immigration
-
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. న్యాయమూర్తులను తొలగిస్తూ..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. అంతకు ముందు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను నోటీసు లేకుండా తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ తెలిపారు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు. ‘తన దేశాన్ని కాపాడుకునే వారు ఎన్నటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించరూ’ అంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల జారీఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం,పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు,ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం, అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ఇలా మెరుపు వేగంతో పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వరుస వ్యాజ్యాలుఅయితే, వాటిల్లో అక్రమ వలసలపై కొనసాగుతున్న కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో పనిచేయకుండా నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడం అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా పలువురు ట్రంప్ నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిల్లో, అక్రమ వలసలపై అణిచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేసే ఏడు వ్యాజ్యాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్‌పై పలు కేసులు నమోదయ్యాయని అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నెపోలియన్‌ను ప్రస్తావిస్తూఈ వరుస పరిణామలపై ట్రంప్ స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడు అని ట్రూత్ సోషల్ యాప్‌లో పోస్ట్ చేసారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు 1804లో నెపోలియన్ కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించిన ఫ్రెంచ్ సైనిక నాయకుడి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ, ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్‌ను వినిపించేవారు. కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని ట్రంప్ చెబుతుండగా, ఆయన సలహాదారులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దాడి చేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం ట్వీట్ చేశారు. -
ట్రంప్ దెబ్బకు..పీడ కలగా అమెరికా చదువు..!
అమెరికాలో చదువుకోవడం అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. అందుకోసం ఎన్నో ప్రయాసలుపడి, అప్పులు చేసి అమెరికాకు వస్తారు. ఎలాగోలా కష్టపడి మంచి యూనివర్సిటీలో సంబందిత కోర్సుల్లో జాయిన్ అయ్యి చదువుకుంటారు. అలాగే తల్లిదండ్రులకు భారం కాకుండా తమ ఖర్చుల కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాక..గ్రీన్‌కార్డ్ కోసం పాట్లుపడి ఏదోలా అక్కడే స్థిరపడేవారు. అలా అమెరికాలో జీవించాలనే కోరికను సాకారం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప దెబ్బకు భారత విద్యార్థులకు ఆ ధీమా పోయింది. అసలు అక్కడ చదువు సజావుగా పూర్తి చేయగలమా అనే భయాందోళనతో గడుపుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు కచ్చితంగా పనినిబంధనలు పాటించాలనే కొత్తి ఇమ్మిగ్రేషన్ చట్టాల నేపథ్యంలో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. అస్సలు అక్కడ ఉండాలో వెనక్కొచ్చేయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది విద్యార్థులు. అసలెందుకు ఈ పరిస్థితి..? భారతీయ విద్యార్థులు ఈ సమస్యను ఎలా అధిగమించొచ్చు తదితరాల గురించి తెలుసుకుందాం..!.ఇంతకుమునుపు వరకు అమెరికాలో చదువుకోవాలనుకునే చాలామంది భారతీయ విద్యార్థులు బ్యాంకు రుణం తీసుకునేవారు. ఆ తర్వాత జీవన ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్‌గా పనిచేయడం, ఏదోలా ఉద్యోగం పొందడం, H-1B వీసా పొందడం వంటివి చేసేవారు. ఇక ఆ తర్వాత తమ విద్యా రుణాన్ని తిరిగి చెల్లించి అక్కడే స్థిరపడేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇదంతా చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించినా..అందుకోసం మనవాళ్లు చాలా సవాళ్లనే ఎదుర్కొంటారు. అది కాస్తా ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని మరింత కఠినంగా మారిపోయింది. అసలు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏంటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అగ్రరాజ్యంలో చదువుకోవడానికి వచ్చిన చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి పంపిస్తే వచ్చినవారే. వారంతా తమ ఖర్చులు కోసం తామే చిన్న చితకా ఉద్యోగాలు చేసి చదుకోవాల్సిందే. ఇప్పుడేమో ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం ..చదువుకునే విదేశీ విద్యార్థులంతా పని నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి. పైగా స్టూడెంట్ వీసాలు కఠినమైన పరిమితుల కిందకు వచ్చాయి. ఇంతకుమునుపు ఎఫ్1 వీసా ఉన్నవారు సాధారణంగా విద్యా నిబంధనల సమయంలో వారానికి 20 గంటలు, సెలవులు, విరామ సమయాల్లో వారానికి 40 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధన ప్రకారం..పరిమితలుకు మించి పనిచేయడం లేదా క్యాంపస్ వెలుపల అనధికార ఉపాధి చేపడితే విద్యార్థి హోదాను కోల్పోవడం తోపాటు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు..సజావుగా స్టడీస్ పూర్తి చేయాలంటే..విద్యార్థులు అమెరికాలో తమ స్టడీస్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే..తమ వీసా స్థితికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. విద్య నాణ్యత, కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉండే టైర్ 1 లేదా టైర్ 2 లాంటి విద్యా సంస్థలలో చదువుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ట్యూషన్ ఖర్చులు విషయమై ఆందోళన చెందకుండా క్యాంపస్‌లోనే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే చదువుకు సంబంధంలేని ఉపాధి చేయడానికి లేదనే నిబంధన ఉంది కాబట్టి వీసా నిబంధనను ఉల్లంఘించకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేయపోవడమే మంచిది. అలాగే విద్యార్థులు తమ విద్యా సంస్థలోని అంతర్జాతీయ విద్యార్థి కార్యాలయాన్ని సంప్రదించడం లేదా సందేహం వచ్చినప్పుడు న్యాయ సలహ తీసుకోవడం వంటివి చేస్తే.. వీసా సంబంధిత కఠిన సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. అలాగే అక్కడ వసతికి సంబంధించిన అంతరాయలను కూడా సులభంగా నివారించుకోగలుగుతారు. కఠినతరమైన సమస్యలు, ఆంక్షలు అటెన్షన్‌తో ఉండి, నేర్పుగా పని చక్కబెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తాయే గానీ భయాందోళనలతో బిక్కుబిక్కుమని గడపటం కాదని నిపుణులు చెబుతున్నారు.-చిట్వేల్ వేణుగమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్ఆర్ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.(చదవండి: ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా! -
కెనడా ప్రధాని రేసులో...రూబీ దల్లా!
కెనడా ప్రధాని పదవి కోసం మరో భారతీయ నేత తలపడనున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటుండటం తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నేత పదవికి భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు రూబీ దల్లా పోటీ పడనున్నారు. రూబీ దల్లా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లారు. ఆమె కెనడాలో మనిటోబాలోని విన్నిపెగ్‌లో జన్మించారు. బయో కెమిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణలో డిగ్రీ చేశారు. కొంతకాలం ఆరోగ్య సంరక్షకురాలు (చిరోప్రాక్టర్)గా పని చేశారు. తర్వాత అందాల పోటీల్లో, సినిమాల్లోనూ రాణించారు. 1993లో మిస్ ఇండియా–కెనడా పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం పారిశ్రామికవేత్తగా రాణించారు. దల్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా ఉన్నారు. కెనడా పార్లమెంటుకు మూడుసార్లు వరుసగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అదే ఊపులో ఆ దేశ ప్రధాని పదవి చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా కూడా రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2008లో జరిగిన ఓ సర్వేలో కెనడా పార్లమెంటులో సెక్సీయెస్ట్ ఎంపీల్లో రూబీ మూడో స్థానంలో నిలిచారు. అదే ఏడాది మాక్సిమ్ మేగజైన్ ఆమెకు ప్రపంచంలోని హాటెస్ట్ రాజకీయవేత్తల్లో మూడో ర్యాంకు ఇచ్చింది. తాను ప్రధాని అయితే అక్రమ వలసదారులందరినీ కెనడా నుంచి పంపించేస్తానని ప్రకటించడం ద్వారా రూబీ ఇటీవలే వార్తల్లో నిలిచారు. అందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ సారథ్యం, ప్రధాని పదవి విషయంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. లిబరల్ పార్టీ తదుపరి నేత ఎవరన్నది మార్చి 9న తేలే అవకాశముంది. పదేళ్ల వయసులోనే ఇందిరకు లేఖ పదేళ్ల వయసులోనే నాటి భారత ప్రధాని ఇందిరాగాం«దీకి లేఖ రాసి రూబీ ఔరా అనిపించారు. పంజాబ్‌లో అస్థిరత, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై చేపట్టిన బ్లూస్టార్ సైనిక చర్యలపై తన అభిప్రాయాలను లేఖలో సూటిగా వెల్లడించారు. ‘‘పంజాబ్ హింసాకాండను టీవీలో చూసి వికలమైన మనసులో మీకు లేఖ రాస్తున్నా. అమాయక సిక్కుల ఊచకోతను, స్వర్ణ దేవాలయంపై దాడులను దయచేసి అడ్డుకోండి. సమస్యను ఇరు వర్గాలూ చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ఈ విషయంలో నేను చేయగల సాయమేమైనా ఉంటే దయచేసి చెప్పండి’’ అంటూ రాశారు. ఆ లేఖకు ఇందిర బదులివ్వడమే గాక ఈ విషయాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు! చిన్నారి రూబీని భారత్‌కు ఆహ్వానించారు. కానీ ఆలోపే ఇందిర హత్యకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వలసలకు విఘాతం
ప్రపంచ నలుమూలల నుంచీ లక్షల మంది యువతీ యువకులు అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది.మంచి వేతనాలు, మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అగ్రరాజ్యానికి ప్రయాణం కట్టిస్తోంది. కుదిరితే చట్టబద్ధంగా, లేదంటే ఆక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడోర్ ప్రజల తరువాత పెద్ద యెత్తున అనధికారికంగా అక్కడికి వెళ్తున్నది భారతీ యులే. 2021 నాటికే అమెరికాలో అలాంటి భారతీయుల సంఖ్య 7,25,000 మించిందని అంచనా. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో 4.6 శాతం వరకు అనధికా రికంగా వచ్చినవారేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ లోగడ వెల్లడించింది.వలసలే అభివృద్ధికి మూలంసమాజ పరిణామం జాతుల, గణాల వలసల క్రమంలోనే జరిగిందని నిర్ధారిస్తారు తన ‘ఏన్షియంట్ సొసైటీ’ పుస్తకంలో ఆంత్రొపాలజిస్ట్ హెన్రీ మోర్గాన్. వలసలు ప్రపంచ వ్యాప్తంగా అనాది కాలం నుంచి జరుగుతూ వచ్చాయి. వలసలు ప్రపంచీకరణను, సరళీకరణను, ప్రైవేటీకరణను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా వలసదారుల వల్ల ఎంతో ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతిని పొందిందని చెప్పక తప్పదు. నిజానికి ట్రంప్ తండ్రి కూడా అమెరికాకు వలస వచ్చినవాడే! వలసల ప్రాధాన్యాన్ని గుర్తించని ఏ దేశమైనా కుదించుకుపోయే అవకాశం వుంది. ఏ నాగరి కత కూడా ఒంటరిగా అభివృద్ధి చెందదు. మతమూ, మౌలికమైన ప్రాపంచిక దృక్పథాల విషయంలో కూడా స్థానికమైన ఆలోచనా ధోరణులపై ఒక మేరకు బయటి ప్రభావాలు ఉంటాయి. ఆ విధంగా అవి మిశ్రమ నేపథ్యాలవుతాయి. అమెరికాను పాలించిన ఎంతోమంది మేధావులు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాద భావాల్ని, వైజ్ఞానిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లినవాళ్లే. జాన్ డ్యూయి వంటి ప్రజాస్వామిక తత్వవేత్త ఆవిర్భవించిన నేల అది. అబ్రహాం లింకన్ ఎన్నో సామాజిక సంస్కరణలను తీసుకువచ్చారు. అమెరికాలో అభివృద్ధి చెందుతున్న ఎంతో విజ్ఞాన శాస్త్ర ప్రభావం ట్రంప్ మీద కనిపించటం లేదు. ఆది నుంచీ వివాదాస్పదుడే!చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు చేస్తూ ట్రంప్ గతంలో కూడా వార్తల్లో నిలిచారు. చొరబాటుదారులను నియంత్రించడానికి అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి పూనుకున్నారు. విదేశాల నుండి అమెరికాకి వచ్చి పురుడు పోసుకున్నంత మాత్రాన పుట్టిన బిడ్డలు పౌరులుగా మారడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. తాను అధ్యక్షుడైతే, అక్రమ వలసదారులను తన్ని తరిమేయటానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడాలంటే విదేశీ ముస్లింలందరినీ యూఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని ప్రతిపాదన పెట్టి విమర్శల పాలయ్యారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి ట్రంప్ జీవితంలో. అమెరికాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేకపోతే 51వ యూఎస్ రాష్ట్రంగా కెనడా కలిసిపోతుందని కూడా అన్నారు.మేల్కోవాల్సిన సమయంఇదే క్రమంలో మనం కూడా అమెరికాపై మోజును తగ్గించుకోవలసి వుంది. మన మేధావులను, సాంకేతిక నిపుణులను మన దేశ అభివృద్ధికి ఉపయుక్తం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి మనకు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన సంపదను పెంచుకున్నట్లయితే మనలో వలస భావన తగ్గుతుంది. ఇవాళ అమెరికా గురించి ఆందోళన చెందుతున్న మనం, మన దేశంలో రద్దవుతున్న రాష్ట్రాల హక్కుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఇతర దేశాలకు విద్య కోసం పరుగెడుతున్నారు. దీనికి కారణం విద్యా హక్కును మనం దెబ్బతీశాం. మన విశ్వవిద్యాలయాల్లో తగినన్ని సాంకేతిక పరికరాలు లేవు. విస్తృతమైన ల్యాబ్‌లు, గ్రంథాలయాలు లేక పోవడం వల్ల మన పిల్లలు వలస బాట పడుతున్నారు. ఇది భారతదేశం మేల్కోవలసిన సమయం. భయభ్రాంతులకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవలసి వుంది. మన పాలకులు అమెరికా నుండి తిరిగి వచ్చే విద్యార్థు లను, ఉద్యోగులను, స్కిల్ వర్కర్స్‌ను సాదరంగా స్వాగతించి, వారికి తగిన పనిని కల్పించడానికి పూనుకోవాలి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చారు. అప్పుడే మనం సిద్ధపడవలసి ఉంది. కానీ మనం ఉదాసీనత వహించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం. కొన్ని సామాజిక తరగతులు భారతదేశంలో జీవించడానికి ఇష్టపడనంతగా దేశీయేతర భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. ఇప్పుడు ఆ భావాల నుండి బయటపడాలి. దేశంలో కుటీర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మించుకోవలసి ఉంది. దేశీయ పారి శ్రామిక విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంబేడ్కర్ చెప్పేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో అనేకసార్లు వచ్చాయి. మనం ఈ పరిస్థితుల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో మానవులంతా ఏ దేశంలోనైనా జీవించవచ్చు, ఉపాధి పొందవచ్చు అనే ప్రపంచ పరిణామ సూత్రం మరోసారి చర్చలోకి వచ్చింది. మానవ జీవన వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకోవలసిన సమయమిది.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
బడికి పంపాలన్నా భయపడుతున్నారు
శాన్ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు. తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది. అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు. కంటి మీద కునుకు లేదు‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్‌లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు. ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్ ‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్‌చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
పౌరసత్వ రద్దు యోచన దారుణం: బైడెన్
వాషింగ్టన్: అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ హోదాతో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. రాజ్యాంగబద్దమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్ అన్నారు. అమెరికా జని్మంచినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దు నిబంధనల అమలును బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్ కోరడం హాస్యాస్పదమన్నారు. ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్ అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం బైడెన్‌కు పగ్గాలు అప్పగించేందుకు ట్రంప్ ససేమిరా అనడం, అధికార మార్పిడి ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న కాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పడం తెలిసిందే. దాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బైడెన్ అభివర్ణించారు. శ్వేతజాతి ఆధిపత్య భావన అమెరికాకు పొంచి ఉన్న పెను ముప్పుల్లో ఒకటన్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక దేశం మనది. అదే మన బలం కూడా. కాపిటల్ హిల్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం తట్టుకున్నందుకు గర్వపడాలి’’అంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 2021 తరహా హింసకు తావు లేకుండా ఈసారి అధికార మార్పిడి ప్రక్రియ శాంతియుతంగా సాగుతుందన్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కూడా బైడెన్ చెప్పారు. ‘‘2021లో నా ప్రమాణ స్వీకారానికి ట్రంప్ గైర్హాజరయ్యారు. అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇటీవల ఆయన్ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా’’అని గుర్తు చేశారు. -
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్‌కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది. -
ట్రంప్ శిబిరంలో వీసా చిచ్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్‌కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే. తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు. వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ మిల్లర్‌తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు. ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు. వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు. దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు. అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్‌కు సహకరిస్తాయన్నది ప్రశ్న. సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్‌తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్‌ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్‌ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. -
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం
అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్.. నూతన బ్రాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్, ఫౌండర్ నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్,మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ , తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసినట్లు ఎన్.ఎం గెహి తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు.భారత్, అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనా వారికి అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.గెహిస్ లీగల్ సర్వీసెస్ ముంబాయి తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటివారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.(చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్) -
సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రహసనమేమీ కాదు
సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగం సహా వివిధ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఆయా సర్టిఫికెట్ల ధృవీకరణ అత్యంత కీలకం, అనివార్యం. సాంకేతికంగా అటెస్టేషన్, అపోస్టిల్గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనం అనే భావన అనేకమందిలో ఉంది. ఈ కారణంగానే ఏజెంట్లను ఆశ్రయించి అధిక మొత్తం చెల్లించడమో, ఢిల్లీ వరకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవడమో జరుగుతోంది. అయితే.. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉన్న బ్రాంచ్ సెక్రటేరియట్ ఈ ప్రక్రియల్ని చేపడుతుందని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ (ఆరీ్పఓ) జొన్నలగడ్డ స్నేహజ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు ఒకే బ్రాంచ్ సెక్రటేరియట్ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే విద్యార్హత పత్రాలతో పాటు జనన, వివాహ ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధం అంశాల్లో కమర్షియల్ డాక్యుమెంట్లు సైతం అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి అయితేనే ఆయా దేశాల్లో ఆ సర్టిఫికెట్ల చెల్లుబాటవుతాయి. దరఖాస్తుదారులు సమరి్పంచే పత్రాలను పరిశీలించి, సరిచూసి అవి సరైనవే అంటూ సరి్టఫై చేయడాన్నే అటెస్టేషన్, అపోస్టిల్ అంటారు. ఇందులో భాగంగా ఆయా ధ్రువపత్రాలకు వెనక అపోస్టిల్ స్టిక్కర్‌తో పాటు స్టాంపు, సంతకం చేస్తారు. ఈ సేవల్ని అందించడం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దేశ వ్యాప్తంగా బ్రాంచ్ సెక్రటేరియట్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించింది సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉంది. దరఖాస్తులను సచివాలయాల్లో సమర్పించాలి ధ్రువీకరణ ప్రక్రియల్ని ఆర్పీఓ అధీనంలోని బ్రాంచ్ సెక్రటేరియట్ చేస్తున్నప్పటికీ.. దరఖాస్తుదారులు మాత్రం నేరుగా సంప్రదించే అవకాశం లేదు. ఆయా రాష్ట్ర సచివాలయాల్లోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో పని చేసే కౌంటర్లలోనే పత్రాలు సమరి్పంచాల్సి ఉంటుంది. దీనికి ముందు మీ సేవ, ఆన్లైన్ విధానాల్లో నిరీ్ణత రుసుము చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ విభాగం అధికారులు ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన విద్యా సంస్థ, ప్రభుత్వ విభాగం, చాంబర్లను సంప్రదించి వాటి విశ్వసనీయతను నిర్ధారించే జీఏడీ సిబ్బంది అథంటికేట్ అంటూ స్టాంప్ వేసి, సంతకం చేసి దరఖాస్తుదారుకు తిరిగి ఇస్తారు. ఈ పక్రియలో నూ సాధారణ, తత్కాల్ అనే విధానాలు అమలులో ఉన్నాయి. ఆపై దరఖాస్తుదారు ఎంఈఏ అ«దీకరణ తో పని చేసే ఏజెన్సీల ద్వారా ఈ సర్టిఫికెట్లను ఆర్పీ ఓ బ్రాంచ్ సెక్రటేరియట్‌కు పంపాల్సి ఉంటుంది. అదే రోజు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అదీనంలో ఉండే జీఏడీ నుంచి ఆర్పీఓలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు అదీకృత అధికారుల వివరాలను చేరతాయి. వీరి వివరాలు, సంతకాలు, స్టాంపులను ఆయా ఏజెన్సీల నుంచి వచ్చిన దరఖాస్తుదారు సర్టిఫికెట్లపై ఉన్న వాటితో సరిచూస్తారు. అన్నీ సరిపోలితే అటెస్టేషన్, అపోస్టిల్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ సర్టిఫికెట్ల మళ్లీ ఏజెన్సీ ద్వారానే దరఖాస్తుదారుడికి చేరతాయి. యూఏఈ, సౌదీ వంటి దేశాలు అటెస్టేషన్‌ను, హెగ్ కన్వెన్షన్‌లో ఉన్న మిగిలిన 126 దేశాలు అపోస్టిల్ను అంగీకరిస్తున్నాయి. బ్రాంచ్ సెక్రటేరియేట్ అటెస్టేషన్‌ను ఉచితంగా, అపోస్టిల్ను ఒక్కో పత్రానికి రూ.50 చొప్పున వసూలు చేసి పూర్తి చేస్తోంది. ఏజెన్సీ మాత్రం సరీ్వస్ చార్జీగా ఒక్కో పత్రానికి రూ.84 (స్కానింగ్ ఫీజు రూ.3 అదనం) తీసుకునేందుకు ఎంఈఏ అనుమతిచ్చింది. బ్రాంచ్ సెక్రటేరియట్ ఒకసారి చేసిన అటెస్టేషన్, అపోస్టిల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ చదివిన విదేశీ విద్యార్థులకూ తప్పనిసరి.. కేవలం భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారికే కాదు.. ఆయా దేశాల నుంచి వచ్చిన, ఇక్కడ విద్యనభ్యసించి తిరిగి వెళ్లే వారికీ అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. అప్పుడు ఇక్కడి విద్యాసంస్థలు జారీ చేసిన సరి్టఫికెట్లు అక్కడ చెల్లుబాటు అవుతాయి. ఎంఈఏ అధీకరణతో పని చేసే ఏజెన్సీల వివరాల కోసం వెబ్‌సైట్‌ను (www.mea.gov.in/ apostille. htm) సందర్శించాలి. అలాగే అటెస్టేషన్, అపోస్టిల్ అంశాల్లో ఇబ్బందులు ఉంటే ఈ–మెయిల్ ఐడీ(hobs.hyderabad@mea. gov.in) ద్వారా సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి నెలా 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. – జొన్నలగడ్డ స్నేహజ, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ -
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
వలసల నియంత్రణాధికారిగా టామ్ హొమన్
న్యూయార్క్: అమెరికా వలసల నియంత్రణ అధికారిగా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ డైరెక్టర్ టామ్ హొమన్ను నియమిస్తున్నట్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొడతానన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘వలసల నియంత్రణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే టామ్ హొమన్ను మన దేశ సరిహద్దులకు ఇన్చార్జిగా నియమిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నా’అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్లో వెల్లడించారు. దేశ దక్షిణ, ఉత్తర సరిహద్దులతోపాటు సముద్ర, గగనతల బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటారన్నారు. దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపేయడాన్ని ఆయన పర్యవేక్షిస్తారన్నారు. ఈ బాధ్యతలకు టామ్ హొమన్నే ట్రంప్ నియమిస్తారంటూ ఇటీవల పలు కథనాలొచ్చాయి.కాగా, తాజా నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు సైన్యం సాయం తీసుకోబోమంటూ ఇటీవల టాప్ హొమన్ ఇటీవల ఫాక్స్ న్యూస్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సమర్థంగా ఇటువంటి విధులను నిర్వర్తిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా, ఐరాసలో అమెరికా రాయబారిగా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -
ట్రంప్ ఎన్నికపై సైన్యంలో రుసరుసలు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు. దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చట్టానికే విధేయులం.. అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్ వర్సెస్ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్లైన్లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు
దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, పోర్చుగల్ నుంచి ఇజ్రాయెల్ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?భారతదేశం, ఆంగ్లోస్పియర్ (ఇంగ్లిష్ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. ట్రూడోకి కెనడియన్ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్ సిక్కు హత్యను, అమెరికన్ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. ‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్వ సింగ్ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్ ఐస్’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్ స్ప్రింగ్’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ అంచనా ఆధారపడి ఉంది.ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం, సంఘ్ పరివార్లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ
టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రావిన్స్‌ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్ ట్రూడో సోమవారం వెల్లడించారు. -
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్‌కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్‌లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్‌ను వదిలి బ్రిటన్‌కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్‌లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో వలసదారులపై దాడులు తీవ్రం
లండన్: వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్‌పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోం మంత్రి వివెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్‌పోర్ట్‌లో కత్తిపోట్లకు ముగ్గురు చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!
హైదరాబాద్ నుంచి బదిలీ అయి మహబూబ్ నగర్లో పని చేస్తున్నప్పుడు మా పిల్లల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆరు మాసాల సెలవు పెట్టి బయలుదేరాను. కుటుంబ సభ్యుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడమే తప్ప నేను వెళ్లడం మొదటి సారి కావడంతో కంగారు పడ్డాను. మా ఇంట్లోనేమో ‘ మీరు పోతున్నది అమెరికా మాత్రమే... చంద్రమండలానికి కాదు కదా ! ఇక్కడేదన్నా మరిచినా యూఎస్‌లో అన్నీ దొరుకుతాయి, మీకు కావలసిన పుస్తకాలు కూడా పుష్కలంగా ‘ అని జోక్ చేశారు. రాత్రి ఒంటి గంటకు ఎగిరే విమానం కోసం ఎందుకైనా మంచిదని మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరి, అన్ని చెకింగ్ లు పూర్తి చేసుకొని మొత్తం మీద ఫ్లైట్ ఎక్కేశా. నా పక్క సీట్లోనే కూర్చున్న ఓ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకొని అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడడం చూసి నేనూ మాట కలిపా, ఆమెది వరంగల్, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తున్నట్లు చెప్పింది. అమ్మా నాకిది మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ, ప్రయాణంలో కాస్త గైడ్ చేస్తుండు అన్నాను మాట వరసకి , మధ్యలో ఫ్లైట్ మారడం గురించే నా వర్రీ అంతా. ‘అయ్యో అంకుల్ నేను విమానం ఎక్కడమే ఇది ఫస్ట్ టైమ్, మీరే నాకు చెప్పాలి ! ‘ అన్నది నవ్వుతూ ఆమె. వేళాపాల లేకుండా ఏదో ఒకటి ఇస్తున్నారు తినడానికి, తాగడానికి రుచిపచి లేని ఆహారం. ఏక దాటిగా దాదాపు 10 గంటలు సీట్లో కూర్చోలేక, హ్యాండ్ లగేజీ తీసుకోడానికో, కాలకృత్యాలు తీర్చుకోడానికో, నేను మధ్యమధ్య లేస్తుంటే, మరో పక్కనున్న శ్వేతమహిళ తాను కదలలేక విసుక్కోవడం నాకు నచ్చలేదు. ఎలాగైతేనేం ఫ్రాంక్ ఫర్ట్లో అడుగు పెట్టాక, అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌లోని మరో టర్మినల్‌కు వెళ్ళడానికి బస్సు రెడీగా ఉండడం బాగుంది. బస్సు దిగగానే హ్యూస్టన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టెర్మినల్‌కి ఎలా వెళ్లాలో ఒకటికి రెండుసార్లు చెప్పింది అక్కడున్న జర్మనీ అమ్మాయి. వాళ్ల మర్యాద బాగుందనిపించింది. అదే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ..మా ఫ్లైట్ జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి ఓ అరగంట ముందే మాకు కస్టమ్ ఫార్మ్స్ ఇచ్చారు పూర్తి చేయడానికి. దిగిన తర్వాత నేరుగా బయటకు వెళ్లొచ్చన్న మూడ్‌లో ఉన్నాను. అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. మనం విమానం దిగగానే.. అమెరికాలో అడుగుపెట్టినట్టు కాదన్న విషయం తెలిసింది. ఫ్లైట్ నుంచి లాండ్ అయిన ప్రతీ ఒక్కరు అక్కడి సెక్యూరిటీ నిఘాలోకి వెళ్తారు. వాళ్లు సూచించిన మార్గంలోనే /దారిలోనే నడవాలి. అది కాస్తా.. తీరిగ్గా చెక్ పాయింట్‌కు దారి తీస్తుంది. దాన్నే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీని అమెరికాలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. అమెరికా దేశంలో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వ్యవస్థను 1789లో ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలను పొందుపరిచారు. వీసా అక్కడ వరకే..యూఎస్ కాన్సులేట్ వాళ్లు వీసా ఇవ్వగానే.. అమెరికాలో వాలిపోవచ్చని అనుకుంటారు. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఏ దేశం నుంచి ఏ నగరంలోని కాన్సులేట్ వాళ్లు వీసా ఇచ్చినా.. దాని పరిధి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వరకే. ఇక్కడి అధికారులు వచ్చే వ్యక్తులను, వారి దగ్గరున్న డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంటే హైదరాబాద్‌లో వీసా అధికారికి ఏ విషయమయితే చెప్పినామో.. దానికి మద్ధతుగా వెంట తెచ్చుకున్న ధృవపత్రాలను పరిశీలిస్తారు. అలాగే అనుబంధ ప్రశ్నలు అడుగుతారు. అనుమానం వస్తే అమెరికాలోకి అడుగుపెట్టకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు. నాకు ఎదురయిన అనుభవం ఏంటంటే.. నేను విమానంలో ఇచ్చిన కస్టమ్ ఫాంలో ఒక ప్రశ్న ఉంది. యూఎస్‌లో ఎంత కాలం ఉంటారు అని అడిగినప్పుడు అనాలోచితంగా 4 నెలలు అని రాశా, అది తప్పయింది. నిజానికి మా వాళ్లు నాకు 6 నెలల తర్వాతకు రిటర్న్ టికెట్ తీసుకున్నారు. దీన్ని పసిగట్టారు అక్కడి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారులు. ‘ మీ రిటర్న్ టికెట్ 6 నెలలకు ఉంది కదా ’ అని క్లియర్ చేయకుండా పై అధికారి దగ్గరకు పంపారు. నేనేదో అమెరికాలోనే ఉండిపోడానికి వచ్చినట్లు ఆయనగారు పదే పదే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నేను ఆనాటి ప్రభుత్వ సర్వీస్‌లోనే ఉన్న అధికారినని తెలుసుకున్నాక మాత్రం వదిలిపెట్టేశారు. మన వాళ్లు ఎదుర్కునే పరీక్ష ఏంటంటే.? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గురించి అవగాహన లేకుండా.. చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు తొలిసారి అమెరికా వెళ్లాల్సిన వారు, కాలిఫోర్నియాలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లాలని వీసా అధికారికి చెబుతారు. తీరా వెళ్లేప్పుడు మాత్రం న్యూయార్క్ సిటీ చూసి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. న్యూయార్క్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇక్కడికెందుకు వచ్చారని అడిగితే ఖంగు తింటారు. అమెరికాకు ఏ పని మీద వెళ్తున్నాం.? ఆ పనికి సరిపోయేలా దగ్గరున్న నగరానికే వస్తున్నామా? లేక తింగరి వేషాలు వేస్తున్నామా అన్నది పసిగట్టేస్తారు ఇక్కడి అధికారులు. పైగా మన పాస్‌పోర్ట్‌లో వీరు వేసే స్టాంపింగ్ డేట్ మనకు కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీకి మించి మనం అమెరికాలో ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు మీరు B1/B2 వీసా ఉండి అమెరికాలో జరగబోయే ఓ తెలుగు మహాసభలకు వస్తున్నారు. అదే పని మీద వీసా తీసుకున్నారు. కానీ మీ మనసులో దేశమంతా తిరిగితే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అది దాచిపెట్టి సభల కోసం వచ్చామని చెబితే స్టాంపింగ్ కేవలం నెల మాత్రమే వేస్తాడు. పద్ధతిగా వివరిస్తే మాత్రం ఆరు నెలల స్టాంపింగ్ వేస్తాడు. విద్యార్థులు.. జాగ్రత్త పడాలి ఇక్కడికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బందులు పడతారు. అమెరికాకు సిద్ధం కాగానే.. మన స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే.. సీనియర్లు, అమెరికాలో అప్పటికే ఉంటోన్న స్టూడెంట్స్‌తో వాట్సాప్/ఫేస్బుక్ చాటింగ్ మొదలు పెడతారు. ఎక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయి? డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చన్న ప్రశ్నలు వేస్తారు. ఆ చాట్ అలాగే ఫోన్లలో ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారికి మీ మీద డౌట్ వస్తే.. మీ ఫోన్ తీసుకుంటారు. మొత్తం చెక్ చేస్తారు. విద్యార్థులు చదువుకోవడానికి రావాలి గానీ.. డబ్బుల కోసం వస్తారా? అని వెనక్కి పంపిస్తారు. మనం ఎంతగా వాదించినా వృధా ప్రయాసే. ఏ దేశానికి వెళ్తే అక్కడి నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలా కోరుకుంటారు కూడా. వేముల ప్రభాకర్(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.🚨 Indian students in Prince Edward Island, a province in Canada, are protesting as they face being deported to India after a sudden change in the provincial immigration rules. 🇮🇳🇨🇦 pic.twitter.com/sSfd2OOH5h— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్‌కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్ పిరయడ్లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.స్టేటస్ అప్లికేషన్‌ను అడ్జెస్ట్మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. -
US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!
యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్‌లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్‌ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు. బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది. (చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!) -
ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!
బ్రిటన్ భిన్నమైన దేశం. బ్రిటన్ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది. ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్ దేశాన్ని, బ్రిటన్ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను. ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను. కానీ డిసెంబర్ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత. రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్ క్లాస్ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్ ట్రాక్’ను బ్రిటన్ తొలగించి ఉండటమే అందుకు కారణం. విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్రూమ్కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. అదింకా క్రిస్మస్కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్ కౌంటర్లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. అప్పటికి మా బ్యాగులు లగేజ్ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నేను హీత్రోలో ల్యాండ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్. స్మిత్ కౌంటర్ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్ 3లో దిగితే భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప? నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్‌ను ఉపయోగించకుండా బ్రిటిష్ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అక్రమ వలసల విపరిణామం
సుమారు 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో నిర్బంధించడం అంతర్జాతీయ వార్తగా మారింది. నికరాగ్వాకు వెళ్తున్న ఇలాంటి వాళ్లందరూ అక్కడి నుంచి తమ దేశంలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికా ఆరోపణ. ఫ్రెంచ్ అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికన్ నిఘా వర్గాలు న్యూఢిల్లీని మాత్రం చీకట్లో ఉంచాయి. ఈ వార్తను పతాక శీర్షికల్లో వచ్చేలా చేయడం ద్వారా అక్రమ వలస రాకెట్‌ను సమర్థంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. తమ అమెరికా కలల్ని నెరవేర్చే అక్రమ ముఠాలకు భారీగా డబ్బులు ముట్టచెబుతూ, జనాలు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్ని ఈ ఉదంతం సూచిస్తుంది. తమ వలస, జాతీయతా చట్టంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 21న ఒక నిబంధనను పొందుపర్చింది. నికరాగ్వాకు ప్యాసింజర్ విమానాల్లో రివాజుగా విదేశీయులను తీసుకెళ్తున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాలను విఫలం చేయడానికీ, అలాంటి వారిని శిక్షించడానికీ సంబంధించిన నిబంధన అది. విదేశీయులను ప్రమాదకరమైన భూభాగం, జలమార్గాల ద్వారా అమెరికాలోకి నెట్టడమే మానవ రవాణా చేస్తున్న వారి ఉద్దేశం అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ ప్రకటన, నాలుగు కీలక అంశాలను పేర్కొంది. ఒకటి, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు రాబోయే వలసదారుల కోసం కొత్త అక్రమ రవాణా కేంద్రంగా నికరాగ్వా ఉద్భవించింది. రెండు, నేరస్థ ముఠాలు వలస వచ్చేవారి నుండి ’భారీ–స్థాయిలో డబ్బు’ను వసూలు చేస్తు న్నాయి, వారిని తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. మూడు, అటు వంటి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించినా, ఎలాగైనా వారిని తమ తమ దేశాలకు అమెరికా తిప్పి పంపుతుంది. నాలుగు, నికరాగ్వా లోకి చార్టర్ విమానాలను పంపించే కంపెనీల యజమానులు, అధి కారులు, సీనియర్ అధికారులతో కఠినంగా వ్యవహరించడానికి అమె రికా పాలనాయంత్రాంగం సిద్ధమవుతోంది. అమెరికా చట్టంలోని సెక్షన్ 212 (ఎ)(3)(సి) ‘యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించడం లేదా తీవ్రమైన అమెరికన్ ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను కలిగి ఉన్న ఏ దరఖాస్తుదారుని అయినా సరే మినహాయించడానికి విదేశాంగ శాఖ మంత్రిని అమెరికా అనుమ తిస్తుంది’. నికరాగ్వా బడా ముఠాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహాయకులకు వ్యతిరేకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నిబంధనను ఉపయోగించడానికి పథక రచన చేశారని నవంబర్ ప్రకటన పేర్కొంది. నికరాగ్వాకు అలాంటి విమానాలను నడుపుతున్న వారినీ, అమెరికా–మెక్సికో సరిహద్దులోని చివరి గమ్య స్థానానికి వలసదారులను తీసుకువెళ్లేవారినీ వదిలిపెట్టబోమని అమె రికా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దురదృష్టవశాత్తు, వాషింగ్టన్ చేసిన ఈ రెండవ హెచ్చరిక కూడా భారతదేశం దృష్టిలోకి రాకుండా పోయింది. వందలాదిమంది అనుమానిత భారతీయులను తీసుకెళుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్(రొమేనియన్ సంస్థ) విమానం ఇంధనం నింపు కోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగుతోందన్న సమాచారాన్ని సేకరించిన అమెరికన్ ప్రభుత్వ నిఘావర్గాలు, వ్యవ స్థీకృత నేరాలపై పోరాడే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ విభాగానికి ఉప్పందించాయి. అట్లాంటిక్ సముద్ర ప్రాంతం పొడవునా నిఘా సమాచారాన్ని పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందన్నది దీని వెనుక ఉద్దేశం. కానీ ఇది కలవరపెట్టే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: అలాంటి నిఘా సమాచారాన్ని న్యూఢిల్లీతో ఎందుకు పంచుకోలేదు? అత్యవసర పరిస్థితుల కోసం తగినంతగా సన్నద్ధత లేని ఒక విమానాశ్రయంలో, నాలుగు రోజుల పాటు భారతీయ ప్రయాణికులు నిర్బంధించబడ్డారు. వాషింగ్టన్ లోని విశ్వసనీయ వర్గాల ప్రకారం, అమెరికన్ అధికా రులు ఆ విమానాన్ని ఎగరడానికి ముందే ఆపాలని అనుకోలేదు. పతాక శీర్షికల్లోకి వచ్చేలా చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో చర్యలు తీసుకునేలా అక్రమ వలస రాకెట్‌ను సమర్థవంతంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. ఎవరి తోడూ లేని మైనర్ ప్రయాణీకు లను కూడా కలిగి ఉన్న ఆ విమానం వాట్రీ విమానాశ్రయం వద్ద ముట్టడిలో ఉండగానే అది ప్రపంచవ్యాప్తంగా వార్తలను సృష్టించింది. యూరప్ టీవీల్లో అతిపెద్ద వార్తగా మారిన ఈ అసాధారణ సంఘటన కారణంగా, ఈశాన్య ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలకు, పారిస్‌లోని అధికా రిక వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ దేశాలకు వలస వచ్చే వారికోసం వేటాడే నేరస్థ ముఠాలు ఈ ఉదంతం కారణంగా, కనీసం కొంతకాలం అయినా ఇలాంటి విమాన వలసలకు ప్రయత్నించవు. అమెరికన్ విదేశాంగ శాఖ శిక్షా త్మకమైన వలస చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని వారాల ముందు, హైతీ తన రాజధాని నుండి నికరాగ్వాకు అన్ని విమానాలను నిలిపి వేసింది. భారతదేశంలాగే, ప్రస్తుతం హైతీ కూడా అక్రమ వలసలకు ఒక వనరుగా ఉందని అమెరికా పేర్కొంది. సంపన్న దేశాలకు తమను అక్రమంగా తరలించేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి నికరాగ్వాకు వెళ్లే విమానం ఎక్కుతున్నారు భారతీయులు. ప్రభుత్వం ఈ నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేసింది. ఎట్టకేలకు డిసెంబరు 21న ఆర్భాటంగా, ఆకర్షణీయమైన సంక్షిప్త నామంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం క్రమబద్ధమైన సహాయకరమైన వలసను ప్రోత్సహించే ‘ప్రయాస్’ కార్యక్రమం అది. అంతర్జాతీయ వలస చట్రానికి సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహనను ప్రోత్సహించడానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. నికరాగ్వాకు ఇటీవల కనీసం రెండు విమానాల్లో వెళ్లిన భారతీయులను ఎవరూ గుర్తించలేదని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. అనేక వందల మంది భారతీయ అక్రమ వలసదారులు దొరకకుండా తప్పించుకు పోతుండటాన్ని నాటకీయంగా చూపించే తమ ప్రయత్నంలో అమెరికా, ఫ్రెంచ్ ప్రభుత్వాల నేరనిరోధక ఏజెన్సీలు... ప్రధానంగా పంజాబ్, గుజరాత్ల నుండి యూరప్ గుండా పశ్చిమ అర్ధ గోళానికి వలసదారులను చేర్చడం కోసం పనిచేస్తున్న విస్తృత నేరస్థ నెట్వర్క్ గురించి భారతదేశాన్నే కాకుండా ఐక్యరాజ్యసమితిని కూడా చీకటిలో ఉంచాయి. ప్రయాస్ అనేది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వలస సంస్థ, భారతీయ అంతర్జాతీయ వ్యవహారాల మండలి... ఉమ్మడి ప్రాజెక్ట్. మరో విడ్డూరం ఏమిటంటే, లెజెండ్ ఎయిర్‌లైన్స్ చార్టర్ ఫ్లైట్ ఉదంతం వెలుగులోకి రావడానికి ఒక వారం ముందు, ‘నమోదు కాని రిక్రూట్మెంట్ ఏజెంట్ల వల్ల మోసపోతున్న విదేశీ ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరిగింది’ అని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై వేటు వేయడం ప్రపంచ స్థాయిలో జరుగుతోంది. ‘చాలా తూర్పు యూరోపియన్ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్లలో వీటికి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి’ అని హెచ్చరించింది. పార్లమెంట్‌లోని ప్రతి సెషన్ లోనూ, అక్రమ వలసల శాపం గురించి జీరో అవర్‌లో పెద్ద మొత్తంలో ప్రశ్నలు వస్తుంటాయి. భారత విదేశాంగ మంత్రి లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ఈ సమస్య సంక్లి ష్టత రీత్యా తాము నిస్సహాయంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ‘బహి ష్కరణ ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాలు చాలావరకు తమ తమ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వారి గురించి సమాచారాన్ని అందించవు’ అని చెప్పారు. ‘విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న లేదా పని చేస్తున్న భారతీయుల సంఖ్యపై మన దౌత్య కార్యాలయాల వద్ద ఎటువంటి విశ్వసనీయమైన డేటా లేదు’ అని అంగీకరించారు. ఇది షాకింగ్‌గా ఉందని చెబితే సమస్యను తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వాట్రీ విమానాశ్రయ ఘటన ఉదంతం, సమస్య తీవ్ర తనూ, సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్నీ సూచిస్తుంది. ఈ విషయంలో విఫలమైతే ఎక్కువ మంది భారతీయులు... అంత ర్జాతీయ నేరస్థ ముఠాల బాధితులుగా మారతారు. కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
US Elections: అవి హిట్లర్ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్
వాషింగ్టన్: అక్రమ వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన పుస్తకం ‘మెయిన్ కంఫ్’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యల వెనుక హిట్లర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్ గురించి ఏమీ తెలియదు. హిట్లర్ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్ కొట్టిపారేశారు. నేషనల్ పల్స్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్ పాయిజనింగ్ ద బ్లడ్ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్లో న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇవి హిట్లర్ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీచదవండి..ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు -
సాక్షి ఇమ్మిగ్రేషన్ టాక్ షో @ 02 December 2023
-
సాక్షి ఇమ్మిగ్రేషన్ టాక్ షో @ 10 November 2023
-
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో @ 04 November 2023
-
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో
-
అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా?
అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా? దేశం వదలి పాశ్చాత్య దేశాలకు వలసపోతున్న జనం ఎక్కువా? వృత్తి నిపుణుల వలసలపై ఎడతెగని చర్చ ఇండియా నుంచి సంపన్నులు భారత పౌరసత్వం వదులుకుని పాశ్చాత్య దేశాల్లో ఎందుకు స్థిరపడుతున్నారు? అమెరికా వంటి పారిశ్రామిక దేశాల్లో చదువుకుని, కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ఇండియా వచ్చేసి కొత్త వ్యాపారాలు పెట్టుకునే నిపుణులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారా? దేశం విడిచి అభివృద్ధిచెందిన దేశాలకు పోతున్నవారు, స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయుల్లో...ఎవరు ఎక్కువ? ఈ రెండు రకాల వలసలపై మధ్య తరగతి ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏ దేశంలోనైనా చదువు, సంపద, పారిశ్రామికీకరణ, మరీ ముఖ్యంగా జనాభా పెరిగినప్పుడు ఆ దేశం నుంచి సంపన్నులు, ఉన్నత విద్యావంతులు అత్యున్నత ప్రగతి సాధించిన దేశాలకు పోయి స్థిరపడతారు. ‘రవి అస్తమించని సామ్రాజ్యం’ నెలకొల్పిన గ్రేట్ బ్రిటన్ నుంచే పెద్ద సంఖ్యలో జనం అమెరికాకు 19వ శతాబ్దం నుంచి వలసపోవడం భారీగా మొదలైంది. 1820–1957 మధ్యకాలంలో అంటే 137 ఏళ్లలో ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఆంగ్లేయుల సంఖ్య 45 లక్షలు. బ్రిటన్ నుంచి జనం పెద్ద సంఖ్యలో 1860లు, 70లు, 80ల్లో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అతిపెద్ధ వైశాల్యం ఉన్న అమెరికాకు వలసపోయారు. ఒక్క 1888లోనే ఇంగ్లండ్ నుంచి 11 లక్షల మంది అమెరికా వెళ్లిపోయారు. మరి, అప్పటికి ఎంతో ప్రగతి సాధించిన సామ్రాజ్యవాద శక్తి బ్రిటన్ నుంచే అంత మంది ప్రజలు ఎందుకు వెళ్లిపోయారు? 19వ శతాబ్దంలో అమెరికా అభివృద్ధిపథంలో వేగంగా పయనిస్తూ అందించే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే వారు వలసపోయారు. అంతేగాని స్వదేశంలో వేధింపులు ఉన్నాయనో, భవిష్యత్తు లేదనే నిరాశతోనో ఇంగ్లిష్ ప్రజలు దేశం వదలిపోలేదు. ఇప్పుడు 21వ శతాబ్దం ప్రథమార్ధంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతున్న ఇండియా నుంచి జనం అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధిచెందిన దేశాలకు వలసపోవడం కూడా అత్యుత్తమ అవకాశాల కోసమే. ఇండియాలో తమకు గొప్ప జీవనశైలి, భద్రత ఉండదనే నైరాశ్యంతో కాదు. బ్రిటిష్ వారి హయాంలోనే ఇండియా నుంచి వలసలు బ్రిటిష్ వారి వలస పాలనలోని గయానా, మారిషస్, ఫిజీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని చెరకు తోటలు, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి ఇండియా నుంచి జనం పెద్ద సంఖ్యలో వెళ్లడం 1834లో ఆరంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల వేధింపులు తట్టుకోలేక కొందరు, మెరుగైన విద్యార్హతలతో ఉత్తమ ఉపాధి అవకాశాల కోసం మరి కొందరు పాశ్చాత్య దేశాలకు వలసపోయారు. ఇలా ఇతర దేశాలకు వెళ్లినవారిలో కొందరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని కొన్ని ప్రజాస్వామ్య రాజ్యాల్లో దేశాధినేతలు అయ్యారు. ప్రస్తుతం దాదాపు 200 మందికి పైగా భారత సంతతికి చెందిన ప్రముఖులు కనీసం 15 దేశాల్లో ఉన్నత పదవుల్లో నేడు కొనసాగుతున్నారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా ప్రముఖులు. ఇప్పుడు చరిత్రలోకి తొంగి చూసి పై విషయాలన్నీ చెప్పడానికి కారణాలున్నాయి. ఇండియా నుంచి మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. 2011 నుంచీ 16 లక్షల మంది సంపన్నులు భారత పౌరసత్వం వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబతున్నాయి. ద్వంద్వ పౌరసత్వానికి వీలులేనందు వల్ల ఇతర దేశాల పౌరసత్వం తీసుకునే ప్రజలు తమ భారత పౌరసత్వం వదులుకోవాల్సివస్తోంది. ఒక్క 2022లోనే 2,25,62 మంది భారతీయులు ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పుకున్నట్టు మెరుగైన అవకాశాలు, భిన్నమైన జీవనశైలి కోసం 140 కోట్ల జనాభా దాటిన ఇండియా నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ధనికులు ఇతర దేశాలకు వలసపోవడం ఆందోళన కలిగించే అంశమేమీ కాదని సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదీకాక, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి పదేళ్లకు పైగా అక్కడ ఉద్యోగం చేసిన పలువురు భారతీయలు అనేక కారణాలతో స్వదేశానికి తిరిగొచ్చి వినూత్న తరహాలో వ్యాపారాలు పెట్టుకుని విజయాలు సాధిస్తున్నారని కూడా మీడియాలో చదువుతూనే ఉన్నాం. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అపూర్వ ప్రగతి సాధిస్తున్న దేశాల నుంచి సైతం కొందరు వలసపోవడం అత్యంత సహజ పరిణామమేగాని పెద్దగా దిగులుపడాల్సిన విషయం కాదు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
హార్ట్‌బీటే పాస్‌పోర్ట్.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్ చేసుకుని తినడమే!
ఏదో పనిమీద పక్క దేశానికి వెళ్తున్నారు. చేతిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా నడిచి వెళ్లారు.అంతే చెకింగ్, ఇమిగ్రేషన్ గట్రా అన్నీ అయిపోయాయి. విమానంలో కూర్చోగానే..సీటు మీ శరీరానికి తగ్గట్టుగా మారిపోయింది. విమానం దిగి హోటల్‌కు వెళ్లగానే ఆకలేసింది.మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయగానే.. ప్రింట్ చేసి తెచ్చి ఇచ్చేశారు.. ఇదేమిటి ఏదేదో చెప్పేస్తున్నారు అనిపిస్తోందా? భవిష్యత్తులో.. అంటే 2070 నాటికిప్రయాణం ఇలానే ఉంటుందట. ఆ వివరాలేమిటో చూద్దామా.. బ్రిటన్‌కు చెందిన ‘ది ఈజీ జెట్’ సంస్థమరో 50 ఏళ్ల తర్వాత ప్రయాణాల తీరుఎలా ఉంటుంది? సెలవులను ఎలాఎంజాయ్ చేస్తామన్న అంశంపై శాస్త్రవేత్తలు,నిపుణులతో మాట్లాడి ‘ది ఈజీ జెట్ 2070 ఫ్యూచర్ ట్రావెల్’పేరిట నివేదికను విడుదల చేసింది. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిర్గిట్టె అండర్సన్, డిజైన్ సైంటిస్ట్ మెలిస్సా స్టెర్రీ, క్రాన్ఫీల్డ్ వర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం బ్రైత్వేట్లతో పాటు మరికొందరుతమ అంచనాలను వెల్లడించారు. జస్ట్ అలా నడిచివెళితే చాలు.. ప్రతి ఒక్కరి వేలిముద్ర, కంటి ఐరిస్ వేర్వేరుగా ఉన్నట్టే.. గుండె కొట్టుకునే సిగ్నేచర్ కూడా విభిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సిగ్నేచర్ డేటాను స్టోర్ చేసి.. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌పోర్టుగా వాడొచ్చంటున్నారు. ఉదాహరణకు విమానాశ్రయంలోని ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లగానే.. సెన్సర్లు, కెమెరాలు, ప్రత్యేక పరికరాలు స్పందిస్తాయి. ఐరిస్ స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖం గుర్తింపు), హార్ట్‌బీట్ సిగ్నేచర్లను గుర్తించి.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తాయి. ఇదంతా సెకన్లలోనే జరిగిపోతుంది. విమానంలో కూర్చోగానే.. ప్రయాణికులు విమానం ఎక్కి సీట్లోకూర్చోగానే.. వారి శరీరానికి తగినట్టు (సన్నగా, లావుగా, పొడవు, పొట్టి.. ఇలా) కాళ్లు గా సీటు ఆకృతి మారిపోతుంది. సీటుపై తలకు పక్కన అమర్చిన ప్రొజెక్టర్ నుంచి సరిగ్గా కళ్లకుముందు డిస్ప్లే ఏర్పడుతుంది. ఏ ఇబ్బందీ లేకుండా కావాల్సినవి వీక్షించవచ్చు. ఇల్లు–ఎయిర్పోర్ట్ టెర్మినల్– ఇల్లు ఉన్నచోటి నుంచే గాల్లోకి ఎగిరి ప్రయాణించి మళ్లీ అలాగే కిందకు దిగగలిగే (వీటీఓఎల్) ఎయిర్ ట్యాక్సీలు అంతటా అందుబాటులోకి వస్తాయి. ఇంటి దగ్గరే ఎయిర్‌ట్యాక్సీ ఎక్కి నేరుగావిమానాశ్రయం టెర్మినల్‌లో దిగడం.. ప్రయాణం చేశాక మళ్లీ టెర్మినల్ నుంచి నేరుగా ఇంటి వద్దదిగడం.. సాధారణంగా మారిపోతుంది. త్రీడీ ప్రింటెడ్ ఫుడ్.. కావాల్సినట్టు బెడ్ ♦ మనకు నచ్చిన ఆహారాన్ని కాసేపట్లోనే ఫ్రెష్‌గా ప్రింట్ చేసి ఇచ్చే ‘ఫుడ్ త్రీడీ ప్రింటింగ్’మెషీన్లు అందుబాటులోకి వస్తాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం దాకా ఏదైనా ప్రింట్ చేసుకుని తినేయడమే. ♦ హోటళ్లలో రూమ్‌లు ‘స్మార్ట్’గా మారిపోతాయి. మనం రూమ్‌కు వెళ్లే ముందే.. గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో,లోపలికి వెళ్లగానే ఏదైనా సంగీతం ప్లేకావాలో, బెడ్ ఎంత మెత్తగాఉండాలో, గీజర్‌లో నీళ్లు ఎంత వేడితో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు తగినట్టుగా అన్నీ మారిపోతాయి. ♦ మనకు కావాల్సిన మోడల్, డిజైన్, వస్త్రంతో డ్రెస్సులు కూడా త్రీడీ ప్రింటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మనం ఇక లగేజీ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు లేనట్టే. ప్రత్యేక సూట్లతో ‘టైమ్ ట్రావెలింగ్’ హాలిడే కోసం ఏదైనా పర్యాటక ప్రాంతానికివెళ్లినప్పుడు ప్రత్యేకమైన ‘హాప్టిక్’సూట్లను వేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్న సమయంలోనే వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ ద్వారా.. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఎలా మారుతూవచ్చాయన్నది కళ్ల ముందే కనిపించే సదుపాయం వచ్చేస్తుంది. ఇతర భాషల్లో ఎవరైనా మాట్లాడుతుంటే.. అప్పటికప్పుడు మనకు కావాల్సిన భాషలోకి మార్చి వినిపించే ‘ఇన్ ఇయర్’ పరికరాలు వస్తాయి. ఎక్కడైనా,ఏ భాష వారితోనైనా సులభంగా మాట్లాడొచ్చు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తప్పు చేయొద్దు! అక్రమ వలసదారులకు రిషి సునాక్ స్ట్రాంగ్ వార్నింగ్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను అనుమతించమని ఖరాకండీగా చెప్పేశారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి అక్రమ వలసదారుడిని బహిష్కరించడమే గాక ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా అనుమతించమని స్పష్టం చేశారు. యూరప్ నుంచి సరిహద్దులు దాటి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పడవలపై అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక రువాండ లేదు సురక్షితమైన మూడో దేశం నుంచి పడవల ద్వారా అక్రమంగా వస్తున్న వలసదారులను బహిష్కరించి, శాశ్వతంగా రాకుండా నిషేధించేలా హోం సెంక్రటరీ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. తప్పు చేయొద్దు, చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే మీరు ఉండలేరు. అక్రమ వలసలు నేరమని, పైగా అక్రమంగా ప్రవేశించిన ముఠాలను అనైతిక వ్యాపారాలు కొనసాగించేలా అనుమతించడం సరికాదని బ్రిటీష్ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. అలాగే పడవలను ఆపేస్తానన్న నా వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సరిహద్దు దాటిని అక్రమ వలసదారులను అనుమతించడానికి, ఆశ్రయం పొందాలన్న యూకేలోని చట్టాలను అనుసరించాలని చెప్పారు. వలసదారుల కేసు విచారణ కోసం ఉన్నప్పుడూ అనుమతిస్తారని, కానీ కొత్త చట్టం ప్రకారం అటువంటి వలసదారులు మొదటి స్థాయిలో ఆశ్రయం పొందకుండా నిరోధిస్తుందని ప్రధాని రిషి సునాక్ చెప్పారు. కాగా, ఫ్రాన్స్ నుంచి యూకేకి ప్రమాదకర స్థాయిలో శరణార్థులు వలస రావడాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: పాక్‌లో ఆత్మాహుతి దాడి..తొమ్మిది మంది పోలీసులు మృతి) -
మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డుకు అర్హులవుతారు. -
విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు..
మోర్తాడ్(బాల్కొండ): కరోనా కల్లోలం నుంచి తేరుకున్న తర్వాత భారత్ నుంచి విదేశాలకు వలసలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. విదేశాంగ శాఖ వెబ్ పోర్టల్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 2020కి ముందు తెలంగాణలో రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య 33 ఉండగా.. ఇప్పుడు 140కి చేరింది. ఇందులో 101 ప్రధాన కార్యాలయాలు కాగా మరో 39 వాటి శాఖలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 11 ఏజెన్సీలుండగా ఇప్పుడు 25 ప్రధాన కార్యాలయాలు, వాటికి అనుబంధంగా 30 శాఖలు ఏర్పాటయ్యాయి. లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య పెరగడం వల్ల విదేశాలకు చట్టబద్ధంగా వెళ్లడానికి అవకాశం కలుగుతుంది. నకిలీ ఏజెంట్ల వల్ల మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లైసెన్స్‌ల జారీలో సడలింపులతో.. గతంలో రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్స్ పొందాలంటే రూ.50 లక్షల బ్యాంక్ గ్యారంటీని సమరి్పంచాల్సి వచ్చేది. ఇలా పొందిన లైసెన్స్‌తో ఇమ్మిగ్రేషన్ చట్టాలకు లోబడి వెయ్యి మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉండేది. లైసెన్స్ జారీ విధానంలో విదేశాంగ శాఖ సడలింపులు ఇవ్వడంతో రిక్రూటింగ్ ఏజెన్సీల విస్తరణకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు లైసెన్స్ పొందాలంటే రూ.8 లక్షల బ్యాంకు గ్యారెంటీ సమర్పిస్తే సరిపోతుంది. వంద మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు పంపించే వారి సంఖ్యను పెంచుకోవాలంటే బ్యాంక్ గ్యారంటీని పెంచుకోవలసి ఉంటుంది. 300కు మించి నకిలీ ఏజెంట్లు విదేశాంగ శాఖ లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలతో పాటు నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల పేర్లను వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాలలో 300కు మించి నకిలీ ఏజెంట్లు ఉన్నారు. మోసపోయినవారి ఫిర్యాదుల ఆధారంగా నకిలీ ఏజెంట్ల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో తాము మోసపోయినట్లు కొంతమంది ఫిర్యాదు చేయగా.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే విదేశాంగ శాఖ లైసెన్స్ పొందిన ఏజెన్సీలను కూడా నకిలీ ఏజెంట్ల జాబితాలో కలిపేసి వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. లైసెన్స్డ్ ఏజెన్సీల ద్వారా గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లిన వారు ఒప్పందం ప్రకారం పని, వేతనం ఉన్నా.. బద్ధకంతో ఇంటిదారి పట్టి తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఇచ్చిన ఫిర్యాదులలో వాస్తవాలను గుర్తించకపోవడంతో కొన్ని లైసెన్స్డ్ ఏజెన్సీలను నకిలీ ఏజెన్సీల జాబితాలో నమోదు చేయడం వల్ల విదేశాంగ శాఖకు చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇమిగ్రేషన్ చట్టాలను పక్కాగా అమలు చేస్తే నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల ఆటకట్టించడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘వీహబ్’తోడుగా.. విజయం దిశగా.. -
ధనవంతులూ వలసబాట
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ పేదలు వలస వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే. వ్యాపార అవకాశాలను, సౌకర్యాలను, పన్ను రాయితీలను వెతుక్కుంటూ కోటీశ్వరులు కూడా వలసబాట పట్టడం కూడా ఎప్పుడూ ఉన్నదే. సాధారణంగా పేదలు దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. ధనవంతులు అందుకు భిన్నంగా వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశాలకు వెళ్తారు. కానీ, పత్రికల్లో పేదల వలసలే పతాక శీర్షికలవుతాయి. పెద్దల వలసల గురించి వార్తలు పెద్దగా కనిపించవు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లకు బెదిరి.. మన దేశంలో కోట్ల మంది పేదలు వలసబాట పట్టారు. కానీ, కోటీశ్వరులు మాత్రం కరోనా సమయంలో వలస బాటపట్టలేదు. ఉన్న దేశం నుంచి కదల్లేదు. కరోనా శాంతించిన వెంటనే అవకాశాలు వెతుక్కుంటూ రెట్టింపు సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 2022లో 88వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (10 లక్షల డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్తారని ‘హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్’ అంచనా వేసింది. ధనవంతుల వలసలు పెరుగుతాయే తప్ప కనుచూపు మేరలో తగ్గే అవకాశంలేదని చెప్పింది. ధనవంతులంతా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్తున్నారనే విషయం ఆసక్తికరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న టైలర్‌మేడ్ వలస విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను, ధనవంతులను ఆకర్షించడానికి కారణంగా నిలుస్తున్నాయి. రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో చౌకగా వైద్యం అందుబాటులో ఉండటం, వారసత్వ పన్ను లేకపోవడం, మంచి ఆర్థికవ్యవస్థ కావడం.. ధనవంతులను ఆకర్షిస్తున్న కారణాలని నిపుణులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి అధికంగా.. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి కోటీశ్వరులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని కోటీశ్వరుల్లో 42 శాతం మంది వలస బాట పడతారని అంచనా వేస్తున్నారు. అలాగే, రష్యాలో 15 శాతం మంది కోటీశ్వరులు దేశం విడిచిపెట్టి వెళ్తారని అంచనా. మిగతా అన్ని దేశాలు రెండు శాతం, అంతకంటే తక్కువ మంది కోటీశ్వరులు వలస వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారత్ నుంచి వలస వెళ్తారని అంచనా వేస్తున్న 8 వేల మంది, దేశంలోని మొత్తం కోటీశ్వరుల్లో 2 శాతం అని నివేదిక పేర్కొంది. ధనవంతులను ఆకర్షిస్తున్న యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోని అన్ని దేశాల ధనవంతులను ఆకర్షిస్తోంది. దీని కోసం.. ► వీసా నిబంధనలను సరళతరం చేసింది. ► 5.44 లక్షల యూఎస్ డాలర్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా ఇస్తున్నారు. ► 2.72 లక్షల డాలర్లు యూఏసీ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికీ గోల్డెన్ వీసాకు అర్హత ఉంటుంది. ► ప్రపంచంలో ఎక్కడైనా తమ స్టార్టప్ కంపెనీని 1.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన వారికి కూడా గోల్డెన్ వీసా తీసుకోవడానికి అర్హత కల్పిస్తూ యూఏఈ నిబంధనలను సడలించింది. ► కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికే కాకుండా, ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చుకోవడానికి కూడా యూఏఈ అవకాశం కల్పిస్తోంది. ► ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనే కాకుండా, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది. -
కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..
తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు ఈ వృత్తినే నమ్ముకొని.. ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు. పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. పెరిగిన ముడిసరుకుల ధరలు మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్ నుంచి కార్తిక మాసం సీజన్లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు. కుమ్మరిని ప్రోత్సహించాలి ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. – శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం దీపావళి సీజన్లోనే పని మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం -
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు వారి ఇంటి అడ్రస్ ప్రకారం..స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, టెంపరరీ వీసా, పర్మినెంట్ రెసిడెన్షియల్ (పీఆర్) లేదా విదేశాలకు ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ అవసరం. ఇంతకు ముందు, విదేశాల్లో నివసించే వారి విషయంలో ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ లేదా, ఇండియన్ ఎంబసీ/హైకమిషన్ కార్యాలయంలో ఆన్లైన్లో పీసీసీ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద పీసీసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ధరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకుముందు పీసీసీ అపాయింట్మెంట్ స్లాట్ల లభ్యతను కూడా మెరుగుపరుస్తామని ప్రకటన చేయగా.. తాజాగా పీసీసీపై ప్రకటన చేయడం పట్ల పాస్‌పోర్ట్ ధర ఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 428 పీసీసీ కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖల చొరవతో పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందనున్నాయి.కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. -
వీసాల సంఖ్యను భారీగా పెంచిన ఆస్ట్రేలియా!
కోవిడ్ -19 మహమ్మారిని నుంచి కోలుకునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాశ్వత వలసదారుల వీసాల సంఖ్యను మరింత పెంచింది. గతంలో ఉన్న వీసా నిబంధనల్ని సడలిస్తూ వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏడాదికి 35 వేల వీసాలు మంజూరు చేసే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇప్పుడు వాటి సంఖ్యను ఏకంగా 1.95 లక్షలకు పెంచింది. తద్వారా ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుని 3.4 శాతంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా వేతనాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఉన్న వీసాల్ని సవరించాలని అక్కడి వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. వ్యాపారస్థుల విజ్ఞప్తితో పాటు ఇతర అంశాల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీసాల పెంపుతో విదేశీయులతో పాటు సంస్థల్ని ఆకర్షించడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించింది. అందుకే ప్రతిఏడు వేలల్లో వీసాలు జారీ చేసే ప్రభుత్వం ఈ ఏడాది ఆ వీసాల సంఖ్యను లక్షకు పైగా పెంచింది. -
చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా!
ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్‌పోర్ట్‌ను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొని రానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పాస్ పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. 2008లో తొలిసారి కేంద్రం పాస్‌పోర్ట్ సేవల్ని ఆన్లైన్లో అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 2వ సారి టీసీఎస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ- పాస్‌పోర్ట్ సేవల్ని అందించనుంది. ఇమ్మిగ్రేషన్ అంటే? ఇమ్మిగ్రేషన్ అంటే ఉదాహరణకు భారత్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో శాస్వతంగా ఉండేందుకు,లేదంటే పౌరసత్వం పొందేందుకు ఆ దేశ అనుమతి తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అనుమతి కోసం జరిగే ప్రాసెస్‌ను ఇమ్మిగ్రేషన్ అంటారు. ఈ ఇమ్మిగ్రేషన్ కోసం కేంద్రం,టీసీఎస్‌లు సంయుక్తంగా ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌పోర్ట్‌పై టీసీఎస్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ యూనిట్ విభాగం ప్రతినిధి తేజ్ బట్లా స్పందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డిసెంబర్ నాటికే వినియోగదారులకు ఈ-పాస్‌పోర్ట్‌లను అందించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్ట్‌లను చిప్‌లతో ఆధునీకరించనున్నట్లు తేజ్బట్లా వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. పలు నివేదికల ప్రకారం..ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో జరిగే అవకతవకల్ని అరికట్టేందుకు ఇంట్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐడీఏఓ) సెక్యూర్ బయోమెట్రిక్ డేటాతో ఈ-పాస్ పోర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో దేశానికి ఒక్కో డిజిటల్ సిగ్నేచర్‌తో ఉన్న ఈ చిప్‌లలో పాస్‌పోర్ట్ వినియోగదారుల బయోగ్రఫికల్ డేటాతో పాటు డిజిటల్ సెక్యూరిటీ ఫీచర్ల డేటా ఉంటుంది. ఆ డేటా సాయంతో ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తే లోపాల్ని అరికట్టవచ్చు. సెమీకండక్టర్ చిప్ సమస్య కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సెమీకండక్టర్ చిప్ తయారీ తగ్గిపోయింది. దీంతో అన్నీ డివైజ్‌లలో ఉపయోగించే చిప్ కొరత ఆయా సంస్థల్ని తీవ్రంగా వేదిస్తోంది. కానీ ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ముందుగానే కావాల్సిన చిప్‌లను సిద్ధంగా ఉంచుకుందని తేజ్ బట్లా తెలిపారు. రెండు డేటా సెంటర్లు ఈ-పాస్‌పోర్ట్ వినియోగదారుల డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్ల అవసరం ఎక్కువగా ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న డేటా సెంటర్లను ఆదునీకరించనున్నట్లు వెల్లడించారు. టీసీఎస్ లక్ష్యం అదే ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్న టీసీఎస్ వినియోగదారులకు అందించే సేవల్ని మరింత సులభతరం చేయనుంది. చాట్ బోట్, బయోమెట్రిక్‌తో ఆటో రెస్పాన్స్ వంటి ఫీచర్లను ఈ ఈ-పాస్ పోర్ట్‌కు జత చేయనుంది. -
2022కు హెచ్1బీ వీసా కోటా పూర్తి
వాషింగ్టన్: ఈ సంవత్సరానికి హెచ్1బీ వీసా పరిమితి 65,000కు సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా మంగళవారం ప్రకటించింది. విదేశీ ఉద్యోగస్తులు అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కేటాయిస్తారు. టెక్ కంపెనీలకు ఈ వీసా చాలా అవసరం. అమెరికా చట్ట సభలు విధించిన ప్రకారం ఏటా 65వేల వరకు గరిష్టంగా ఈ వీసాలను కేటాయిస్తారు. మరో 20వేల వీసాలను యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జెంషన్ కింద కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు సరిపడా దరఖాస్తులు తమకు ఇప్పటికే అందాయని యూఎస్ పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ వీసా దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర ప్రక్రియలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. -
ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు
విమానం ఎక్కాలి.. అమెరికాలో వాలిపోవాలి.. డాలర్లలో డబ్బులు సంపాదించాలనే క్రేజ్ గుజరాత్‌లోకి కొన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తోంది. ఎన్నారై మోజులో పడి ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు అవుతుండగా... ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు మాఫియాలా మారారు. తుపాకులు చేతబడుతున్నారు.. చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ట్రావెల్ ఏజెంట్లు గుజరాత్లో ఎన్నారై కావాలనే ఆశతో కెనాడలో అమెరికా సరిహద్దులో ఓ కుటుంబం బలైపోయిన సంఘటన ఇంకా మది నుంచి చెరిగిపోకముందే మరో ఘటన తెర మీదకి వచ్చింది. గుజరాత్‌లోని కలోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుభాయ్ మానేక్‌లాల్ పటేల్ అనే వ్యక్తి కలోల్ పట్టణంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.అతని మేనల్లుడు విశాల్, అతని భార్య రూపాలిలను అక్రమ పద్దతిలో అమెరికా పంపేందుకు రుత్విక్, దేవమ్ అనే స్థానిక ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందం చేసుకున్నాడు. డీల్ ఇలా ఒప్పందం ప్రకారం భార్య భర్తలను ఇల్లీగల్‌గా అమెరికాకు తీసుకెళ్లినందుకు రూ. 1.10 కోట్ల రూపాయలు చెల్లించాలనే నిర్ణయించారు. ఇందులో రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా.. అమెరికా చేరుకున్న తర్వాత రెండో విడతగా రూ. 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో సెటిలైన తర్వాత నెలన్నర రోజులులోగా మూడో విడతగా రూ.50 లక్షలు చెల్లించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ప్లాన్‌లో చేంజ్ ఢిల్లీ మీదుగా విశాల్, రూపాలీలను అమెరికా తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్లు రుత్విక్, దేవమ్‌లు తెలిపారు. మీతో పాటు మరికొంతమంది కూడా ఈ టూర్లో ఉన్నారని చెప్పారు. అన్నట్టుగానే ఫిబ్రవరి 5న విశాల్, రూపాలీ దంపతులు ఢిల్లీ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. వీరితో పాటు ట్రావెల్ ఏజెంట్లైన రుత్విక్, దేవమ్‌లు కూడా అమెరికా చేరుకోవాలి. అయితే ఈ ప్రయాణం నుంచి రుత్విక్ ఢిల్లీలోనే డ్రాప్ అయ్యాడు. డబ్బులు ఇవ్వమంటూ ఢిల్లీలోనే ఆగిపోయని రుత్విక్ తనతో పాటు అదే సంస్థకు చెందిన మరికొందరు ఏజెంట్లతో అదే రోజు రాత్రి గుజరాత్ చేరుకున్నాడు. కలోల్‌లోని విష్ణుభాయ్ పటేల్ ఇంటికి వెళ్లి ‘ మీ వాళ్లు అమెరికా ఫ్లైట్ ఎక్కారు కాబట్టి మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు’. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికాలో మా వాళ్లు దిగిన తర్వాతే మిగిలిన డబ్బులు ఇస్తానంటూ విష్ణుభాయ్ బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఫైరింగ్ డబ్బులు రాకపోవడంతో రుత్విక్ అతని గ్యాంగ్ విష్ణుభాయ్ పటేల్‌పై తుపాకితో కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అతని శరీరానికి తాకలేదు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు గట్టిగా కేకలే వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. మిగిలిన గ్యాంగ్ సభ్యలు పారిపోగా.. రుత్విక్ దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. కోటిన్నర రూపాయలు ఎలాగైనా ఎన్నారై కావాలనే ఆశతో గుజరాత్లో కొందరు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భూములు అమ్మడం, లోన్లు తీసుకోవడవం చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను అమెరికా పంపేందుకు కోటిన్నర రూపాయలను ట్రావెల్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!! -
Afghan Girl: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే! పాపం మరోసారి..
Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గుల్. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్ మరోసారి శరణార్థిగా మారింది. అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్లు, సోవియట్ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్ కూడా ఒకరు. 80వ దశకంలో పాపులర్ ఫోటో.. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్––పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి. దీంతో ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ కవర్ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్ గర్ల్’’గా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్ అయిన ఫోటోలలో అఫ్గాన్ గర్ల్ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది. ఆ సమయంలో అఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ... షర్బత్ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్. హెపటైటీస్ సీతో 2012లో షర్బత్ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాలిబన్ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
కరోనా నేర్పిన పాఠాలు: విదేశాలవైపు భారతీయుల చూపు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ధోరణి విస్తృతమవుతోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని చూసి.. మెరుగైన ఆరోగ్య వసతులు ఉన్న చోటకు వలసపోదామన్న ఆలోచన వ్యాపారస్తుల్లో కలుగుతోంది. ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ వ్యాపారి మూడు దశాబ్దాల్లో బాగానే ఆస్తులను సమకూర్చుకున్నారు. తాజా పరిస్థితుల్లో అతడు తన కుటుంబాన్ని తీసుకుని న్యూజిలాండ్ లేదా కెనడాకు వెళ్లి స్థిరపడే ఆలోచనలో ఉన్నాడు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అతడి సమీప బంధువు ఒక్కగానొక్క కుమారుడు కరోనాకు బలైపోవడాన్ని చూసిన తర్వాతే అతడిలో ఈ మార్పు వచ్చింది. ఎంత డబ్బుంటేమి.. ప్రాణాలు దక్కలేదు! అన్న బాధతో పరాయి దేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. నోయిడాకు చెందిన మరో వ్యాపారి తన కుటుంబాన్ని తీసుకుని ఖతార్ వెళ్లిపోయాడు. మెరుగైన హెల్త్‌కేర్ వసతుల కోసమే అతడు వలసపోయాడు. ఈ ఇద్దరే అని కాదు కరోనా వచ్చిన తర్వాత దేశం వీడిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని ట్రావెల్ పరిశ్రమ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కావాలి.. కరోనా రెండో విడత చాలా తీవ్రంగా ఉండడం, లక్షలాది కేసులు రోజువారీగా నమోదు కావడాన్ని చూశాం. ఆస్పత్రుల్లో పడకలు లభించడానికి చాలా ప్రాంతాల్లో అవస్థలు పడాల్సి వచ్చింది. పడకలు, వైద్యం లభించక పోయిన ప్రాణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, ఔషధాలు అందక, ఆస్పత్రుల్లో ఐసీయూలు, పడకలపై ఉన్న వారికి ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మెరుగైన వైద్య వసతులు ఏ ఏ దేశాల్లో ఉన్నాయనే విషయమై విచారణ చేస్తూ, విదేశాలకు ప్రయాణం కట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ధనవంతులే కాకుండా, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన రెండు నెలల్లో విదేశాలకు వలసపోవడంపై విచారించే వారి సంఖ్య 20 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రానున్న రోజుల్లో విదేశాలకు సంబంధించి విచారణలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి సూచనలతో చాలా మంది పర్యాటక సంస్థలను ఆశ్రయిస్తున్నారు. సులభతర వీసా విధానం అమెరికా, కెనాడా, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలనే కాదు.. చిన్న దేశాలైన ఆస్ట్రియా, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్టా, సైప్రస్, టర్కీ దేశాల్లో వసతులు, జీవన విధానం ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టు ట్రావెల్ పరిశ్రమకు చెందిన వారు తెలిపారు. ప్రధానంగా సులభ వీసా ఏ దేశం నుంచి లభిస్తుంటే ఆ దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కే మొగ్గు చూపిస్తున్నారు. ‘‘కరోనా రెండో దశలో ప్రతీ కుటుంబంపై ప్రభావం చూపించింది. దీంతో వలసవిధానంలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది’’ అని వీసా, ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఐవీఏసీఎస్ డైరెక్టర్ చంద్రజిత్‌సింగ్ తెలిపారు. కరోనా రాక ముందు వరకు వ్యాపార అవకాశాల విస్తరణ కోసం, సులభతర పన్నుల విధానం చూసి విదేశాలకు వలసవెళ్లే వారు ఎక్కువగా ఉండే వారని.. ఇప్పుడు మెరుగైన వైద్య వసతులు కూడా ప్రాధాన్యాల జాబితాలోకి చేరిపోయిందని ఆయన చెప్పారు. -
మయన్మార్ నుంచి అక్రమ వలసలు
యాంగూన్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో సైనిక పాలన భారత్‌పై ప్రభావం చూపుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించి ఫిబ్రవరిలో సైన్యం అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడి నిర్బంధాలకు భయపడి ప్రజలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా, 116 మంది సరిహద్దుల్లో భారత బలగాల గస్తీ ఎక్కువగా కనిపించని తియు నదిని దాటి మిజోరంలోకి ప్రవేశించారు. సరిహద్దులకు సమీపంలోని ఫర్కాన్ గ్రామంలో వీరంతా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మయన్మార్ పోలీసు, అగ్ని మాపక సిబ్బంది అని సమాచారం. మానవతాసాయం కోరుతూ వచ్చే వారినే అనుమతించాలంటూ సరిహద్దుల్లోని మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్రం ఇటీవల కోరింది. భారత్–బర్మాలకు సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్‌లో అల్లకల్లోల పరిస్థితులతో వలస వచ్చిన వేలాది మంది భారత్‌లో తలదాచుకుంటున్నారు. కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని మయన్మార్ సైనిక పాలకులు కఠినంగా అణచివేస్తున్నారు. ఆదివారం నిరసనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంగూన్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతోపాటు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.సైనిక పాలనను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లోదేశ వ్యాప్తంగా శనివారం కూడా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని మీడియా పేర్కొంది. ఆస్పత్రులను కూడా సైన్యం స్వాధీనం చేసుకోవడంతో వైద్యులు సేవలను నిరాకరిస్తున్నారు. సైన్యం పగ్గాలు చేపట్టాక ఇప్పటి వరకు కనీసం 70 మంది ప్రజలు కాల్పుల్లో మరణించినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సంఖ్య 90 వరకు ఉంటుందని అనధికార వర్గాల సమాచారం. చదవండి: సారా ఎవెరార్డ్ హత్య ప్రకంపనలు -
7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులనే వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధన్ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందన్నారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని సజ్జనార్ వివరించారు. ఆ అనుభవమే పెట్టుబడిగా... సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్ బెయిన్ 2013లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉంటున్న జోబా అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందాడు. అక్కడే అక్రమంగా గుర్తింపు పత్రాలు, పాన్ కార్డు పొందాడు. బోధన్‌లో ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న బెంగాల్‌వాసి సమీర్ రాయ్ వద్దకు 2015లో వచ్చిన పరిమళ్.. వైద్యం నేర్చుకొని 2016లో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేశాడు. బోధన్‌లో ఉంటూనే నకిలీ గుర్తింపు కార్డులు పొందిన అతను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా ఉన్న పెరుక మల్లేశ్‌రావు నిర్లక్ష్యంగా వెరిఫికేషన్ చేయడంతో పరిమళ్‌కు పాస్‌పోర్టు జారీ అయింది. ఈ అనుభవంతోనే అక్రమంగా పాస్‌పోర్టులు పొందే దందాకు అతను శ్రీకారం చుట్టాడు. బతుకుదెరువు కోసం అడ్డదారుల్లో విదేశాలకు వెళ్లాలనుకొనే బంగ్లాదేశీయులకు తప్పుడు మార్గాల్లో పాస్‌పోర్టులు ఇప్పించే స్కాంకు పరిమళ్ తెరలేపాడు. తొలుత పుణేలోని ఓ కంపెనీలో పని చేసే తన సోదరుడు గోపాల్ బెయిన్‌కు ఏఎస్సై మల్లేశ్ సహకారంతో అక్రమంగా పాస్‌పోర్టు ఇప్పించాడు. ఆ తర్వాత 2019లో సమీర్, ఢిల్లీవాసి షానాజ్‌లతో జట్టుగా ఏర్పడ్డాడు. సమీర్ బంగ్లా జాతీయుల్ని అడ్డదారిలో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకుకొచ్చే వ్యూహం అమలు చేయగా వారికి తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లడానికి టికెట్లను షానాజ్, సద్దాం హుస్సేన్ సమకూర్చేవారు. ఇరాక్‌లో పనిచేస్తున్న సమీర్ కుమారుడు మనోజ్ వీసాల ప్రాసెసింగ్‌కు పాల్పడేవాడు. ఈ దందాకు ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా ఉన్న మల్లేశ్‌రావు, ఏఎస్సై బి.అనిల్ కుమార్ సహకారం, అవినీతి ఉన్నాయి. ఇద్దరు పోలీసుల కీలకపాత్ర... ఈ గ్యాంగ్ సమకూర్చిన తప్పుడు చిరునామాలతో పాస్‌పోర్టులు పొంది దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులు నితాయ్ దాస్, మహ్మద్ రానా మయ్, మహ్మద్ హసిబుర్ రెహ్మాన్ గత నెలాఖరులో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో లోతుగా దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. బోధన్ కేంద్రంగా జరిగిన ఈ పాస్‌పోర్టుల కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించారని గుర్తించారు. ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్ చేశారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్ అహ్మద్ మీర్జా అక్రమంగా ఆధార్ కార్డులు జారీ చేయించగా... మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు. ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా... ముగ్గురు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్స్ జారీ చేస్తున్నారు. -
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
-
పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్: బోధన్ పాస్‌పోర్ట్ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఒకే చిరునామాస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అవడం కలకలం రేపింది. దీనిలో ఇప్పటివరకు 72 పాస్ట్‌పోర్టులు గుర్తించినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒకే చిరునామాపై భారీ సంఖ్యలో పాస్‌పోర్టులు ఉండడంపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఎంతమంది దేశం దాటి వెళ్లారనేది విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, స్థానికుల పాత్రపైనా కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందారని, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది పాస్‌పోర్టులు పొందారనేది విచారణ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కస్టడీకి తీసుకొని విచారిస్తామని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ పరిశీలనలో లోపాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. చదవండి: అసలు సూత్రధారి గల్ఫ్ ఏజెంటే.. -
అమెరికాలో పెంచిన పౌరసత్వ ఫీజులకు కోర్ట్ బ్రేక్
శాన్‌డియాగో: భారీగా పెంచిన పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ జడ్జి ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 2 నుంచి అమలులోకి రావాల్సిన ఈ భారీ ఫీజులను యుఎస్ జిల్లా జడ్జి జఫ్రీ వైట్ తక్షణం నిలిపివేశారు. ఆ ఇద్దరూ సీనియర్ హోంసెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు మెక్ అలీనన్, చాద్‌వూల్ఫ్‌లను చట్టవిరుద్ధంగా నియమించారని జడ్జి అభిప్రాయపడ్డారు. ఫెడరల్ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని జడ్జి తెలిపారు. 8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్ లీగల్ రీసోర్స్ సెంటర్లు ఉమ్మడిగా పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించారు. పెంచిన ఫీజులను, చట్ట విరుద్ధంగా నియమితులైన అధికారులు నిర్ణయించారు కనుక వీటిని తక్షణం నిలిపివేయాలని ఈ సంస్థలు కోర్టుని కోరడంతో, ఫెడరల్ జడ్జి ఈ తీర్పునిచ్చారు. జార్జ్ డబ్లు్య బుష్ అధ్యక్షునిగా ఉన్న కాలంలో వైట్‌ను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ జడ్జిగా నియమించారు. ఈ నిర్ణయంపై హోంలాండ్ సెక్యూరిటీ, జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించలేదు. చాద్‌వూల్ఫ్‌ని పాలసీ విభాగంలో ఉన్నతాధికారిగా ట్రంప్ నియమించినప్పటికీ, ఈ నియామకాన్ని సెనేట్ అంగీకరించలేదు. గ్రీన్‌కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్ పర్మిట్లకు ఫీజులను 20 శాతం మేర పెంచారు. హెచ్1 బి వీసా ఫీజు ప్రస్తుతం ఉన్న 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు. ఎల్ 1 వీసాల ఫీజులను 75 శాతం పెంచి, 805 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే పనిచేస్తోన్న హెచ్1బి కార్మికుల భాగస్వాములకు ఫీజుని 34 శాతం పెంచి, 550 డాలర్లు వర్క్ పర్మిట్ ఫీజుగా నిర్ణయించారు. పౌరసత్వ ఫీజుని 83 శాతం పెంచి, 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు. ఫీజులు చెల్లించలేమని చెప్పిన వారికి, మినహాయింపులు ఇచ్చే పద్ధతికి కూడా స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకున్నారు. -
గ్రీన్‌కార్డ్ నిషేధం భారతీయులకు కలిసొచ్చిందా..?
వాషింగ్టన్ : ఈ ఏడాది చివరి వరకూ గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాస పర్మిట్లు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేపట్టే భారతీయులకు వరంగా మారిందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాది అమెరికన్లకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు తిరిగి భారతీయులకు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం సెప్టెంబర్ చివరినాటికి ఉపయోగించని కుటుంబ ఆధారిత శాశ్వత నివాస కార్డులను అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ ఆధారిత కోటాకు మళ్లిస్తారు. గ్రీన్ కార్డ్ నిషేధం కారణంగా యుఎస్ లో ఇటువంటి వలసదారులు ఈ ప్రక్రియ యొక్క చివరి దశలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించేలా ప్రాధాన్యత తేదీలను ముందుకు తీసుకువస్తారని అమెరికన్ న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత తేదీల్లో ఇది భారతీయులకు ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. ఇక 1,10,000 గ్రీన్ కార్డులు ఉపాధి ఆధారిత కోటా కిందకు మళ్లించే అవకాశం ఉందని వలస నిపుణులు పేర్కొన్నారు. ఉపాధి ప్రాధాన్య వలసదారులందరికీ కుటుంబ సభ్యులు సహా ఏటా కేవలం 1,40,000 గ్రీన్ కార్డులనే అమెరికా జారీ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న పది లక్షల మంది వలసదారులు, వారి కుటుంబ సభ్యులు గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని బ్యాక్‌లాగ్‌లో ఉన్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్లో 3,00,000 దరఖాస్తులతో భారత్ నుంచే పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌కు చెందిన వీరంతా హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాక్‌లాగ్‌లో భారతీయులే అత్యధికులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం భారతీయులకు 7 శాతం కోటా లభించనుండగా, ఇతర జాతీయులు వారి కోటా సంఖ్యను వాడుకోకుంటే వాటిని కూడా బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేసేందుకు కేటాయిస్తారు. బ్యాక్లాగ్ క్లియర్ చేస్తే భారతీయులే అధికంగా లబ్ధి పొందే వెసులుబాటు ఉందని వలస నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి : టిక్‌టాక్‌కు అమెరికా చెక్ -
కెనడా వైపు టెక్ వర్కర్ల చూపు!
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల టెక్ వర్కర్లు కెనడా వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ప్రారంభించిన గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ(జీఎస్ఎస్) ప్రోగ్రామ్ ద్వారా కెనడా మూడేళ్లలో ఐదు రెట్లు ఎక్కువ మందికి వీసాలు జారీ చేసిందని ఆ దేశ ఇమిగ్రేషన్, వలసదారులు, పౌరసత్వ సంస్థ(ఐఆర్సీసీ) పేర్కొంది. (విగ్రహాల ధ్వంసం: ట్రంప్ కీలక నిర్ణయం) కంప్యూటర్ ప్రొగ్రామర్లు, ఇంటరాక్టివ్ మీడియా డెవలపర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలిస్టులు, కన్సల్టెంట్లు కేటగిరీల కింద 23 వేల మందికి కెనడా వీసాలు ఇచ్చినట్లు ఐఆర్సీసీ తెలిపింది. 2020 జనవరి నుంచి మార్చి మధ్య ఇవే ఐదు కేటగిరీలకు చెందిన 2300 మంది అప్లికేషన్లకు ఆమోదం లభించిందని వివరించింది. అప్లికేషన్ పెట్టుకున్న రెండు వారాల్లోనే ప్రాసెసింగ్ పూర్తవుతున్నట్లు వెల్లడించింది. అయితే కోవిడ్–19 ప్రభావం వల్ల ఇమిగ్రేషన్ కు పెట్టుకునే వారి సంఖ్య భారీగా తగ్గినట్లు చెప్పింది. ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువగా వీసాలు దొరకబుచ్చుకుంటున్న వారిలో 62.1 శాతంతో ఇండియన్స్ టాప్ లో ఉన్నారని తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో చైనీయులు ఉన్నారని చెప్పింది. వెయ్యి మంది అమెరికన్లకు సైతం వీసాలు జారీ అయ్యాయని వెల్లడించింది. (మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం) కోవిడ్–19 లాక్ డౌన్ నుంచి ఉపశమనం తర్వాత కెనడాకు టెక్ వర్కర్లు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాంకోవర్ లోని మెక్క్రెయా ఇమిగ్రేషన్ లా సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న కైల్ హైండ్మన్ పేర్కొన్నారు. ఓ పెద్ద కంపెనీ వర్కర్లను కెనడాకు రప్పించేందుకు తోడ్పడాలని కోరినట్లు చెప్పారు. -
ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు
వాషింగ్టన్ః కరోనా వైరస్ ప్రభావం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇమిగ్రేషన్ వీసాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు సహా టెక్ నిపుణులు, రాజకీయవేత్తలు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అమెరికా ఆర్థిక ప్రగతికి ఇమిగ్రేషన్ ఇచ్చిన ప్రోద్బలం అమోఘం. అమెరికాతో పాటు గూగుల్ టెక్ లీడర్‌గా ఎదగడానికి అదే కారణం. ఈ సమయంలో ఇమిగ్రెంట్స్‌కు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందరికీ పని చేసే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.(వెనక్కి రావాల్సిందేనా?) ట్రంప్ కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ జెస్సికా తెలిపారు. ‘ఇమిగ్రేషన్ అమెరికాకు ఉన్న అతి పెద్ద సంపద. దాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు’ అని వ్యాఖ్యానించారు. శాశ్వత వీసాలపై మరో 60 రోజుల పాటు, తాత్కలిక వీసాలపై ఈ ఏడాది చివరి వరకూ నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వైట్ హోజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల దెబ్బతిన్న అమెరికన్లకు ఉపశమనం కలిగించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. అమెరికా తాత్కాలికంగా నిషేధించిన వాటిలో పాపులర్ వీసాలైన హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, జే, ఎల్ కూడా ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కు చెందిన ఓ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్లు కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఉబర్, పేపాల్ తదితర కంపెనీలు కూడా హై స్కిల్డ్ వర్కర్లను దేశం నుంచి పంపేయడాన్ని వ్యతిరేకించాయి. దీని వల్ల దేశం నష్టపోతుందని తప్ప ఒరిగే లాభమేమీ ఉండదని అభిప్రాయపడ్డాయి.(వర్క్ వీసాల నిలిపివేత) వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేయాలని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. కరోనా తర్వాతి ఫేజ్ ను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హై స్కిల్డ్ వర్కర్లు అవసరం ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ ప్రొగ్రాం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు దేశ హెల్త్ కేర్ సిస్టంను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. హెచ్ 1బీ తో పాటు ఎల్ 1బీ వీసాల జారీని నిలిపేసే బదులు వాటికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ట్రంప్ అమెరికా బిజినెస్ ను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఉమన్ డొనా ఈ షలాలా ఆరోపించారు. ఆయన నిర్ణయంతో అమెరికా పేదరికంలోకి జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ముసుగులో ట్రంప్ ఇమిగ్రెంట్లపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మరో కాంగ్రెస్ మహిళ షెల్లీ పింగ్రీ అన్నారు. -
అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. ‘‘హెచ్–1బీ, ఎల్–1 వీసా సంస్కరణల చట్టం’’ పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారికి హెచ్–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు. అంతే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు. సెనేట్‌లో చుక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పాస్క్రెల్, పాల్ గోసర్ తదితర ప్రజాప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్య వల్ల అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. భారత్‌కు చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్నారు. లేబర్ శాఖకు మరిన్ని అధికారాలు ఈ బిల్లు లేబర్ శాఖకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా లేబర్ శాఖకు ఉంటుంది. వివిధ కంపెనీలను పర్యవేక్షించడం ఏ వీసాపై ఎందరు ఉద్యోగులున్నారు , వారికిస్తున్న జీతభత్యాలు, వారు అభ్యసించిన విద్య వంటి గణాంకాలను సేకరిస్తే ఆయా కంపెనీల్లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. ఇక ఎల్–1 వీసాల నిబంధనల అమలుపై పర్యవేక్షించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీకి అప్పగించింది. బిల్లులో ఏం ఉందంటే.. ► అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ యువతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే అమెరికన్ల ప్రయోజన్ల కాపాడడం ► ఉన్నత విద్యనభ్యసించిన వారు, అత్యధిక వేతనాలు తీసుకునే నిపుణులైన పనివారికి ప్రాధాన్యం ► అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్–1బీ, ఎల్–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం ► హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు ► తక్కువ వేతనాలు ఇస్తూ ఔట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగులపై .హెచ్1–బీ, ఎల్–1 వీసాలపై తాత్కాలికంగా భారీ సంఖ్యలో విదేశాల నుంచి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చాక, తిరిగి వారి దేశానికి అదే పనిచేయడానికి పంపే కంపెనీలపై ఆంక్షలు ► 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్–1బీ లేదంటే ఎల్–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. మార్కెట్లో విదేశీ నిపుణులకు డిమాండ్ ఉంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఔట్ సోర్సింగ్ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు కోత పెట్టి చీప్ లేబర్ని నియమించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ఈ బిల్లు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా నిపుణులైన విదేశీయుల్ని తక్కువ వేతనానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్న యాజమాన్యాల దోపిడీని కూడా అరికడుతుంది’ –గ్రాస్లీ, కాంగ్రెస్ సభ్యుడు -
త్రిశంకు స్వర్గంలో హెచ్1బీలు
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులు సహా రెండు లక్షల మందికిపైగా హెచ్1బీ వీసాదారుల పరిస్థితి ఈ జూన్ నాటికి అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసిన తరువాత నిబంధనల కారణంగా అమెరికాలో ఉండకూడని పరిస్థితి ఒకవైపు అయితే, అంతర్జాతీయ ప్రయాణాలపై భారత్ నిషేధాన్ని కొనసాగిస్తే స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి మరోవైపు ఉండనుంది. జూన్ చివరి నాటికి వీసా గడువు ముగియనున్న వారిలో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు దాదాపు 2.5 లక్షలమంది ఉన్నారు. వారిలో సుమారు 2 లక్షల మంది హెచ్1బీపైననే అక్కడ ఉన్నారు. వీరే కాకుండా గ్రీన్కార్డ్కు దరఖాస్తు చేసుకోని, జూన్‌లోపు వీసా గడువు ముగిసే హెచ్1బీ వీసాదారులు కూడా వేలల్లో ఉన్నారని, వారంతా కూడా స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు జెరెమి న్యూఫెల్డ్ తెలిపారు. కోవిడ్–19 కారణంగా గత రెండు నెలల్లో లక్షలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, స్థానిక అమెరికన్ల పరిస్థితికి, వీసా నిబంధనలకు లోబడి ఆ దేశంలో ఉండాల్సి వచ్చే విదేశీయుల పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు ఆ తరువాత 60 రోజుల్లోగా వేరే జాబ్ వెతుక్కుని, వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. లేదా స్వదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు, ఉద్యోగాలు కోల్పోని వారి సందిగ్ధత మరోలా ఉంది. ఉద్యోగం ఉన్నప్పటికీ.. ఈ సంక్షోభ సమయంలో ఒకవేళ వీసాలు రెన్యువల్ కానట్లయితే.. ఏం చేయాలనే సందిగ్ధతలో వారున్నారు. ‘ఈ వీసా సంక్షోభం ఉద్యోగాల విషయంలోనే కాకుండా, ఆర్థికంగానూ పెనుముప్పుగా పరిణమించింది. హెచ్1బీ వీసాదారులకు, వారి ఉద్యోగాలపైననే ఆధారపడి, అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న కుటుంబ సభ్యులు ఉంటారు. అక్కడే చదువుకుంటున్న పిల్లలుంటారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరం’అని బౌండ్లెస్ ఇమిగ్రేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, ఒబామా హయాంలో అమెరికా ఇమిగ్రేషన్ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన డౌ ర్యాండ్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో వీసా గడువు ముగుస్తున్న విదేశీ ఉద్యోగులకు సెప్టెంబర్ 10 వరకు వారి వీసా గడువు పొడిగించాలని కోరుతూ అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్ అనే లాబీయింగ్ గ్రూప్ అమెరికా విదేశాంగ శాఖకు ఇటీవల ఒక లేఖ రాసింది. అప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో హెచ్1బీ వీసాపై ఉన్న టెక్కీల సేవలు ఆరోగ్య రంగం సహా అన్ని రంగాలకు అత్యవసరమని పేర్కొంది. ట్రంప్ సర్కారు వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2015లో 1.09 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ కాగా, 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 87 లక్షలకు తగ్గింది. -
కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్
-
వలసల రద్దు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనుకున్నంతా పని చేశారు. ఇటీవల డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన కలకలం సృష్టించిన ట్రంప్...తాజాగా మరో సంచలనం నిర్ణయంపై అధికార ముద్ర వేశారు. కరోనా మారణహోమం సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ...వలసలపై నిషేధ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయడంతో అన్ని రకాల వలసలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. ఈ వలసల తాత్కాలిక రద్దు అరవై రోజుల పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక గ్రీన్ కార్డుల జారీని కూడా రెండు నెలలపాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. (వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!) రెండు నెలలపాటు తమ దేశంలోకి ఎవరినీ అడుగుపెట్టనీయమని, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే టూరిస్ట్, బిజినెస్, విదేశీ వర్కర్ల వంటి వలసేతర వీసాలపై ఎలాంటి నిషేధం వుండదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాతే ఉత్తర్వులను సమీక్షస్తామన్నారు. ఓ అంచనా ప్రకారం భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు..దాదాపు అయిదున్నర లక్షల మందికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అని అమెరికాలో వున్న భారతీయులు ఆందోళనలో వున్నారు. కాగా కేవలం గ్రీన్ కార్డుల జారీని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేయడంతో లక్షలది మంది హెచ్-1బీ వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు. (కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్) -
వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!
వాషింగ్టన్ : అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా పౌరుల ఉద్యోగాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వత నివాసం(గ్రీన్ కార్డ్) కోరుకునే వారికే వర్తింస్తుందని ట్రంప్ అన్నారు. లాక్డౌన్ ముగిసన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన రోజువారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. ‘ఈ నిషేధం 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని పొడిగించడమా.. లేక మార్పులు చేయడమా అనేది నిర్ణయిస్తాం. అమెరికాలో శాశ్వత నివాసం(గ్రీన్ కార్డ్) కోరుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. తాత్కాలిక ప్రతిపాదికన అమెరికాలోకి వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలనేది మా లక్ష్యం. వలసలను నియంత్రించడం వల్ల నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ట్రంప్ ప్రస్తావించినందువల్ల నాన్–ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, ఆహార సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కరోనాను అదుపు చేయడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం జారీ చేసే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. కాగా, 2016లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6,17,000 వీసాలు జారీ చేసిన అమెరికా.. గతేడాదిలో 4,62,000 వీసాలు మాత్రమే జారీచేసినట్టు అధికారిక గణంకాలు చెప్తున్నాయి. చదవండి : అన్ని ఇమిగ్రేషన్ వీసాలపై తాత్కాలిక నిషేధం కిమ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: ట్రంప్ -
డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
-
వలసలకు అమెరికా బ్రేక్..
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి విజృంభణతో అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఆయన కార్యనిర్వహక ఉత్తర్వులు జారీచేశారు. కనబడని శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అలాగే అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు తమ దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. మహమ్మారి కరోనా ఎక్కడ? ఎలా? పుట్టుకొచ్చిందో కనుగొనేందుకు చైనాకు నిపుణుల బృందం పంపనున్నట్లు ట్రంప్ సోమవారం వెల్లడించారు. కరోనా చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన మరోమారు అసహనం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమకు సాయం చేసేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కాగా, ఇప్పటికే కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 7.75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకు పైగా మృతిచెందారు. -
భారత టెకీలకు అమెరికా షాక్
అమెరికా: డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత టెకీలకు షాకిచ్చింది. తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్ పాలసీ(యూఎస్సీఐఎస్)ప్రకారం హెచ్-1బీ దరఖాస్తులు 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో మూడురేట్లు తగ్గాయని తెలిపింది. వీటిలో భారతీయుల దరఖాస్తులే 70శాతం తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇందులో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివే ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని ఎన్ఎఫ్ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ అన్నారు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా ప్రధాన కారణమని తెలిపారు. టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కంపెనీకి చెందిన 60శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యానని, తరువాతి స్థానంలో విప్రో, ఇన్ఫోసిస్ ఉన్నాయని అన్నారు. 2018లో భారత్‌కు చెందిన ఆరు ప్రధానమైన సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్-1బీ వీసాలు వచ్చాయి. ఇక, అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం ఏకంగా 2,399 హెచ్-1బీ వీసాలు రావడం గమనార్హం. ఇక, విదేశీ ఉద్యోగుల విషయంలో ఆపిల్, వాల్‌మార్ట్, కమ్మిన్స్ లాంటి కంపెనీల వీసాల మంజూరులో పెద్దగా ప్రభావం లేదని ఎన్‌ఎఫ్‌పీఏ పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం విదేశీ వలసదారులైన భార్యాభర్తలకు ఉద్యోగాలు చేసుకునే సౌలభ్యం కల్పించిన విషయం విదితమే. అమెరికన్లకే ఉద్యోగాల అనే నినాదంతో అధికారం కేవసం చేసుకున్న ట్రంప్ ఇప్పుడు వీసా నిబందనలు కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో వీసాలు లభించడం ఇప్పుడు చాలా కష్టతరమైంది. 2015లో ఒబామా ప్రభుత్వం అత్యధికంగా భారతీయ మహిళలకు 1,20,000 వీసాలు కల్పించింది. -
గోడలో పాములు, మొసళ్లు ఉంచండి: ట్రంప్
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై మరోసారి విరుచుకుపడ్డారు. వలసదారులను అడ్డుకోవడానికి కరెంటు తీగలతో కూడిన గోడను నిర్మించి.. దాని పొడవునా పాములు, మొసళ్లు ఉండేలా చూడాలని వైట్‌హౌజ్ సలహాదారులకు సూచించారు. తద్వారా వలసదారులను అడ్డకోవచ్చని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ వలసదారులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రవేశపెట్టిన జీరో టాలరెన్స్ విధానం కారణంగా అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధానం వల్ల ఎంతో మంది వలస చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరం కాగా.. మరికొంత మంది అమెరికాలో ప్రవేశించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వలసదారుల పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తామన్నట్లు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. నేటికీ వలసదారులు అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారంటూ ఉన్నతాధికారులపై ట్రంప్ విరుచుకుపడినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. సరిహద్దు గోడ విషయంలో అలసట వహిస్తూ తనను ఇడియట్‌లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ వారిపై చిందులు తొక్కినట్లు తెలిపింది. కాగా సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. మైకెల్ షియర్, జూలీ డెవిస్ అనే ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా రచించిన ‘బార్డర్ వార్స్: వలసదారులపై ట్రంప్ అంతరంగం’ అనే పుస్తకం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 8న ఆవిష్కరించనున్నారు. -
అమెరికాలో బయటపడ్డ ఫేక్ యూనివర్సిటీ
-
బంగ్లాదేశీయులకు హైదరాబాదీ పాస్‌పోర్టులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపుకార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయులు నగరం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్న సంగతి తాజాగా వెలుగు చూసింది. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందారు. వీటిని వినియోగించి దుబాయ్ వెళ్లిన ఈ ముగ్గురు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. దీంతో వీరిని కొచ్చికి డిపోర్టేషన్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి వ్యవహారంపై ఇక్కడి పోలీసులూ ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ బృందం ఎర్నాకుళం వెళ్లనుంది. జల్పాయ్గురివాసులుగా చెప్పుకుంటూ.. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన అజయ్ చౌదరి, షుబ్రో బరువా, అవి ముఖర్జీ సమీప బంధువులు. కొన్నాళ్ల క్రితమే వీరు అక్రమంగా వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇక్కడే ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఓటర్ ఐడీ, ఆధార్, పాన్‌కార్డ్ పొందినట్లు తేలింది. దీనికోసం షుబ్రో మినహా మిగిలిన ఇద్దరూ తమ ఇంటి పేర్లు మార్చేసి నమోదు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఇతర పత్రాల తయారీ, ప్రాసెసింగ్ బాధ్యతల్ని వారు కోల్‌కతాకు చెందిన ఓ ఏజెంట్‌కు అప్పగించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసిన ఆ ఏజెంట్ వారికి సహకరించాడు. పాస్‌పోర్టుల దరఖాస్తుల్లో వీరం తా తమ స్వస్థలం పశ్చి మ బెంగాల్‌లోని జల్పాయ్గురిగా పేర్కొన్నారు. ఇలా వీరిలో చౌదరి, ముఖర్జీలకు ఈ ఏడాది మార్చ్ 5న, బరువాకు ఆగస్టు 6న పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. వీటి తో వారు గత బుధవారం దుబాయ్‌కు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి సెర్బియా మీదుగా దుబాయ్ చేరుకున్నారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ తనిఖీలో వీరు పట్టుబడ్డారు. దీంతో దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో వారిని అక్కడినుంచి తిప్పి పంపారు. ముందస్తు సమాచారంతో కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు నేడుంబస్సేరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులు అసలైనవేనని ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కేఎస్ ఉదయభాను గుర్తించారు. మారు పేర్లతో ఉన్న ఆధార్, పాన్, ఓటర్ కార్డులను స్వాధీనం చేసు కున్నారు. వివరాల కోసం ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ విభాగం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసింది. పోలీసులు కొచ్చి ఇమ్మిగ్రేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, కేరళ ఇంటెలిజెన్స్ అధికారులు విచారించారు. వీరి వ్యవహారంలో ఉగ్రవాద కోణం ఉందా? అనే అనుమానాలను కూడా కేరళ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. -
టూరిస్టు వీసాలతో నిరుద్యోగుల తరలింపు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): మలేషియాలో ఉద్యోగాల పేరిట నిజామాబాద్ జిల్లావాసులను తీసుకెళ్తున్న తరుణంలో మోసం ముందుగానే బయటపడింది. ఇమిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో నిరుద్యోగులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. జరిగిన ఘోరాన్ని వారు అధికారులకు చెప్పడంతో ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి మంగళవారం రాత్రి 9.55 సమయంలో ఎయిరేషియా విమానం మలేషియాకు బయలుదేరాల్సి ఉంది. ఈ విమానం ఎక్కడానికి 17 మంది నిజామాబాద్ ప్రయాణికులు టూరిస్టు వీసాలతో సిద్ధమయ్యారు. వీరిని ఇమిగ్రేషన్ అధికారులు అనుమానించారు. ఇంత నిరుపేదల్లా ఉన్న మీరు టూరిస్టులా... ఎక్కడికెళ్లి ఎపుడొస్తారంటూ ప్రశ్నించడంతో వారు నిజం చెప్పేశారు. తాము టూరిస్టులం కాదని, ఉపాధి కోసం మలేషియా వెళ్తున్నామని చెప్పారు. అంతేకాదు. తాము మలేషియాలో కూలి పనులకోసం రూ.50 వేల నుంచి రూ.70 వేలు వరకు చెల్లించామని చెప్పారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు మలేషియాలో ఇలా జరిగే మోసాలను నిరుద్యోగులకు వివరించారు. విదేశీ వీసా లేకుండా టూరిస్టు వీసాలతో పంపుతున్నారంటే అక్కడ మోసానికి ప్లాన్ చేసినట్లేనని, ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగు చూస్తున్నాయని చెప్పడంతో 17 మంది ప్రయాణికులూ కళ్లు తేలేశారు. ఇంత మోసమా...అంటూ వారిని సాగనంపడానికి వచ్చిన ఏజెంట్ల వైపు చూసే సరికి వారి నోట మాటలేదు. టెర్మినల్ బిల్డింగ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులతోపాటు బయట ఉన్న మరో ఏజెంట్‌ని ఆ నిరుద్యోగులు పోలీసులకు చూపించారు. మోసపోకముందే మేల్కొలిపారని ఊపిరిపీల్చుకుని ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. -
మనం ట్రంప్ కన్నా తక్కువ తిన్నామా!
సాక్షి, న్యూఢిల్లీ : ఎదురుగా ఎత్తయిన పది అడుగుల గోడ. గోడ మీద ఎర్రటి రంగుతో హృదయాకారం. గోడ అంచు మీద ఇనుప కంచె. ఎవరికైనా అది జైలు కాబోలని అనిపిస్తుంది. నిజంగా అక్కడి జీవితం జైలే. ఎవరు పారిపోకుండానే ఆ గోడకు అంత ఎత్తున ఆ ఇనుప కంచె. అయితే దాన్ని జైలు అని పిలవరు. షెల్టర్ అని లేదా శిబిరం అని పిలుస్తారు. ఆ గోడ వెలుపలి నుంచి అప్పుడప్పుడు అటుగా పోతున్నవారి నవ్వులు, అమ్మాయిల అరుపులు వినిపిస్తుంటాయి. అమ్మాయిల అరుపులు వినిపించినప్పుడల్లా వారేమి మాట్లాడుకుంటున్నారో వినేందుకేమో గోడకు ఇటువైపున్న అమ్మాయిలు మౌనంగా ఉంటారు. గోడ లోపలున్న ఈ అమ్మాయిలంతా బంగ్లాదేశీయులు. వారంతా సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి భద్రతా దళాల చేతుల్లో అరెస్ట్ అయిన వారే. వారిలో ఆరేళ్లప్పుడు ఈ శిబిరానికి వచ్చి పెళ్లీడు వచ్చినా ఇప్పటికీ శిబిరంలోనే తలదాచుకుంటున్న వారూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను బంగ్లాదేశ్ అధికారులు గుర్తించి వారిని తీసుకెళ్లే వరకు ఆ అమ్మాయిలకు ఈ నిర్బంధ జీవితం తప్పదు. వారిలో కొందరిది మరింత దౌర్భాగ్య పరిస్థితి. తల్లిదండ్రులో, తల్లో లేదా తండ్రో భారత దేశంలోనే ఎక్కడో, ఏదో జైలులో మగ్గుతూ ఉంటారు. ఒకరినొకరు చూసుకునే అవకాశమే ఉండదు. వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ షెల్టర్ పేరు ‘స్నేహ’. శాన్లాప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఇలాంటి షెల్టర్లు పశ్చిమ బెంగాల్లో మగ పిల్లలకు వేరుగా, ఆడ పిల్లలకు వేరుగా 80 షెల్టర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వీసా, పాస్‌పోర్టు లాంటి సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చిన లేదా వచ్చి భారత్‌లో రహస్యంగా స్థిరపడిన బంగ్లాదేశీయులను భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి 1946, విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 ఏ కింద రెండేళ్లు నుంచి గరిష్టంగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వారిలో ఆరేళ్ల పైబడిన పిల్లలుంటే వారిని శిశు సంక్షేమ కమిటీ ముందుకు, జువెనైల్ జస్టిస్ బోర్డుకు పంపుతారు. అక్కడ వారికి ఎలాంటి శిక్షలు విధించరుగని ప్రభుత్వ, స్వచ్ఛంద వసతి గృహాలకు పంపిస్తారు. సరైన డాక్యుమెంట్లతో వారి తల్లిదండ్రులు లేదా బంగ్లాదేశ్ అధికారులు వచ్చే వరకు ఆ పిల్లలకు శిబిరాల్లో నిర్బంధం తప్పదు. ఇక అక్రమంగా వచ్చి జైలు శిక్ష పడిన పెద్దవాళ్లను వారి శిక్ష పూర్తయినప్పటికీ విడుదల చేయరు. కాకపోతే జైళ్లలో ఉన్నవారిని షెల్టర్లలోకి మారుస్తారు. ఇలాంటి షెల్టర్లు ప్రభుత్వం ఆధీనంలోను ఉన్నాయి. స్వచ్చంద సంస్థల ఆధీనంలోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు వచ్చి వారిని తీసుకెళ్లాలి. అందుకు ముందుగా వారు వారిని తమ దేశ పౌరులుగా అంగీకరించాలి. అప్పుడే వారికి జైలు నుంచి, దేశం నుంచి విముక్తి లభిస్తుంది. బంగ్లాదేశ్ అధికారులు రాకపోయినా, వచ్చి వారు తమ దేశీయులు కాదన్నా వారు జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సిందే. గతంలో వారు తమ దేశీయులు కాదన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పిల్లలతో అక్రమంగా వలసవచ్చి అరెస్టై, ఒకరినొకరు చూసుకోకుండా పిల్లలు, తల్లిదండ్రులు వేర్వేరుగా శిక్ష అనుభవించిన, అనుభవిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ‘మహానిర్మాణ్ కోల్‌కతా రీసర్చ్ గ్రూప్’నకు చెందిన సుచరిత సేన్ గుప్తా అలాంటి వారిపై 2015లో ఓ అధ్యయనం జరిపారు. రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఓ కొడుకు, కూతురుతో భారత్‌కు వచ్చిన బహదూరిబాలా అనే 40 ఏళ్ల యువతికి భారత్‌లో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఆమెను బెహ్రాంపూర్‌లోని సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌కు పంపించగా, ఇద్దరు పిల్లలను జువెనైల్ హోమ్స్‌కు పంపించారు. ఆమె నాలుగేళ్ల వరకు తన పిల్లలనే చూడలేదట. ఓ న్యాయవాది కారణంగా వారిని చూడ గలిగింది. ఈ విషయాలు సుచరిత సేన్ గుప్తా అధ్యయనంతో వెలుగులోకి వచ్చాయి. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన ప్రజల నుంచి రెండు వేల మంది పిల్లలను అన్యాయంగా వేరు చేశారంటూ ఇటీవల ప్రపంచమంతా గళమెత్తి ఘోషించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అందులో భారత ప్రభుత్వం కూడా ఉంది. మరి బంగ్లాదేశీయుల విషయంలో భారత్‌లో జరుగుతున్నదేమిటీ? బంగ్లాదేశ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్బంధించడం లేదా! పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమతి చేసిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా! ఆ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామే. ఆ ఒప్పందంలోని 9వ అధికరణం ప్రకారం పిల్లలను కొడుతూ తిడుతూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయరాదు. తల్లిదండ్రుల్లో ఎవరికి శిక్షపడినా, నిర్బంధంలో ఉన్న, జైల్లో ఉన్నా వారి పిల్లల క్షేమసమారాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. శిక్ష పడిని వారి పిల్లలను చూసుకునేందుకు బంధు మిత్రులు ఎవరూ లేకుంటే ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎందుకు? బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4,097 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. అందులో సగానికిపైగా అంటే, 2, 217 కిలోమీటర్ల సరిహద్దు పశ్చిమ బెంగాల్లోనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016, ఏప్రిల్ నాటికి పశ్చిమ బెంగాల్లో బంగ్లాకు చెందిన 3,647 మంది పెద్దలు, 142 మంది పిల్లలు నిర్బంధంలో ఉన్నారు. కొన్ని బంగ్లాదేశ్ కుటుంబాలు భారత్‌లోని తమ బంధువులను కలుసుకునేందుకు సరిహద్దులు దాటి వస్తాయి. కొన్ని కుటుంబాలు దళారులు లేదా ఏజెంట్ల మోసం కారణంగా ఇక్కడికి వచ్చి దొరికిపోతాయి. కొందరు బంగ్లా రాజకీయ సంక్షోభం కారణంగా, మతపరమైన వేధింపుల కారణంగా వస్తారు. భారత్‌లో వైద్యం కోసం కూడా కొందరు సరిహద్దులు దాటి వస్తారు. వారు ఏ కారణంగా వచ్చినా సరైన డాక్యుమెంట్లు లేకపోతే జైలు లేదా కరెక్షనల్ సెంటర్లలో గడపాల్సిందే. బెంగాల్లో కరెక్షనల్ సెంటర్లకు జైళ్లకన్నా మంచి పేరే ఉంది. చదవండి: ‘వలస పిల్లల’ను వేరుచేయం వెనక్కి తగ్గిన ట్రంప్.. అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ! జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు -
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్‌లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘వలస పిల్లల’ను వేరుచేయం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లలను వేరుగా నిర్బంధించటానికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. కుటుంబాలను, వారి పిల్లలను కలిపి ఒకేచోట నిర్బంధంలో ఉంచుతామని చెప్పారు. మెక్సికో సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పిల్లలను, తల్లిదండ్రుల నుంచి వేరు చేయటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావటంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అధ్యక్ష భవనం వెలుపల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సమస్య ఇకపై ఉండదు. కుటుంబాల నుంచి వారి పిల్లలను వేరు చేయబోం. కుటుంబాలతోనే కలిపి ఉంచుతాం. ఇదే సమయంలో మా సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం చేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ఆశ్రయం కోరిన వారిని నిర్బంధిస్తారా? అక్రమ వలసదారుల పిల్లలను, కుటుంబాలతో కలిపి ఉంచుతున్నప్పటికీ వారిని కనీస సౌకర్యాలు లేని డిటెన్షన్ సెంటర్లలో ఉంచడంపై భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు, హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పిల్లలను, వారి కుటుంబాలను నెలల తరబడి నిర్బంధంలో ఉంచడం ‘అమానవీయం, క్రూరం’ అని కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి పిల్లలతో సహా నిర్బంధించడాన్ని కోర్టులో సవాల్ చేస్తామన్నారు. పిల్లలను వేరుగా ఉంచడం ద్వారా ఉత్పన్నమైన సమస్యకు కుటుంబాన్నంతటినీ కలిపి నిర్బంధించడం పరిష్కారం కాదని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థ అధ్యక్షురాలు నీరా టాండెన్ అన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వు ఈ సమస్యకు పరిష్కారం కాదనీ, ఆయన ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. పిల్లలను వేరు చేసి ఉంచే సమస్య పరిష్కారానికి, కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట నిర్బంధిస్తామనటం ద్వారా ఇంకో సమస్యను సృష్టించారని చెప్పారు. ఈ ఏడాది మార్చి–మే మధ్య కాలంలో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన దాదాపు 50వేల మందిని అధికారులు నిర్బంధించారు. -
వెనక్కి తగ్గిన ట్రంప్..
వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తిపలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అయితే వలస విధానం విషయంలో ఏమాత్రం తగ్గబోమని స్పష్టం చేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినందుకు ఇక కుటుంబాలను కలిపే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేలా చర్యలు చేపడతారు. ప్రస్తుతం అక్రమ వలసదారుల్లో పిల్లలను తల్లితండ్రులను వేర్వేరుగా నిర్భందిస్తుండటంపై విమర్శలు ఎదురవడంతో ట్రంప్ యంత్రాంగం పునరాలోచనలో పడింది. ‘ తమ సరిహద్దులు ఇప్పుడు మరింత పటిష్టంగా ఉన్నాయని, అయితే కుటుంబాలను సమిష్టిగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంద’ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. కుటుంబాలను వేరు చేశామన్న భావన ఎవరిలో కలగరాదనేది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. కాగా వలసలపై తన కఠిన వైఖరిని పదేపదే సమర్ధించుకుంటున్న ట్రంప్ వలస వచ్చిన చిన్నారులను సరిహద్దులు దాటిన అనంతరం తల్లితండ్రుల నుంచి బలవంతంగా వేరుచేయడాన్నీ వెనకేసుకువచ్చేవారు. అయితే తల్లితండ్రులకు దూరమైన చిన్నారులు కంటతడి పెట్టే దృశ్యాలు, వారిని బోనుల్లో నిర్భందించడం వంటి ఫోటోలు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ!
వాషింగ్టన్ : అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. తల్లిదండ్రులనుంచి పిల్లలను వేరు చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వలసదారుల పిల్లలను నిర్బంధ వసతి గృహానికి తరలిస్తుండటంతో.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారులు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రుల చెంతకు తమను పంపించాలని, లేదంటే కనీసం వారితో ఫోన్లో మాట్లాడే అవకాశమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్బంధ గృహంలో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారి తాజాగా ఫోన్లో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తన ఆంటీతో ఆ పాప మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా వైరల్‌గా మారింది. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ సంభాషణలో ‘నేను ఇంటి వద్ద మంచిగా నడుచుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను’ అంటూ చిన్నారి ఏడుస్తూ అన్న మాటలు.. ప్రతి హృదయాన్ని కదిలించి వేస్తున్నాయి. ‘పాపి (స్పానిష్‌లో తండ్రి), మామి (తల్లి).. కనీసం బంధువులైన కలవండి. ఇక్కడ మేం ఒంటరిగా ఉన్నామనే బాధ ఎక్కువగా ఉంది. దయచేసి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆ చిన్నారి అర్థిస్తున్న.. ఈ సంభాషణ ఆడియోను ప్రోపబ్లికా అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆ చిన్నారి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని, ట్రంప్ ప్రభుత్వం త్వరగా ఆ పిల్లలను వారి తల్లి దండ్రులకు అప్పగించాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఈ ఆడియో టేప్‌ను విన్న హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ నీల్సన్.. చాలా నిర్లక్ష్యంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. నిర్బంధ వసతి గృహంలోని పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా అక్రమ వలసదారులకు హాలిడే స్పాట్ కాదని, అక్రమవలస విధానాలపై చట్టాలు మార్చే ప్రసక్తేలేదని, యూరప్ దేశాల్లో చూస్తున్నారుగా అంటూ మరోవైపు ట్రంప్ పరుషంగా ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల కోసం అలమటిస్తున్న పసి పిల్లల కోసమైన ఈ వలస చట్టాలు మారుస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటింటికో వలస.. బస్వాపూర్ గోస!
ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న ఈ వృద్ధురాలి పేరు సానటి రాజవ్వ. ఆమె ఇద్దరు కొడుకులు ఎడారి దేశానికి వలసపోయారు. వాళ్లే కాదు.. గ్రామంలో ప్రతి యువకుడు అలాగే పోతున్నారని చెబుతోందామె. ‘ఇక్కడ చేసుకోనీకి పనిలేదు. అందరికీ దూరంగా పోయి దేశం కాని దేశంలో పొట్టనింపుకుంటున్నరు. అక్కడెన్ని రోజులున్నా సంపాదించేదేం లేదు. షేక్‌లు చెప్పిన పని చేయాలె. తెల్లవారుజామున 4 గంటలకు పనిలోకి వెళ్తే రాత్రి పది గంటలకు రూమ్‌కు పోతరంట’అని తన కొడుకుల వ్యథను చెప్పుకొచ్చింది. చెట్టంత కొడుకులున్నా.. ఇక్కడ తన తిండి తిప్పలు తనవేనని కళ్లనీళ్లు పెట్టుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లోని ఏ ఇంటి తలుపు తట్టినా వినిపించే ఆవేదన ఇది. సాక్షి, సిద్దిపేట: 600 అడుగుల లోతుకు తవ్వినా జాడ లేని నీరు! సాగునీటి సౌకర్యం లేక పడావు పడిన భూములు.. స్థానికంగా లభించని ఉపాధి.. వెరసి సిద్దిపేట జిల్లా బస్వాపూర్ గ్రామం వలసల ఊరుగా మారింది. వలస పోయేందుకు వీలుగా 18 ఏళ్లు నిండగానే యువత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న దుస్థితి. 40 ఏళ్ల క్రితమే బస్వాపూర్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయని ‘సాక్షి’పరిశీలనలో తేలింది. దాదాపు ఇంటికొకరు.. ఆరేపల్లి, చందునాయక్ తండా, జురాలిన్, మల్లన్నపేట, జ్యోతిరాం తండా, సింగరాయ తండా, గద్దల కాలనీ.. ఇవన్నీ కలిపి బస్వాపూర్ రెవెన్యూ గ్రామం ఉంది. 1,200 కుటుంబాలు, 5,000 మంది జనాభా, 3,700 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 10 వేల ఎకరాల సాగు భూమి ఉంది. గుట్టలు, చెట్లు, రాళ్లురప్పలు పోగా 6 వేల ఎకరాల విస్తీర్ణం మనుగడలో ఉంది. ఈ భూమికీ వర్షపు నీరే ఆధారం. ప్రాజెక్టులు, కాల్వలు లేవు. వానలొచ్చి చెరువులు నిండితేనే పంట పండేది. వందల అడుగుల లోతుకు బోర్లు తవ్వించి అప్పులపాలైన వారు ఈ గ్రామంలో ఇంటికొకరు ఉన్నారు. ఈ క్రమంలో అప్పులు తీర్చుకునేందుకు, కుటుంబ బాధ్యతలు మోసేందుకు బస్వాపూర్ గ్రామ యువత ఎడారి దేశాలకు వలస పోతున్నారు. గడిచిన 40 ఏళ్లలో వెయ్యి మంది దుబాయ్, ఒమన్, మస్కట్, సౌదీ, కత్తర్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ తదితర దేశాలకు వలస వెళ్లారు. గ్రామం నుంచి కనీసం ఇంటికొక్కరు చొప్పున వెళ్లిన దాదాపు 700 మంది ఇంకా ఎడారి దేశాల్లోనే ఉన్నారు. అప్పులు చేసి వెళ్లి అక్కడ చాలీచాలని జీతాలతో కొందరు బతుకు వెళ్లదీస్తుంటే.. అక్కడ కష్టాలపాలై తెలిసిన వారి వద్ద అప్పోసప్పో చేసి ఇక్కడకు చేరుకున్న వారు మరికొందరు ఉన్నారు. 18 ఏళ్లు దాటగానే.. యువత చదువు పూర్తి కాగానే ఉద్యోగాన్వేషణలో పడతారు. కానీ బస్వాపూర్ యువకులు మాత్రం 18 ఏళ్లు దాటగానే మొదట చేసే పని.. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడం. ‘దరఖాస్తు చేసుకుని ఉంటే ఎప్పటికైనా గల్ఫ్ వెళ్లడానికి ఉపయోగపడుతుంది’అని గ్రామ యువకులు చెప్పారు. మరోవైపు గల్ఫ్ వెళ్తున్న యువకుల్లో చాలామంది ఏజెంట్ల మోసాలతో దగా పడుతున్నారు. సౌదీ వెళ్లేందుకు రూ.లక్ష వరకు ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. మంచి వేతనం, ఉద్యోగం అని చెప్పి ఎయిర్‌పోర్టులో వదలేసి తప్పుకుంటున్నారు. తీరా అక్కడకు వెళ్లాక యువకులు.. గొర్రెలు, ఒంటెలు కాసే పనులకు కుదురుతున్నారు. ‘అక్కడున్న సమయంలో వేల మైళ్ల ఎడారి ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ పశువులను మేపే వాళ్లం. వారానికి ఒకసారి యజమాని రొట్టెలు ఇచ్చి వెళ్లే వాడు. చేసే పని నచ్చలేదనే ఉద్దేశం మాకు ఉన్నట్టు కనిపెట్టిన వెంటనే పాస్‌పోర్టు, వీసా లాక్కుంటారు’అని గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన కొందరు వాపోయారు. జీవనోపాధి పథకం అమలు సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక వలసలున్న ప్రాంతంగా బస్వాపూర్‌ను అధికారులు గుర్తించారు. చేపట్టాల్సిన ఉపాధి పథకాలు, వలసల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల చర్చించింది. వారి అనుభవాలు, ఏం చేస్తే వలసలు తగ్గుతాయో, సమస్యకు మూలమేమి టో అడిగి తెలుసుకుంది.త్వరలోనే గ్రామంలో జీవనోపాధి పథకం కింద వివిధ ఉపాధి మార్గాలు చూపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చనిపోదామనుకున్నా.. ఇద్దరు ఆడపిల్లలకు మంచి చదువులు చెప్పిద్దామని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆశతో రూ.1.5 లక్షలు అప్పు చేసి సౌదీ వెళ్లా. డ్రైవర్ ఉద్యోగం, నెలకు రూ.30 వేలు జీతమని ఏజెంటు చెప్పిండు. కానీ అక్కడికి వెళ్లాక ఎడారిలో గొర్రెలను కాయబెట్టిర్రు. నెలకు రూ.8 వేలే వస్తుండె. వారానికోమారు యజమాని వచ్చి రొట్టెలు ఇచ్చేటోడు. చనిపోవాలనుకున్నా.. చివరికి రూ.2 లక్షలు అప్పు చేసి మిత్రుల సాయంతో ఇంటికి చేరా. – మధుకర్ అరచేతిలో ప్రాణాలు.. మంచి పని దొరుకుతుందని, అప్పులు తీర్చవచ్చని, మంచి ఇళ్లు కట్టుకోవచ్చని ఇరాక్ వెళ్లా. అక్కడ యుద్ధ బంకర్లలో పని. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదు. మిలటరీ సైరన్ మోగగానే సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టేటోడిని. భార్య, పిల్లలు గుర్తుకొచ్చేవారు. అక్కడి సంపాదన వద్దు.. ఆ దేశం అంతకన్నా వద్దనుకొని ఇంటికి చేరా. ఇక్కడ పనిలేదు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్న పిల్లలను చూస్తే బాధవుతాంది. – బండి బాలరాజు రూ.3 లక్షల అప్పు నా భర్త లింగల వెంకటయ్య 2013లో సౌదీ పోయిండు. అక్కడ గొర్రెల కాపరిగా పని చూపిచ్చిర్రు. ఆ పని నచ్చక రెండేళ్ల క్రితం కంపెనీ నుంచి బయటకొచ్చిండు. వేరే పని చేసుకుంటుంటే సౌదీ పోలీసులు పట్టుకోని జైల్లో ఏసిండ్రు. ఇద్దరు బిడ్డలు పెళ్లికి ఎదిగారు. ఇప్పటికే రూ.3 లక్షల అప్పు ఉంది. మా భవిష్యత్తు మంచిగుండాలని సంపాదనకు పోతే బతుకులు ఆగమైనయ్. ప్రభుత్వం స్పందించి నా భర్తను విడిపించాలె. – లింగల పద్మ ఉపాధి లేకే వలసలు గ్రామంలో అంతా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటోళ్లే. కానీ ఇక్కడ సాగునీరు లేదు. పంటలు పండవు. లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసినా నీళ్లుపడవు. ఉపాధి లేకే యువత ఎడారి దేశాలకు వలస పోతుండ్రు. – మాంకాలి అంజయ్య, ఉప సర్పంచ్ -
బ్రిటన్‌కు వలసల్లో పడిపోయిన భారత్ స్థానం
లండన్: బ్రిటన్‌లో ఉండే విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు నాలుగో స్థానంలో నిలిచారు. అయితే, ఈ విషయంలో 2016లో భారత్ రెండో స్థానం ఆక్రమించగా 2017 లెక్కల ప్రకారం నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ వలసలపై జాతీయ గణాంకాల కార్యాలయం(ఓఎన్ఎస్) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పోలండ్(10 లక్షలు) ప్రథమ స్థానంలో, రుమేనియా(4.11 లక్షలు), రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ (3.50 లక్షలు), భారత్(3.46 లక్షలు) నాలుగో స్థానంలో ఉంది. యూరోపియనేతర దేశాలతో పోలిస్తే వలసల్లో భారతీయులదే ప్రథమ స్థానం, ఆ తర్వాత పాకిస్తాన్(1.88లక్షలు) నిలుస్తోంది. అయితే, పర్యాటక వీసాపై బ్రిటన్‌కు వెళ్లే వారిలో అత్యధికులు భారతీయులు కాగా రష్యా, పాకిస్తాన్, చైనా దేశీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వలస జనాభా పెరుగుదల రీత్యా చూస్తే రుమేనియా మొదటి స్థానంలో ఉందని ఓఎన్ఎస్ అధికారి నికోలా వైట్ తెలిపారు. -
వలసదారులకు ట్రంప్ షాక్!
ఐదేళ్ల వరకు సంక్షేమ పథకాలు ఆశించొద్దంటూ మెలిక వాషింగ్టన్: ప్రతిభ ఆధారిత వలస (ఇమ్మిగ్రేషన్) విధానానికి మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా విదేశీ వలసదారులకు షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వచ్చే వలసదారులు ఐదేళ్ల వరకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందబోరని ఆయన చెప్పారు. 'మా దేశానికి వచ్చినప్పుడు ఐదేళ్లపాటు మీరు సంక్షేమ పథకాలను పొందలేరు. గతంలోగా ఇప్పుడు అమెరికాలోకి రాగానే సంక్షేమ పథకాలను పొందలేరు' అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతివారం నిర్వహించే వెబ్, రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 'ఐదేళ్లపాటు మా సంక్షేమ పథకాలను అడగటం కానీ, వినియోగించుకోవడం కానీ చేయబోనని మీరు చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌లో చేసిన నా ప్రసంగంలో చెప్పినట్టు.. అమెరికా ఉన్నతంగా కలలు కంటోంది. సాహసోపేతంగా ముందుకు వెళుతోంది' అని ట్రంప్ అన్నారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ రూపొందించిన ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్) బిల్లుకు ట్రంప్ ఇటీవల మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి స్వస్తి పలికి.. ఇక నుంచి ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా కార్డులు జారీ చేయనుంది. ఇందుకోసం ఉద్దేశించిన 'రైజ్' బిల్లు ఆమోదాన్ని ప్రస్తావిస్తూ అమెరికా సరైన దిశలో సాగుతున్నదని ట్రంప్ అన్నారు. ఈ నూతన విధానం భారతీయులకు వరమేనని భావిస్తున్నా.. ట్రంప్ మాత్రం వలసదారులపై మరిన్ని ఆంక్షలు తప్పవంటూ సంకేతాలు ఇస్తున్నారు. -
బతుకు యుద్ధంలో రోజుకో చావు
- ఎడారి దేశాలకు వలస వెళ్లి మృత్యువాత - ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పల్లెపల్లెనా కన్నీటి కథలే.. సాక్షి నెట్వర్క్: ఎడారి దేశాల్లో బడుగు జీవుల బతుకు యుద్ధంలో రోజుకో చావు వినాల్సి వస్తోంది. నాలుగు దీనార్లు చేతిలో పడితే జీవితం మారిపోతుందనే నమ్మకం వమ్మయిపోతోంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు, అప్పులు తీర్చేసేందుకు పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ బాట పడుతోన్న వలస జీవులు.. అక్కడ అనుకోని ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఏ తలుపు తట్టినా వలస బతుకుల విషాదమే పలకరిస్తోంది. గడచిన పది నెలల్లో గల్ఫ్ దేశాల్లో 345 మంది వివిధ ప్రమాదాల్లో మరణిస్తే.. అందులో 244 మంది తెలంగాణ బిడ్డలే ఉన్నారు. మరో 96 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. ఐదుగురు ఇతర రాష్ట్రాల వారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసుస్టేషన్ రికార్డుల ప్రకారం ఏటా దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ పల్లెలకు వస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది వలసజీవులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని లెక్కలు చెబుతున్నాయి. లెక్కాపత్రం లేని ‘వలస’ రాష్ట్రంలో వలసలకు సంబంధించి సక్రమమైన అధ్యయనం కానీ, రికార్డులు కానీ ఏమీ లేవు. స్వచ్ఛంద సంస్థల రికార్డుల ప్రకారం.. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న వారిలో పురుషులు 95 శాతం, మహిళలు 5 శాతం మేర ఉన్నారు. పురుషుల్లో 50 శాతం మంది కార్మికులే. వీరంతా 18–30 ఏళ్లలోపు వారే. ఇందులో ప్రాథమిక విద్యను అభ్యసించిన వారు 35 శాతం కాగా, 21 శాతం మంది నిరక్షరాస్యులు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో 85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారే కాగా.. 38 శాతం మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని మొత్తం జనాభాలో 61.88 లక్షల మంది అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ వలసల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ పాత నగరం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వీరంతా గల్ఫ్ కోఆపరేషన్ (జీసీసీ) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌తో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌తో సహా 18 ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్) దేశాలలో 85 లక్షల మంది భారతీయులు ఉన్నట్టు ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇందులో తెలంగాణకు చెందినవారు 10 లక్షల మంది ఉన్నట్టు అంచనా. అనారోగ్యం.. ప్రమాదాలు.. గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి చనిపోతున్నవారు కొందరైతే.. ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన బెంగతో మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గుండెపోటు మరణాలూ పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. ప్రమాదాలకు గురైన సందర్భాల్లో చాలా మందికి తగిన వైద్యం అందడం లేదు. నిబంధనల పేరు చెప్పి.. రకరకాల సాకులతో అక్కడ క్షతగాత్రుల్ని పట్టించుకునే దిక్కు ఉండటం లేదు. అలాగని వెంటనే స్వదేశానికి వచ్చే ఏర్పాటూ కరువవుతోంది. చివరకు అక్కడే ప్రాణాలు విడిచి.. నెలల తరబడి జాప్యం తర్వాత స్వగ్రామాలకు మృతదేహాలు చేరుతున్నాయి. అప్పటి వరకు బాధిత కుటుంబాలు మానసికంగా చిత్రవధ అనుభవిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో వీసా, పాస్‌పోర్టు ఉన్న వారికే వైద్య సదుపాయాలు వర్తిస్తాయి. టూరిస్టు వీసాపై వెళ్లిన వారికి.. అక్రమ నివాసితులకు ఉచిత వైద్యం లభించదు. వీసా, లేబర్ కార్డు లేకపోతే.. పక్కనే ఆసుపత్రులున్నా ప్రయోజనం ఉండదు. చాలామంది ఏజెంట్ల చేతిలో మోసపోయి టూరిస్ట్ వీసాలపై వెళ్తూ.. అక్కడ లభించే సౌకర్యాలను కోల్పోతున్నారు. దీంతో ఏదైనా ప్రమాదానికి గురైతే సకాలంలో వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. పరిహారం.. పరిహాసం.. ప్రమాదాల్లో తమ వారిని కోల్పోతున్న బాధిత కుటుంబాలు చివరకు పరిహారానికి కూడా నోచుకోవడం లేదు. మచ్చుకు ఓ ఉదాహరణ.. కిందటేడాది అక్టోబరు 19న అబుదాబిలో ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న 320 మంది కార్మికుల కోసం ఓ రేకుల షెడ్డులో క్యాంపు ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఇందులోని కొన్ని బ్లాకులు తగలబడిపోయాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ జిల్లాల వారే. వారిలో ముగ్గురు నిర్మల్ జిల్లా వాసులు. వీరిలో సేవానాయక్ తండాకు చెందిన ప్రకాశ్‌నాయక్ (29) ఒకరు. ఆయన ఈ ప్రమాదానికి రెండు నెలల ముందే అబుదాబి వెళ్లాడు. ప్రమాదంలో నిలువునా కాలి బూడిదైపోయాడు. చావు వార్త స్వగ్రామానికి చేరింది. కానీ మృతదేహం ఆరు నెలలకు వచ్చింది. అప్పటిదాకా ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. వాస్తవానికి గల్ఫ్ కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం ప్రకాశ్‌కు సౌదీ ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం అందాలి. కానీ.. తీరా ఆర్నెళ్ల తర్వాత ప్రకాశ్ గుండెపోటుతో చనిపోయాడని తేల్చి శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడా కుటుంబానికి పైసా కూడా దక్కే పరిస్థితి లేదు. చాలా కేసుల్లోనూ ఇలాగే జరుగుతోంది. కేరళ విధానంలో ఏముంది? టీఆర్ఎస్ అధికారం చేపట్టిన వెంటనే గల్ఫ్ వలస కార్మికుల కోసం కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని హామీనిచ్చింది. అసలు కేరళ విధానం ఏమిటి? అందులో ఏముందంటే..? ► గల్ఫ్ వెళ్లే ప్రవాస కేరళవాసుల కోసం ప్రత్యేక శాఖ ఉంది. దీని ఆధ్వర్యంలో ‘నోర్కా రూట్స్’పేరిట విస్తృత స్థాయి యంత్రాంగంతో కూడిన విభాగం పనిచేస్తోంది. ► నోర్కా (నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్) 1996లో ఏర్పాటైంది. ► కేరళ ప్రభుత్వం వలస కార్మికులకు 2008 ఆగస్టు నుంచి ప్రవాసీ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ► రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లిన కేరళవాసులకు, స్వదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి ‘సాంత్వన పథకం’పేరిట ఏటా రూ.లక్షలోపు కుటుంబ ఆదాయం గల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రూ.50 వేలు వైద్య చికిత్సలకు అందిస్తోంది. ► వలస కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష సాయం అందచేస్తోంది. ► సాధారణ వ్యాధులకు రూ.20 వేలు, వలస కార్మికుల పిల్లల పెళ్లికి రూ.15 వేలు, వికలాంగులకు అవసరమైన పరికరాల కోసం రూ.10 వేలు అందిస్తోంది. ► తమ రాష్ట్రానికి చెందిన వారు ఇతర దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలకు తీసుకురావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ► వలస వెళ్లగోరే కార్మికులకు కేరళ ప్రభుత్వం ఐఐటీల ద్వారా వృత్తి శిక్షణను అందిస్తోంది. ఫీజులో 80 శాతం ప్రభుత్వమే భరిస్తోంది. 20 శాతం మాత్రమే అభ్యర్థి చెల్లించాలి. ► ఇతర దేశాలకు వెళ్లాలనుకునే ఉద్యోగులు, కార్మికుల కోసం ‘ఫ్రీ డిఫార్చర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్’నిర్వహిస్తోంది. కేరళలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గల కార్యాలయాల్లో రూ.200 చెల్లిస్తే తగిన శిక్షణనిస్తారు. ► ‘నోర్కా’జారీ చేసే ధ్రువీకరణ పత్రాలపై వచ్చే ఆదాయంలో 10 శాతాన్ని చైర్మన్ నిధిలో జమ చేస్తారు. వీటిని నిరుపేద వలస కార్మిక కుటుంబాల ప్రయోజనాలకు వెచ్చిస్తారు. ► 2008లో కేరళ ప్రభుత్వం ప్రవాసీ సంక్షేమ నిధి చట్టాన్ని రూపొందించింది. 18–55 మధ్య వయస్కులు ఇందులో చేరడానికి అర్హులు. రూ.200 ఫీజు. ప్రస్తుతం 85 వేల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వికలాంగులకు, వివాహాలకు, గృహ నిర్మాణానికి, విద్య, వైద్యానికి సాయం అందిస్తారు. పింఛన్ కూడా ఇస్తారు. ► కేరళతో పాటు పంజాబ్ ప్రభుత్వం నిర్మాణాత్మక విధానాలతో గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నాయి. లైసెన్స్ పొందిన ఏజెంట్లే అర్హులు.. ఇమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం గల్ఫ్‌తో సహా 18 దేశాలకు కార్మికులను విదేశీ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందిన ఏజెంట్లు మాత్రమే అర్హులు. ఈ లైసెన్స్ పొందడానికి రూ.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసి, తగిన కార్యాలయం కలిగి ఉండాలి. ఇలాంటి లైసెన్స్డ్ ఏజెన్సీలు దేశంలో 1,900 వరకు ఉన్నాయి. ఇవి తెలంగాణలో 31 ఉన్నాయి. వీటి కింద వేలాది మంది సబ్ ఏజెంట్లు, అనధికార ఏజెంట్లు పని చేస్తున్నారు. ఇంటిపైనే ఆలోచన.. చెప్పుకోలేని ఆవేదన గల్ఫ్ వెళ్తే చాలు.. గట్టెక్కిపోతాం.. అనేదే అక్కడకు వెళ్లాలనుకునే వారందరి ఆలోచన. అక్కడ సంపాదనపై ఎక్కువ ఊహించుకోవడం, ఎన్నో ఆశలతో వెళ్లాక తీరా అక్కడ అనుకున్నంతగా రాకపోవడంతో చాలామంది డీలా పడిపోతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. అసలే ఇక్కడ అప్పులు.. దానికితోడు వెళ్లడానికి మరికొంత అప్పు.. చాలీచాలని వేతనంతో ఈ అప్పులెలా తీర్చాలి.. కుటుంబాన్ని ఎలా పోషించాలన్న బెంగతోపాటు కుటుంబానికి దూరంగా ఒంటరితనంతో గడపడం, పని ఒత్తిడి, ఇవన్నీ కార్మికులను మనోవ్యధకు గురిచేస్తున్నాయి. ఎక్కువగా ఒప్పంద మోసాలతో పలువురు దగా పడుతున్నారు. దీంతో అక్కడ కనీసం తామే బతకలేని పరిస్థితులూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే మనోవ్యధతో చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. ఏటా వివిధ కారణాలతో గల్ఫ్‌లో సగటున 200 మంది వరకు చనిపోతున్నారని అంచనా. వీరిలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారు 90 మంది వరకు ఉంటున్నారు. మానసిక వ్యధతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారూ పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. ఏడేళ్ల తర్వాత శవమై.. ఎలిగెట్టి రాజేశ్వర్(41).. ఆదిలాబాద్ జిల్లా కూచ న్‌పల్లి. ఉన్న కొద్ది పొలంలో ఎవుసం చేస్తూ బాగా బతికిన రైతు. కాలం కలిసిరాక.. అప్పుల పాల య్యాడు. కుటుంబాన్ని పోషించేందుకు 2010లో ఒమన్ వెళ్లాడు. ఏడేళ్ల పాటు ఇంటి ముఖం చూడలేదు. ఓ రోజు భవన నిర్మాణ పనులు చేస్తూ గాయపడ్డాడు. అక్కడ పట్టించుకునే వారెవరూ లేక.. చికిత్స అందక ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రాణాలు విడిచాడు. రెండు నెలలకు రాజేశ్వర్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. ‘పైలం’ అని చెప్పి వెళ్లిన ఇంటి పెద్ద.. ఏడేళ్ల తర్వాత శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. అప్పులు తీరలేదు. పూట గడవడం లేదు. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ కూడా ఒమన్ వెళ్లాడు. ఎన్నెన్నో కన్నీటి గాథలు అందరినీ అనాథల్ని చేసి జగిత్యాల జిల్లా మద్దనూర్ గ్రామానికి చెందిన తరాల రాజేశ్(28) డ్రైవర్. ఇక్కడ తగిన సంపాదన లేక రెండేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. ఈ ఏడాది మార్చి 12న సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇరవై రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామానికి చేరింది. చెట్టంత కొడుకును పోగొట్టుకుని ఆయన తల్లిదండ్రులు, భర్తను పోగొట్టుకుని భార్య విజయ కుంగిపోయారు. అత్తమామల్ని, నా ఇద్దరు ఆడబిడ్డల్ని ఎలా సాకాలని విజయ దీనంగా అడుగుతోంది. అప్పుల కుప్పతో గుండెపోటు.. జగిత్యాల జిల్లా సాతారానికి చెందిన కొక్కు శంకర్ వ్యవసాయంలో దెబ్బ తిన్నాడు. పదేళ్ల క్రితం వెళ్లి దుబాయ్, సౌదీలలో దొరికిన పనులు చేశాడు. తిరిగొచ్చి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ క్రమంలో మిగిలిన అప్పులు తీర్చేందుకు ఏడాది క్రితం మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. ఈసారి జీతం పెద్దగా లేదు. కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నాననే బాధతో.. గత ఫిబ్రవరి 28న పనిలోనే గుండెపోటుతో మరణిం చాడు. ఆ కుటుంబం వైపు ఇంకా రూ.2.5లక్షల అప్పు చూస్తోంది. వ్యాధుల బారిన పడుతున్నారు గల్ఫ్‌లో మనోళ్ల మరణాలకు అనేక కారణాలున్నాయి. ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, అక్కడి వాతావరణంలో ఇమడలేకపోవడం వంటి కారణాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆహారం, నిద్రలో సమయపాలన పాటించకపోవడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యం గా కిడ్నీ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. పని ఒత్తిడి గుండెజబ్బులకు దారితీస్తోంది. గల్ఫ్‌లో వైద్యం చాలా ఖరీదైనది. వైద్య బీమా సౌకర్యాలు లేక చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. – డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల సర్కారుకు పట్టింపు లేదు.. గల్ఫ్ కార్మిక చట్టాల ప్రకారం అక్కడ విధుల్లో చనిపోయిన వారికి రూ.10లక్షల నుంచి రూ.40లక్షల వరకు పరిహారం ఇవ్వా లి. కానీ చాలా కేసుల రిపోర్ట్‌ను పరిమారం పరిధిలోకి రాని గుండెపోటుగా చూపుతున్నారు.గతేడాది అబుదాబిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తెలంగాణ కార్మికులు సజీ వదహనమైతే ఒక్కరికి కూడా అటు గల్ఫ్ ప్రభుత్వం, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఇవ్వలేదు. ఎందరో ఆటగాళ్లు, పాట గాళ్లకు లక్షలకు లక్షలు ఇస్తున్న రాష్ట్రం గల్ఫ్ కార్మికుల పట్టించుకోకపోవడం అన్యాయం. – రుద్రశంకర్, తెలంగాణ ప్రవాస భారతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎయిర్‌పోర్ట్‌లో పరీక్ష!
న్యూయార్క్: సాఫ్ట్ ఉద్యోగులూ.. బీ అలర్ట్. మంచి మార్కులతో చదువు పూర్తి చేసుకొని.. సంస్థలు నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఎలాగోలా ఉద్యోగాలు సంపాదించినా.. ఇక అక్కడితోనే ప్రిపరేషన్ ఆపేస్తే సరిపోదు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా మరోసారి మిమ్మల్ని పరీక్షించే అవకాశం లేకపోలేదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇటీవల ఓ నైజీరియన్‌కు పరీక్ష పెట్టారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగగానే.. 'ఇంతకూ నువ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా' అని అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఓ పెన్నూ పేపర్ ఇచ్చి ప్రూవ్ చేసుకోమన్నారు. బైనరీ సెర్చ్ ట్రీ, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. ఊహించని పరీక్షకు సెలెస్టిన్ ఒమిన్ అనే 28 ఏళ్ల ఇంజనీర్ షాక్ తిన్నాడు. న్యూయార్క్, లాగోస్, నైరోబీలలో కార్యాలయాలు ఉన్న అండెలా అనే ఓ టెక్ స్టార్టప్ కంపెనీలో సెలెస్టిన్ పనిచేస్తున్నాడు. తీరా ప్రశ్నలకు ఎలాగోలా జవాబులు రాసినా అధికారులు సంతృప్తి చేందలేదని సెలెస్టిన్ వాపోయాడు. తనను తిరిగి నైజీరియాకు పంపిస్తారని భావిస్తున్న తరుణంలో అధికారులు అనూహ్యంగా అనుమతించారని సెలెస్టిన్ వెల్లడించాడు. ఇక్కడో విషయం గమనించాలి.. డొనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన ఏడు ముస్లిం దేశాల జాబితాలో నైజీరియా లేదు. -
అమెరికాలో ఐదుగురు భారతీయుల అరెస్ట్
వాషింగ్టన్ : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఐదుగురు భారతీయులను ఈ నెల 8న అక్కడి పోలీసులు వాషింగ్టన్ లోని మోల్సోన్ పంలో అరెస్ట్ చేశారు. వారికి సహకరించిన ఒక కెనడా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇమిగ్రేషన్ జడ్జి ముందు హాజరుపరచనున్నట్లు బార్డర్ పోలీసు విభాగం తెలిపింది. ప్యూ సంస్థ నివేదిక ప్రకారం.. అక్రమంగా అమెరికాకు వలసవచ్చిన భారతీయుల సంఖ్య 2009లో 1.3 లక్షలు కాగా 2014నాటికి అది 5 లక్షలకు చేరింది. సంఖ్యాపరంగా చూస్తే అక్రమవలసదారుల్లో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నారు. -
వచ్చేవారం మళ్లీ నిషేధం
వలసలపై త్వరలో మరో ఉత్తర్వు: ట్రంప్ ► అప్పీలు కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన సర్కారు వాషింగ్టన్ : వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని శుక్రవారం ఆయన ప్రకటించారు. పాత ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేస్తామని వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అది చాలా తప్పుడు నిర్ణయం. దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైంది. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం’ తెలిపారు. ట్రంప్‌కు టెక్సస్ రాష్ట్రం మద్దతు మరోవైపు ట్రంప్ నిషేధ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రంప్ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ శుక్రవారం సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... ‘ట్రంప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్... వలసల ఉత్తర్వులపై ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు. మీడియా పట్ల ట్రంప్ విమర్శలపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ను ఆసక్తికరంగా స్పందించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఒకసారి ఏమన్నారంటే... రాజకీయ నాయకులు వార్తపత్రికల గురించి ఫిర్యాదు చేయడమంటే... సముద్రం గురించి నావికుడు ఫిర్యాదు చేయడమే’ అని పేర్కొన్నారు. మీడియాను విమర్శిస్తూ ట్రంప్ సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు. -
ట్రావెల్ బ్యాన్‌కు కొత్త ఆర్డర్: ట్రంప్
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ కోసం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వచ్చే వారంలోగా ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మొదట ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై యూఎస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన స్టేపై మాట్లాడిన ఆయన అంతిమంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని అన్నారు. అదీ కాకపోతే చాలా రకాల ఆప్షన్లు తన చేతిలో ఉన్నాయని చెప్పారు. నిషేధానికి మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెడతానని చెప్పారు. ఫ్లోరిడాకు విమానంలో వెళ్తున్న ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. దేశానికి భద్రత చాలా అవసరమని చెప్పారు. తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆర్డర్ల వల్ల వచ్చే వారం వరకూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇవ్వలేమని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇమిగ్రేషన్ కు సంబంధించి కొత్త భద్రతా నిబంధనలు ఉండే అవకాశం ఉంది. గత నెలలో ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాస్ చేసిన విషయం తెలిసిందే. -
ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లిం మతం దేశాల నుండి వలసలను పరిమితం చేయడంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇమ్మిగ్రేషన్ కార్వ నిర్వాహక ఆదేశాలపై కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు రడీ అవుతోంది. ఏడు ముస్లిందేశాల శరణార్ధులపై ట్రంప్ తాజా ఆదేశాలను అడ్డుకునేందుకు వాషింగ్టన్ స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం సహకారంతో ఈ దావా వేయనున్నట్టు మైక్రో సాఫ్ట్ ప్రతినిది పీట్ వూటెన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న ట్రంప్ తాజా నిర్ణయాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రతిపాదనలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విదేశాంగ శాఖ సిద్ధమవుతోంది. ఈమేరకు అమెరికన్ కాంగ్రెస్ సీనియర్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా ఇమ్మిగ్రేషన్ ఆంక్షలపై ఇప్పటికే టెక్ దిగ్గజాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విమర్శలు గుప్పించారు.అ మెరికా వలస దారులదేశమనీ, ట్రంప్ నిర్ణయం సరైదని కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.