
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం. టైటిల్ లోగోను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది.
ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్‌లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment