జాతీయ చాంపియన్ పద్మిని రౌత్ | National champion Padmini Rout | Sakshi
Sakshi News home page

జాతీయ చాంపియన్ పద్మిని రౌత్

Published Tue, Nov 15 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

జాతీయ చాంపియన్ పద్మిని రౌత్

జాతీయ చాంపియన్ పద్మిని రౌత్

ప్రత్యూషకు 12వ స్థానం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాస్టర్ పద్మిని రౌత్ వరుసగా మూడోసారి భారత మహిళల ప్రీమియర్ జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన టోర్నీ చివరి, 11వ రౌండ్‌లో ఆమె... ఇషా కరవాడే(7)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. దీంతో పద్మిని (పీఎస్‌పీబీ) 8 పారుుం ట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎరుురిండియా క్రీడాకారిణి ఎస్.విజయలక్ష్మి (7.5) రెండో స్థానంలో నిలవగా, ఇషా కరవాడే కాంస్య పతకం గెలుచుకుంది.

ఆఖరి రౌండ్‌లో విజయలక్ష్మి... వైశాలి (తమిళనాడు, 3.5)పై గెలిచింది. తెలుగమ్మారుు బొడ్డ ప్రత్యూష 12వ స్థానంలో నిలి చింది. తమిళనాడుకు చెందిన కన్నమ్మ (5)తో జరిగిన పోరులో ప్రత్యూష (3.5) పరాజయం చవిచూసింది. జాతీయ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా పద్మిని భారత జట్టులోకి ఎంపికై ం ది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న ఈ జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తలపడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement