Indian woman
-
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్‌పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్‌ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్‌లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్‌భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్‌పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్‌పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్‌లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్‌లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్‌లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె ఈ మ్యాచ్‌లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్‌పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్‌పై వినేశ్‌ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమె టాప్ సీడ్‌గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్‌కి ఇచ్చిన యూనిఫామ్‌ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్‌లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్‌పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్‌లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్‌ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. -
సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు
ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్య శాస్త్రపు పట్టా పొంది, ప్రాక్టీస్ చేసి, విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబినీ బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా! అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం... కాదంబినీ గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన, తొలి తరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ. భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ ‘భాగల్పూర్ మహిళా సమితి’ని ప్రారంభించినవారిలో ఒకరైన బ్రజా కిషోర్ బసుకు కాదంబిని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబిని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థినులకు ప్రవేశం కల్పించగా, మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబినీ గంగూలీ కాగా, మరొకరు చంద్రముఖీ బసు. డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబిని వివాహమైంది. ద్వారకానాథ్ మనదేశంలో మహిళల కోసం తొలి పత్రిక ‘అబలా బంధోబ్’ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యాత్వానికి, అంధ విశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత, కాదంబినిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబినికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు. దాంతో కాదంబినీ గంగూలీ భారతీయ విశ్వ విద్యాలయపు వైద్యవిద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్సీ చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబినీ గంగూలిని ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబినీ గంగూలికి జారీ చేసి, 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు. దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్‌బరో నుంచి ఎల్‌ఆర్‌సీ (లైసెన్షియేట్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్), గ్లాస్కో నుంచి ఎల్‌ఆర్‌సీ ఎస్ (లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్), ఇంకా డబ్లిన్ నుంచి జీఎఫ్పీఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డఫ్రిన్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు.డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్య్ర సమరయోధురాలు కాగా, కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన ‘అబలా బంధోబ్’ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే! ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, పట్టా పొంది, ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబినీ గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబిని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ‘బంగభాషి’ అనే పత్రిక ‘కులట’ అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించే దాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్‌ను కోర్టుకీడ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు. అరవై రెండేళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన కాదంబినీ గంగూలీ నేటికీ భారతీయ మహిళా లోకానికే కాదు, అందరికీ ప్రాతఃస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో ‘స్టార్ జల్సా’లో వచ్చిన ‘ప్రోతోమా కాదంబిని’ అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్; జీ బంగ్లాలో ‘కాదంబిని’ అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి 9440732392 -
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్‌లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్‌ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ
‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్ మహిశర్మ వీడియో వైరల్ అయింది. గోల్డెన్ బార్డర్స్ బ్లూ శారీ ధరించి జపాన్‌లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్ ఏ శారీ ఇన్ జపాన్ రియాక్షన్స్ ఆర్’ కాప్షన్‌తో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. -
చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!
ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్‌కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది. చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్‌కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్‌గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్‌లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్‌గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు జీన్స్‌తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్‌కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది. నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్‌ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాస్తా..నేడు సంపన్న మహిళగా..!
రాధ వెంబు విజయాన్ని చూసిన తరువాత ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అనే సుపరిచిత మాటకు అదనంగా మరో మాట చేర్చవచ్చు అనిపిస్తుంది. ‘ప్రతి పరిశ్రమ విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పోరేషన్’లోకి అడుగు పెట్టిన రాధ వెంబు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి గెలుపు పాఠాలు తయారు చేసుకుంది. ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించని రాధ వెంబు ‘ఇన్విజిబుల్ ఫోర్స్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ లో చోటు సంపాదించి, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీ నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్‌ని దాటేసి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచింది....' ‘ఎన్నో విజయాలు సాధించిన రాధ వెంబు గురించి నేనెందుకు వినలేకపోయాను అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాశాడు జోహో కార్పొరేషన్ కన్సల్టెంట్ ఇంగ్లాండ్‌కు చెందిన ఆడిసన్. ఈ కన్సల్టెంట్‌కు మాత్రమే కాదు దేశంలో చాలామందికి ఆమె విజయాల గురించి తప్ప వ్యక్తిగత వివరాల గురించి తెలియదు. ‘సెల్ఫ్–మేడ్ ఉమన్’ అనేది ఆమె పేరు ముందు కనిపించే విశేషణం. ‘కామ్ అండ్ టాస్క్–ఓరియెంటెడ్’ అని సన్నిహితులు రాధ గురించి చెబుతుంటారు. చెన్నైలో పుట్టి పెరిగింది రాధ. తండ్రి మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మద్రాస్) లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది రాధ. ఆమె సోదరుడు శ్రీధర్ వెంబు ఆమెకు స్నేహితుడు, గురువు. టెక్ ఇండస్ట్రీ గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలతో పోల్చుతూ విశ్లేషించుకునేవారు. తన సోదరులతో కలిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ మొదలు పెట్టింది రాధ వెంబు. అంతకుముందు ఉన్న శ్రీధర్ వెంబు కంపెనీ ‘అడ్వెన్ నెట్’ జోహో కార్పోరేషన్లో విలీనమైంది. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఆ సంస్థలో చేరింది రాధ వెంబు. క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది తనకెంతో ఉపయోగపడింది. ఆ తరువాత జోహో మెయిల్ ప్రాడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వేగంగా ఉన్నత హోదాలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చాలా సంవత్సరాల పాటు ప్రాడక్ట్ మేనేజర్‌గానే పనిచేసింది. పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడుతూ తమ కంపెనీని ముందు వరుసలో నిలిచేలా చేసింది. ‘కంపెనీకి సంబంధించిన సాంకేతికతను శక్తిమంతం చేయడానికి, కస్టమర్లను ఆశ్చర్యానందాలకు గురి చేయడానికి సంబంధించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను’ అంటుంది రాధ. ‘పని చేసే ప్రదేశంలో పక్షపాతానికి చోటు లేదు. ఆడా మగా అనే తేడా లేదు. ప్రతిభ ఒక్కటే ప్రమాణం’ అని నమ్మడమే కాదు ఆచరణలో నిరూపించింది రాధ. జోహో వర్క్‌కల్చర్ బాగా పాపులర్ అయింది. ఒక స్థాయికి చేరిన తరువాత టెక్ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ విదేశాల బాట పడితే ‘జోహో’ మాత్రం మన దేశంలోని చిన్న పట్టణాలను ఎంచుకుంది. టెక్ రంగంలో పురుషాధిక్యతే ఎక్కువగా కనిపించే పరిస్థితులలో రాధా వెంబు ఎన్నో మూస ఆలోచనలను బద్దలు కొట్టింది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ‘నువ్వు కనిపించడం కాదు నీ ప్రాడక్ట్ కనిపించాలి. నువ్వు మాట్లాడడం కాదు నీ ప్రాడక్ట్ మాట్లాడాలి’ అనేది రాధ వెంబు నమ్మిన సిద్ధాంతం. పబ్లిసిటీ లేకపోతే పని జరగదు అని నమ్మే ఈ కాలంలోనూ ఆమె నమ్మిన సిద్ధాంతం నిలిచి గెలిచింది. తీరిక సమయాల్లో తోటపని చేసే రాధ వెంబుకు సామాజిక సేవాకార్యక్రమాలు అంటే ఇష్టం. ‘సంపన్నురాలిగా మారాలని టెక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి ఆ ఫలితాలతో సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో వచ్చాను’ అంటుంది రాధ వెంబు. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
ప్రవాస భారతీయురాలు ఆత్మహత్య ?
కర్ణాటక: ఆస్ట్రేలియా ప్రవాస భారతీయురాలు శవం ధార్వాడలో అనుమానాస్పద స్థితిలో గత ఆదివారం లభించింది. ధార్వాడకు చెందిన ఆస్ట్రేలియా నివాసి ప్రియాదర్శిని లింగరాజ పాటిల్ (40) ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వివరాలు...ప్రియాదర్శినికి ఇద్దరు పిల్లలు. భర్తతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అక్కడి పౌరసత్వం ఉంది. అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన ప్రియదర్శిని స్వగ్రామానికి రాలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ మేయర్ వీరేశ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రియదర్శిని పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ విషయంపై ఆమె తీవ్ర మనోవేదనలో ఉందని, ఈనెల 18 భారత్‌కు వచ్చిన ప్రియదర్శిని బెంగళూరులో ఒకరోజు స్నేహితుల ఇంటిలో ఉన్నారు. మరుసటి రోజు ధార్వాడ వెళ్తున్నట్లు చెప్పి బస్సు ఎక్కి గోగాక్ టికెట్ తీసుకున్నారు. అయితే గోగాక్కు బదులు సవదత్తిలో దిగి నవిళుతీర్థలో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆమె పిల్లలను ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడామని చెప్పారు. -
'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'
భోపాల్: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
'చావడమే మేలు..' పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు తండ్రి ఆవేదన..
జైపూర్: పాక్ వెళ్లి ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్‌కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు. అంజు.. వివాహిత అయిన రాజస్థాన్‌కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి! అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు. సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్‌లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్
కూతురు పైలెట్.. తండ్రి ప్రయాణికుడు. మరి కాసేపట్లో విమానం గాల్లో ఎగరాలి. కూతురు కాక్‌పిట్ నుంచి బయటికొచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. తండ్రి ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మరిచి నేను ఏ పనీ చేయను అంటున్న భారతీయ పైలెట్ కృతద్న్యా సోషల్ మీడియాలో మెటికలు విరిచే ఆశీర్వాదం పొందుతోంది. ‘ఈ రోజు కోసం నేను 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ఇన్‌స్టాలో రాసుకుంది పైలెట్ కృతద్న్యా హాలె తన తండ్రితో పాటు ఉన్న తన ఫొటోను పోస్ట్ చేస్తూ. ‘నేను పైలెట్ అవ్వాలని కలలు కంటున్నప్పుడు మా నాన్న తప్ప ఎవరూ నా మీద విశ్వాసం ఉంచలేదు. నా కెరీర్ మొదలెట్టి 13 ఏళ్లు అయింది. ఇవాళ మా నాన్నను ఆకాశం మీదుగా గమ్యాన్ని చేర్చే అవకాశం వచ్చింది’ అని కూడా రాసుకుంది కృతద్న్యా. ముంబై నుంచి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కి ఎయిర్‌బస్ 320 తరచూ నడిపే కృతద్న్యా తన తండ్రిని బహుశా స్వదేశం తీసుకు వస్తూనో లేదా స్పెయిన్ తీసుకువెళుతూనో ఒక వీడియో పోస్ట్ చేసింది. విమానం ఎగిరే ముందు కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి పాసింజర్ సీట్లో కూచుని ఉన్న తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఆయన్ను హత్తుకుంది. తబ్బిబ్బవుతూ తండ్రి ఆమెను ఆశీర్వదించాడు. ఆ వీడియోను కృతద్న్యా పోస్ట్ చేస్తూ ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నేను ఏ పని చేయను. ఒక్కోసారి డ్యూటీకి నేను తెల్లవారుజాము మూడుకో నాలుక్కో ఇంటి నుంచి బయట పడాల్సి వచ్చినా నా తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉన్నా వారి పాదాలు తాకి వెళ్లడం అలవాటు’ అని రాసింది. ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దానికి దాదాపు ఐదు లక్షల లైకులు వచ్చాయి. ఇన్‌స్టాలో చాలామంది నెటిజన్లు ఉద్వేగానికి లోనయ్యారు. ‘నిన్ను, మీ నాన్నను చూసి కన్నీరు ఆగడం లేదు’ అని ఒకరు రాస్తే ‘ఇది అసలు సిసలు భారతీయ సంస్కృతి’ అని మరొకరు రాశారు. ‘నీలాంటి అమ్మాయిలే మాకు రోజూ స్ఫూర్తినిస్తున్నారు’ అని మరొక మహిళ కామెంట్ చేసింది. భారతీయ కుటుంబాల్లో తండ్రీ కూతురు అనుబంధం ప్రత్యేకమైనది. కొందరు కూతుళ్లు అమ్మ కూచిలుగా కాకుండా నాన్న బిడ్డలుగా ఉంటారు. నాన్నతో క్లోజ్‌గా ఉంటారు. నాన్నలు వారి కోసం ప్రాణం పెడతారు. కృతద్న్యా, ఆమె తండ్రిలో అలాంటి తండ్రీ కూతుళ్లు తమను తాము పోల్చుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో యమా వైరల్‌గా మారింది. చదవండి: Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?! Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు! View this post on Instagram A post shared by Capt. Krutadnya Hale✈️ (@pilot_krutadnya) -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్‌గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్ టైమ్‌లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్‌గా గుర్తించారు. -
కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్‌లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82 — Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం -
'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి'
మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై ఇటీవలే లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆర్కే శర్మపై వేటు వేసింది. దీనికి సంబంధించిన కేసును సాయ్ ఇటీవలే మానవ హక్కుల కమీషన్‌కు బదిలీ చేసింది. తాజాగా ఆర్కే శర్మ విషయంలో మరో టాప్ సైక్లిస్ట్.. జాతీయ చాంపియన్ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ''ఆర్కే శర్మతో పాటు అతని అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టిన ఆ సైక్లిస్ట్ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్ ఆర్కే శర్మ.. అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్ కండీషనర్ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్ ఆర్కే శర్మ ఆరోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.'' అంటూ పేర్కొంది. ఇక డెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్ తరపున సైక్లింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలిన హెరాల్డ్.. 2014లో జరిగిన ఆసియా కప్ ట్రాక్‌లో 500 మీటర్ల టైమ్ ట్రయల్‌లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్‌లో జరిగిన తైవాన్ కప్ ఇంటర్నేషనల్ క్లాసిక్‌లో ఐదు మెడల్స్ సాధించిన హెరాల్డ్.. ఆ తర్వాత ట్రాక్ ఇండియా కప్‌లో మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'
క్రీడలు ఏవైనా లైంగిక వేధింపులు సహజం. పాశ్చాత్య క్రీడల్లో భాగంగా ఉన్న ఇలాంటి వేధింపులు భారత్‌కు పాకాయి. తాజాగా భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్ఐ కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. చదవండి: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది Tiger Woods: వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
Priyanka Mohite: రికార్డులు బ్రేక్.. ఫస్ట్ ఇండియన్ ప్రియాంకనే..
భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ప్రియాంక గురువారం సాయంత్రం 4.52 గంటలకు మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీ)పై తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆమె సోదరుడు ఆకాష్ మోహితే తెలిపారు. ఇక, ప్రియాంక.. తన చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువతో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలోని పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. 2012లో ఉత్తరాఖండ్‌లోని ఉన్న హిమాలయాల్లోని గర్వాల్ డివిజన్లో ఉన్న బందర్పంచ్ను అధిరోహించింది. 2020లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్‌ను ప్రియాంక మోహితే అందుకున్నారు. ప్రియాంక అధిరోహించిన శిఖరాలు ఇవే.. - ఏప్రిల్ 2021లో అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ), - 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ), - 2018లో ల్హోట్సే (8,516 మీ), మౌంట్ మకాలు (8,485 మీ)ను, - 2016లో మౌంట్ కిలిమంజారో (5,895 మీ)ను అధిరోహించారు. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు