
డాలస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో బుధవారం జరిగిన కాల్పుల ఘట నలో నలుగురు చనిపోయారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ఫెసిలిటీ భవనంపై ఓ వ్యక్తి పక్కనున్న భవనం నుంచి కాల్పులకు దిగాడు. ఘటన లో ముగ్గురు చనిపోయారు. పోలీసులు జరి పిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. ఐసీఈ అధికారులే లక్ష్యంగా ఈ కాల్పులకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దుండగుడి వివరాలు తెలియరాలేదు. మృతుల వివరాలను కూడా పోలీసులు తెలపలేదు. అయితే, వీరిలో కొందరు ఐసీఈలో నిర్బంధించిన వారు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. జూలై 4వ తేదీన టెక్సాస్ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఓ అధికారి గాయపడ్డారు. జూలై 7న టెక్సాస్ సమీపంలోని మెకల్లెన్ వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో బోర్డర్ పెట్రోల్ అధికారి ఒకరు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో దుండగుడు చనిపోయాడు.