
మెగా ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర వార్త టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు జాలరి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment