జైపూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ అనే వివాహిత పాక్‌కు వెళ్లి అక్కడే తన ప్రియున్ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనల అనంతరం అంజూ కుటుంబం స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంజూ నిర్వాకం తర్వాత స్థానికులు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారట. కేవలం గ్రామంలోనే గాక ఉద్యోగంలో కూడా వెలివేతకు గురికావాల్సి వస్తోందని సమాచారం.
అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ బౌనా అనే గ్రామంలో బట్టల కుట్టే వృత్తి చేస్తున్నారు. తన కూతురు అంజూ పాక్‌కు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ తనకు ఉపాధిని కల్పించడం లేదని చెప్పారు. మొదట సానుభూతి చూపిన గ్రామస్థులే.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని వాపోయారు. అటు.. అంజూ సోదరుడు, భర్తకు కూడా తమ కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందట. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అయితే.. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్‌ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందని చెప్పారు.
అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్‌కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట. ఖాలీ గానే ఉంచున్నారని వెల్లడించారు. అంజూ అనే వివాహిత ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ప్రియుని కోసం పాకిస్థాన్‌కు కొన్ని రోజుల క్రితం వెళ్లిపోయింది. అక్కడే తన పేరును ఫాతిమాగా మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత అంజూపై ఆమె తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడు.
తనకు చెప్పకుండానే పాకిస్థాన్‌కు వెళ్లిందని అంజూ భర్త తెలిపారు. పాక్ వెళ్లాక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. అంజూ పాక్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అంజూ కొత్త జంటకు భూములు వంటి అనేక కానుకలు సమర్పించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ చదవండి: భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో!
Comments
Please login to add a commentAdd a comment