three persons
-
ఘోరం: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు
ముంబై: ఒక వ్యక్తి తనను తదేకంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించాడని ముగ్గురు వ్యక్తుల దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన ముంబైలో మాతుంగ ప్రాంతంలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....కాల్సెంటర్లో పనిచేసే రోనిత్ భలేకర్ తన స్నేహితుడితో మద్యం మత్తులో ఉన్నప్పుడూ ఈ దారుణం జరిగింది. భలేకర్ అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఒకర్నీ తనను ఎందుకు తదేకంగా చూస్తున్నారంటూ గొడవపడ్డాడు. దీంతో వారు కోపంతో అతన్ని బెల్టుతో పదేపదే కొట్టి ఛాతీ, కడుపుపై దారుణంగా తన్నారు. దీంతో సదరు వ్యక్తి భలేకర్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఈ ఘటనతో భయపడిన నిందితులు బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అతను ఆస్పత్రి చేరక మునుపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో షాహు నగర పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?) -
దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కరోనా వైరస్ ప్రబలకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా నగరంలో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులపై ఇనగుదురుపేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ అఖిల్‌జమ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 9వ తేదీన మచిలీపట్నం వచ్చారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు గృహంలోనే ఉండాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ జన సంచారం ఉండే ప్రాంతాల్లో ముగ్గురు తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గృహ నిర్బంధం చేసినట్లు సీఐ తెలిపారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం) ఎన్ఆర్ఐపై.. హౌస్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన ఓ ఎన్ఆర్ఐ రోడ్లపై సంచరిస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇంటిలో ఉంచి స్టేషన్ సిబ్బందిని కాపలా పెట్టారు. రూరల్ ఎస్ఐ లక్ష్మీనరసింహమూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం నెలకుర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పదిహేను రోజుల క్రితం యూఎస్ నుంచి సొంత గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అతడిని హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. సదరు వ్యక్తి గ్రామంలో తిరుగుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనలో ఉన్న గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లి హౌస్ ఐసోలేషన్‌లో ఉంచి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (షాదీ.. 'కరోనా') కల్లుగీత కారి్మకుడిపై.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మందుబాబులకు కల్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై బందరు రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం గుండుపాలేనికి చెందిన రాజు గ్రామంలో కల్లు గీస్తుంటాడు. సోమవారం కల్లు గీసి గ్రామస్తులకు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (కరోనాకు 35,349 మంది బలి) -
అమీన్పూర్లో బాలిక గ్యాంగ్‌రేప్?
పటాన్చెరు: బాలిక అత్యాచారం, ఆపై హత్యకు యత్నం వార్తలతో అమీన్పూర్లో కలకలం రేగింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు తనను అత్యాచారం చేసి హత్య చేసేం దుకు ప్రయత్నిస్తున్నారని ఓ బాలిక ఫోన్ లో తన తండ్రికి సమాచారం ఇచ్చింది. దాంతో ఆ బాలికను స్థానికులు కాపాడేందుకు వెళ్లగా దుండగులు పరారయ్యారు. అయితే తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన బాలిక కథనానికి భిన్నంగా పోలీసులు ఆమె పై అత్యాచారమే జరగలే దని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వాణినగర్ లోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి వద్ద సదరు బాలిక తండ్రిగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆ బాలిక స్వస్థలమైన ఏపీలోని శ్రీకాకుళంలోనే ఉంటోంది. సెలవు లుండటంతో పది రోజుల క్రితమే తండ్రి వద్దకు వచ్చింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే బైక్‌పై వచ్చిన వ్యక్తి తనను బెదిరించి నిర్మానుష్య ప్రాం తానికి తీసుకెళ్లగా.. ఆ తర్వా త మరో ముగ్గురు కారులో వచ్చి తనపై లైంగి కదాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఈలోగా తన ఫోన్ నుంచి తండ్రికి సమాచారమివ్వగా అందరితో వచ్చి కాపాడారని వెల్లడించింది. అత్యాచారం జరగలేదు: ఎస్పీ దీనిపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల తర్వా త బాలికపై అత్యాచారం జరగదలేని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. బైక్‌పై ఎం దుకు వెళ్లావని ప్రశ్నిస్తే.. అతను ముందే తెలుసని.. తన నగ్న చిత్రాలు ఫోన్లో ఉన్నాయని బెదిరించి వాహనంపై తీసుకెళ్లాడని ఆమె చెప్పిందన్నారు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తరలించిన నిందితులను పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. బాలిక కిడ్నాప్.. అత్యాచారం టేక్మాల్(మెదక్): బాలికను అపహరించుకుపోయి అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. అల్లాదుర్గం సీఐ రవి కథనం ప్రకారం.. టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన బాలిక (15) సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 18న నానమ్మతో కలసి మధ్యాహ్నం చేనుకి వెళ్లింది. ఇద్దరూ కలసి పని చేస్తుండగా నీళ్లు తాగుతానంటూ ఆ బాలిక చేను వద్ద ఉన్న గుడిసెలోకి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఈనెల 21 పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరపగా అదే గ్రామానికి చెందిన పిట్ల లక్ష్మణ్ (23) బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో ఉండే లక్ష్మణ్ బంధువు మల్లయ్య ఇంట్లో బాలికను ఉంచినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం పోలీసులు మిన్పూర్కు వెళ్లి వారిని పట్టుకున్నారు. లక్ష్మణ్, మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
భారీగా పాత పెద్ద నోట్ల పట్టివేత
హైదరాబాద్: నగరంలో రద్దైన పెద్ద నోట్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొంతకాలం పాటు పెద్ద మొత్తంలో నల్లడబ్బును అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్లు రద్దై నాలుగు నెలలు కావొస్తున్నా ఇంకా దుండగులు పాత పెద్ద నోట్లతో పట్టుబడుతుండటం సంచలనాన్ని రేపుతోంది. కాగా, సోమవారం పట్టుబడిన రూ.500, రూ.1000 పాత పెద్ద నోట్ల విలువ రూ.కోటి ముప్ఫై ఐదు లక్షల ఎనభై వేలు. ఇంత భారీ మొత్తంలో పాత నోట్లు నిందితులకు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
పెచ్చులూడి ముగ్గురికి గాయాలు
అమడగూరు : మండల కేంద్రంలోని స్త్రీ శక్తి కార్యాలయంలో పెచ్చులు (సీలింగ్) ఊడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఐకేపీ కార్యాయలంలో ఆకులవారిపల్లి శ్రీలక్ష్మీ ఏహెచ్‌జీ డాక్యుమెంటేషన్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహిస్తున్నప్పుడే పెచ్చులూడిపడి కింద కూర్చున్న ఆకులవారిపల్లికి చెందిన మల్లికార్జున నాయుడుతోపాటు శివయ్య, ఈశ్వరమ్మ దంపతులపై పడింది. దీంతో వారందరికీ గాయాలయ్యాయి. చికిత్సల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కాగా స్త్రీ శక్తి భవనం నిర్మించి రెండేళ్లు కూడా గడవకనే ఇలా పెచ్చులూడి పడిపోవడంపై పలువిమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని పనులకు ఉన్నతాధికారులు సైతం ఎలా బిల్లులు చేశారని మండల వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ చూపితే జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని మండల వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
గణపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్‌పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సమ్మయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా తాగొచ్చి భార్యతో గొడవపడి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా బుధవారం పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమారులు ఉం డగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఉన్నారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపెండ్యాలలో ఉపాధ్యాయురాలు.. చిన్నపెండ్యాల(స్టేçÙన్‌ఘన్‌పూర్) : భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిన్నపెండ్యాలలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఘన్‌పూర్‌కు చెదిన గుంటి లింగయ్య, ఎల్లమ్మ దంపతుల కూతురు రజిత(25)కు మండలంలోని చిన్నపెండ్యాలకు చెందిన బుల్లె అయిలయ్య, ఐలమ్మ దంపతుల కుమారుడు రవితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. ప్రతీ రోజు ఏదో ఒక విధంగా వేధిస్తుండడంతో రజిత అదే గ్రామంలోని శ్రీగాయత్రి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అయినా రాత్రి వేళలో వేధించేవాడు. దీంతో మనోవేదనకు గురైన రజిత మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందుతాగింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంకరాజుపల్లిలో వృద్ధురాలు.. ఏటూరునాగారం : వృద్ధాప్యంలో తనను చూసుకునేవారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని శంకరాజుపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గోనె సమ్మక్క(90) కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఆలనపాలన చూసే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుం ది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
గల్లంతైన ముగ్గురూ మృతి
వాగులో కిలోమీటరు దూరం కొట్టుకొచ్చిన మృతదేహాలు ఆచూకీ కోసం గంటలపాటు శ్రమించిన సిబ్బంది చినకోండ్రుపాడు (ప్రత్తిపాడు): కొండవాగులో శనివారం సాయంత్రం గల్లంతైన ముగ్గురూ మృతిచెందారు. వారి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. నడింపాలెం పంచాయతీలోని చినకోండ్రుపాడుకు చెందిన ముగ్గురు కూలీలు స్థానికంగా ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ వాగులో గల్లంతైన సంగతి తెలిసిందే. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గల్లంతైంది ఇలా.. వాగులో ముగ్గురూ గల్లంతైన ఘటనపై తొలుత రకరకాల ప్రచారం జరిగింది. చినకోండ్రుపాడుకు చెందిన కుంటిగొర్ల చంద్రిక (13), గడ్డం కోటేశ్వరమ్మ (45), చాగంటి సామ్రాజ్యం (45), పల్లబోతుల శ్రీనాథ్ (12) శనివారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక పౌల్ట్రీ ఫాంలో కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో నలుగురూ ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నలుగురూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని వాగు దాటేందుకు ప్రయత్నించారు. వాగు ఉధృతికి నలుగురూ వాగులోకి కొట్టుకుపోయారు. అదే సమయంలో శ్రీనాథ్ ఓ చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగాడు. అక్కడి నుంచి గ్రామంలోకి వచ్చిన శ్రీనాథ్ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ఈ విషయం వెలుగుచూసింది. విస్తృతంగా గాలింపు.. గల్లంతైన వారి కోసం శనివారం రాత్రంతా రెవెన్యూ, పోలీస్ అధికారులు గాలింపు చేపట్టినప్పటికీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహాలను గుర్తించటం వీలు పడలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచే గాలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్పెషల్ స్రై్టకింగ్ ఫోర్స్, స్థానికులు వేకువజాము నుంచే రంగంలోకి దిగారు. తొలుత కుంటిగొర్ల చంద్రిక, గడ్డం కోటేశ్వరమ్మల మృతదేహాలు లభ్యమయ్యాయి. చాగంటి సామ్రాజ్యం మృతదేహం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరుగంటల పాటు విస్తృత గాలింపు అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో సామ్రాజ్యం మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాలు దాదాపు కిలోమీటరు దూరం కొట్టుకొచ్చాయని సిబ్బంది తెలిపారు. బాధితురాలి భర్త కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు ఎస్ఐ వీరేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యల్లో 20 మంది ఎన్డీఆర్ఎఫ్, ఏడుగురు ఫైర్, వివిధ విభాగాలకు చెందిన 30 మంది పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు గాలింపు చర్యలకు సహకరించారు. గాలింపు చర్యలను వట్టిచెరుకూరు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, ప్రత్తిపాడు ట్రైనీ ఎస్ఐ ఖాదర్‌భాషా తదితరులు పర్యవేక్షించారు. -
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ములుగు : జనశక్తి పార్టీ పేరుతో ములుగు ప్రాంతంలో పాటలు పాడుకుంటూ చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురిని శనివా రం ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్సై సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండ లం గురిజాలకు చెందిన వెంపాటి కుమారస్వామి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్‌గా ఉన్నాడు. గతంలో ఉప్పల్‌లో జరిగిన ఓ మర్డ ర్ కేసులో సైతం అతడు ప్రధాన నిందితుడు. కుమారస్వామితో పాటు దేవరుప్పుల మండ లం సింగరాజుపల్లికి చెందిన మేడ సురేశ్, తొర్రూరుకు చెందిన ఆంబోతు సోమన్నలు గ్రూపుగా ఏర్పడి ఇది వరకు దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో జనశక్తి పార్టీ పేరుతో చందాలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ములుగు మండలంలోనూ చందాలు వసూలు చే యాలని పథకం పన్నారు. శనివారం ఉద యం మండలకేంద్రంలోని బండారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో ఏఎస్సై సమ్మిరెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీను, సునీల్ వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో జనశక్తి పేరుతో చందాల వసూళ్లకు వచ్చినట్లు తెలిపారు. వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సురేశ్, సోమన్నలు అరుణోదయ కళా బృందంలోనూ పనిచేస్తున్నారు. -
మహారాష్ట్రలో ముగ్గురు హైదరాబాదీల అరెస్టు
* భారీగా తూటాలు, డిటోనేటర్లు స్వాధీనం * నగరంలోని ఆర్మరీ నిర్వాహకులుగా గుర్తింపు * లోతుగా విచారిస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ * ముదస్సీర్ ఉదంతం నేపథ్యంలో ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని యవత్మాల్లో ముగ్గురు హైదరాబాదీలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో భారీగా తూటా లు, డిటోనేటర్లు ఉండటంతో మహారాష్ట్ర ఏటీఎస్ లోతుగా విచారిస్తోంది. ప్రాథమిక వివరా ల ప్రకారం వీరు నగరంలోని ఓ ఆయుధ విక్ర య దుకాణానికి చెందినవారని తెలిసింది. అయితే 2014లో హైదరాబాద్‌లో అరెస్టయిన షా ముదస్సీర్ను గతేడాది మరో కేసులో యవత్మాల్ పోలీసులే అరెస్టు చేయడం, అది ఉగ్రకోణంతో కూడింది కావడంతో ఈ ముగ్గురినీ ఏటీఎస్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. పఠాన్‌కోట్ ఎఫెక్ట్‌తో తనిఖీలు: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సోదాలు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి యవత్యాల్ పోలీసులు ఏపీ రిజిస్ట్రేషన్‌తో వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో .22 క్యాలిబర్ తూటాలు 50, .6030 క్యాలిబర్ తూటాలు 10, మరికొన్ని డిటోనేటర్లు కనిపిం చాయి. దీంతో వాహనంలోని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మసివుద్దీన్ ఓవైసీ, మహ్మద్ ఉమర్ ఘాజీ, మహ్మద్ మిరాజుద్దీన్గా గుర్తిం చారు. తాము అబిడ్స్‌లోని ఓ ఆర్మరీలో పనిచేస్తామని, యవత్మాల్ జిల్లాలో ఉన్న పుసద్ టౌన్లో ఒకరికి వీటిని ఇచ్చేందుకు వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది. పుసద్‌లో డెలివరీ అనే విషయం తెలియగానే అప్రమత్తమైన యవత్మాల్ పోలీసులు ఏటీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీఎస్ టీమ్ ముగ్గురినీ ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి తరలించి విచారిస్తోంది. పుసద్ లింకుతో ఉలికిపాటు: మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ జిల్లా షా కాలనీకి చెందిన షా ముదస్సీర్ అలియాస్ తల్హా, అంగోలీ జిల్లా అఖడ్‌బాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద బాటపట్టి సిమిలో చేరారు. అల్ కాయిదా శిక్షణ పొందేం దుకు అఫ్ఘానిస్థాన్‌కు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా నగరానికి చేరుకున్న వీరిని సికింద్రాబాద్(2014)లో పోలీసులు అరెస్టు చేశారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు సహకరించినట్లూ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముదస్సీర్ బెయిల్‌పై వచ్చాడు. కాగా, గతేడాది మహారాష్ట్రలోని పుసద్‌లో జరిగిన ఘర్షణల్లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన అబ్దుల్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని ప్రేరేపించింది ముదస్సీర్ అని తేలడంతో అతడినీ అరెస్టు చేశారు. ఇప్పుడు యావత్మాల్లో చిక్కిన ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారు కావడం, తూటాలు, డిటోనేటర్లను పుసద్‌లో డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పడంతో మహారాష్ట్ర పోలీసులు ఉలిక్కిపడ్డారు. వీరిని విచారిస్తున్న ఏటీఎస్ బృందం తెలంగాణ పోలీసులతోనూ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర నిఘా వర్గాలు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ ముగ్గురూ యవత్మాల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటాడటానికి వెళ్లినట్లు తేలిందని తెలిసింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ఏటీఎస్‌కు చేరవేశారు. -
బంజారాహిల్స్‌లో సైకోదాడి: ఒకరి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ - 12 ఎన్బీటీ నగర్లో రహదారిపై వెళ్తున్న ఐదుగురు వ్యక్తులను ఓ సైకో అడ్డగించి... కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బబ్లూ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ఆసుపత్రికి చేరుకొని దాడి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విహారయాత్రలో విషాదం...
ఖాజీకోడ్: కర్ణాటక నుండి కేరళకు విహారయాత్రకు బయలుదేరిన బృందానికి విషాదమే మిగిలింది. బృందంలో ముగ్గురు నదిలో స్నానానికి దిగి ప్రాణాలు కోల్పోవడంతో వారు దిగ్భాంతికి లోనయ్యారు. కాగా చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విషాదం. మృతుల్లో ఇద్దరు తండ్రీ కొడుకులు కాగా మరొకరు దగ్గరి బంధువు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కర్ణాటకు చెందిన సుమారు పదిహేనుమంది కేరళ పర్యటనకు బయలుదేరారు. మధ్యలో ఖాజీకోడ్ సమీపంలోని కప్పాడ బీచ్‌లో ఆగారు. వీరిలో ఇందూధర్, వెంకటనారాయణ, వెంకటేష్ అనే ముగ్గరు స్నానానికి నదిలో దిగారు. అకస్మాత్తుగా నదిలో మునిగిపోతూ కేకలు వేయడం ప్రారంభించారు. వీరి అరుపులు వున్న స్థానికులు, మత్స్యకారులు వారిని ఒడ్డుకు చేర్చినా ఫలితం దక్కలేదు. హుటాహటిన వారిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. -
ఒకే లక్ష్యం కోసం ఆ ముగ్గురు...
‘‘ఒకే లక్ష్యం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పోరాటమే ఈ చిత్రం’’ అంటున్నారు కార్తీక్ వర్మ దండు. ఆయన దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ‘‘కొత్త పంథాలో తెరకెక్కిన ఈ సినిమా రెండు గంటల సేపు అన్ని వర్గాల వారికీ కడుపుబ్బా నవ్వులు పంచుతుంది’’ అని ఈ సందర్భంగా నిర్మాత అన్నారు. ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, నవీన్, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె ధరణ్, సహనిర్మాతలు: పెన్మెత్స రఘు, కాకర్లపూడి రామకృష్ణ. -
మంచిర్యాలలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు హైదరాబాద్ వైద్యులు శనివారం నిర్ధరించారు. మంచిర్యాల టౌన్ కు చెందిన ముగ్గురి రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా వారికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. బాధితులలో ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరికి మంచిర్యాల ఆస్పత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు. -
యువతిపై సామూహిక అత్యాచారం
తెనాలిలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలిలో నివసిస్తున్న ఒక యువతిని ముగ్గురు యువకులు వేమూరు పొలాల్లోకి తీసుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార విషయాన్ని బయటకు వెల్లడిస్తే తల్లిని, తమ్మున్ని చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు దాడులు: వ్యభిచారులు, జూదరులు అరెస్ట్
గుంటూరు జిల్లా వినుకోండ పట్టణంలో గత అర్థరాత్రి పలు లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జూదం ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5800 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గృహిణిని నిర్బంధించి సామూహిక అత్యాచారం
ఠాణే: మహిళలపై మృగాళ్ల ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వారి ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని దివాలో ఓ గృహిణిపై ముగ్గురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్యలో ఆమెను తన ఇంట్లోనే బంధించి పలుమార్లు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బాధితురాలిని బెదిరించారు. ఈ నేరం చేసేలా నిందితులను ప్రేరేపించిన ఓ మహిళపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితులు బట్టూ, బలియా, వారి స్నేహితుడు గుర్తించారు. బాధితురాలి భవనంలోనే ఉంటున్న సోనియా అనే మహిళ ఆ ముగ్గురు దుండగులకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఖమ్మం జిల్లాలో దారుణం