సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు.. సుకుమార్ ఎమోషనల్ | Director Sukumar Emotional Speech About Karthik Varma Health At Virupaksha Pre-Release Event - Sakshi
Sakshi News home page

Karthik Varma Dandu: ఆ ప్రాబ్లం నాకు తెలుసు.. కేవలం స్టెరాయిడ్స్‌తోనే బతికాడు: సుకుమార్

Published Mon, Apr 17 2023 9:13 AM | Last Updated on Mon, Apr 17 2023 10:04 AM

Sukumar Interesting Comments About Virupaksha Director Karthik Varma Dandu - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు, విరూపాక్ష దర్శకుడు గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 

కార్తీక్ దండు గురించి సుకుమార్ మాట్లాడుతూ.. 'కార్తీక్ దండు నా శిష్యుడు. అతను మొదట ఒక కథ చెప్పాడు. అది నాకు పెద్దగా నచ్చలేదు. కార్తీక్ నేరేషన్ బాగా నచ్చింది. ఇంకో కథతో రమ్మని చెప్పా. నేను అమేజ్ అయిపోయా. ఆ తరువాత అతనికి బాపినీడును పరిచయం చేసి.. సాయికి కథ చెప్పించాను. అతని లైఫ్ చాలా చిన్నది. నాకు తెలిసి మరో ఐదేళ్లు బతుకుతాడేమో. అతనికి ఓ మెడికల్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఆ బాధను అధగమించి ఈ సినిమా తీశాడు. తన లైఫ్ చాలా క్రిటికల్‌గా ఉన్నా కూడా.. సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు. కేవలం స్టెరాయిడ్స్ తీసుకుని బతికేవాడు. మీ అమ్మగారి ప్రార్థనలే నిన్ను బతికించాయి. ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. నేను కేవలం సపోర్ట్‌గా నిలిచా. ఈ సినిమా కార్తీక్‌కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నా. అతన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.'  అని అన్నారు. 

సాయి ధరమ్‌ తేజ్ గురించి మాట్లాడూతూ.. 'మొదటిసారి నేను దిల్‌రాజ్ అమ్మాయి పెళ్లిలో కలిశాం. అక్కడే అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. విరూపాక్ష షూట్‌కు వెళ్లినప్పుడు ఒకసారి షవర్ అయ్యాను. నటించడానికి ఇబ్బంది పడ్డాడు. తనకిది నటుడిగా పునర్జన్మ. మొదటి రోజు సాయి డ్యాన్స్‌ చేస్తే మీకు కన్నీళ్లు ఆగవు. ప్రమాదం తర్వాత తీసిన సినిమా ఇది. తప్పకుండా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది.'  అంటూ ప్రశంసలు కురిపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement