Vaarahi Chalana Chitram
-
మెగా అల్లుడి ‘విజేత’
-
నాగశౌర్యతో అవసరాల మరో సినిమా?
నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్లు అందుకున్నారు. రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్‌ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. -
‘విజేత’గా వస్తున్న చిరు చిన్నల్లుడు
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం. టైటిల్ లోగోను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్ -
మరో మెగా హీరో లాంచింగ్‌పై క్లారిటీ
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. వైష్ణవ్.. వారాహి చలనచిత్రం బ్యానర్లో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను తాము నిర్మించటం లేదని క్లారిటీ ఇచ్చింది. -
10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్రపాటి సాయి నిర్మాతగా వరాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఈ చిత్రంలోని పాటలను రచించారు. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజా కూడా నటించారు.