Padmini Rout
-
పద్మిని రౌత్ శుభారంభం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి పద్మిని రౌత్ శుభారంభం చేసింది. రష్యాలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్ తొలి గేమ్‌లో పద్మిని 36 ఎత్తుల్లో ఉల్వియా (అజర్బైజాన్)పై గెలిచింది. నేడు వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. దీనిని ‘డ్రా’ చేసుకుంటే పద్మిని రెండో రౌండ్‌కు చేరుకుంటుంది. మరో తొలి రౌండ్ గేమ్‌లో భారత్‌కే చెందిన వైశాలి 62 ఎత్తుల్లో కియు జౌ (కెనడా)పై నెగ్గింది. ద్రోణవల్లి హారిక, భక్తి కులకర్ణిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
ఆసియా చెస్ చాంప్ పద్మిని
మకాటి (ఫిలిప్పీన్స్): అజేయ ప్రదర్శనతో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) క్రీడాకారిణి పద్మిని రౌత్ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పద్మిని మొత్తం ఏడు పాయింట్లు సాధించి కియాన్యున్ గాంగ్ (సింగపూర్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా పద్మినికి టైటిల్ లభించింది. కియాన్యున్ గాంగ్ రన్నరప్‌గా నిలిచింది. ఒడిశాకు చెందిన 24 ఏళ్ల పద్మిని ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. సూర్యశేఖర గంగూలీ నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా ఘనతతో పద్మిని... 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన ఎనిమిదో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో రోహిణి ఖాదిల్కర్ (1981, 1983), అనుపమ గోఖలే (1985, 1987) రెండేసి సార్లు ఈ టైటిల్ నెగ్గగా... భాగ్యశ్రీ థిప్సే (1991), కోనేరు హంపి (2003), తానియా సచ్దేవ్ (2007), ద్రోణవల్లి హారిక (2011), భక్తి కులకర్ణి (2016) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు. -
టైబ్రేక్‌లపై హారిక, పద్మిని ఆశలు
టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హరిక, పద్మిని రౌత్ ముందంజ వేసే అవకాశాలు మళ్లీ టైబ్రేక్ గేమ్‌లపై ఆధారపడింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌లలో వీరిద్దరూ తమ ప్రత్యరు్థలతో ‘డ్రా’ చేసుకున్నారు. సోపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను హారిక 36 ఎతు్తల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని 23 ఎతు్తల్లో ‘డ్రా’గా ముగించారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమవైుంది. ఆదివారం జరిగే టైబ్రేక్ గేముల్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
జాతీయ చాంపియన్ పద్మిని రౌత్
ప్రత్యూషకు 12వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాస్టర్ పద్మిని రౌత్ వరుసగా మూడోసారి భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన టోర్నీ చివరి, 11వ రౌండ్లో ఆమె... ఇషా కరవాడే(7)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. దీంతో పద్మిని (పీఎస్‌పీబీ) 8 పారుుం ట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎరుురిండియా క్రీడాకారిణి ఎస్.విజయలక్ష్మి (7.5) రెండో స్థానంలో నిలవగా, ఇషా కరవాడే కాంస్య పతకం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో విజయలక్ష్మి... వైశాలి (తమిళనాడు, 3.5)పై గెలిచింది. తెలుగమ్మారుు బొడ్డ ప్రత్యూష 12వ స్థానంలో నిలి చింది. తమిళనాడుకు చెందిన కన్నమ్మ (5)తో జరిగిన పోరులో ప్రత్యూష (3.5) పరాజయం చవిచూసింది. జాతీయ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా పద్మిని భారత జట్టులోకి ఎంపికై ం ది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న ఈ జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తలపడనుంది.