
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న విషయం తెలిసిందే. వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 21న వైష్ణవ్ తేజ్ హీరోగా సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభం కానుంది.
ఈ సినిమాను దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించనున్నాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకుడు. రియలిస్టిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. గతంలో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను వారాహి చలనచిత్రం సంస్థ తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రాజెక్ట్ మొదలు కాకపోవటంతో సుకుమార్ నిర్మాణంలో వైష్ణవ్ వెండితెరకు పరిచయం కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment