Karthik Varma Dandu
-
సుకుమార్ నిర్మాతగా చైతూ 'మిథికల్ థ్రిల్లర్'
నాగచైతన్య పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం 'తండేల్' చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మిథికల్ థ్రిల్లర్ అంటే.. మైథలాజికల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఇది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో అజిత్)నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ కన్ను.. అందులో నాగచైతన్య పర్వతంపై నిలబడ్డ ప్రతిబింబం రావడాన్ని చూపించారు.'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్లుగా మీనాక్షిని ఎంచుకున్నారు. కానీ ఆ డీటైల్స్ త్వరలో బయటపెడతారు. అలానే మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?
ప్రేక్షకుల్ని భయపెట్టడం అంత తేలికైన విషయమేం కాదు. వందల సినిమాల చూసేసుంటారు కాబట్టి సినిమాని కాస్త డిఫరెంట్ గా తీయాలి. అప్పుడే షాకవుతారు. ఆ చిత్రాన్ని హిట్ చేస్తారు. అలా ఈ ఏడాది సక్సెస్ కొట్టిన చిత్రం 'విరూపాక్ష'. రూ.100 కోట్ల వసూళ్లు కూడా సాధించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు. మూవీ టీమ్ మాత్రం ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'విరూపాక్ష' సంగతేంటి? గతంలో తెలుగులో పూర్తిస్థాయి హారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత తర్వాత అవి కాస్త హారర్ కామెడీ చిత్రాలుగా మారిపోయాయి. అలాంటిది 'విరూపాక్ష'ని చేతబడి కాన్సెప్ట్ తో కేవలం హారర్ కథతో అద్భుతంగా తీశాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ. స్క్రీన్ ప్లే విషయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహాయం చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం దర్శకుడికే దక్కుతుంది. దాన్ని ఏ మాత్రం మరిచిపోని నిర్మాతలు ఇప్పుడు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. బెంజ్ బహుమతిగా తనకు బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతూ దర్శకుడు కార్తీక్ వర్మ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. వీటిలో బెంజ్ కారు సీ క్లాస్ మోడల్ కనిపించింది. మన దేశంలో దీని రోడ్ ప్రైస్ దాదాపు రూ.65-70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ్చిన దర్శకుడికి నిర్మాతలు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిజమైంది. ఇదంతా చూస్తే ప్రేక్షకుల్ని భయపెట్టాడు, ఖరీదైన కారుని పట్టేశాడు అనిపిస్తోంది. Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa — karthik varma dandu (@karthikdandu86) June 27, 2023 (ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) -
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్‌కి సాయి ధరమ్ తేజ్
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
అప్పుడు నేను కోమాలో ఉన్నాను: విరూపాక్ష డైరెక్టర్
ఇటీవలి కాలంలో హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ ఓ స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ హారర్ ఫిలిం రాలేదు. అందుకే హారర్ జానర్‌కు అభిమానిని అయిన నేను విరూపాక్ష తీశాను. ప్రేక్షకులను థ్రిల్ చేయాలని సినిమాలోని మర్డర్ సీక్వెన్స్‌లను కొత్తగా డిజైన్ చేశాం అన్నారు దర్శకుడు కార్తీక్ దండు. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజైంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ.. 2016-17 సమయంలో ఓ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. చేతబడి చేస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేస్తారు. ఆమెకు నిజంగా చేతబడి చేసే శక్తులు ఉంటే ఏం జరుగుతుందని ఊహించి విరూపాక్ష కథ రాశాను. నా కథను నమ్మిన సుకుమార్ గారు స్క్రీన్‌ప్లే అందించి, తాను ఓ నిర్మాతగా ఉంటానన్నారు. అలాగే సాయితేజ్గారిని హీరోగా నిర్ణయించి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని నిర్మాతగా నిర్ణయించారు. అయితే విరూపాక్ష షూటింగ్‌ను మరో రెండు మూడు రోజుల్లో మొదలు పెడదామనుకున్న సమయంలో సాయిధరమ్ తేజ్ గారికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సినిమా పరిస్థితి ఏంటో అని మెంటల్‌గా నాకు నేను కోమాలోనే ఉన్నట్లనిపించింది. సాయితేజ్ గారికి అంతా బాగానే ఉందని చెప్పగానే రిలాక్స్ అయ్యాను. విరూపాక్ష విడుదలయ్యాక చాలామంది నిర్మాతలు ఫోన్ చేశారు. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం అన్నారు. -
ప్రేక్షకులు సవాల్ విసిరారు, దానికి సమాధానమే ఇది: సాయిధరమ్ తేజ్
‘‘గత ఏడాది కొన్ని సినిమాలకు ప్రేక్షకులు సరిగ్గా రాలేదు. మమ్మల్ని థియేటర్స్‌కు రప్పించే సినిమాలు తీస్తేనే వస్తామంటూ ఆడియన్స్ ఓ చాలెంజ్ విసిరారు. ఆ సవాల్‌కి జవాబే ‘విరూపాక్ష’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 21) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్‌దో కాదు.. మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విరూపాక్ష’ని హిట్ చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్’’ అన్నారు కార్తీక్ దండు. ‘‘ఈ మూవీలో నా పాత్రకి వస్తున్న స్పందనకు కారణం కార్తీక్గారే’’ అన్నారు సంయుక్తా మీనన్. ‘‘ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ మారుతి. ‘‘విరూపాక్ష’ని అందరూ థియేటర్లోనే చూడండి.. గొప్ప అనుభూతి వస్తుంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్, కెమెరామేన్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, సాయిచంద్, అజయ్, కమల్ కామరాజు బ్రహ్మాజీ, రవికృష్ణ పాల్గొన్నారు. -
సినిమా హిట్.. థియేటర్‌కు వెళ్లిన విరూపాక్ష దర్శకుడికి షాక్..
చాలా కాలం తర్వాత విరూపాక్షతో హిట్ అందుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించగా ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. థియేటర్‌కు వచ్చినవాళ్లను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమాపై అటు సినీప్రేమికులు, ఇటు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఒక్కసారి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందామో నేరుగా చూద్దామని కార్తీక్ వర్మ, నిర్మాత బాపినీడుతో కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లాడు. తన సినిమాను స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయాడు డైరెక్టర్. సినిమా చూస్తున్నంతసేపు బాగానే ఉంది కానీ బయటకు వచ్చాక చూసుకుంటే జేబులో మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. థియేటర్లో ఉన్నప్పుడు ఎవరో ఆయన ఫోన్ కొట్టేశారు. ఈ విషయాన్ని కార్తీక్ వర్మే స్వయంగా వెల్లడించాడు. సినిమా హిట్టయింది కానీ ఫోన్ పోయిందని చెప్పుకొచ్చాడు. విరూపాక్ష విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. చదవండి: ప్రియురాలి ఆత్మహత్య.. మూడేళ్ల తర్వాత నటితో నటుడి లవ్ మ్యారేజ్ -
సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు.. సుకుమార్ ఎమోషనల్
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు, విరూపాక్ష దర్శకుడు గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కార్తీక్ దండు గురించి సుకుమార్ మాట్లాడుతూ.. 'కార్తీక్ దండు నా శిష్యుడు. అతను మొదట ఒక కథ చెప్పాడు. అది నాకు పెద్దగా నచ్చలేదు. కార్తీక్ నేరేషన్ బాగా నచ్చింది. ఇంకో కథతో రమ్మని చెప్పా. నేను అమేజ్ అయిపోయా. ఆ తరువాత అతనికి బాపినీడును పరిచయం చేసి.. సాయికి కథ చెప్పించాను. అతని లైఫ్ చాలా చిన్నది. నాకు తెలిసి మరో ఐదేళ్లు బతుకుతాడేమో. అతనికి ఓ మెడికల్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఆ బాధను అధగమించి ఈ సినిమా తీశాడు. తన లైఫ్ చాలా క్రిటికల్‌గా ఉన్నా కూడా.. సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు. కేవలం స్టెరాయిడ్స్ తీసుకుని బతికేవాడు. మీ అమ్మగారి ప్రార్థనలే నిన్ను బతికించాయి. ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. నేను కేవలం సపోర్ట్‌గా నిలిచా. ఈ సినిమా కార్తీక్‌కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నా. అతన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడూతూ.. 'మొదటిసారి నేను దిల్‌రాజ్ అమ్మాయి పెళ్లిలో కలిశాం. అక్కడే అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. విరూపాక్ష షూట్‌కు వెళ్లినప్పుడు ఒకసారి షవర్ అయ్యాను. నటించడానికి ఇబ్బంది పడ్డాడు. తనకిది నటుడిగా పునర్జన్మ. మొదటి రోజు సాయి డ్యాన్స్ చేస్తే మీకు కన్నీళ్లు ఆగవు. ప్రమాదం తర్వాత తీసిన సినిమా ఇది. తప్పకుండా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది.' అంటూ ప్రశంసలు కురిపించారు. -
బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ముఖాముఖీ
-
ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...
‘‘ఒకే లక్ష్యం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పోరాటమే ఈ చిత్రం’’ అంటున్నారు కార్తీక్ వర్మ దండు. ఆయన దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ‘‘కొత్త పంథాలో తెరకెక్కిన ఈ సినిమా రెండు గంటల సేపు అన్ని వర్గాల వారికీ కడుపుబ్బా నవ్వులు పంచుతుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత అన్నారు. ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, నవీన్, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె ధరణ్, సహనిర్మాతలు: పెన్మెత్స రఘు, కాకర్లపూడి రామకృష్ణ. -
భమ్ బోలేనాథ్ మూవీ స్టిల్స్