గ్లామర్ షో చేయకుండా కేవలం అభినయంతోనే పేరు తెచ్చుకున్న నటి మాళవిక నాయర్. అలా తెర మీదే కాదు.. తెర బయటా ఆమె సంప్రదాయ శైలిని ఎలివేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉంటాయి..
షెహరి బై సాహితి రెడ్డి
హైదరాబాద్ హ్యామ్‌స్టెక్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సాహితి రెడ్డి.. 2012లో ‘సహారా బై సాహితి రెడ్డి’ పేరుతో బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత.
ఎటువంటి ఫ్యాబ్రిక్ మీదైనా సరే.. ఫ్లవర్ డిజైన్ ఆర్ట్‌తో మెప్పించటం ఆమె ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
జ్యూలరీ..
ఇద్దరు స్నేహితులు శిల్ప, గీత ప్రారంభించిన ఆన్‌లైన్ జ్యూలరీ స్టోర్ ఇది. ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజే వారిని సెలిబ్రిటీలకు కూడా డిజైన్స్ అందిచే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే వీలు ఉంది.
బ్రాండ్ వాల్యూ
డ్రెస్ బ్రాండ్: షెహరి బై సాహితి రెడ్డి
ధర: రూ. 19,800
జ్యూలరీ బ్రాండ్: శిల్ప గీత స్టయిల్స్
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడిలా సంప్రదాయబద్ధంగా.. ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నా కానీ, చిన్నప్పుడు మాత్రం నాది టామ్‌బాయ్ స్టయిలే. ఇప్పుడిప్పుడే కాస్త ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్‌బుల్‌గా రెడీ అవుతున్నా. – మాళావిక నాయర్
∙దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment