జైపూర్: పాక్ వెళ్లి ఫేస్‌బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్‌కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు.
అంజు.. వివాహిత అయిన రాజస్థాన్‌కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్‌బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు.
సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్‌బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్‌లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు.
అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment