పెచ్చులూడి ముగ్గురికి గాయాలు | cealing drops.. three persons injured | Sakshi
Sakshi News home page

పెచ్చులూడి ముగ్గురికి గాయాలు

Published Tue, Feb 28 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

cealing drops.. three persons injured

అమడగూరు : మండల కేంద్రంలోని స్త్రీ శక్తి కార్యాలయంలో పెచ్చులు (సీలింగ్‌) ఊడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఐకేపీ కార్యాయలంలో ఆకులవారిపల్లి శ్రీలక్ష్మీ ఏహెచ్‌జీ డాక్యుమెంటేషన్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహిస్తున్నప్పుడే పెచ్చులూడిపడి కింద కూర్చున్న ఆకులవారిపల్లికి చెందిన మల్లికార్జున నాయుడుతోపాటు శివయ్య, ఈశ్వరమ్మ దంపతులపై పడింది. దీంతో వారందరికీ గాయాలయ్యాయి.

చికిత్సల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కాగా స్త్రీ శక్తి భవనం నిర్మించి రెండేళ్లు కూడా గడవకనే ఇలా పెచ్చులూడి పడిపోవడంపై పలువిమర్శలు వ్యక్తమవుతున్నాయి.  నాణ్యత లేని పనులకు ఉన్నతాధికారులు సైతం ఎలా బిల్లులు చేశారని మండల వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ చూపితే జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని మండల వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement