భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే.. | Pakistani manager molests Indian woman jobseeker in UAE | Sakshi
Sakshi News home page

భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే..

Published Mon, May 16 2016 4:14 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే.. - Sakshi

భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే..

దుబాయి: తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఓ 19ఏళ్ల భారతీయ యువతి (గృహిణి)పై పాకిస్థాన్కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. దుబాయ్లోని  రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్థాన్ మేనేజర్ ఉన్నాడు. గృహిణిగా పనిచేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ జాబ్ కోసం గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది.

అయితే, ఓ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన పాకిస్థాన్ మేనేజర్.. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అక్కడే కంప్యూటర్కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన  యువతి అతడు చెప్పిన అడ్రస్కు వెళ్లాక అది కార్యాలయం కాదని, అతడి ఇళ్లు అని తెలిసింది. ఆ వెంటనే ఏవో మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను తన బెడ్ రూంలోకి తీసుకెళ్లిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై మే 26న తీర్పు వెలువరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement