
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి పద్మిని రౌత్ శుభారంభం చేసింది. రష్యాలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్ తొలి గేమ్‌లో పద్మిని 36 ఎత్తుల్లో ఉల్వియా (అజర్‌బైజాన్)పై గెలిచింది. నేడు వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. దీనిని ‘డ్రా’ చేసుకుంటే పద్మిని రెండో రౌండ్‌కు చేరుకుంటుంది. మరో తొలి రౌండ్ గేమ్‌లో భారత్‌కే చెందిన వైశాలి 62 ఎత్తుల్లో కియు జౌ (కెనడా)పై నెగ్గింది. ద్రోణవల్లి హారిక, భక్తి కులకర్ణిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment