
హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. వైష్ణవ్.. వారాహి చలనచిత్రం బ్యానర్‌లో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపించింది.
అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను తాము నిర్మించటం లేదని క్లారిటీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment