో మాళవిక లాంటి డెడికేటెడ్ ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఓ మంచి అనుభూతి. ♦ ప్రేమ , పెళ్లి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పెళ్లికొడుకు గెటప్‌లో నన్ను చూసి చాలామంది రియల్ లైఫ్‌లో పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. కానీ, నా దృష్టిలో పెళ్లి అనేది పూర్వజన్మ సుకృతం. అదో ముఖ్యమైన ఘట్టం. ఒక అబ్బాయి, అమ్మాయి జీవితాలకు పెళ్లితోనే నిజమైన అర్థం వస్తుంది. నాకు గనక ఈ సినిమాలోలాగే ఎవరైనా అమ్మాయి నిజంగా నా మనసుకు నచ్చితే మా అమ్మకు పరిచయం చేస్తాను. కానీ, పెళ్లి మాత్రం అప్పుడే కాదు. ఇంకా రెండు, మూడేళ్లు ఆగమని చెబుతా. ♦ జనరల్‌గా ఏ సినిమా చేసినా హిట్టవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమా హిట్టయినందుకు నాకు ఆనందంగా ఉంది. అమ్మానాన్నల ఆనందానికి హద్దే లేదు. వాళ్లు ఈ సినిమా రిజల్ట్ గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం అమ్మానాన్న హైదరాబాద్‌లో లేరు. కానీ, ఇక్కడే ఉన్నట్లే ఉంది. ఎందుకంటే, సినిమా విజయాన్ని షేర్ చేసుకోవడానికి వాళ్లకి కనీసం పదిసార్లకు పైనే ఫోన్ చేసుంటా. ♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమాకు ముందు నా కెరీర్ కాస్త డౌన్ అయిన మాట నిజమే. అయినా ఒక్కోసారి మన లెక్కలు తప్పుతూ ఉంటాయి. అది సహజం. అంత మాత్రాన డీలా పడిపోతే ముందుకు సాగలేం. అందుకే, అలాంటివి ఎదురు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ♦ ఏ సినిమా అయినా ముందు నాకు కనెక్ట్ కావాలి. దర్శకుడు కథ చెప్పేటప్పుడే నేను నవ్వాలి, ఏడవాలి. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడే కథకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తా. అందుకే నా గత సినిమాల్లో నన్ను చూస్తే నేను కనబడను, నా పాత్ర మాత్రమే కనబడుతుంది. ♦ నేను హీరోగా, నాగబాబుగారి అమ్మాయి నిహారిక కథానాయికగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘ఒక్క మనసు’ సినిమా షూటింగ్ పూర్తయింది. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జో అచ్యుతానంద’ సినిమా చేస్తున్నా. ఇంకా మరికొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. -
‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు
కథే హీరో అని నమ్ముతూ సినిమాలు తీసే కొద్దిమంది నిర్మాతల్లో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దామూ) ఒకరు. ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు- ఆ తర్వాత’తో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న ఆయన తాజా ఫిల్మ్ ‘కళ్యాణ వైభోగమే’. నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 4న రిలీజ్. దామూతో స్పెషల్ ఛాట్. పోస్టర్ నిండుగా, నటీనటులతో కళకళలాడుతోంది. ఇంత మంది క్యాస్టింగ్‌తో కూడిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ 40 రోజులు చిత్రీకరణ చేశారట? సినిమా షెడ్యూల్ నటీనటుల డేట్స్, కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మేం ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళుతుంటాం. మా హీరోయిన్ చదువు వలన 40 రోజుల షెడ్యూల్ పెట్టాల్సి వచ్చింది. నందినీరెడ్డి గత చిత్రం ప్లాప్. మళ్లీ ఆమెతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా? మా కాంబినేషన్లో ‘అలా మొదలైంది’ ఎంత పెద్ద సక్సెస్సో అందరికీ తెలుసు. మా ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నందిని ‘అలా మొదలైంది’ లాంటి సక్సెస్‌తో ఎంత నేర్చుకుందో, ఆ తర్వాత వచ్చిన ఫెయిల్యూర్తోనూ అంతే నేర్చుకుంది. ‘కళ్యాణవైభోగమే’ కథను ఆమె రాసుకున్న విధానం, నాకు చెప్పిన విధానం బాగా నచ్చాయి. కథపై తనకెంత స్పష్టత ఉందో... ఆ కథ విన్నాక నాలోనూ అంతే స్పష్టత ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా చేసేశా. మీరు మిగతా దర్శకులతోనూ కలిసి పనిచేశారు. వాళ్లతో పోలిస్తే, నందినిరెడ్డిలో మీకు కనిపించే డిఫరెన్స్? నందిని కమిట్మెంట్ ఉన్న దర్శకురాలు. నిజాయతీగా నచ్చిందే చేస్తుంది. నిర్మాతగా నేనెప్పుడైనా ‘ఇది కరెక్టు కాదేమో’ అని చెబితే ఆలోచించి దానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తుంటుంది. ఒకవేళ తాను అనుకున్నదే కరెక్టనుకుంటే నన్ను కూడా కన్విన్స్ చేస్తుంటుంది. అందు కోసమని నాతో వాదించడానికి కూడా రెడీ అవుతుంది. కళ్యాణ్ కోడూరి అంతే. అందుకే వీరిద్దరితోనూ నా ప్రయాణం సాగుతోంది. చిత్రీకరణలో మీరు టెన్షన్‌కి గురైన సందర్భం ఉందా? ‘కళ్యాణ వైభోగమే’ ప్రీ క్లైమాక్స్‌లో ఓ సీన్ చిత్రానికి ఆయువుపట్టు లాంటిది. పేపర్పైనున్న డైలాగ్ వర్షన్, ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి. మరి అవి అలాగే తెరపైకి వస్తాయో, రావో అన్న భయం ఉండేది. అందుకే ఆ సన్నివేశాలు పూర్తయ్యేవరకు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నా. మేం అనుకున్నట్టుగానే ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి. నాకున్న ఒకే ఒక్క టెన్షన్ ఆరోజే తీరిపోయింది. ఇందులోని ప్రతి సీన్ రియలిస్టిక్‌గా ఉంటుంది. మీ సంస్థ నుంచి కుటుంబ కథాచిత్రాలే వస్తుంటాయెందుకు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు నన్ను. నాకు కూడా ఇలా ఒకే జానర్‌కి పరిమితం కావాలని లేదు. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ తీయాలనుంది. తీస్తాను కూడా. అయితే కుటుంబ కథలు మాత్రం అనుకోకుండానే నా దగ్గరికి వస్తుంటాయి. సుమారు 80 కథలు విన్నాక ‘అలా మొదలైంది’ కుదిరింది. ఆ తర్వాత 50 కథలు విన్నాక ‘అంతకు ముందు-ఆ తర్వాత’ చేశా. మరో 50 కథలు విన్నాక ‘కళ్యాణ వైభోగమే’ చేశా. చిన్న సినిమాలు తీస్తే విడుదల సమయంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా? పెట్టే బడ్జెట్లో తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ... కథ విషయంలో కాదు. కథ బాగుంటే చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది. అదే కథలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా వృథానే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళామన్నదే ముఖ్యం. చాలామంది పబ్లిసిటీ విషయంలో వెనకబడుతున్నారు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరమనే ది నా భావన. మీకు డ్రీమ్ ప్రాజెక్టుల్లాంటివేమైనా ఉన్నాయా? తీసే ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. ప్రతి సినిమానూ తొలి సినిమాలాగే భావిస్తుంటా. ప్రతిసారీ కొత్తవిషయాలు నేర్చుకుంటుంటా. వాటిని తదుపరి చిత్రానికి ఉపయోగిస్తా. -
మొదట ఈ విషయం ఎవరికీ తెలీదు!
- నిర్మాత దామోదర్ ప్రసాద్ ‘‘నా సినిమాలో కథకు తగ్గట్టే నటీనటులు ఉంటారు. మా బ్యానర్లో గతంలో వచ్చిన సినిమాలకు దీటుగా ఈ ‘కళ్యాణ వైభోగమే’ ఉంటుంది’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో విలేఖరులతో మంగళవారం పంచుకున్నారు. ‘‘కథ అంతా విన్నాక, స్క్రిప్ట్ రెడీ అయ్యేంతవరకు నేను ఆ సినిమా గురించి మాట్లాడను. ప్రత్యేకించి ఈ సినిమా కోసం 14 నెలలు వర్క్ చేశాను. ‘అలా మొదలైంది’ తర్వాత దర్శకురాలు నందినీరెడ్డి, నేను కలసి చేస్తున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. కళ్యాణ్ కోడూరి స్వరాలందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో పెళ్లి పాట అందరికీ కనెక్ట్ అయింది. మేం సినిమా చేస్తున్నట్టు చాలా మందికి తెలీదు. కానీ సినిమా పూర్తయి, సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చాక ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఓ అందమైన ప్రేమకథ ఇది. ఈ తరానికి తగ్గట్టు పూర్తిగా వినోదాన్ని మేళవించి, ఈ కథను తెరకెక్కించాం’’ అని దామోదర్ ప్రసాద్ తెలిపారు. -
ఆ జంట కన్నులపంట
ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో పెళ్లికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సకుటుంబ వినోదకథా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘అలా మొదలైంది’ వంటి చిత్రాలను మించి ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కథాకథనాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం హైలైట్’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై యువతరంలో ఉన్న ఆలోచనలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. సున్నిత భావోద్వేగాలను సమపాళ్ళలో మేళవించి చిత్రం రూపొందించాం’’ అని నందినీరెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జీవీఎస్ రాజు, సహ-నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహనరెడ్డి. వి. -
వైభవంగా ఉంటుంది!
నందినీరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో తయారైన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని విధాలుగా వైభవంగా ఉంటుందని దర్శక-నిర్మాతలు నందినీరెడ్డి, దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దామోదర్ ప్రసాద్ మాట్లాడు తూ - ‘‘యువతలో ప్రేమ, పెళ్లి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపించాం. కల్యాణి కోడూరి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రంపై మరిన్ని అంచనాలు పెరగడానికి ఆడియో విజయం ఓ కారణమైంది. ఈ చిత్రం హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసు కుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి.వి. -
కళ్యాణం..కమనీయం...
ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై ప్రస్తుతం యువతలో ఎటువంటి అభిప్రాయాలున్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేమ, పెళ్లి విలువలను చాటి చెప్పే కుటుంబ కథా చిత్రమిది. పాటలు బాగా కుదిరాయి. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘అలా మొదలైంది’ తర్వాత నందినీరెడ్డి మా సంస్థలో చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జీవీఎస్ రాజు, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి. -
ఎవడే సుబ్రమణ్యం మూవీ స్టిల్స్
-
'ఎవడే సుబ్రహ్మణ్యం' ఆడియో ఆవిష్కరణ
-
ఆ 40 రోజులూ పడినంత కష్టం ఎప్పుడూ పడలేదు
హిమాలయాల్లో ఒక్కరోజైనా విహార యాత్ర చేయాలని అందరికీ కోరిక ఉంటుంది. అలాంటిది 40 రోజులు అక్కడే గడపాల్సి వస్తే...? హీరో నానీకి అలాంటి అవకాశం దక్కింది. నాని, మాళవికా నాయర్ జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకా దత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్న సినిమా పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ హిమాలయాల్లో చేశారు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో నాని పంచుకున్నారు. హిమాలయాల్లో 40 రోజులు షూటింగ్ చేయాలన్నప్పుడు ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంటుందనుకున్నాను. కాకపోతే అక్కడ ఓ రేంజ్లో కష్టపడతామని మాత్రం ఊహించలేదు. హైదరాబాద్ నుంచి దాదాపు 35 మంది హిమాలయాలకు ఎంతో హుషారుగా వెళ్లాం. వెళ్లిన తర్వాత తెలిసింది... ఏం తెలిసింది? అక్కడ షూటింగ్ చేయడం మామూలు విషయం కాదని. చాలా చలిగా ఉండేది. ఎంత చలి అంటే... గ్లాసులో నీళ్లు నిమిషాల్లో తాగేయాలి. లేకపోతే గడ్డ కట్టిపోతాయ్. శరీరాన్నంతా ప్యాక్ చేసుకున్నట్లుగా దుప్పట్లు, రగ్గులు కప్పుకునేవాళ్లం. షూటింగ్ లొకేషన్లో అందరూ అలానే ఉండేవాళ్లు. కానీ, ఆర్టిస్టులకు అలా కుదరదు కాదు. సీన్ చేసే ముందు దుప్పట్లు, నెత్తి మీద టోపీలు అవీ తీయాలంటే భయం వేసేది. ఇంకో విషయం చెబితే నవ్వుతారేమో. స్నానం చేసిన రోజులు చాలా తక్కువ (నవ్వుతూ...). నా జీవితంలో ఆ 40 రోజులు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదు. ఈ సందర్భంలో మీ శ్రీమతి అంజన అలిగారట? అలగలేదు. చాలా బాధపడింది. ఎందుకంటే సరిగ్గా నేనక్కడ ఉన్నప్పుడే అంజన నాన్నగారు చనిపోయారు. విషయం తెలియగానే నేను హైదరాబాద్ చేరుకోవడానికి నాలుగైదు ఫ్లయిట్లు మారాల్సి వచ్చింది. మామయ్యగారి మరణం ఓ షాక్. ఆ బాధ నుంచి అంజన తేరుకునేవరకూ నేను తనతో ఉండలేకపోయాను. కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఉండి షూటింగ్‌కి వెళ్లిపోయాను. అది నాక్కూడా బాధ అనిపించింది. కానీ, యూనిట్ మొత్తం ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు రోజులు వృథా చేయకూడదు కదా! పర్వతాలు ఎక్కేటప్పుడు ఏమనిపించింది? మేం అక్కడ ఉన్న 40 రోజుల్లో 15 రోజులు నడకకే సరిపోయింది. ఒక చోట షూటింగ్ చేసి, మరో చోటికి చేరుకోవడానికి ఒకటిన్నర, రెండు రోజులు పట్టేది. ఆ 40 రోజుల్లో మేమంతా దాదాపు నాలుగైదు కిలోల బరువు తగ్గామంటే అతిశయోక్తి కాదు. ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. పైగా 5,400 మీటర్లు ఎత్తుకు వెళ్లే సరికి ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. ఒకానొక దశలో క్షేమంగా వెనక్కి తిరిగి వస్తామా అని సందేహం కూడా వచ్చింది. అంతలా కష్టపడేంతగా ఈ కథలో ఉన్న ఆసక్తికరమైన అంశం ఏంటి? ఇందులో నా పాత్ర పేరు సుబ్రమణ్యం. పెద్ద వ్యాపారవేత్తని. ఎమోషన్స్ లేని మనిషిని. అసలు తనెలాంటివాడు? తన చుట్టూ మనుషులు లేకపోతే ఎలా ఉంటాడు? అని సుబ్రమణ్యం తెలుసుకోవాలనుకుంటాడు. చిత్రదర్శకుడు నాగ అశ్విన్ ఈ కథ చెప్పగానే కొత్తగా ఉందనిపించి, అంగీకరించాను. షూటింగ్ చేసిన ప్రతిరోజూ నాకు సంతృప్తి కలిగింది. షూటింగ్ పూర్తయ్యిందా? ఇంకో మూడు, నాలుగు రోజులు చేస్తే పూర్తవుతుంది. కానీ, హిమాలయాల్లో కాకపోవడం ఓ రిలీఫ్. మిమ్మల్నెంతగానో కష్టపెట్టిన సినిమా కదా.. ఎలా అనిపిస్తోంది? అది చాలా విలువైన కష్టం. హిమాలయాల్లో చేసిన షూటింగ్ తాలూకు విజువల్స్ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. రేపు సినిమా చూసినవాళ్లు మంచి అనుభూతితో బయటికొస్తారు. పైగా... సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు వినోద ప్రధానంగా సాగుతుంది. సో.. కష్టం మాకు..! నవ్వులు ప్రేక్షకులకు! అశ్వనీదత్‌గారి కుమార్తె సంస్థకు సినిమా చేయడం గురించి? వైజయంతీ మూవీస్ సంస్థలో సినిమా చేయాలనే కల చాలామందికి ఉంటుంది. ఒకప్పుడు ఆ కల నెరవేర్చుకోవడానికి ఆ ఆఫీసుకెళ్లి, అశ్వినీదత్గారిని కలిశాను. ‘ఇప్పుడే సినిమాలెందుకయ్యా.. చక్కగా చదువుకో’ అన్నారాయన. అప్పుడు అవకాశం అడిగిన కుర్రాణ్ణి నేనే అని అశ్వినీదత్‌గారికి గుర్తు లేదు. నేను గుర్తు చేస్తే నవ్వారు. ఒక మంచి బేనర్లో, మంచి సినిమా చేయడం.. అది కూడా ప్రపంచంలో ఇప్పటివరూ ఏ సినిమా షూటింగ్ కూడా హిమాలయాల్లో చేయనన్ని రోజులు, చేయని లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది.