
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్‌లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment