ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు... | What Did Rana's Mad Friends Do? | Sakshi
Sakshi News home page

ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...

Published Sun, Feb 22 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...

ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...

‘‘ఒకే లక్ష్యం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పోరాటమే ఈ చిత్రం’’  అంటున్నారు కార్తీక్ వర్మ దండు. ఆయన దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న  విడుదల కానుంది. ‘‘కొత్త పంథాలో తెరకెక్కిన ఈ సినిమా రెండు గంటల సేపు అన్ని వర్గాల వారికీ కడుపుబ్బా నవ్వులు పంచుతుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత అన్నారు.

 ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, నవీన్, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె ధరణ్, సహనిర్మాతలు: పెన్మెత్స రఘు, కాకర్లపూడి రామకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement