గూగుల్ చర్య.. ట్రంప్కు చెంపపెట్టు!
గూగుల్ చర్య.. ట్రంప్కు చెంపపెట్టు!
Published Mon, Jan 30 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
శాన్ఫ్రాన్సిస్కో: వలసదారులపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ ఓ వైపు దేశాధ్యక్షుడు ముందుకుపోతుండగా.. అమెరికా టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏడు దేశాల నుంచి వచ్చే ముస్లింలపై ఆంక్షలు కఠినం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఎండగట్టిన గూగుల్.. ట్రంప్ వలసవ్యతిరేక విధానాలకు చెంపపెట్టులా మరో చర్య చేపట్టింది. తాజాగా 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం గూగుల్ సమీకరించింది. దీనిలో 2 మిలియన్ డాలర్లను గూగుల్ ఉద్యోగులు విరాళాలుగా అందజేయడం విశేషం. సంక్షోభ నివారణకు గూగుల్ చేపట్టిన అతిపెద్ద చర్య ఇదే కావడం గమనార్హం.
ఈ నిధులను వలసదారుల సమస్యలపై పోరాడే నాలుగు సంస్థలు.. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఇమ్మిగ్రెంట్ లీగల్ రీసోర్స్ సెంటర్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, యూఎన్హెచ్సీఆర్ల కోసం సమీకరించినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు. వలసదారులపై ఆంక్షల నేపథ్యంలో సంస్థ సహవ్యవస్థాపకుడు సెర్జియో బ్రిన్ శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం వద్ద నిరసనలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement