Mega hero
-
అఫీషియల్: 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే'.. రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారి సందేహాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆర్సీ16 మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఈ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమవుతుంది' అంటూ హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబును ట్యాగ్ చేసింది. దీనిపై హీరో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు రీట్వీట్ చేశారు. బుచ్చిబాబు టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చెర్రీ శంకర్ డైరెక్షన్లో ఆర్సీ15 షూటింగ్లో విదేశాల్లో బిజీగా ఉన్నారు. గతంలో 'ఆర్సీ 16' గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం ఉంటుందని టీమ్ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు ఆఫర్?: ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకుడు బుచ్చి బాబు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ బ్లాక్ కావడంతో కుదరలేదని తెలుస్తోంది. Sometimes, Revolt becomes a necessity ❤️🔥 Mega Power Star @AlwaysRamCharan & Sensational director @BuchiBabuSana team up for a powerful subject and a Pan India entertainer 💥 #RamCharanRevolts 🔥 Produced by @vriddhicinemas & @SukumarWritings Presented by @MythriOfficial pic.twitter.com/SisvkrbJo8 — Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022 Excited about this !! Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkataSatishKilaru @MythriOfficial pic.twitter.com/hXuI5phc7L — Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022 -
అటు ఆర్ఆర్ఆర్ ప్రభంజనం, ఇటు చెర్రీ బర్త్‌డే.. హవా మామూలుగా ఉండదుగా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇపుడు ఈ పేరు వింటే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎందుకంటే చెర్రీ లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ సంచలనం అలాంటిది మరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి క్రియేటివిటీకి, మెగా వారసుడు యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో చాటి చెప్పిన ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ప్రభంజనం నేపథ్యంలో మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అలాగే గత ఏడాది రాంచరణ్ పుట్టినరోజుకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ మరిపుడు రామరాజు బర్త్‌డేకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందా అని కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ గురించి పరిచయం అవసరమే లేదు. అలనాటి దివంగత ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవిగా కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘చిరుత’గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించాడు. ఆ తరువాత పెద్దగా కమర్షియల్ హిట్స్ సాధించలేకపోయినా, నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. 2007లో తొలి మూవీతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సంచలనం సృష్టించింది. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు చెర్రీ ఖాతాలో చేరాయి. కాలభైరవగా, రొమాంటిక్ హీరోగా చరణ్ ఆడియెన్స్‌లో తనకంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే 2010లో ఆరెంజ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆరెంజ్ మూవీ పాటలు సక్సెస్ అయినప్పటికీ, కమర్షియల్ కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఎవడు మూవీ కూడా సో.. సో గానే నడిచాయి. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బ్లాక్ బ్లస్టర్ జంజీర్‌కి రీమేక్‌గా, అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన తుఫాన్ మూవీ కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే, 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ సినిమాలు ఇదే బాటలో పయనించాయి. ఆశించిన కలెక్షన్లను రాబట్ట లేక పోయాయి. అయితే 2016లో వచ్చిన ధృవ చిత్రం కాస్త ఊరట నిచ్చింది. ఈ విజయానికి కొనసాగింపుగా వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ డూపర్ హిట్టయింది. ముఖ్యంగా వికలాంగుడిగా రాంచరణ్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 2018 లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చిట్టిబాబుగా నట విశ్వరూపం ప్రదర్శించాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలగలసి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మూవీ రంగస్థలం. ఈ సినిమా సక్సెస్‌తో రాం చరణ్ ఇమేజ్ భారీగా పెరిగింది. కానీ 2019 జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మళ్లీ ఫ్లాప్‌నే మూట గట్టుకుంది. అయినా సాలిడ్ హిట్ కోసం ఓపిగ్గా వెయిట్ చేసి చివరికి మరో బ్లాక్ బ్టస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మూవీ ఆర్ఆర్ఆర్. కోవిడ్ కష్టాలు, దాదాపు రెండేళ్ల కృషి, ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. రామరాజుగా చెర్రీ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. భారీ వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేందుకు రడీ అవుతోంది. రాం చరణ్ కేవలం నటుడు మాత్రమే కాదు సక్సెస్ఫుల్ ఆంట్రపెన్యూర్ కూడా. హార్స్ రైడింగ్ అంటే ఇష్టపడే చెర్రీకి 'హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్' తోపాటు ట్రూజెట్ అనే సొంత ఎయిర్‌లైన్స్ కూడా ఉంది. ఇక ఆర్సి భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
మరో మెగా వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న విషయం తెలిసిందే. వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 21న వైష్ణవ్ తేజ్ హీరోగా సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించనున్నాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకుడు. రియలిస్టిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. గతంలో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను వారాహి చలనచిత్రం సంస్థ తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రాజెక్ట్ మొదలు కాకపోవటంతో సుకుమార్ నిర్మాణంలో వైష్ణవ్ వెండితెరకు పరిచయం కానున్నాడు. -
సైలెంట్‌గా స్టార్ట్ చేసిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే వైష్ణవ్ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తొలి చిత్ర షూటింగ్ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ ప్రారంభించేశారట. నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాను డైరెక్ట్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
మరో మెగా హీరో లాంచింగ్‌పై క్లారిటీ
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. వైష్ణవ్.. వారాహి చలనచిత్రం బ్యానర్లో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను తాము నిర్మించటం లేదని క్లారిటీ ఇచ్చింది. -
మరో మెగా హీరో ఎంట్రీ
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లాంటి హీరో వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో మెగా హీరో ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎమ్బీబీయస్ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు వైష్ణవ్. ఈ మెగా వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడి సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం అయ్యే అకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస హిట్స్‌తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్‌లో ఉన్న సాయి, ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లను ఆదుకునే పనిలో పడ్డాడు. తాజాగా సుప్రీమ్ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సాయి ధరమ్, ప్రజెంట్ తిక్క సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన భారీ డిజాస్టర్ ఓం3డి దర్శకుడు సునీల్ రెడ్డి, ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా తరువాత కూడా ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన పండగ చేస్కో సినిమాతో నిరాశపరిచిన గోపీచంద్ మలినేనితో సినిమా అంగీకరించాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తరువాత డైరెక్టర్‌గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రచయిత బివియస్ రవి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. తనకు పిల్లా నువ్వులేని జీవితం లాంటి సక్సెస్ఫుల్ స్టార్ట్ అందించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలోనూ సినిమా అంగీకరించాడు. అయితే రవికుమార్ చౌదరి కూడా సౌఖ్యం సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఫేస్ చేశాడు. ఇలా వరుసగా ఫ్లాప్ దర్శకులతోనే సినిమాలు అంగీకరించి అందరికీ షాక్ ఇస్తున్నాడు సాయిధరమ్ తేజ్. -
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు
మెగా వారసుడు వరుణ్ తేజ్ జోరు పెంచాడు. మాస్ ఇమేజ్ కోసం రిస్క్ చేయకుండా నెమ్మదిగా అడుగులేస్తున్న ఈ ఆరడుగుల అందగాడు 2016లో జోరు పెంచుతున్నాడు. తొలి సినిమా ముకుందతో పరవాలేదనిపించిన వరుణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన కంచె సినిమాతో మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోకపోవటంతో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. మాస్ ఇమేజ్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా చేసినా.. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూడు సినిమాలు వరుణ్‌కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురాకపోయినా విషయం ఉన్న నటుడిగా నిరూపించాయి. అందుకే వరుణ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఈ యంగ్ హీరో మాత్రం కథ ఎంపికలో తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో మరోసారి క్రిష్ దర్శకత్వంలో 'రాయబారి' సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత పండగ చేస్కో సినిమాతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాక ముందే మూడో సినిమాను కూడా కన్ఫామ్ చేసేశాడు. దిల్‌రాజు నిర్మాతగా కొత్త దర్శకుడితో ఈ ఏడాదిలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వరుణ్, ఈ మూడు సినిమాలను 2016లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట మెగా హీరో. -
ముగ్గురికి ఓకే చెప్పాడు
తొలి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. మెగా వారసుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయిన వరుణ్, 'కంచె' సక్సెస్‌తో బిజీ హీరోగా మారిపోయాడు. దసరా సినిమాల్లో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన 'కంచె'.. ఒక్కసారిగా వరుణ్ తేజ్‌ను బిజీ స్టార్ గా మార్చేసింది. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ సీతామాలక్ష్మి' సినిమాలో నటిస్తున్నాడు. మదర్ సెంటిమెంట్‌తో పాటు పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత, మరో కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. తన తొలి సినిమాను నిర్మించిన ఠాగూర్ మధు నిర్మాణంలో మరో సినిమా చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు 'కంచె' లాంటి భారీ హిట్‌తో తన కెరీర్‌ను గాడిలో పెట్టిన క్రిష్ (రాధకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్. -
మరో మెగా రీమేక్
భారీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న మెగా వారసుడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తొలి సినిమాతో చేదు అనుభవాన్నే మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా నటన పరంగా ఏ మాత్రం ఆకట్టుకోవలేకపోవటంతో విమర్శలు ఎదుర్కొవలసి వచ్చింది. ఆ తరువాత రూటు మార్చి కమర్షియల్ జానర్లో రెజీనాతో కలిసి 'కొత్త జంట' సినిమా చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శిరీష్. కోలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'యామురిక్క భయమెయ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన డికే దర్శకత్వంలోనే చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి శిరిష్ రీమేక్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
ప్రేమికుడిగా, సైనికుడిగా.. వరుణ్
-
ప్రేమికుడిగా, సైనికుడిగా.. వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ రెండో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమాతో సాఫ్ట్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ రెండో సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాడు. అందుకే గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాతో వరుణ్ ను యాక్షన్ హీరోగా పరిచయం చేస్తున్నాడు. వరుణ్ హీరోగా చేస్తున్ రెండో సినిమా'కంచె' టీజర్ మంగళవారం విడుదలైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న 'కంచె' సినిమాలో యుద్ధ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సీన్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయని చెపుతున్నారు. ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు ( సెప్టెంబర్ 1)న విడుదల చేశారు. వరుణ్ సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
గపిల్లా నువ్వు లేని జీవితం అంటున్న సాయిధరమ్ తేజ
‘‘సాయిధరమ్ తేజలో మంచి మాస్ హీరో ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ‘దిల్’ రాజుతో చక్కని అవగాహన కుదిరినందువల్ల తనతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. మున్ముందు కూడా మా కాంబినేషన్లో సినిమాలొస్తాయి’’ అన్నారు అల్లు అరవింద్. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా రెజీనా హీరోయిన్గా గీతా ఆర్ట్స్, ఎస్వీసీ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసుతో కలిసి ‘దిల్’ రాజు సోదరుని కుమారుడు హర్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘గబ్బర్‌సింగ్ విడుదల తర్వాత దేవిశ్రీప్రసాద్ నాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. ఈ చిత్రానికి ఆ టైటిల్ ఉపయోగపడింది. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు’’ అన్నారు. ‘‘టైటిల్ కోసం మా టీవీలో ఒపీనియన్ పోల్ నిర్వహించాం. ఎక్కువ శాతం ఓట్లు ఈ టైటిల్‌కే పడటంతో దాన్నే ఖరారు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 80 శాతం సినిమా పూర్తయ్యిందని బన్నీ వాసు తెలిపారు. ‘‘మా మామయ్య పవన్‌కళ్యాణ్ సినిమాలోని పాట.. నా సినిమా టైటిల్ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని సాయిధరమ్ తేజ అన్నారు. ఈ వేడుకలో గౌతంరాజు, రత్నబాబు, హర్షిత్, రెజీనా తదితరులు పాల్గొన్నారు.